సామాజిక చైతన్య నాటకంలో బోయిభీమన్న “పడిపోతున్న అడ్డుగోడలు”(వ్యాసం )- లక్ష్మణ్ ఆదిమూలం

ఆధునిక సాహిత్యంలో తన కంటూ ఒక స్థానాన్ని పదిలం చేసుకున్న రచయితలలో బోయి భీమన్న ఒకరు . కోనసీమ ప్రాంతం వైనతేయ తీరంలోని రాజోలు తాలుకా మామిడికుదురు గ్రామంలో 1910 సెప్టంబరు 19 వ తేదీన భేఎమన్న జన్ముంచాడు . తండ్రి పల్లయ్య , తల్లి నాగమ్మ , 1935 లో B . A పాసయ్యాడు , 1937 లో B.ed పూర్తి చేసాడు . కొంత కాలం ఉపాధ్యాయుడిగా పని చేసారు . ఆంద్ర ప్రదేశ్ ట్రాన్స్ లేషన్ డిపార్టుమెంట్ డైరక్టరుగా , రిజిస్ట్రారు ఆఫ్ బుక్స్ గా 1964 వరకు పని చేసారు .

పన్నెండవ ఏట నుంచే రచనలు చేయడం ప్రారంభించాడు భీమన్న . మధుబాల . మధు గీత , దీపసభ ,భీమన్న కావ్య కుసుమాలు , ప్రకృతిలో మానవ ప్రకృతి , శ్రీ పిల్లి శతకం , అశోక వనంలో రాముడు , కేదారేశ్వరి , జన్మాంతర వైరం , అంబేద్కర్ సుప్రభాతం , బాల యోగీయం , నా ఊహలలో వాల్మీకి , పంచమ స్వరం , చాటువులు , స్వగతాలు , మాట వెలదులు వీరి పద్య రచనలు . అనాది కొస నుంచి అనంత తత్వంలోకి , గుడిశేలు కాలిపోత్తున్నై , రాగ వైశాఖి , భీమన్న ఉగాదులు , మోక్షం నా జన్మ హక్కు , చివరి మెట్టు మీద శివుడు మొదలైనవి వీరి వచన కవితా కావ్యాలు .

రాగోదయం , అకాండ తాండవం గేయ కావ్యాలు , భీమన్న పాటలు తోటలు , పాటలలో అంబేద్కర్ , పాటల కావ్యాలు , త్రిపదలు ఆయన సృష్టి , గిల్లి చెబుతున్నా , మినీ కవితల సంపుటి .
పడిపోతున్న అడ్డు గోడలు ఏకాంకిక రచనా కాలం 1958 విజయవాడలోని హరిజన సంఘాల వారు దీనిని మొదట ముద్రించారు . రచన చిన్నదే అయినా సందేశంలో మిన్న అయిన ఏకాంకిక ఇది .
ఈ నాటకంలో ఉమాదేవి బ్రాహ్మణ బాలిక , రమాదేవి హరిజన బాలిక , ఉమాదేవి క్లాసుమేటు . లక్ష్మీ దేవమ్మ ఉమాదేవి తల్లి , శివరామశాస్త్రి ఉమాదేవి తండ్రి , హరిజన సేవక సంఘ కార్యదర్శి , రామ చంద్రం ఉమాదేవి అన్నయ్య . గిరి ఉమాదేవి తమ్ముడు , శ్రీరాముడు రామాదేవి తండ్రి , వెంకటయ్య శ్రీ రామదాసు బంధువు .
భీమన్న ఈ ఏకాంకిక సమకాలీన సాంఘిక రుగ్మతలను ఎత్తి చూపి సమాజ ప్రగతికి అక్షరాదీపికగా నిలుస్తుంది . దళిత విద్య , వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించడం ప్రధానాంశాలుగా పరిమితమైన పాత్రలతో సందేశాతంకంగా సంభాషణలతో ప్రదర్శన మొగ్యమైన ప్రబోధాత్మకంగా రచించారు రచయిత.

ఈ నాటకంలో అన్ని కులాలు సమానమేనని గాంధి మహాత్ముడు చూపిన సర్వోదయ ఉద్యమంలో ఈ గ్రామం అందరికి ఆదర్శంగా నిలుస్తుంది . శివరామ శాస్త్రికి ముగ్గురు పిల్లలు , పెద్ద కొడుకు రామ చంద్రం , చిన్నవాడు గిరీశం , ఆడపిల్ల ఉమాదేవి . అందరూ ఈ విషయంలో శివరామశాస్త్రి వైపే మాట్లాడతారు కాని సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చ్సిన లక్ష్మీ దేవమ్మ మాత్రం వ్యతిరకంగా ఉంటుంది . అక్కడ ప్రతిసారి హరిజన దినోత్సవం జరిగినట్టు మరెక్కడా జరగదునుకో.

ఇవతల అగ్రహారం నుంచి ఒకటి , అవతల మాల పేట నుంచి ఒకటి . రెండు ఊరేగింపులు బయలుదేరి ఆ మర్రి చెట్టు నీడలో కలుస్తాయి . అక్కడ నుంచి అందరు కలిసి హైస్కూల్ ఆవరణంలో బహిరంగ సభలో పాల్గొంటారు . సర్వోదయ విందుగా ఆవిర్భవిస్తుంది. ఆ పైన వేడుకలు , వినోదాలు ప్రతి నెలా జరిగే ఈ సంఘటన అందరు కలిసి మెలిసి ఉండాలని ఒక త్రాటి మీదకు రావాలని అనడానికి నిదర్శనం .

హరిజనులు అంటే ఎవరిని అడుగుతుంది లక్ష్మీ దేవమ్మ కూతురు ఉమాదేవిని ……
ఉమా : ఓహో ! వాళ్ళా ? వాళ్లట అమ్మా , మన కంటే ఎక్కువ వాళ్ల ట మ్మా !
లక్ష్మీ : ఆ ?
ఉమా : అ ! అందుకనేట గాంధీ మహాత్ముడు వాళ్లకి తెకంగా హరిజనులనే పెటు పెట్టేస్త “.
ఆ మాటల్లో లక్ష్మీ దేవమ్మ అమాయకత్వం తెలుస్తుంది .

విందు భోజనానికి అందరూ సిద్ధం కావడంతోనే అక్కడికి వచ్చిన శ్రీరామదాసు “ ఒక్క పూట భోజనం చేసినంత మాత్రాన మాకు ఒలికిందేమిటి “ అంటూ నిలదీస్తాడు . నిజంగా అంటరానితనం పోవాలంటే వర్ణాంనతర వివాహాలు జరగాలని చెబుతాడు . ఆ మాటలకి రామచంద్రం శ్రీ రామదాసుకి గట్టినే సమాధానం చెబుతాడు . హరిజన బాలికనే వివాహం చేసుకుంటానని మాట కూడా యిస్తాడు . దానికి శివ రామ శాస్త్రి సంతోషిస్తాడు . లక్ష్మీ దేవమ్మ బాధ పడుతుంది . చివరకి లక్ష్మి దేవమ్మ యిష్టపడిన అమ్మాయి , హరిజన వాడలో ఇచ్చిన మాటకి పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఒకరేనని తెలుసుకుని అందరు ఆశ్చర్య పోతారు .

“ శ్రీరామా : అయితే , సరే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి శాస్త్రిగారు .
శివ ; నేటికి ఆ చివరా , ఈ చివరా అందుకొంటున్నాం.భారతదేశ అభ్యుదయ వృత్తం నేటికి పూర్తి అయ్యింది .
లక్ష్మీ : అంతా శ్రీ వెంకటేశ్వరుడి దయ .
ఉమ : ఇదంతా అమ్మ ఔదార్య ఫలం .
లక్ష్మీ : మాలాళ్ళలో ఇంతటి మధుర మూర్తులుంటారని నాకెలా తెలుసునే మరి ?

చివరికి మాల వాళ్లను వద్దు అని వాళ్లని అసహ్యించుకునే లక్ష్మి దేవమ్మ రమాదేవి హరిజన బాలిక అని తెలుసుకుని ఆశ్చర్య పోతుంది . రమాదేవితో రామచంద్రం పెళ్లికి అంగీకరిస్తుంది .

వెనుక బడిన కులాలు విషయంలో ఒక రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు . సామాన్య ప్రజలు . రోజూ తమ చుట్టూ చూసే వారిలానే వేషధారణ . వస్త్ర ధారణ పద్దతులు ఉండేవారే ఈ కులానికి చెందిన వారు అనే అభిప్రాయం బలంగా ఉంది . సమాజంలో బలంగా వ్రేళ్ళూరుకుపోయిన వ్యవస్థ అగ్ర కులాలు , వెనుకబడిన కులాలు వీటి వలన మనిషిని మనిషి లా చూడనివ్వని క్రూరత్వం మొదలైంది.

మానవుల మనుగడకి ఏర్పరుచుకున్న జీవన వృత్తులే . కులాలు . తరవాత కాలంలో వారి స్వార్ధానికి మార్చుకొని సమాజంలో దౌర్జన్యం ఎక్కువయింది . స్వాతంత్ర్యోద్యమ కాలం , అనంత కాలం లో వచ్చిన సాహిత్యంలో వర్ణాంతర వివాహాల పై రచనలు రావడం జరిగింది.

సమాజంలో ఈ కులాలు , మతాల దిపత్యాన్ని వివరిస్తూ చైతన్యాన్ని కలిగించే విధంగా రచించబడిన నాటకం పడిపోతున్న అడ్డు గోడలు . మనుషులందరూ సమానమే అని వారి మధ్యన ఉన్న ఈ కులాలు , మతాలు వంటి అడ్డు గోడలు కూలీ పోవాలని ఆశిస్తూ పడిపోతున్న అడ్డు గోడలు నాటకం ఉద్దేశ్యం .

(కాకరపర్తి భావనారాయణ కాలేజిలో జరిగిన “తెలుగు నాటకము –సామాజిక చైతన్యము” జాతీయ సదస్సు లో పత్ర సమర్పణ చేసిన వ్యాసం )

లక్ష్మణ్ ఆదిమూలం  ఏం .ఏ,టి.పి.టి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

సాహిత్య వ్యాసాలు ​, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో