ఎనభై ఏళ్ల బాడీ బిల్డరు ఎర్నిస్టిన్ షప్పర్డ్(వ్యాసం )-టి.వి.యస్.రామానుజరావు

టి.వి.యస్ .రామానుజరావు

డెభై ఒక్క సంవత్సరాల వయసులో బాడీ బిల్డింగు పోటీలో పాల్గొని, గిన్నిస్ బుక్ లో కెక్కిన బామ్మగారిని మీరేమంటారు? వార్ధాక్యాన్ని డం బెల్ల్స్ తో ఎత్తేస్తూ, అద్భుత వ్యక్తి అనిపించుకుంటున్న గొప్ప బాడీ బిల్డరు ఎర్ని స్టిన్ షెప్పర్డ్. తన బాల్టిమోర్జిమ్ లో అందరికీ వెయిట్ లిఫ్టింగ్ గురించి చెబుతూ, తన దగ్గరికి వచ్చిన వారికి ట్రైనింగ్ ఇస్తున్న ఈ అద్భుత బాడీ బిల్డరువయసుఇప్పుడుఎనభై ఒక్క సంవత్సరాలు. ఈవయసులోకూడాఆమె తెల్లవారుఝామున 2.30 గంటలకే లేచి, కాసేపు దైవ ప్రార్ధన చేశాక,తనభర్తతోకలిసి 16 కిలోమీటర్లు పరుగు తీస్తుంది. ఆ తర్వాత సుమారు గంటన్నర సేఫు, తన జిమ్ లో వచ్చిన వారికి శిక్షణ ఇస్తుంది. అయితే, అక్కడకు వచ్చే వారిలోనడి వయసు, ఆ పై వయసు వారే ఎక్కువ మంది వుంటారు.
[spacer height=”20px”]ఎర్నిస్టిన్ షెపార్డు అమెరికన్ వనిత. ఆమె పుట్టిన తేదీ1936 జూన్ నెల 16.అసలు యాభై ఆరేళ్ళ వయసు వచ్చేవరకూ, బాడీ బిల్డింగు గురించి ఆమెకు ఆలోచనే లేదు.ఆమె చిన్నప్పుడు నర్సు కావాలని అనుకునేది. బాల్టిమోర్ లో ఆమె మోడల్ గా పనిచేస్తూ, తన అక్క మిల్ డ్రెడ్ బ్లాక్క్ వెల్ తో కలిసి వుండేది. చర్చి ఏర్పాటు చేసిన పిక్నిక్ లో పాల్గొనాలని ఒకసారి వీరిద్దరికిఆహ్వానం వచ్చింది. వాళ్ళు స్విమ్ సూట్ వేసుకుని రావాలని కూడా చెప్పారు. అయితే, స్విమ్ సూట్ వేసుకున్నాక,తమ శరీరాలు చూసుకుని అక్క చెల్లెళ్ళు ఇబ్బంది పడ్డారు. ఏమైనా సరే, తాము ధృడ శరీరులం కావాలని, ఏరోబిక్ ఎక్సరసైజులు చెయ్యటం మొదలు పెట్టారు. కొద్ది రోజులలో, వాళ్ళ ఆకారాలలో వచ్చిన మార్పులు చూసి, శిక్షణ ఇస్తున్న అతను, వాళ్ళను వెయిట్ లిఫ్టింగ్ చెయ్యమని సలహా ఇచ్చాడు. అక్క చెల్లెళ్ళకు అతి పెద్ద వయస్కులైన బాడీబిల్డర్లూగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డు రికార్డ్స్ లోకి ఎక్కాలని అనుకున్నారు.
[spacer height=”20px”]అయితే, 1992లో ఆమె అక్క బ్లాక్వెల్ చనిపోవడంతో, కొన్నాళ్ళు షప్పర్డు అన్నీ మానేసి, డిప్రెషనులోకి వెళ్ళిపోయింది. అక్క తనకు కలలో కనబడి, తామిద్దరి ఆశయంనెరవేర్చాలని కోరినందువల్ల, కొన్నాళ్ళ తర్వాతతాను మళ్ళీ బాడీబిల్డింగు ఎక్సరసైజులు మొదలుపెట్టినట్లు షప్పర్డ్ చెప్పింది. అదేసమయంలోఆమెకుమారుడు,సిల్విస్టర్ స్టాల్లొన్ సినిమారాకీ 3 వీడియో తెచ్చి ఇచ్చాడు. ఆ సినిమా తనకు ఎంతో స్పూర్తి నిచ్చిందని , సిల్విస్టర్ అంటే తనకు చాలా ఇష్టమనీ, అతన్ని ఒకసారైనా కలవాలని వుందనీ ఆమె చెప్పింది.
ఏమైనా సరే, తను గిన్నీస్ బుక్కు లో ఎక్కాలన్న పట్టుదలతో, ఎర్నిస్టిన్ ఒకప్పటి మిస్టర్ యూనివర్స్ యహ్నీ  షాంబర్గర్ సహాయం తీసుకుంది.

[spacer height=”20px”]షప్పర్డ్ సుమారు పదిహేను సంవత్సరాలు,పట్టుదలగా తన ఆశయం కోసం కఠోర పరిశ్రమ చేసింది.ఆమె మొదట సారి నాచురల్ యీస్ట్ కోస్టు టోర్నమెంటులో పాల్గొని, విజయం సాధించింది.అయితే, ఆమె అసలు కోరిక 2010 వ సంవత్సరంలో,తన డెభై ఒకటవ ఏట నెరవేరింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డు రికార్డ్స్ వారు, 2010, 2011 సంవత్సరాలలో అతి పెద్ద వయసువున్న బాడి బిల్డరుగా ఆమెకు టైటిల్ ఇచ్చి గౌరవించారు. ఇప్పుడామె పోటీలలో పాల్గొనకపోయినా, నడి వయసులోకి వచ్చిన వారందరికి, బాడి బిల్డింగు ఆవశ్యకత వివరిస్తుంది. అందరికీ బాడిబిల్డింగు మీద ఆసక్తి లేకపోవచ్చు. అందరూ రన్నర్లు కావాలని అనుకోకపోవచ్చు. అయితే, ఏదో ఒక ఎక్సరసైజు చెయ్యటం అవసరం అనేది ఆమె సలహా. తాను ఎక్సరసైజులు మొదలుపెట్టాక, తనకున్న రుగ్మతలన్నీ మాయమై పోయాయనీ, వయసు రావడం అనేది లెక్కపెట్టనక్కరలేదనీ, వయసు అంటే, ఒక అంకె మాత్రమేననీ ఆమె చెబుతుంది. ఇప్పటికీ, ఆమె రోజూ తన జిమ్ కి వచ్చిన వాళ్ళకు శిక్షణ ఇస్తూ వుంటుంది. తనని ఎర్నీ అనే పిలవమంటుందామె.
[spacer height=”20px”]కేవలం బాడీబిల్డింగ్ఎక్సరసైజులు  మాత్రమే కాకుండా, ఆమెమరాథాన్రేసుల్లోకూడాపాల్గొనేది. ఇప్పటి వరకూ తొమ్మిది 5K, 10K రన్ మరాథాన్లలో పాల్గొన్న ఆమె, అన్నింటిలో ఫస్టు వచ్చాననీ చెప్పింది.మాజీ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామ భార్య మిచెల్ ఒబామ అంటే తనకు అత్యంత ఇష్టమనీ, ఆమెకు ఫిట్నెస్ శిక్షణ ఇవ్వాలని తన కోరికనీ, షప్పర్డ్ అంటుంది.ఆహారం విషయంలో నియమాల్ని ఆమె కచ్చితంగా పాటిస్తుంది. రోజు మొత్తం మీద ఆమె 1700 కాలరీల ఆహారం మాత్రమే తీసుకుంటుంది. ఎక్కువగా ఎగ్ వైట్, బ్రౌన్ రైస్, స్వీట్ పొటాటో, చికెన్, వెజిటబుల్స్, లిక్విడ్ ఎగ్ వైట్ ఇవే ఆమె ఆహారం. అదనంగా బలవర్ధక ఔషధాలేవీతీసుకోననిఆమెస్పష్టంచేసింది. ఆమె భర్త కొల్లిన్ షెప్పర్డ్, ఆమె ఆహారం తయారు చెయ్యడంలో పూర్తి బాధ్యత తీసుకోవడమే కాకుండా,ఆమెకు అన్ని విషయాలలో అండగా నిలుస్తాడు.
ఫిట్ నెస్ కోసం డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్ ఈ మూడు అవసరమని ఆమె చెబుతుంది. అరవై వేల మంది ఆమె ఫేస్ బుక్ మిత్రులు న్నారు. ఎవరికి ఏ సలహా అవసర మైనా ఆమె జవాబిస్తుంది.ఆమె 2016వ సంవత్సరంలో “డిటర్మిన్డు, డెడికేటెడ్, డిసిప్లిన్డ్ టు బి ఫిట్ -ది ఏజ్ లెస్ జర్నీ ఆఫ్ ఎర్నిస్టిన్ షప్పర్డ్“ అనే పుస్తకం రచించి,తన అనుభవాల్ని అక్షర రూపంలో పెట్టింది.
పట్టుదల వుంటే, ఎంత వయసు మీరినా,ఏదైనా సాధింవచ్చనే దానికి నిదర్శనం ఎర్నీ జీవితం.

-టి.వి.యస్ .రామానుజరావు

———————————————————————————————————————————

వ్యాసాలు, UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో