వదిలించుకోలేని అభిప్రాయాలు

 డా॥ కనుపర్తి విజయబక్ష్‌

నువ్వెన్నయినా చెప్పు ఆ జాతీ అంతా! వాళ్ళ అలవాట్లు అంతే! పొమ్మంటే పోతాయా ? పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎట్లా వదలి పోతాయ్‌? ఇదీ ఒక కులం వారికి గురించి వేరే కులం వాళ్ళు చేసే కామెంట్‌ …

                      ఒక మతానికి ఒక కులానికి ప్రత్యేకంగా కొన్ని అలవాట్లు తరతరాలుగా అంటి పెట్టుకొని వుంటాయని అవి ఎప్పటికి మార్పు చెందవని  వేరే మతం వాళ్ళు, కులం వాళ్ళు అనుకొంటుంటారు. ఎంత చదువు కొన్నా, నలుగురిలో తిరుగుతున్నా, పది మందితో కలసి ఉద్యోగం చేస్తోన్నా ఎవరికి వారు ఈ పరిధిలోనే ఆలోచిస్తారు. ఎన్నెన్నో పరిణామాలు కాలాను గతంగ చోటు చేసుకోంటోన్న యిటువంటి అభిప్రాయాలు మార్పు చెందటం లేదు. వీటినే మరో మాటలో చెప్పాలంటే ‘స్థిరీకృత అభిప్రామయాలు’ అని చెప్పవచ్చు.
ఆడవాళ్ళు నోట్లో నువ్వుగింజంత మాట దాగదని, వాళ్ళకు ఈర్ష్యాసూయలెక్కువ వుంటాయని, ఓర్వలేని తనంతో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొంటుంటారని ఓ అభిప్రాయముంది స్త్రీలగురించి కాని నిజంగా చూచినట్లయితే మగవారిలోను ఈ గుణం ప్రస్ఫుటంగ వుంది. ఒకరి నొకరు హేళన చేసుకోవటం, ఒకరి వర్క్‌ని మరొకరు హేళన చేయటం, ఒకరి ఉన్నతిని మరొకరు సహించలేక పోవటమన్నది ఎల్లెడెలా వుంది.
ప్రత్యేకంగ కొన్ని కొన్ని కులాల వాళ్ళు పొగరు మోతులని, కొన్ని కులాల వాళ్ళు పిసినారి వాళ్ళని, పిరికి వారిని, కొన్ని కులాల వారిలో పౌరుషం పాలెక్కువ అని యిట్లా  ఒక్కొక్కరికొక్క అలవాటును ఆపాదించి మాట్లాడుతు వుంటారు. ఏ నాటిదో అయినా వారి అలవాట్లను ఇప్పటి తరంలోని వున్నట్లు చెబుతూ వుంటారు. అంతగా ఆయా అలవాట్లు ఘనీభవించి వుంటాయనుకోటం పెద్ద పొరపాటు. ఆయా పరిస్థితులకు తగ్గట్లుగ నడచుకొనేవారు ఎందరో వున్నారు. చాల లౌక్యంగ, చాక చక్యంగ తామెవరో కూడ తెలియకుండా ప్రవర్తించే వారెందరో!
మతాలకు ` కులాలకే కాదు .. ఈ అభిప్రాయాలను కుటుంబాలకు కూడ ఆపాదింప చేసుకోటం మన కో అలవాటయింది. ముఖ్యంగా అత్త ` కోడళ్ళ మధ్య సంబంధాన్ని గూర్చి మన కున్నన్ని కధలు, సామెతలు, లోకోక్తులు యిన్నన్నని చెప్పలేము. అత్త గారంటే తప్పని సరిగా కఠినంగా, ఆధికారికంగా కోడలి మీద పెత్తనం చెలాయించే వ్యక్తి అని, సూటిపోటి మాటలతో కోడల్ని బాధించే గయ్యాళి అనే ఓ అభిప్రాయం మన మనసులో స్థిరంగా నాటుక పోయింది. కాని తల్లీ కూతుళ్ళ వలె వుండే అత్తాకోడళ్ళు మన మధ్యనే ఎంత మందిలేరు!

పెళ్ళికి ముందు గానే అమ్మాయిల మనస్సులో ఓ గట్టి అభిప్రాయం చోటు చేసుకొంటుంది. అత్తగారంటే తనకు అన్ని విధాల వ్యతిరేకించే వ్యక్తని. ఇక మంచిగా వున్నా, మంచిగా వుండాలన్నా వారి వల్ల కావటం లేదు.  రాశి భూతమై వుండదు.  చెడ్డంతా ఒకేచోట మేటవేసినట్లు వుండదు.  ఇన్ని వేల సంవత్సరాల నాగరికతా పయనంలో ఎన్నో దేశాలతో ఆదాన ప్రదానాలు జరిగాయి. జరుగుతున్నాయి ` జరుగుతూనే వుంటాయి. అనేది అక్షర సత్యం కాదా! అటువంలపుడు ఏది మారకుండా ఘనీభవించి నట్లుండి పోవటం సాధ్యమా? ఆచారాలు, అలవాట్ల ల్లోను మార్పులు చోటు చేసు కొటూనే వుంటాయి. ప్రంచం నిత్య పరిణామశీల మయినది కదా!
మా ఇళ్ళల్లో ఆడపిల్లలు చదువుకోరు.  అమ్మాయిలు బయటకురారు.  ఘోషా.. అన్న ఒకనాటి సమాజం వుండేది మన దేశంలో.. అట్లానే కుల భ్రష్టత్వాన్ని ఒప్పుకోము.  సంకర మవటమన్నది మా వంశంలోనే లేరు అన్న వాళ్ళ వంశ చరిత్ర లే మారి పోతున్నాయి. అభిప్రాయాలు మాటల్లోనే తప్ప క్రియాచరణలో పలుచబడిపోతు వున్నాయి.  ఆ పనులు అబ్బాయి లే చేయాలి ` ఇంటి పనులు అమ్మాయిలు మాత్రమే చేయాలి అని ఇంకా గట్టిగా నమ్మే వారు వున్నారు.  అమ్మాయి పనులు అబ్బాయి చేస్తే ‘ఆడంగివెధవ’ అబ్బాయి పనులు అమ్మాయి చేస్తే ‘మగరాయుడు’ ……  అయినా అందరు అన్ని పనులు చేయగలరు అని నిరూపిచు కొంటునే వున్నారు. ఫలానా వారు ఫలానా వృత్తిలోనే రాణించగలరనే ఓ స్థిరమైన అభిప్రాయము వున్నది. అది అబద్ధమనేది నేడు ఋజువయింది.  వ్యవసాయం వ్యాపారం, ఉద్యోతం, యాజమాన్యం అన్ని అందరు చేయగల గటమే కాదు. స్త్రీ పురుషులు సైతం తమతమ సామర్ధ్యాలను బట్టి అన్ని రంగాల్లోను రాణిస్తున్నారు.

                    ఈ కులం వాళ్ళు ఈపనే చేయాలి. వీళ్ళు ఇట్లానే జీవించాలి. ఇట్లానే మాట్టాడాలి అనే అభిప్రాయాలకు చోటు లేదనేది నిరూపితం ` శ్రమ ` కృషి ` పట్టుదల వున్న ఎవరైనా ఏ విషయంలోనైనా సరే విజయాలను సొంతం చేసు కొంటున్నారు. విజయాలు పొందటంలో దేశ సరిహద్దులు అడ్డు రావటం లేదు. విదేశాలలో సైతం మనవాళ్ళు విజయ విహారం చేస్తున్నారు.
కులాన్ని మతాన్ని బట్టికాక మనిషికాక వ్యక్తి గతమైన అలోచనా విధానముంటుందని అదే అతన్ని నడిపిస్తుందని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. *

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో