వెనకబడిన దేశాన్ని ముందుకు నడిపిస్తున్న దేశాధినేత సర్లిఫ్ (వ్యాసం )-టి.వి.ఎస్.రామానుజ రావు

               ఒకఆర్ధిక శాస్త్రవేత్త దేశానికి అధ్యక్షురాలు అయితే ఎలా వుంటుంది? ఆదేశ ఆర్ధిక పరిస్థితిచక్కబెట్టటం ప్రధమ కర్తవ్యంగా స్వీకరిస్తారు.వనరులన్నీదేశాభివృద్ధికి సమర్ధవంతంగావినియోగించే ప్రయత్నం చేస్తారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తారు. ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పి, తమఅంతర్జాతీయవ్యాపారాలు ఆర్ధిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా పనిచేస్తారు. ఏ దేశ ప్రజలకైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది?
పదకొండు సంవత్సరాలుగా దేశంలో శాంతి సౌఖ్యాలు నెలకొల్పి, ప్రభుత్వాన్ని, ప్రజలను అప్పుల బారి నుండి బయటపడేసి, ఆఫ్రికాఐరన్లేడిగా పెరుపొందిన ఎలెన్ జాన్సన్ సర్లిఫ్, లైబీరియా దేశాధ్యక్షురాలు. ఆఫ్రికా ఖండంలోనే మొదటి సారి అధ్యక్షురాలిగా ఎన్నికైన నల్లజాతి స్త్రీ. ఆర్ధిక విధానాలనుచక్కగా అమలు చేసిన ఏకైకశాస్త్ర వేత్త.

                  లైబిరియాలో మన్రోవియ అనే ఊరిలో పుట్టిన సర్లిఫ్ తండ్రి గోలా జాతికి చెందిన వాడయితే, తల్లి క్రు జాతికి చెందిన జర్మన్ దేశస్తురాలు. ఈమె 1938 వ సంవత్సరం అక్టోబర్ నెల 29న జన్మించారు. చాలా చిన్నతనంలోనే, అంటే 17 సంవత్సరాలకే పెళ్ళి చేసుకుని నలుగురు బిడ్డల తల్లి అయ్యింది. భర్త జేమ్స్ సర్లిఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటులో పనిచేసేవాడు. 1961లో భర్తతో కలిసి అమెరికా వెళ్ళి, అక్కడమాడిసన్ బిజినెస్ కాలేజిలో అక్కౌంట్స్లో అసోసియేట్ డిగ్రీ,ఆతర్వాత కొలరాడో యునివర్సిటిలోను, హార్వర్డు యూనివర్సిటిలో ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నారు. ఆతర్వాత ఆమె భర్త వేదింపుల మూలంగా విడాకులు తీసుకున్నారు.1972-73లో తిరిగి లైబీరియాకి వచ్చి, విలియంతల్బెర్ట్  ప్రభుత్వంలో ఆర్ధిక శాఖలోసహాయ మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వ వ్యయం విధానంతో విభేదించి ఆమె కొద్దికాలంలోనే మంత్రి పదవికి రిజైన్ చేశారు. తిరిగి 1979 నుండి,1980 ఏప్రిల్ వరకూ ఆమె ఆర్ధిక మంత్రిగా పనిచేశారు. ఏప్రిల్ 12,1980 నప్రభుత్వం పై సైనిక తిరుగుబాటు చేసి,అద్యక్షుడైనసార్జంట్ సామ్యుల్ ప్రభుత్వంలో,లైబిరియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రెసిడెంటుగా సర్లిఫ్ పని చేస్తుండే వారు . ఒక సారి ఆమె ప్రభుత్వ ఆర్ధిక విధానాల్ని విమర్శించడం వల్ల, ఆమెదేశం వదిలి అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాషింగ్టన్ లో వరల్డు బ్యాంకులో కొన్నాళ్ళు, 1981 లో నైరోబీ వెళ్ళి అక్కడ సిటి బ్యాంకులో ఆఫ్రికన్ రీజనల్ ఆఫీసులో వైస్ ప్రెసిడెంటుగాను ఆమె పనిచేశారు. లిబిరియాలో ఎలెక్షన్ల వల్ల, సిటి బ్యాంకులో రిజైన్ చేసి, హచ్.ఎస్. బి. సి. బ్యాంకు సబ్సిడరీ అయిన ఈక్వెటర్ బ్యాంకుకు పనిచేశారు.

                        1985లో దేశ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేశారు. గెలవలేదు కానీ,ఆమెను కొన్నాళ్ళు హౌస్ అరెస్టు చేశారు. శామ్యూల్దేవ్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు 1985 ఆగస్టులో ఆమెకు పదేళ్ళ కారాగార శిక్ష విధించారు. ఆమెను శిక్షించడాన్ని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయంగా విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో, ప్రెసిడెంట్ శామ్యూల్ సెప్టెంబర్ నెలలో ఆమెను జైలు నుంచి విడుదల చేశాడు. ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు దేశ మంతటా నిరసనలు పోటెత్తాయి. సర్లిఫ్ ప్రెసిడెంట్ టికెట్టు రద్దు కావడంతో, సెనేటర్ గా ఎన్నికయినా, జరిగిన అక్రమాలకు నిరసనగా ఆమె ఆ పదవిని త్యజించారు. 1985 నవంబర్12వ తేదిన ప్రభుత్వం కూల్చివేసేందుకు కుట్ర జరిగింది.శామ్యూల్ ప్రభుత్వం ఆమెను మళ్ళీ అరెస్టు చేసింది.1986 జులై నెలలో ఆమె రహస్యంగా అమెరికా వెళ్ళిపోయారు.1989 నుంచి 2002 వరకూ దేశంలో జరిగిన అంతర్యుద్ధాల వల్ల ఆమె స్థిరంగా లైబిరియాలో ఉండలేదు.1992 లో ఆమె అసిస్టెంట్ సెక్రెటరి జెనరల్,అసిస్టెంట్ అడ్మినిస్త్రేటర్ హోదాలో, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఆఫ్రికాఖండ రీజనల్ బ్యూరోకి డైరెక్టర్ గా నియమించబడ్డారు.
                  1997 లో దేశాధ్యక్షుడి పదవికి జరిగిన ఎన్నికలలో,అద్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు సక్రమంగా జరగలేదన్న కారణంగాఅంతర్యుద్దంఏర్పడి ఆమె ఐవరీ కోస్టు దేశంలో కొంతకాలం తలదాచుకున్నారు.1999 లో రువాండలో జరిగిన దారుణ మారణ కాండ గురించి పరిశోధించే ఏడుగురి కమిటిలో ఒకరుగా ఆఫ్రికా యూనిటీ ఆర్గనిజేషన్ ఆమెను నియమించడం జరిగింది.యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ విమెన్ అనే సంస్థ (UNIFEM) స్త్రీల హక్కుల గురించి, రాజకీయ రంగంలో వారి భాగస్వామ్యం, ఆర్ధిక స్వావలంబన మొదలగు విషయాలలో సరికొత్త పధకాలను రచించి కార్యక్రమాలను అమలు చేసే ఆశయంతో ఏర్పడింది. స్త్రీల స్థితిగతుల గురించీ, శాంతి సాధనలో వారి పాత్ర గురించి పరిశీలించి, నివేదిక సమర్పించాల్సిందిగాఈ సంస్థ నియమించిన ఇద్దరు ప్రముఖ అంతర్జాతీయ వ్యక్తులలో ఆమె ఒకరు. 2005 లో తాత్కాలికంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ప్రభుత్వపాలనా విధానాల సంస్కరణల కమీషన్ కు పనిచేశారు.2005 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో, ఆమె అద్యక్ష పదవికి పోటీ చేసి గెలిచారు. తిరిగి2011లో రెండవ సారి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

                 2006 లో అద్యక్షపదవి చేపట్టే నాటికిఆమెకుకఠినమైన సవాళ్ళుఎదురయ్యాయి. దేశంలో అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. చీకటి రోజులుగా వర్ణించబడ్డ కాలం (1989 నుంచీ 2003)లో రెండు లక్షల మందికి పైగా చంపబడ్డారు. అంతకు కొన్ని రెట్లు మంది నిరాశ్రయులయ్యారు. యువకులు,పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి,తమ జీవితాలను నాశనం చేసుకున్నారు.జనాభాలో 70 శాతం మంది స్త్రీలు అత్యాచారానికి గురయ్యారు.అటువంటి పరిస్థితులలో ఆమె ప్రభుత్వాన్ని చేపట్టింది.తన కార్యాలయం కాలిపొయినా, మరొక ప్రభుత్వ సంస్థ బిల్డింగులో తన ప్రభుత్వాన్ని నడిపించారు. తన సొంత ఇంట్లోనే నివసించారు.అందరిని కలుపుకుపోయే ఉద్దేశ్యంతో ఆమెఅప్పోజిషన్ పార్టీ వారికి కుడాతన ప్రభుత్వంలోపదవులు ఇచ్చారు. ప్రభుత్వంలో అత్యధికంగా స్త్రీలకు ప్రాధాన్యత నిచ్చారు.అంతర్జాతీయంగా వివిధ దేశాలతో ఆమె మంచి స్నేహ సంబంధాలు నెరపి, తద్వారాలబ్ది పొందారు. చైనాతో సత్సంబంధాల వల్ల, ఆదేశంట్రాన్స్మిటర్లు, భవనాలు నిర్మించి బ్రాడ్కాస్టింగ్ కార్పోరేషన్ ఏర్పాటుకు సహాయపడింది. లైబీరియాయునివర్సిటీ భవన నిర్మాణానికి సహాయ పడింది. అలాగే, అమెరికాకు తమస్నేహ హస్తం అందించి, ఆ దేశం నుంచీ సహాయం పొందారు.

                                2006 లో ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ అనేకమీషన్ ఏర్పాటు చేసి, గత 20 సంవత్సరాలుగా దేశంలో ఏర్పడిన అంతర్యుద్ధాల కారణాలు పరిశోధింఛి, దేశంలో శాంతి, భద్రతలు, ఐకమత్యంపెంపొందించేపని అప్పజెప్పారు. 2007 జులై 26వ తేదినలైబిరియా160వ స్వాతంత్ర దినోత్సవంగా పెద్ద ఎత్తున నిర్వహింఛి,చదువుకునే వయసున్న పిల్లలకు, ప్రాధమిక విద్యనిర్భందం చేస్తూ,ఉచిత విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టారు. అప్పటి దాకా స్త్రీలపైనా, పిల్లల పైనా విచ్చలవిడిగా జరుగుతున్న అత్యాచారాలని అరికట్టేందుకు చట్టం తీసుకొచ్చారు. ఆఫ్రికా ఖండ పడమటి దేశాలలో ఎక్కడాలేని ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్చట్టం తెచ్చారు. 2006మార్చి15వ తారికున అమెరికన్ కాంగ్రెస్ జాయింట్ సమావేశంలోఆమె“మా లైబీరియా దేశం ఆఫ్రికా ఖండానికి దీప స్థంబంలా నిలిచేందుకు, స్వాతంత్ర్యం పట్ల మాకున్న ప్రేమతో మేము ఏదైనా సాధించగలమని నిరూపించేందుకు, మాకు తోడాడ్పాటు నివ్వండి” అంటూ విజ్ఞప్తి చేశారు. 2011 లో అమెరికా దేశం ఇచ్చే రుణ సహాయం “గే” ల హక్కుల పరిరక్షణకు వినియోగించాలని నిబంధన పెట్టింది.సర్లిఫ్ ప్రభుత్వంలో కొందరు “గే” లపై మరింత కఠినమైన ఆంక్షలు ప్రతిపాదించినప్పుడు, సర్లిఫ్ అంగీకరించలేదు. అప్పటివరకు వున్న చట్టాలు చాలులెమ్మని ఆ బిల్లులను త్రోసిపుచ్చారు.
                    2015 లో లైబీరియాలో ఎబోలా వైరస్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అంతు తెలియని ఆ వైరస్ వలల జరిగిన ప్రాణ నష్టానికి చలించిపోయిన సర్లిఫ్, వెంటనే అమెరికా వారి సహాయం కోరింది.ఆమె సాధించిన అతి పెద్ద విజయాలలో, 4.9బిలియన్ డాలర్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాన్ని బయట పడేయ్యటం. 391 మిల్లియన్ డాలర్ల ఋణాన్నిరైట్ ఆఫ్ చేసిన అమెరికా దేశం,324.5 మిల్లియన్ డాలర్ల వరకూ ఐ. ఎం. ఎఫ్.ఋణం తీర్చడానికి జర్మనీ దేశం చేసిన సహాయం-ఆమె ఆర్ధిక విధానాలకు, దేశాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు, సంతృప్తి చెంది చేసినవే.విదేశీ రుణభారాన్ని తగ్గించడానికి ఆమె చేసిన మరొక ప్రయత్నం వల్ల,అంతర్జాతీయఅభివృద్ది సంస్థ (ఐ.డి.ఏ)కు బాకీ వున్న 1.2 బిలియన్ డాలర్ల ఋణాన్ని,బై బాక్ పద్ధతిలో 97% డిస్కౌంట్ తో తీర్చి వేయగలిగారు. ఆమెకు ఈ ప్రయత్నంలో జర్మనీ, నార్వే, అమెరికా, బ్రిటన్లు ఆర్ధిక సహాయం చేశాయి. అభివృద్ది చెందుతున్న మరే దేశానికి ఇంత ఎక్కువ డిస్కౌంటు ఇవ్వడం జరగలేదు. లైబీరియా2008 వ సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిది(ఐ. ఎం. ఎఫ్.)సంస్థల సహాయం పొందే అధిక రుణభారం కల దేశాల జాబితాలో చేరడమే కాకుండా,

                          2010 లో ఆ రుణాల్ని రద్దుఅయ్యేందుకుఅర్హత సంపాదించుకున్నది. అదే సంవత్సరం ఆ రెండూ సంస్థలు 1.5బిలియన్ డాలర్ల సహాయం చెయ్యడానికి ముందుకొచ్చాయి. పారిస్ క్లబ్ తమకుచెల్లించాల్సిన 1.25బిలియన్ డాలర్ల ఋణాన్ని ఇతరుల నుంచీ అందుకుని, మరింత వితరణతోలైబీరియాదేశానికి మిగిలిన మొత్తం (107 మిలియన్ డాలర్ల) ఋణాన్ని రైట్ ఆఫ్ చేసుకుంది. ఇక దేశానికి అవసరమైన నిర్మాణాత్మక ప్రాజెక్టుల కోసం తప్ప మరొక అవసరానికి ఋణం పొందరాదనీ,ఆ ఋణం కూడాజీ.డి.పి (గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్టు.)లో 3%శాతం మించరాదని, సర్లిఫ్ నిర్ణయించింది. మిత్ర దేశాలతో సుహృద్భావ సంబంధాలు నెరపబట్టే సర్లిఫ్ కు ఇది సాధ్యమయ్యింది. ఆమె శాంతి కోసం సలిపిన కృషికి 2010 లో నోబుల్ పీస్ బహుమతి వచ్చింది. భారత దేశం 2012 లో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఇచ్చి సత్కరించింది.
ఆమె అందుకున్న పదవులు, అవార్డులు, గౌరవ పురస్కారాలు అనేకం. అవి:
రూజ్వెల్ట్ ఇన్స్టిట్యుట్ ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అవార్డు
రాల్ఫ్ బంచ్ ఇంటర్నేషనల్ లీడర్షిప్ అవార్డు
గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆఫ్రికా రెడంషన్ ఆఫ్ లైబీరియా
కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మోనో
2006 కామన్ గ్రౌండ్ అవార్డు రిసిపిఎంట్
2006లారియేట్ ఆఫ్ ఆఫ్రికా ప్రైజ్ ఫర్ లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ ఎండ్ ఆఫ్ హంగర్
2006 డిస్టింగ్యూషుడుఫెలోక్లాస్. ఎమ్. హాలె ఇన్స్టిట్యూట్ ఫర్గ్లోబల్ లెర్నింగ్, ఎమోరి యూనివర్సిటీ
2006డేవిడ్రాక్ఫెల్లర్బ్రిడ్జింగ్ లీడర్షిప్ అవార్డు, సినర్గోస్ నుండి
ఇక ఆనరరీ డాక్టర్ ఆఫ్ లా డిగ్రీలు- 2006 లో మర్కెట్టి యూనివర్సిటీ నుంచి,
2008 లో ఇండియానా యూనివర్సిటీ, డార్ట్ మౌత్ కాలేజి, బ్రౌన్ యూనివర్సిటీ ల నుండీ,
2010 లో యేల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ అఫ్ న్యూ జెర్సీ,
2011 లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచీ, ఆనరరీ డాక్టర్ అఫ్ లా అందుకున్నారు.
2009 లో ఆనరరీ డాక్టర్ అఫ్ హ్యూమన్ లెటర్స్ డిగ్రీ, తమ్పా యూనివర్సిటీ
2010ఆఫ్రికన్ ఎడిటర్సు యూనియన్ నుంచీ ఫ్రెండ్ అఫ్ మీడియా ఇన్ ఆఫ్రికా అవార్డు
2011ఆఫ్రికన్ జెండర్ అవార్డు
2011 నోబుల్ పీస్ ప్రైజ్
2013ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ ఫర్ పీస్, డిజార్మమెంట్అండ్ డెవెలప్మెంట్
2016 లో ప్రపంచంలో అత్యంత ప్రభావంతమైన వారిలో సర్లిఫ్ 83 వ స్థానంలోఉన్నట్లు ఫోర్బ్స్ నిర్ణయించింది.
2016 లో ఎకనామిక్ కమ్యూనిటీ అఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ కు చైర్ పర్సన్ గా ఎన్నుకోబడ్డారు. కమిటీ ఏర్పడిన తర్వాత ఇలా ఎన్నికైన మొదటి స్త్రీ ఆమె.
ఆమె జీవితంలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ విధానాలలో, ఎన్నికలలో అక్రమాలు జరిగినప్పుడల్లా తిరుగుబాటు చేశారు. జైలు శిక్ష అనుభవించారు. ప్రాణ రక్షణ కోసం దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో దేశం కోసం, ప్రజల కోసం నిరంతరంశ్రమించారు.ఎబోలా వైరస్ ప్రమాదాన్ని ముందే పసికట్ట్లేదని, ప్రభుత్వంలో తన వారికి ప్రాధాన్యత ఇచ్చుకుందని, ప్రభుత్వంలో అవినీతిని అరికట్టలేకపోయిందని ఆమెపై విమర్శలు పెరిగిపోయాయి. ఇటువంటి ప్రతికూల వాతావరణంలో వచ్చే నెలలో జరుగనున్న అద్యక్ష ఎన్నికలలో ఆమె పోటీ చేస్తారో, లేదో తెలియదు.అయితే,ఆర్ధికంగా, సామాజికంగా అట్టడుగు పరిస్థితికి దిగ జారిన దేశాన్ని సరైన దారిలో పెట్టే క్రమలో, కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు.ఏదేమైనా,సర్లిఫ్ అత్యంత ప్రతిభావంతురాలని,సమర్దురాలైన నాయకురాలని ఒప్పుకొని తీరాలి.

                                                                                                                  –టి.వి.ఎస్. రామానుజ రావు.

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో