‘ న్యాయఫోబియా ‘- (కథ) – ఆదూరి హైమావతి.

” అయ్యా! న్యాయమూర్తిగారూ! దండాలండీ!నాకు ఇంగ్లీసు భాషరాదు. ఐదోతరగతి వరకే చదువుకున్నా. నాకు

వచ్చిన భాషలో మాట్లాడను అనుమతించ వలసిందిగా ప్రార్ధిస్తున్నానయ్యా!”

“మీకోరిక ఆమోదించ బడింది. కానీండమ్మా! చెప్పండి. “న్యాయమూర్తి అనుమతించారు.

“మీరు న్యాయాన్ని పాటిస్తారనీ, ధర్మం తప్పరనీ విన్నాను .ఇప్పుడు మిమ్ముచూస్తుంటే నేను విన్న దంతా

అసత్య మని పిస్తున్నది…”ఆమె కంఠం ఆగగానే కోర్టంతా నిశ్శబ్దమై పోయింది .

కోర్టులో లాయర్లంతా అలర్ట య్యారు.S.P.లాటీని చేతుల్లోనే గిరగిరా తిప్పాడు. మిగతా వారంతా,’ ఏ మినిస్టర్

తల్లోకాదు కదా! ఈమెకంత సీన్ ఉన్నట్లు లేదు.ఈమె వస్త్రధారణ, తీరూ అల్లా లేదు.’అనుకోసాగారు.

న్యాయమూర్తి కుర్చీలోంచీ ముందుకు వంగారు ‘ ఎంత ధైర్యం! నిండుకోర్టులో తననే విమర్శిస్తున్నదా! ఈమెకు ఏ సెక్షన్ క్రింద ఏమి నేరమారోపించి శిక్ష విధించవచ్చో ఆయన ఆలోచిస్తున్నారు.

“అయ్యా!మీరు చాలామంచివారనీ,న్యాయం తప్ప, ధనికులపట్లా, రాజకీయాల పట్లా,శిఫారసులకూ తల వంచరనీ,

మహానేర్ప రులనీ విన్నాను. “ ముసలామె గొంతు సవరించుకుని, “అయ్యా! న్యాయదేవత గారూ! నేను విన్న

దంతా వట్టిమాటలే!మిమ్మల్ని చూస్తుంటే మరో న్యాయదేవత లేదనిపిస్తున్నది. న్యాయ దేవతే రూపుదాల్చి

ఇక్కడ కూర్చున్నట్లూ,ధర్మం రూపం దాల్చి వచ్చి మీ రూపంలో ఉన్నట్లూ అనిపి స్తున్నది. ఆ నాటి ధర్మరాజులో

లోప ముందేమో కానీ, శ్రీరామ చంద్రునిలో సీతను అనుమానించి అడవులకు పంపిన పాపముందేమో కానీ,

మీ ముఖాన అంతా దయ, కరుణ, జాలి, ధర్మం ,న్యాయం తప్ప మరేమీ కనిపించడం లేదు. సాక్షాత్ దైవం ఇక్కడ

ఉన్నట్లే ఉంది .మీ వెనక ఉన్న న్యాయ దేవత బొమ్మ మీ ఘనత చూడలేక, మీరు న్యాయం తప్ప, మరేమీ

వినరని, భయపడి కళ్ళకు నల్ల గుడ్డ కట్టుకుందనీ నమ్ముతున్నానయ్యా!” అంటూ ఆయాసంతో ఆగింది.

వెక్కిళ్ళుకూడా వస్తున్నాయి. న్యాయమూర్తి సైగతో ఒక జవాను ఆమెకు మంచినీళ్ళు అందించాడు.

‘అబ్బా ! ముసిల్ది జడ్జీగార్ని పడేసినట్లుంది. ఏంతెలివి ఈమెకూ!’ అనుకున్నారు కోర్టులో అంతా.

ఆమె మాటలకు కరగిపోయడు న్యాయమూర్తి.’ తన సర్వీసులో ఎవ్వరూ తననింత గొప్పగా అర్ధంచేసుకుని చెప్పిన

వారే లేరు.’ అనుకుని,” అమ్మా! నీవు చెప్పదల్చుకున్నది నిర్భయంగా చెప్పు, నీవెవరినైనా న్యాయవాదిని పెట్టు

కోలేదా! ఆయనైతే చక్క గా చెప్తాడు. నీవు మాట్లాడ లేక పోతున్నావు? నీకు వచ్చిన కష్టమేమి?” అన్నాడు

న్యాయమూర్తి ఆమెను చూస్తూ.

చల్లని నీరుత్రాగి తేరుకుని ” అయ్యా! ‘ఉట్టికెక్కేలేనమ్మ స్వర్గానికా!’ అన్నట్లు తినను తిండీ, కట్టను బట్టా లేని

నేను వకీలు ను పెట్టుకోను ధనం ఎక్కడనుంచీ తేను?ఈ నల్లకోట్లవారు డబ్బు కట్టలు చూసి తప్ప, గాంధీ

మహాత్మునిలా ఊరికే న్యాయ పోరాటం చేస్తారాయ్యా! పైగా అది వారి జీవనాధారమైన వృత్తి కదయ్యా! మీ దయకు

ధన్యవాదాలు.

నాకు ఇంగ్లీషురాదని చెప్పుకున్నాగదయ్యా!.మాదో చిన్నపల్లెటూరు. మేం పేద రైతులం. నాకు మా ఆయన,

ఆయనకు నేనూ తప్పమరెవ్వరూ లేరు.ఇప్పుడు నాకు మా ఆయన్ని లేకుండా చేసి , అనాధను కావటానికి

కారకులైన వారిని శిక్షించ వలసిందిగా అదేదో సెక్షన్ అంటారే దాని క్రింద హత్యానేరం ఆరోపించి యావజ్జీవం

వేయవలసిందిగా మీమ్ము కోరుకుంటున్నాను. మా ఆయన లేకుండా నేనెలా బ్రతక నయ్యా!” అంటూ ముఖం

చుట్టూ చీరచెంగు కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్వసాగిందా ముసలామె.

ఆమె ఏడ్పు చూసి కోర్టులో చాలామంది కళ్ళు చెమ్మగిల్లాయి. ముసలి వగ్గు, చర్మం వ్రేలడుతోంది. ఎముకలు

తప్ప వంటి మీద చిన్న మెత్తు బంగారం మాట అలా ఉంచి మిల్లీ గ్రామంత కండలేదు.

మాసిన చీర, ఎప్పుడు అన్నం తిన్నదో కడుపు వీపుకు అంటుకుని ఉంది. కంఠం మాత్రం ఖంగు మంటున్నది.

“వారెంతటి వారైనాసరే శిక్షవేసి తీరుతాను.వయో వృధ్ధురాలి వైన నిన్ను ,తల్లి లాంటిదాన్ని బాధించిన వారి ని

ఊరికే వదల్ను. చెప్పుతల్లీ !” అంటూ న్యాయమూర్తి ఆమెకు ధైర్యం చెప్పి ఓదార్చాడు.

“అయ్యా! న్యాయమూర్తిగారూ!మా ఆయన , నేను మాకున్న అరెకరాపొలంలో కాయా, పువ్వూ పండించు

కుంటూ, పొలం పనులు చూసుకుంటూ కలోగంజో త్రాగి బతికేటోల్లం .నేను ఐదోక్లాస్ చదువు కున్నాను. మా

ఆయన నిశానీ.నాకు ఎనిమి దే ళ్ళ వయస్సులో పెళ్ళైంది. ఇద్దరం స్నేహితుల్లా బతికాం .

నాకు చాలా ధైర్య, మా ఆయన పిరికి. చిన్నప్పుడు పిడుగు పడ్ద శబ్దానికి దడుసుకున్నాట్ట. మాపెళ్ళయ్యా కా

పిడుగుపడితే వచ్చి నన్ను వాటేసుకునేవాడు. మా అత్తా మామా వెతికి వెతికీ ధైర్యం గల నన్నిచ్చి

పెళ్ళిచేశారయ్యా! ఆయనకు తెలీకుండా నేనే పనీ చేయను, నాకు తెలీకుండా ఆయనే పనీ చేయడు.

మా ఆయనని కాదయ్యా! ఆయన మహామంచోడు.ఎవరికి కష్టం వచ్చినా తనకే అనుకుంటాడు.

మాకున్నదాంట్లోనే లేనోళ్ళకు సాయం చేస్తుంటాడు. గొప్ప మనస్సు .ఆయన కోసం నేను తీసు కెళ్ళి ఇచ్చిన

అన్నం ఆకలితో అల్లాడుతున్న ఎవరికో పెట్టే స్తుంటాడు. తిండి తీనీ తినకా పనిచేసే సరికి గుండె నొప్పొక్కటి

పట్టుకుందయ్యా! మొన్నామధ్య వచ్చిన అకాల వర్షానికి పక్క నే ఉన్న తాటి చెట్టుమీద పడ్ద పిడుగు శబ్దానికి

అడ్డంగా పొలం లోనే పడిపోయాడయ్యా! ఆయన మంచి తనం తెలిసున్న మా ఊరివాళ్ళంతా 108 కు ఫోన్ జేసి

పిలిపించి, తెచ్చిఈ నగరంలో హాస్పెటల్లో చేర్చారయ్యా.

మేం అంత డబ్బు పెట్టీ లోన ఉండ లేక ఔట్ పేషెంట్ గా చేరి, ఆస్పత్రిలోచూపించుకుంటూ , మా ఊరోళ్ళు వెతికి

చూపించిన పల్లెటూరోళ్ళుండీ, పనీ పాటా చేసు కునే ఈ కాలనీలో ఒకిల్లు అద్దెకు తీసుకుని , ఇల్లంటే ఒక్క రేకుల

గదయ్యా ! ఆడే వంటా వార్పూ పడకానూ. ఆడ ఉంటుంటి మయ్యా! నేను నాలుగిళ్ళలో గిన్నె లు తోమి ,

వారిచ్చింది ఇద్దరం తింటూ ,వైద్యం చేయించుకుంటూ ఉంటిమి.” అంటూ ఆయాసం తో రొప్పు తూ ఆగింది, దగ్గూ

వచ్చింది.

మళ్ళీ న్యాయమూర్తి సూచన తో జనావ్ నీళ్ళిచ్చాడు. న్యాయమూర్తి ” అమ్మా! ఇంతకూ అసలు విషయం చెప్పనే

లేదు, నీకు అన్యాయం చేసింది ఎవరు ? కోర్టు సమయం వృధా చేయకూడదు, నేరం కూడా.” అంటూ ఓపిగ్గా

అడిగాడు .

“న్యాయమూర్తి గారూ! ఇప్పుడునాకు 70 ఏళ్ళు, మా పెళ్ళై 62 ఏళ్ళు. ఒక్కప్రాణంగా బతికాం ఆయన లేకుండా

నేను ఉండ లేనయ్యా! ” అంటూ కుప్పకూలి పెద్దగా ఏడ్వసాగిందామె.

ఆమె పెట్టే ఎక్కిళ్ళకు కోర్టులో వారికంతా మనస్సు కరిగి, ఆమెకు అన్యాయం చేసి ఆమె భర్త ప్రాణం తీసిన వారిని

తప్పక దండించాల్సిందే , తామూ ఆమెకు సపోర్ట్ ఇచ్చితీరాలి.’ అనుకున్నారు కూడా.

“ఎవరైనా ఎంతకాలం బ్రతుకుతారమ్మా!ఏదోనాటికి పోవలసిందేగదా!” అన్నాడు న్యాయమూర్తి ధైర్యంచేసి.

“అయ్యా! మన్నించండి, మీరన్నది సత్యం. ఐతే ఇది సహజ మరణంకాదూగదయ్యా!చదువురాని దాన్ని, ఎవ్వరూ

లేని అనా ధను, , ఉన్న ఒక్క మనిషినీ పోగొట్టుకున్న దాన్ని. నాకు న్యాయం చేయడం మీకూ, ఈ

న్యాయస్థానానికీ తప్పని సరి. అది మీ ధర్మం. ‘ వైద్యులు అమ్మా! పెద్ద శబ్దాలు ఈయనకు పడవు,శబ్దం వింటే

గుండె దడవస్తుంది .అది పనికిరాదు. జాగ్రత్త, అని చెప్పారయ్యా! నేను రోజంతా లోపలే పెట్టి ఏశబ్దాలూ

వినపడకుండా చెవుల్లో దూది ఉండలు పెట్టి జాగ్రత్త పడుతూ ఉన్నానయ్యా! మేం అక్కడ చేరి పది రోజులు

కావస్తున్నది. ఈ పది రోజులుగా విమానాలు మా ఇళ్ళమీదుగా వెళుతున్నాయయ్యా! అదేం శబ్ద మో

విపరీతమైన శబ్దం. చెవులు చిల్లులు పడుతున్నాయి. నాకే గుండె నొప్పి వచ్చేంత శబ్దమయ్యా!నేను ఉదయాన్నే

పనికెళ్ళి పని చేసే ఇంటి అమ్మను బతిమాలి ఇడ్లీలూ, అరటి పండ్లూ తెచ్చి చూద్దును కదా! ఆయన ఎంత

పిలిచినా పలక లేదయ్యా! పక్కవాళ్ళను పిలిచి, వాళ్ళసాయం తో,108 కుఫోన్ చేసి ఆస్పత్రికి తీసుకెళ్లానయ్యా! ఆ

డాక్టర్లు, ‘అమ్మా! నీకు చెప్పాం గదా ! ఈయనకు శబ్దం పనికి రాదని. ఇక్కడైతే ఏ.సీ గదిలో ఉంచేవాళ్ళం

,ఇప్పుడు చూడూ! తీసుకెళ్ళి పోమ్మా! మీ ఆయన గుండె ఆ శబ్దాలకు ఆగి పోయింది.” అని చెప్పి రయ్యా! డెత్

సర్టిఫికేటూ ఇచ్చారయ్యా!మా ఆయన చాలాకాలం క్రిత మే ” ఏమే సుబ్బు సుందరీ! డబ్బున్నోళ్ళంతా జనాలకు

శానా సేవలు చేస్తున్నరంట గదా! నీకు ఎమీ లేదు, నాకూ ఏమీ లేదు, రత్త దానం చేయను మనొంట్లో రగతమే

లేదాయె. నిన్న మన వాడకాడ పంచాయితీ రేడియాలో ఇన్ననే! మడిసి చచ్చాక ఆ పీనుగని ఆస్పెటేల్కిత్తే దాంతో

డాకటరీ సదివే కుర్రోల్లకి సదువు చెప్తారంటే. నీవు ముందెల్తే నేనా పని జేత్త, నే పోతే నీవూ అదే సెయ్యే. నా మీది

పేవ తో ఏదో సేయకే. నామీ దొట్టు.మనకు చేతైన సేవి దేనే.నిన్న సేప్తాఉంటే ఇన్నప్పుడే ఇట్టసేయాల్ని

అనుకున్నానే.ఏవంటవు?” అన్నాడయ్యా! మా ఆయన మనస్సు చెడ్డ మంచిదయ్యా! సరేని పెమాణం చేసేసినా

నయ్యా. అందుకని మా ఆయన్ని ఆస్పేటల్క్ తీసుకెల్లి ,కాయితాల మీద రాసి, ఆస్పేటల్క్ కిచ్చేసి వచ్చిన్నయ్యా!

మా కాలనీ వాళ్లందరి సాయంతో న్యాయం కోసం మీ వద్ద కొచ్చానయ్యా! నాకు దిక్కెవ్వరు నాకు న్యాయం చేసే

దెవరు? ” అంటూ మళ్ళా పెద్దగా ఏడ్వడం మొదలెట్టింది.

జడ్జీ నిర్ఘాంతపోయి కూర్చున్నాడు.

‘ HAL . సంస్థ తయారు చేసి, వాటి పనితనాన్ని పరిశీలించను చేసే విహారం ! వీటిని ఆపడం ఎలా?అది కేంద్ర

ప్రభుత్వ సంస్థ.’ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ రక్షణ మంత్రిత్వ ‘ శాఖకు సంబంధించినది. ఎవరా పగలరు?

వారిపై ఎవరు కేసుపెట్టి, ఆ శబ్దాలు చేసిన వారిని శిక్షించగలరు?’

“అయ్యా! న్యాయమూర్తి గారూ? మా ఆయన్నైనా బతికించి ఇప్పించండి, నాకు న్యాయమైనా చేయించండి. ‘

ఏదైనా సరే చేస్తా ‘ నన్నారు కదా!” అంటూ మళ్లాఏడ్వసాగిందామె.

“అమ్మా! అది ప్రభుత్వ విమాన సంస్థ. ఎవ్వరూ వాటిని ఆపలేరు.”

“అయ్యా జనాల మధ్య ఇట్టాటి పెద్ద శాబ్దాలు చేస్తూ జనాల ప్రాణాలు తీస్తూ, మధ్య రాత్రిలో పిల్లగాళ్ళు భయం తో

ఉలిక్కిపడి నిద్రలేస్తూ ఏడుస్తుంటే ,కర్ణభేరి పగుల్తా ఉంటే ఊర్కోవాలాయ్యా! ఇదే మరెవరో తెప్పిదం చేస్తే శిక్షించ

రాయ్యా! ప్రభుత్వాని కొక న్యాయం , జనాలకో న్యాయమాయ్యా! ఇట్టా టి సంస్థల్ని ఊరికి దూరంగ ఎక్కడో పెట్టాలి

గదయ్యా! “

” ఇంతకు ముందు ఈ సంస్థ ఊరికి దూరంగానే ఉందమ్మా ! ఇప్పుడు ఊరు పెరిగి మధ్యకొచ్చిందమ్మా! “

” ప్రభుత్వమే గదయ్యా! కొంపలు కట్టుకోను స్థలాలిచ్చి ప్లానులు శాంక్షన్ చేసేది?ఎట్టాచేశారయ్య! ఆవి మానం

కొంపల మీద కూలితే ఏం కానయ్యా!అప్పుడూ ఈమాటే అంటారాయ్యా! న్యాయమూర్తులు, ధర్మ ప్రభు వులు

దిక్కులేని నాకు న్యాయం చేయండయ్యా ! ఇదే ఎవరైనా ముఖ్యమంత్రి కో, మరోపెద్ద అధికారికో జరి గితే ఏం

చేస్తారయా! తిండి, కండలేని పేద దాన్నని గదయ్యా!ఇట్ట అంటావున్నారు? ” అంటూ బోన్లోక్రింద కూర్చుని వెక్కి

వెక్కి ఏడవసాగిందా వృధ్ధురాలు. ‘ఇది నివారణ లేని సమస్య.’ అనుకుంటూ తల పట్టు క్కూర్చున్నాడు

న్యాయమూర్తి.

ఆ ముసలాడు ‘శబ్ద ఫోబియా ‘ తో పోతే ఇప్పుడు న్యాయమూర్తికి ‘ న్యాయ ఫోబియా ‘ పట్టుకుంది.

— ఆదూరి.హైమావతి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో