ఐక్యరాజ్యసమితి,భద్రతా మండలి అధ్యక్షురాలైన ప్రధమమహిళ శ్రీమతి విజయలక్ష్మి పండిట్ – టి .యస్ .రామానుజరావు

పదవి లభించడానికి ఒక ప్రముఖ వ్యక్తితో చుట్టరికం వుంటే చాలన్నది అందరికితెలిసిందే. ఒక దేశ ప్రధాన మంత్రికి దగ్గర బంధువు అయితే, ఆయన మంత్రి వర్గంలో మంత్రి పదవి రావచ్చు, లేదా కనీసం మరొక మంచి పదవైనా లభించ వచ్చు.ఈ దేశానికి ప్రధమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు చెల్లెలయిన విజయలక్ష్మి పండిట్ స్వతహాగా సమర్దురాలు. కనుకనే, ఆమెబ్రిటిష్ వారి హయాం లోనే మంత్రిగా ఎన్నుకోబడ్డది. అలా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ ఈమె. స్వాతంత్ర సంగ్రామంలో ఆమె పాల్గొన్న పోరాటాలు,స్వాతంత్ర్యం రాకముందునుంచే ఆమె సమర్ధత గుర్తించి లభించిన పదవులు,శ్రీమతి విజయలక్ష్మి పండిట్ లోని నాయకత్వ లక్షణాలను, అసమాన ప్రతిభాపాటవాలను బయటకు తెచ్చాయి.అలాంటి ప్రతిభావంతురాలు,87 సంవత్సరాల వయసులో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో , ప్రధానమంత్రిజవహర్లాల్ నెహ్రు ఎప్పుడూ స్వతంత్రంగా ఆలోచించాలని చెప్పేవారనీ అందువల్ల, తానెప్పుడూ స్వతంత్రంగా ఆలోచించేదానినని, దేశం కోసం ఏపని అప్పచెప్పినా నిజాయితిగా చెయ్యాలని అనుకునేవారమని ఆమె చెప్పారు. 1900వ సంవత్సరం, ఆగష్టు 18 న జన్మించిన విజయలక్ష్మి పండిట్ అసలు పేరు స్వరూప కుమారి. ఆమె మోతిలాల్, స్వరూప రాణిల రెండవ సంతానం.అన్నగారయిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు, ఈమెకు పదకొండు సంవత్సరాల తేడా వున్నది. ఈమె తర్వాత పుట్టిన మరొక ఆడపిల్ల కృష్ణ.

అసలు పండిట్ మోతిలాల్వంశస్తులు కాశ్మీర్ కు చెందిన వారు. వారి పూర్వీకులు డిల్లీ వచ్చి స్థిరపడ్డారు. మోతిలాల్ సంపన్నుడు.న్యాయవాదిగా పేరుగడించాడు. అలహాబాద్ లో ఆనందభవన్ అనే అధునాతన భవనంలో నివసించేవాడు.విదేశీ నాగరికత, ఆడంబరంగా బ్రతకడం అతనికి అలవాటు.తన పిల్లలనుఎంతో గారాబంగా సంపన్నల పిల్లలను పెంచినట్లే పెంచాడు. వారి కుటుంబంలో పిల్లలకు ఇంట్లో ఆంగ్ల ఉపాధ్యాయులచేత చదువు చెప్పించేవారు.మోతిలాల్ నెహ్రు తన పిల్లల విషయంలో ఆడా,మొగా తేడా చూపించే వాడు కాదు. అందువల్ల, సహజంగా తెలివితేటలు కలిగిన స్వరూప కుమారి, జవహర్లాల్ వలెనే, గుర్రపు స్వారితో సహా, అన్ని విద్యలూ నేర్చుకుంది. తండ్రి మోతిలాల్కు మొదట్లో రాజకీయాలలో ఆసక్తి లేకపోయినా, 1915లో జరిగిన హోం రూల్ ఉద్యమంతో రాజకీయాలలో ప్రవేశించాడు. 1915 లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలు, ముస్లింలీగ్ సభలకు స్వరూప కుమారి తన తండ్రితో కలిసి పాల్గొంది. అప్పటి నుంచీ ఆమెకు రాజకీయాలపై ఆసక్తి కలిగింది. మొదటి ప్రపంచ యుద్ధం వార్తలను తండ్రి, అన్నలు ఇద్దరూ చర్చిస్తున్నప్పుడు ఆమె పాల్గొనేది.చక్కని స్వరూపము, తెలివితేటలు కల ఆమెను 1921 వ సంవత్సరం,మే నెల 10 వ తారీకున రంజిత్ సీతారాంపండిట్ అనే కథియవార్ కు చెందినలాయరుతో వివాహం చేశారు.అప్పటి ఆచారం ప్రకారం, స్వరూపకుమారికి విజయ లక్ష్మి పండిట్ అని పేరు మార్చడం జరిగింది.రంజిత్ జర్మనీ, ఫ్రెంచ్, సంస్కృతం, ఇంగ్లీష్ భాషలలో మంచి పండితుడు.

1940 వ సంవత్సరం మార్చి 30వ తేదిన గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహం లో విజయలక్ష్మి పండిట్, ఆమె చెల్లెలు కృష్ణ పాల్గొన్నారు. గొప్ప ధైర్య సాహాసాలు, మంచి వాక్పటిమ ఆమె స్వంతం.విజయలక్ష్మి అనేక సమావేశాల్లో ఉప్పు సత్యాగ్రహం ప్రోత్సాహిస్తూ, బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలన ధిక్కరిస్తూ ఉపన్యాసాలిచ్చింది. ఉద్యమాలు నిర్వహించింది.అదే సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం తండ్రి మోతిలాల్ ను, జవహర్ లాల్ ను, భర్త రంజిత్ ను అరెస్టు చేసింది. రంజిత్ ను, పండిట్ మదన మోహన మాలవ్యాను నైనిలో ఒకే జైల్లో ఉంచారు. అయినప్పటికీ, విజయలక్ష్మి వెరవకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే వుండేది. ఆ తర్వాత విజయలక్ష్మి పండిట్ ను సమావేశంలో అరెస్టు చేస్తే. ఉద్యమం ఉధృతం కావచ్చన్న భయంతో బ్రిటిష్ పబుత్వం ఆమెను ఇంటి వద్ద అరెస్టు చేసింది.అల్లారు ముద్దుగా, అడంబరాలలో పెరిగిన ఆమె దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొని, 1932-33, 1940, 1942-43 సంవత్సరాలలో జైలు శిక్ష అనుభవించారు. 1937 వ సంవత్సరంలో యునైటెడ్ ప్రావిన్స్ సభకు ఎన్నికై 1939 సంవత్సరంలోఆప్రభుత్వ ప్రధాని పంత్ నిర్ణయం ప్రకారం రిజైన్ చేసే వరకూ,స్థానిక స్వపరిపాలన, ఆరోగ్య శాఖలను నిర్వహించారు. తిరిగి 1946 లో మళ్ళీ రెండవ సారి యునైటెడ్ ప్రావిన్స్ అసెంబ్లీ ఎన్నికలలో నెగ్గి, అదే శాఖకు మంత్రిగా 1947 లో మనకు స్వాతంత్ర్యం వచ్చే వరకూ పనిచేశారు. మంత్రిగా పని చేస్తూ ఆమె, గ్రామాలలోని దయనీయమైన ఆరోగ్య స్థితిగతులకు చలించిపోయి, ఆయుర్వేద, యునానివైద్యంతోసహాదాదాపు 300 ఆస్పత్రులుఏర్పాటు చేయించారు.స్త్రీలఆరోగ్యాభివృద్ధికి, నర్సుల కేంద్రాన్ని ఏర్పరిచి, కొత్త వారికి శిక్షణ ఇప్పించారు. గ్రామాలలోమంచి నీటి సౌకర్యాలు కల్పించారు.

స్కూళ్ళల్లో విద్యార్ధులకు ఆట స్థలాల ఏర్పాటు చేయించారు. ఎంతో విశాల దృక్పధంతో ఆమె తన నియోజక వర్గంలో అందరి అభివృద్ధికై పాటు పడ్డారు.ఆ సమయంలో పరిపాలన, శాఖా పరంగా భారతీయులకు ఇచ్చినప్పటికీ, అంతటా బ్రిటిష్ వారి పెత్తనమే సాగేది. అందువల్ల, ఏ పనైనా పట్టుదలతో, సంయమనం తో మాత్రమే సాధించడం సాధ్యమయ్యేది. 1944 వ సంవత్సరంలో ఆమె భర్త రంజిత్ చనిపోయినప్పటికి,తన పిల్లలను ఇంట్లో వదిలేసి దేశం కోసం ఆమె స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ప్రముఖ రచయిత్రి నయనతారా సెహగల్ ఆమె కుమార్తె.

దేశ స్వాతంత్రానంతరము ఆమె 1947 నుంచీ 1949 వరకూ సోవియెట్ యునియన్ కు,1949 నుంచీ 1951 వరకూమెక్సికోలోనూమన దేశం తరఫున రాయబారిగా పనిచేశారు.1954-1961 వరకూ ఆమె బ్రిటన్లో భారతదేశం తరఫున హై కమీషనర్ గా, అదే సమయంలో ఇర్లాండ్ రాయబారిగా కుడా పనిచేశారు.1946- 48,52-53 సంవత్సరాలలో, ఆమె భారత దేశం తరఫున ఐక్యరాజ్యసమితికి పంపిన బృందానికి నాయకత్వం వహించారు.అంతేకాదు, 1953 వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి అధ్యక్షురాలిగా ఎన్నుకోబడ్డారు. ఆ పదవికి ఎన్నికైన మొదటి స్త్రీ, ఏకైక భారతీయురాలు ఆమె. భద్రతా మండలి అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత,లాంజిన్ క్రోనోస్కోప్ టెలివిజన్ జర్నల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె, ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ తానుఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షురాలిగా ఎన్నిక కావడంవలన బాధ్యత గల ప్రపంచ పౌరురాలినయ్యానని, దేశాల మధ్య వివాదాలు, ఆర్ధిక అసమానతలు,జాతివివక్ష లాంటిఅంతర్జాతీయ సమస్యల పై దృష్టి ఉంచుతాననిచెప్పిన విశాల దృష్టి గల మానవతావాది ఆమె.

ఆమె1962 నుంచీ 64 వరకూ మహారాష్ట్ర గవర్నరుగా పనిచేశారు. 1964 వ సంవత్సరంలో ప్రధాని జవహర్లాల్ నెహ్రు మరణానంతరం ఆయన పార్లమెంటరీ నియోజక వర్గం నుంచీ ఎన్నికై 1968వరకూ లోకసభ సభ్యురాలిగా వున్నారు. 1977 సంవత్సరంలో ప్రధాని ఇందిరాగాంధీ విధానాలు నచ్చక, కాంగ్రెస్ పార్టి నుంచీ బయటకు వచ్చేశారు. ఎమర్జెన్సికి వ్యతిరేకంగా ఆమె తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడమే కాదు, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పనిచేశారు కూడా. 1978 లో అంతర్జాతీయ మానవ హక్కుల కమీషన్ కు భారత దేశం నుంచీ ప్రతినిధిగా నియమించబడ్డారు.

సమకాలీన రాజకీయాలపై 1987 వ సంవత్సరంలో ఆమె వాఖ్యలు ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం అవసరం, “నేను బ్రిటన్ లో హై కమీషనర్ గా వున్నన్ని రోజులూ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేదాన్ని. అలా హాజరయిన సమయాల్లో నేను గమనించిన ఒక గొప్ప విషయం ఏమిటంటే, పార్లమెంటులో ప్రభుత్వ, ప్రతిపక్షాలు ఎంత వేడి వేడిగా చర్చించుకున్నా, బయటకు రాగానే, లంచికి రమ్మని, డ్రింక్ కు రమ్మని ఒకరినొకరు ఆహ్వానించుకునే వారు. బయటకు వచ్చాక అందరు కలిసిపోయే వారు. మనదేశంలో ప్రతి పక్షం అంటే శత్రువులుగా చూడడం గమనిస్తున్నాను. ఇలా అయితే, పార్లమెంటరీ విధానం ఎలా కొనసాగుతుంది?”

1990 సంవత్సరం డిసెంబర్ నెల 1 వ తేదిన ఆమె డెహ్రాడూన్ లోని తన స్వంత ఇంట్లో 90 వ ఏట మరణించారు. చికాగో ట్రిబ్యూన్, ది న్యూయార్క్ పోస్ట్ పత్రికలు ఆ మరుసటి రోజు ఆమె మరణ వార్తను ప్రముఖంగా ప్రకటించాయి.

ఆమె జీవిత చరిత్ర సంక్షిప్తంగా A&T నెట్వర్క్ బయాగ్రఫి సైట్లో పెట్టారు. 1979 లో ఆమె తన అనుభవాలను క్రోడీకరించి, “ది స్కోప్ ఆఫ్ హాపినెస్ –ఏ పర్సనల్ మెమాయిర్” అనే పుస్తకాన్ని రచించారు.ఆమె ఇతర రచనలు –“సో ఐ బికేం మినిస్టర్”(1939), “ప్రిజన్ డేస్”(1946), ”ది ఫామిలీ బాండ్”, “ఏ స్టడీ ఆఫ్ నెహ్రు” (1959). ఆమె జీవిత చరిత్ర మీద పుస్తకాలు లేనప్పటికీ, అన్నే గుత్రి రాసిన “మేడం అంబాసిడర్: ది లైఫ్ ఆఫ్ విజయలక్ష్మి పండిట్” , వేర బ్రిటన్ రాసిన “ఎన్వాయ్-ఎక్స్ ట్రా ఆర్డినరీ”(1965), రాబర్టుహార్డీ ఆండ్రూస్ రాసిన“ఏ లాంప్ ఫర్ ఇండియా: ది స్టొరీ అఫ్ మేడం పండిట్”, ఆమె కుమార్తె నయనతార సెహగల్ రాసిన “ప్రిజన్ అండ్ చాకొలేట్ కేక్ (1954), “ఫ్రం ఫియర్ సెట్ ఫ్రీ “ (1963) కొంతవరకు ఆ కొరత తీర్చగలవు.

ఆనాడు స్త్రీలపైవున్నకట్టుబాట్లకుఎదురునిలిచి, స్వాతంత్ర్య సంగ్రామంలో జైలు శిక్షలు అనుభవించి,దేశం కోసం పోరాడినఈ మహా నాయకురాలు, స్త్రీజాతికే కాదు, భారతీయులందరికీ కూడాఆదర్శప్రాయురాలుఅనడంలో సందేహం లేదు.

-టి.యస్. రామానుజరావు 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో