చేజారిన వసంతాలు(కవిత )- డేగల అనితా సూరి

anithasuri

బాధ్యతలు బాదరబందీలో పడి
ఋతుశోభను విస్మరించా !

నిమిషాల ముల్లుతో పోటీ పడుతూ
కాల చక్రం నుంచే వెలివేయబడ్డా !
కోయిల గొంతు విని
ఎప్పుడో విన్నట్లుందని బుర్ర గోక్కున్నా 1

అసంకల్పితంగా ఆకాశంవంక చూసి
ఎప్పుడో చేజారిన వస్తువు
మళ్లీ చేరువైనట్టు అచ్చెరు వొందా!

ఏ.సి . గదులకై అర్రులు చాస్తూ
ఓ.సి.గా వచ్చే పిల్లతెమ్మెరనైనా
ఆస్వాదించలేని అభాగ్యనయ్యా !

మామిడాకుల వాసనకు
మరుగున పడిన గతాన్ని
అర్ధంగా తడుముకున్నా
ఇల్లు – పిల్లలు – ఉద్యోగం అన్న
ముప్పేట దాడికి లొంగి
చిట్టిపొట్టి ఆశలచేతిలో కూడా
చిత్తుచిత్తుగా ఓడిపోయా !

విసిగి వేసారి చివరికి
విశ్రాంతి దొరికాక
కళ్ళజోడు సర్దుకుంటూ పరికిస్తే –

ఎన్నో వసంతాల్ని పరుగు పరుగున వెనక్కునెట్టి
ఏ అనుభూతుల్నీ వెంటతెచ్చుకొని
గతించిన నవయవ్వన చిత్తరువునై
గోడపైన నలుచదరపు చట్రంలో
నవ్వు పులుముకుని మిగిలా !!

-డేగల అనితా సూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , Permalink

One Response to చేజారిన వసంతాలు(కవిత )- డేగల అనితా సూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో