నా జీవనయానంలో (ఆత్మ కథ )-65 – రవీంద్ర కాన్వెంటు స్కూలు ప్రారంభం – కె. వరలక్ష్మి

[spacer height=”20px”]మధ్యాహ్నం మోహన్ ఇంటికొచ్చినప్పుడు నేనుకొంటున్నది చెప్పాను. ట్యూషన్ సెంటర్ కాదు కానీ ఇప్పుడిప్పుడు కాన్వెంట్ అని చాలా ప్రైవేటు స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. అలా నడపగలవో లేదో ఆలోచించుకో’ అన్నాడు. ‘నాకేవైనా అలాంటి స్కూల్స్ కొన్ని చూపిస్తే ఎలా నడపాలో ఒక ఐడియా వస్తుందేమో’ అన్నాను. నాలుగురోజుల తర్వాత మోహన్ నన్ను పిఠాపురం తీసుకెళ్ళాడు. నాకు అప్పటికే తొమ్మిదో నెల నడుస్తోంది. కానీ అనుకున్నదేదో చేసెయ్యాలనే హుషారు నన్ను ప్రోత్సహిస్తోంది. పిఠాపురంలోని బ్లూస్టార్ కాన్వెంటుకి వెళ్ళాం. రాజమండ్రి రైల్వే క్వార్టర్స్ లో మోహన్ కి తెలిసిన వెల్మా అనే ఆంగ్లో ఇండియన్ పెద్దావిడ ఆ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. కబురు చెప్తే బైటికొచ్చింది. మోహన్ కి చెప్పింది విని, మీరు స్కూలు ప్రారంభిస్తామంటే వీళ్ళేం చెప్పరు. పిల్లల్ని జాయిన్ చెయ్యడానికి వచ్చామని వివరాలు కనుక్కోండి’ అంది. ప్రారంభంలోనే అబద్ధమా అన్పించింది. అప్పుడే అనుకున్నాను. నా స్కూలు గనక సక్సెస్ అయితే ఎవరికే వివరం కావాలన్నా సాయం కావాలన్నా చెప్పాలని, చెయ్యాలని.
[spacer height=”20px”]స్కూలు కరెస్పాండెంట్ ఆవిడ పేరేంటో ఇప్పుడు గుర్తు లేదు కానీ, చూడగానే గౌరవంకలిగేలా చక్కగా ఉన్నారు. ఎడ్మిషన్ ఫీజ్ వంద నుంచి క్లాసును బట్టి పెరుగుతుందని, ఎల్.కే.జీ విద్యార్థికి నెలఫీసు పది రూపాయలని చెప్పి క్లాస్ రూమ్స్ తిప్పి చూపించారు. అక్కడక్కడా ఆగి పిల్లల సిలబస్ పరిశీలించాను. వెల్మా తనకి నెలకి వంద రూపాయలు ఇస్తున్నారని చెప్పింది. తెలియాల్సిందేదో తెలిసింది ఇంకా స్కూల్స్ తిరిగి చూడాల్సిన అవసరం లేదనిపించింది. ఇంటికొస్తూనే మోహన్ వడ్రంగి మేస్త్రీకి చెప్పి అడుగెత్తు బెంచీలు ముగ్గురు పిల్లలు కూర్చునేవి చేయించాడు. అడ్మిషన్ రిజిస్టర్, అటెండెన్స్ బుక్ కొనుక్కొచ్చాడు.
[spacer height=”20px”]ఇప్పటి కేబుల్ టి.వి బుజ్జి వాళ్ల నాన్నమ్మ తండ్రి గారివి చిన్న చిన్న వరుస గదుల వాసతోబాటు, అదే కాంపౌండు కానుకుని ఉత్తరం వైపు పెద్ద ఇల్లొకటి ఉండేది. అప్పటి ఇంటి నిర్మాణ పద్ధతి ప్రకారం మధ్యలో హాలు అనబడే పెద్ద గది, దానికి ఉత్తర దక్షిణాల్లో మూడేసి గదులు, పెద్ద గదికి తూర్పు పడమరల్లో పెద్ద పెద్ద అరుగులు, పడమట రోడ్డు వరకూ పెద్ద వాకిలి, తూర్పున కాంపౌండు వాల్ లోపల పెద్ద పెరడు, పెరట్లో రకరకాల పళ్ల చెట్లు ముఖ్యంగా అతిమధురమైన కాయలు కాసే సపోటా చెట్టు సెంటరుకీ పోలీసు స్టేషనుకీ దగ్గర కావడం వల్ల కాబోలు ఆ పెంకుటింట్లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ పోలీసు ఎస్సైల కుటుంబాలు ఉండేవి . ఎందుకో తెలీదు కానీ ఈ మధ్య కొంతకాలంగా ఖాళీగా ఉందట. ఎప్పుడూ బైటినుంచి చూడటమే తప్ప లోపలికెళ్ళి చూసాక ఆ ఇల్లు నాకు చాలా నచ్చేసింది. నెలకి అద్దె ఇరవై రూపాయలు.
[spacer height=”20px”]తెలిసిన వాళ్ళు కావడం వల్ల అడ్వాన్స్ కూడా అడగలేదు. ఈ ఖర్చుల మధ్య నా నెక్లెస్, అందె ఉంగరం మళ్లీ తాకట్టుకు వెళ్ళిపోయాయి. కొత్తగా కొనుక్కున్న సూత్రాలు గొలుసు అడగలేదు మోహన్. నా కప్పుడే అర్థమైంది అతని సెంటిమెంటు. రాజమండ్రి వెళ్ళి తెలుగు హిందీ ఇంగ్లీషు అక్షరాల పదాల చార్టులు బ్లాక్  బోర్డు లాంటివన్నీ కొనుక్కొచ్చాడు. ఇల్లుగలవాళ్ళు శుభ్రం చేసి ఇచ్చిన ఇంటికి మామిడాకుల తోరణాలు కట్టించాడు. అన్ని ఏర్పాట్లు చేసి ఊళ్ళో చాలా మందిని పిలిచి అల్పాహారం, టీ ఏర్పాటు చేసి అన్నీ తనే చూసుకున్నాడు. 1972 అక్టోబర్ 12 న ఇల్లు మారడం స్కూలు ప్రారంభం ఒకేసారి అన్నట్టు ఆ ముందురోజు సాయంకాలం రాజమండ్రి రైల్వే క్వార్టర్స్ నుంచి బార్బరా డేవిడ్ అనే ఆంగ్లో ఇండియన్ లేడీని ఆమె అయిదేళ్ల పాపతో బాబు పిల్చుకొచ్చాడు. ఆమె మోహన్ కన్నా ఎత్తుగా, బలంగా ఆరోగ్యంగా ఉంది. తన పాపైతే మరీ ముద్దులు మూటకట్టేలా ఉంది. మా అబ్బాయి రవి ఆ పాపాయి దేవరపల్లి రామ్మూర్తి గారి మనవడు రామ్మూర్తి, సత్యనారాయణమూర్తి వీళ్ళు నలుగురూ చిన్న పిల్లలు. మరో ముగ్గురు పన్నెండేళ్ళు దాటిన హోటల్స్ వాళ్ల పిల్లలు. ఈ ఏడుగురూ నా మొదటిరోజు విద్యార్థులు.
[spacer height=”20px”]ఆగ్నేయం మూల చిన్నగదిలో ఇంగ్లీషు టీచర్ ఉండేది. బొగ్గుల కుంపటి మీద వండుకునేది. ఆమెకు నెలకు జీతం వంద. గది ఇచ్చి వంటకు సంబారాలు కూడా మేమే ఇచ్చేలా ఒప్పందం. ఆవిడ రోజూ బజారుకెళ్ళి కానాగదుళ్లు అనే సముద్రం చేపలు తెచ్చుకుని వేయించుకు తినేది. మూడున్నరేళ్ళ మా రవి, వాళ్ల పాపాయి త్వరలోనే మంచి స్నేహితులైపోయారు. స్కూలు అయ్యాక ఒక చంకలో పాపాయి బొమ్మనెత్తుకుని మరో చెయ్యి రవి మెడ చుట్టూ వేసి పెరడంతా తిరిగి ఆడుతూండేది. ఊరి జనానికి బార్బరా ఒక పెద్ద ఎట్రాక్షన్ అయిపోయింది. పొట్టి గౌను హై హీల్స్ వేసుకుని ఆమె నడుస్తూ ఉంటే జనం ఇళ్లలోంచి బైటికొచ్చి చూస్తూ ఉండిపోయేవారు. నేనేమో ఆమెను వెంటేసుకుని పిల్లల్ని జాయిన్ చేయమని అడగడానికి ఇంటింటికీ తిరిగేదాన్ని. మా నాలుగో ఆడపడుచు శాంతను కూడా తీసుకొచ్చాడు మోహన్. మా చిన్న చెల్లెలు సూర్యకుమారి కూడా సాయంకాలం వరకూ సాయంగా ఉండి వెళ్ళేది. ఇక్కడుంటే చదవమంటున్నామని పార్వతి పెళ్ళికెళ్ళినప్పుడు రుక్కు రానని పేచీ పెట్టి మా అత్తగారి దగ్గర ఉండిపోయింది. ఈ పిల్లలిద్దరూ తెలివైన వాళ్ళు కావడం వల్ల నేను స్కూలు పనిలో ఉన్నా ఇంటిపనీ వంటపనీ వాళ్ళే చక్కబెట్టేసేవారు. ప్రారంభోత్సవం నాడు మానూజిళ్ళ మాస్టారు, మా నాన్న, అమ్మ వచ్చి ఆశీర్వదించారు. అదో ధైర్యం నాకు, మా అత్తమామలు రాజోలు నుంచి రాలేమని చెప్పేశారు. పిల్లలు ఒకళ్ళూ ఇద్దరూ జాయిన్ అవసాగారు. అడ్మిషన్ ఫీజు లేదు. నెలఫీజు పదిరూపాయలు కడితే చాలు. స్కూలు ప్రారంభించిన పధ్నాలుగో రోజు అక్టోబర్ 26న తెల్లవారుఝామున నాకు నొప్పులు ప్రారంభమయ్యాయి. స్కూలు బాధ్యత బార్బరాకి అప్పగించి ఎప్పటిలాగే మా అమ్మనాన్నలు, మోహన్ నేను కాకినాడ గవర్నమెంట్ హాస్పిటలుకు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాం. ఈ సారి వేవిళ్ళు తగ్గినప్పటినుంచీ నాకు జీలకర్ర తినాలన్పించేది. పావుకేజీ జీలకర్ర రెండురోజుల్లో అయిపోయేది. కాన్పుకెళ్తూ కూడా ఒక పొట్లం జీలకర్ర పట్టుకుని వెళ్ళాను.
[spacer height=”20px”]ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, ఉద్యోగస్తుల భార్యలు అందరూ గవర్నమెంటు హాస్పిటలుకే వచ్చేవారు. నాకు నొప్పులు ఉధృతంగా వస్తున్నా రాత్రి వరకూ లేబర్ రూంకి తీసుకెళ్ళలేదు. హాస్పిటల్ పర్యవేక్షణలోనే ఏదో మార్పు కనిపించింది. నాకు డెలివరీ చేస్తున్న డాక్టరు చాలా అందంగా ఉంది. అంతకన్నా అందంగా అలంకరించుకుంది. జుట్టును రింగులు రింగులుగా నుదుటి మీద వేసుకుంది. కళ్లకు పొడవుగా కాటుక దిద్దుకుని మంచి మేకప్ హెయిర్ స్టైల్ చేసుకుంది. నా అభిప్రాయతను ఎగరకొడుతూ పెద్దగొంతుతో ఒక్క కసురు కసిరింది. మూడో కాన్పు ఎవడు కనమన్నాడు, నొప్పులివ్వలేని దానివి మొగుడి దగ్గర ఎందుకు పడుకున్నావ్? అంటూ నేను బాధతో మూసుకున్న కళ్ళ నుంచి కన్నీళ్ళు ధారలు కట్టేసాయి. అంతకఠినంగా మాట్లాడే డాక్టర్లు కూడా ఉంటారని నాకు అప్పుడే తెలిసింది. ఓ పక్క తట్టుకోలేని నొప్పి, మరోపక్క గొప్ప మనోవ్యధని కలిగిస్తున్న ఆవిడ మాటలు. రాత్రి ఏడు గంటల నుంచి దగ్గర దగ్గర పన్నెండు వరకూ ఆ నరకాన్ని భరించాల్సి వచ్చింది. బేబీ మూడున్నర కేజీల పైన పుట్టిందట. దానికి మళ్లీ తిట్లు.’ దున్నపోతుల్లాగ తినేస్తారు. కడుపులో పిల్లల్ని ఇలాగ పెంచేసుకుని కాన్పులకొస్తారు. అంటూ మళ్లీ కుట్లు పాపాయికీ నాకూ షుగర్ టెస్టులు. ఈ సారి హాస్పిటల్లో పదిరోజులుండాల్సి వచ్చింది. నా దృష్టంతా నా రవీంద్ర కాన్వెంటు మీదే ఉంది. ఎప్పుడెప్పుడు పది రోజులై పోతాయా అని ఎదురు చూశాను.
[spacer height=”20px”]పాపాయి బలంగా బోలెడు జుట్టుతో మూడు నెలల పిల్లంత ఉంది. నా పక్క మంచం మీద లెక్చరర్ ఒకావిడకి పాలు పడలేదు. ఆ పది రోజులూ నా పాపాయితో పాటు ఆవిడ బాబూ నా పాలు తాగాడు.
నా మూడో కాన్పు కాబట్టి ఈసారి మా అమ్మవాళ్ళింటికి వెళ్లలేదు. నేనొచ్చేసరికి స్కూలు అస్తవ్యస్తమైపోయింది. బార్బరా ఇంగ్లీషు అక్షరాలు- పదాలు తప్పులు చెప్పేసింది. లెక్కలు ఎడమవైపు నుంచి కూడికలు, తీసివేతలు చేయించింది. తల్లిదండ్రులు వచ్చి గోల పెట్టేసారు. ‘అమ్మా నువ్వు ఎలా చదువుతున్నావో మా పిల్లలకూ అలాంటి చదువు చెప్తావని పంపించాం’ అంటూ నేనువాళ్లందరికీ నచ్చజెప్పి ఎవరూ పిల్లల్ని మాన్పించకుండా చేశాను. కాన్పు తర్వాత బాలింత తీసుకోవాల్సిన విశ్రాంతి ఆ దఫా నాకు దొరకలేదు.
[spacer height=”20px”]మేమున్న ఇంట్లో ఉత్తరం వైపు రెండు గదుల హైస్కూలుకి కొత్తగావచ్చిన గుమాస్తా గారికి ఐదు రూపాయలకి అద్దెకిచ్చాడు మోహన్, ఆయన భార్య అనసూయ చక్కని మనిషి. వాళ్లకీ మాలాగే ముగ్గురు పిల్లలు. స్నేహంగా మంచిగా మసలుకునేది. హైస్కూలులో కొన్నిటిని జిల్లాపరిషత్ నుంచి తప్పించి గవర్నమెంట్ స్కూల్స్ గా మార్చారు. దీంట్లోకి మారడం ఇష్టంలేని వాళ్ళని వాళ్ళు కోరుకున్న జిల్లాపరిషత్ స్కూల్స్ కి ట్రాన్స్ ఫర్ చేశారు. మోహన్ గవర్నమెంట్ స్కూలునే కోరుకోవడం వల్ల జగ్గయ్యపేటలోనే ఉండిపోయాడు. అప్పట్లో నాకు తెలిసి, జగ్గంపేట, ఏలేశ్వరం, ఆలమూరు కోరుకొండ స్కూల్స్ ని గవర్నమెంట్ ఎడాప్ట్ చేసుకుంది. అందుకే స్కూలు అసిస్టెంట్ గా, హెడ్ మాస్టరుగా మోహన్ సర్వీస్ మొత్తం ఈ నాలుగు ఊళ్లలోనే కొనసాగింది.
[spacer height=”20px”]1972లో జై ఆంధ్రా ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. అంతకు ఆరేళ్ల ముందని గుర్తు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ ఉద్యమం జరిగింది. మేమున్న ఇల్లు రోడ్డూ పక్క ఉండటం వల్ల రోజూ ఇతర ఊళ్ల కాలేజీ పిల్లలు బస్సుల పైకెక్కి కూర్చునీ, బస్సుల్ని పట్టుకుని వేళ్ళాడుతూ మా జై ఆంధ్రా నినాదాలిస్తూ ఉండటం కన్పించేసి. ఒకరోజు అలా వేళ్ళాడుతున్న అబ్బాయి పట్టు జారి బస్సు టైరు కిందికెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఆ దృశ్యాన్ని కళ్లారా చూసిన నా మనసు వికలమైపోయి చాన్నాళ్ళు దుఃఖంతో కుమిలిపోయాను. ఆ ఉద్యమ సందర్భంగా చాలా చోట్ల సభలు, సమావేశాలు, స్కూలు పిల్లల ఊరేగింపులూ జరుగుతుండేవి. సందర్భమేమైనా పిల్లల చదువులకి విఘాతం కలగడం నాకు నచ్చలేదు. నేనప్పుడే నిశ్చయించుకున్నాను. నా స్కూలు నిలదొక్కుకుంటే గనక నా విద్యార్థులకి అవగాహన కలిగించాలి తప్ప ఉద్యమాల పేరుతో రోడ్ల వెంబడి తిప్పకూడదని. ఆ రోజుల్లోనే మా నూజిళ్ల మాస్టారు ఒక పాట రాసి విద్యార్థులచేత పాడిస్తూ ఉండేవారు.
‘ఇందిరమ్మ కెన్ని గుండెలున్నాయి
ఇవ్వకుండపోవడానికీ రాష్ట్రం
అంటూ ఆ ఉద్యమమే విజయవంతమై ఉంటే గనుక రాష్ట్రం అప్పుడే విడిపోయి ఉండేది. ఆంధ్ర ప్రాంతం వాళ్లకి హైదరాబాద్ తో ఇంతటి అనుబంధం ఏర్పడకపోయేది.జనవరి నెల వచ్చేసరికి స్కూల్లో పిల్లల సంఖ్య యాభైకి చేరింది. స్కూల్లో వసూలైన ఫీజులు ఎప్పటికప్పుడు  మోహన్ కి ఇచ్చేసేదాన్ని. ఆర్థికపరమైన విషయాలు చూసుకోవాల్సింది మగవాల్ళేనని నాకొక పిచ్చి నమ్మకం ఉండేది. మోహన్ సహకారం లేకపోతే నేను స్కూలు ప్రారంభించలేకపోయేదాన్నని కూడా నమ్మేదాన్ని. నేనిచ్చిన డబ్బుల్ని జేబులో పెట్టుకుని రిజిస్టరు తీసి తనిఖీచేసుకునేవాడు. ఇంట్లోకి తెప్పించిన మాంసం, కూరగాయలు లాంటి ఖర్చు ఒక పుస్తకంలో రాసి లెక్కకట్టి అప్పగించేదాన్ని. ఆ సంక్రాంతికి మోహన్ నాలుగైదు జతల కొత్తబట్టలు, రెండు మూడు జతల బూట్లు, చెప్పులు తెచ్చుకున్నాడు. కొత్త వాచీ కొనుక్కున్నాడు.
[spacer height=”20px”]బార్బరా దగ్గర కొంచెం పెద్దసైజు ట్రాన్సిస్టరు ఒకటుండేది. ఉన్నట్టుండి దాన్ని రెండు వందలకి అమ్మేస్తానంది. గత కొన్ని సంవత్సరాలుగా రేడియో, సిలోన్, వివిధ భారతి పాటలకి దూరమైపోయాను. అందుకని ఆ రేడియో కొనుక్కోవాలనుకున్నాను. మోహన్ కి చెప్పాను. రెండువందలా, ఇప్పుడంత డబ్బెక్కడుంది అన్నాడు. ‘పోనీ, ఫస్ట్ కి మీ జీతం వచ్చాక’ చూద్దాంలే’ నేను బార్బరాని ఫస్ట్ వరకూ ఆగమని రిక్వస్ట్ చేశాను.
[spacer height=”20px”]అక్కడ్నుంచి కొన్ని నెలలపాటు ‘జీతం జేబులో పెట్టుకుని రాజమండ్రి వెళ్తుంటే ఎవరో కొట్టేసారు. మొత్తం ఖర్చంతా మన స్కూలు మీదే నడవాలి అనడం ప్రారంభించాడు. బార్బరా రేడియో వేరేవాళ్లకి అమ్మేసుకుంది. కిరాణా, బియ్యం బట్టలు అప్పులిచ్చిన వాళ్లంతా ఇంటికొచ్చి నన్ను అడగడం మొదలు పెట్టారు. పుట్టి పెరిగిన ఊళ్ళో నాకు తల ఎత్తుకోలేనట్టైంది. నేను సంసారాన్ని ఎంత పద్ధతిగా నడుపుకోవాలని కలలు కంటున్నానో అంతా అస్తవ్యస్తం చేసేస్తున్నాడు. ఇలా అయితే ముగ్గురు పిల్లల్ని ఎలా పెంచగలుగుతాం విపరీతమైన ఆవేశం, నిస్సహాయత, నీరసం అన్నీ కలిపి ప్రేరేపించగా చచ్చిపోవాలనుకున్నాను. రాత్రి తొమ్మిదిగంటలవేళ పాపాయికి కడుపునిండా పాలిచ్చి పడుకోబెట్టి దొడ్లో ఉన్న గన్నేరుకాయలు చితక్కొట్టి తింటూ నీళ్ళు తాగడం మొదలు పెట్టాను. పిల్లల్ని తలచుకుని కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తున్నాను. షాపు మూసేసి ఇంటికి వెళ్తున్న మా నాన్న అనుకోకుండా మా ఇంటికొచ్చారు.

                                                                                                                  – కె. వరలక్ష్మి

————————————————————————————————————————-

 

ఆత్మ కథలుPermalink

One Response to నా జీవనయానంలో (ఆత్మ కథ )-65 – రవీంద్ర కాన్వెంటు స్కూలు ప్రారంభం – కె. వరలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో