జానపద స్త్రీల పాటలు – వైశిష్ట్యం (సాహిత్య వ్యాసం ) – లక్ష్మణ్ ఆదిమూలం

ISSN 2278 – 4780

జానపద సాహిత్యమున గేయ, వచన, రూపకము అను మూడు ప్రధాన శాఖలున్నవి. గేయశాఖ కథా సహితమనియు, కథారహిత మనియు రెండు విధములు. కథా సహితమైన గేయములను కథాగేయములనియు, కథా రహితమైన గేయములను జానపద గేయములని, పల్లె పాటలని అంటారు. జానపద కవిత్వంలో గేయానిదే అగ్రస్థానం . గేయరూపంలో భావ ప్రధానంగా వెలువడే ఆశురచన జానపద గేయం.

జానపద గేయాన్ని ఆంగ్లంలో ‘ఫోక్‌సాంగ్స్‌’ అంటారు. బ్రతుకులోని ఆనందాన్ని , విషాదాన్ని జానపదుడు తన జానపద గేయంగా రూపొందింది. ఒకరి చెవి నుండి మరొకరికి మౌఖిక ప్రసరంలో వ్యాపించిన సామాన్య ప్రజాసమూహ గీతాలే జానపదగేయాలు. సంగీత సాహిత్యాలతో కూడిన నిరక్షరాస్యుని భావగీతం జానపద గేయం. జానపదులు పనులు చేసేటప్పుడు కష్టము కనబడకుండా ఉండడము కోసం అప్రయత్నముగా కూనిరాగాలు తీయడం ఏవో ఏవో మాటలు లయతో అనడము సంభవిస్తుంది. పొలాలలో దగ్గర పనిచేసేవాళ్ళు, బండ్లు లాగేవాళ్ళు, కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు పాటలు పాడటం వింటూనే ఉంటాం. అలా ఏర్పడినవే జానపద గేయాలు. వేట ఆదిమానవుని ప్రధాన వృత్తి. వేటాడిన తర్వాత వేట ద్వారా కలిగిన భావోద్వేగంతో నృత్యాలు చేస్తూ మాట్లాడిన భాష లయబద్ధంగా వుండేదని ఊహించవచ్చు. ఆదిమానవులు తమ సుఖదుఃఖాలను మానవాతీత శక్తులకు విన్నవించు కునేటప్పుడు లయాత్మక గీతాలు ఆలపించి ఉండవచ్చు.

మహాభారతంలో నన్నయ వాడిన సీసము, గీతము, మధ్యాక్కర, తరువోజులను జానపద గేయాలుగా పేర్కొనవచ్చు. నన్నెచోడుడు కుమారసంభవంలో గౌడు గీతములు, రోకటి పాటలు, అంకమాలికలు, మొదలగువాటిని పేర్కొన్నాడు. పాల్కురికి సోమన బసవపురాణంలో అతీత బసవపురాతన భక్తగీతార్థ సమితియే మాతృకగా రచించినట్లు చెప్పాడు. పండితారాధ్య చరిత్రలో తుమ్మెద పదములు, పర్వత పదములు, వ్రాలేశు పదములు, వెన్నెల పదములు, నివాళి పదములు, రోకటి పాటలు మొ||వాటిని పేర్కొన్నారు.

తెలుగు వారి పండగలలో సంక్రాంతి పండగకి ఒక ప్రత్యేకత ఉంది . తెలుగు వారికి పెద్ద పండగ . సంక్రాంతి ముందు ఆడపిల్లలు గుంపులుగా వచ్చి గుండ్రంగా తిరుగుతూ గొబ్బి,’ తట్టి పాటలు పాడతారు .

గొబ్బి యెల్లో గొన్ని గొన్ని పాడరమ్మా /గొబ్బాలి లాల యో /చందమామ , చందమామ ఓ చందమామ / చందమామ కూతుళ్ళు నీలగిరి కన్నెలు
/నీలగిరి కన్నెలకు నిత్య మల్లె తోట /నిత్య మల్లె తోటలో నిమ్మల్ల బావి
/నిమ్మల్ల బావికి గిళ కల్ల తాడు /గిళ కల్ల తాడుకు బుడిగి బుడిగి బెంబు” అంటూ సాగుతుంది .

సీతమ్మ వేవిళ్ళు , జానపదుల కల్పనలో సిరి మంతు లయ్యేది చక్రవర్తులయ్యేది . జానపదుల మాటలే ఆడతారు .
ఓ యమ్మ సీతకి యెన్నమ్మ నెలలు ?
/ఒకటాయే , రెండాయే మూడు నెల లాయె /మూడు నెలలకు సీత కేమి మనసాయె
/పులిపాలు తెమ్మని పురుషునితో జెప్పు /తన మరిది లక్ష్మన్న పులి వేటగాడు
/పుట్ట మీద బొనోగ్గి పులిని బడగొట్టి /పులి జలపి పులి పాలు దొన్నెల్ల
/యిదిగోను వదినమ్మ నీ కోరికల్లు /ఇంకొక్క కోరి కుంది మరిది లక్ష్మన్న
/నట్టేట సముద్రాన నది దిబ్బ మీద /టేకి చెట్టుల మీద తేనె మనసాయె “ఈ పాట ద్వారా జానపదుల కల్పనలు తెలుస్తాయి .

అల్లుళ్ళకు అత్త దగ్గర చనువు ఎక్కువ . నవ మాసాలు మోసి కని పెంచి పెద్ద వారిని జేసిన కూతుళ్ళను అల్లునికి కాళ్లు గడిగి కన్యాదానము చేయుటచే గదా !
“అల్లుడల్లూడంటే ఒళ్లు మండేను /అల్లు డత్తకు తెచ్చె అద్దాల రైక
అల్లుడత్తకు తెచ్చె అద్దాల రైక /యిప్పూక తోడగ బోతే నిప్పుల్లు రాలె….నిప్పుల్లు రాలె
మరగేసి తోడగ బోతే మల్లెల్లు రాలె/ ఇది ఏమి అల్లుడా ఇంక సోద్యాము
కాదత్తానే సేబుతా నువ్వాలకించు /నిత్తె మల్లెలు రైక నీకు అందమ్ము
నువు కన్న కూతురూ నాకు అందమ్ము “ అంటూ అత్తా , అల్లుళ్ళ మధ్య చనువు , వెతకారం తెలియజేసారు .

పుట్టింటిలో తన మాటకు గల చెల్లుబడిని గూర్చి ఈమె చెప్పుచున్నది . పుట్టింటికి అత్తింటికి మధ్య గల ఆటంకాల అరల పొరలను తొలగించినందుకు తిరుపతి తిమ్మప్ప నూటొక దీవెనలతో తిరు పూజలయినవి .
అక్కలను చెల్లెండ్ల నొకూరి చిచ్చ/ వొక్కడే అన్నయ్య వచ్చెనన పోతూ
పచ్చెన్న పోతుంటే యేరడ్డమాయే /తీగాకీ తిరుపతీ కొండడ్డమాయే”అత్తింటికి , పుట్టింటికి మధ్య గల వ్యత్యాసాన్ని వివరించారు .

తాళి గట్టిన మగడు వినా , ఎందరున్నను ఆ సోఖ్యము , సౌభాగ్యము రావని ఈ క్రింది విసురు రాతి పాట చాటుచున్నది .
“రాగల్ల యిసిరేటి వొ రామ చిలుకా /మొగుడెందు బోయెనే మొగము కళ దప్పె
నాగలోకము బోయి నరుడయ్యి నిలిచి /దేవలోకము బోయి దేవుడై నిలిచె
చింతల నీలమ్మ చెల్లె లున్నాది /చేతి గాజులు పోయే చెల్లె లేవరమ్మా
యేడోద్దు నీలమ్మ తల్లి వున్నాది /తల మింద నీడ బోయె తల్లి ఎవరమ్మా “ స్త్రీ తన భర్త సుఖ శాంతులు గురించి ఏ విధంగా ఆలోచిస్తుందో తెలియజేసిన జానపద గేయం .

“పుట్టింటి పై గల మమకార మొక యువతీ మనసులో లేపిన తీయని కోరికలు ఈ పాటలో ఉన్నవి .
“సూర్యుని చేతికి సులగె కానైతు /పసులోవి చేతికి పరిగె శానైతు
నా తల్లి శ్రీలక్ష్మి చల్ల జెయ్యంగ /చిల్లి పోయి కవ్యాన రిలుకగా నైదు
నా యేడుగు రాన్నలు నాగలి దున్నంగ /నాగాల్లో నేనొక్క నాగాలన్న నైదు
నా యేదుగురు వదినెలు నాలె దియ్యంగ /నాలెలో నే వొక్క మొగలి పువునైదు “.

అత్తల ఆరళ్లు ప్రసిద్ధము . చీటికి మాటికి కోడలిపై నేరములు మూపు అత్తగారి బాధలు పడజాలక ఒక కోడలు విరక్తితో వేదన ఈ పాటలో కన్పిస్తుంది .
మొదటి అయిదు పంక్తులు అత్తగారి ప్రశ్నల పరంపరలు . తరవాత పంక్తులు కోడలి హృదయపు గాయాలు …..

కోడలా కోడలా కొలికి ముత్యామా /పచ్చి పాలా మీది మీగడేమాయే
వేడి పాల మీది వెన్న లేమాయె /తేనె కుండల మీది తెప్ప లేమాయే
నూనె కుండల మీది నురుగు లేమాయే /అత్తనువు బెట్టిన ఆరళ్ళ వలన
అట్లుపోయి అడవిలో మాను గానైతి /మానన్న గానైతి మంచెలేతూరు
చెట్టన్న గానైతి చెలగి వేతూరు /ఆకన్న గానైతి మేక లారగించు
కాయన్న గానైతి కాకు లారగించు “ కోడల మీద అత్త గారి సాధింపులకి నిదర్శనం ఈ గేయం .

అన్నదమ్ముల నుండి వేరు పడుటకై , తన భర్తను ప్రోత్సహించుచున్న దొక యుపాయశాలిని . వేరు బడినచో తన ప్రజ్ఞ చూపించి సంసారము అభివృద్ధి చేతుననియు మొగనికి మొలత్రాడు చేయింతు ననియు ముఖములు చూరలిత్తు ననియు పురి కొల్పుచున్నది .
“ ఎరు బడితేనే మేలు మొగడా ..మనము /పొత్తు లుంటేనే పోరు మొగడా
ఎరు బడ్డ తెల్లారి ఏకమై మన ముండి /ఏకించి పీకించి నెలకొక్క పోగొడికి
మోట దండెడ దొడ్డు మొలతాడు చేయిస్తు /మొక్క జొన్న చెను మన పాలికే వస్తే
నక్క బెదురూ బెట్టినా ప్రజ్ఞ చూపించి /యిద్దూము పండేది నల్తూము పండిస్తూ “
ఈ విధంగా స్త్రీలు తమ నిత్య వ్యవహారంలోని ప్రతి సంఘటనని పాట కింద మలచి పాడుకోవడం జరుగుతుంది . జానపద గేయాలలో స్త్రీల పాటలు వారి జీవన స్థితి గతులను తెలియజేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు .

(“తెలుగు మార్గ దేశి సాహిత్యాలు” జాతీయ సదస్సు  జూన్ 29 , 30 , 2011 ఆంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో జరిగిన సదస్సు పత్ర సమర్పణ చేసిన వ్యాసం  ) .

-లక్ష్మణ్ ఆదిమూలం M.A .M.phill

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో