సహ జీవనం – 24 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

“నిజమేననుకో, అయినా ఒక్క విషయం అడుగుతాను! నువ్వు కనీసం నీ కొడుక్కు చెప్పగలిగలవా?”

ఆ శ్నప్ర నువ్వు అడుగుతావని నాకు తెలుసు అన్నట్లు చిరునవ్వు నవ్వాడు ప్రసాదం.
“ఏదీ, వాడు నాకు మాట్లాడే అవకాశం ఇస్తేగా? మరొక మాట లేకుండా వెళ్ళి పోయాడయ్యే! చాలా సార్లు ఫోన్లు చేశాను. నా గొంతు వినగానే ఫోను పెట్టేసేవాడు. వుత్తరం రాసి చూశాను. దానికి జవాబు లేదు. బహుశా చించేసి ఉంటాడు. వాళ్ళ తాతయ్యా,అమ్మమ్మ చెప్పిచూశారు, వినలేదు. మనవడి బాలసారెకు తాతయ్యా,అమ్మమ్మలను పిలిచాడు, కానీ మమ్మల్నిపిలవలేదు. మేము వెడితే వాడు పలకరించనన్నా పలకరించలేదు. కోపం వచ్చి వెంటనే వెనక్కి తిరిగి వచ్చేశాము. కోడలు పరాయి పిల్ల. కానీ వాడు రక్త సంబంధాన్ని కూడా కాదని దూరంగా ఉంటున్నాడు. తల్లిదండ్రులను సరిగా అర్ధం చేసుకున్న వాడెవడూ ఇలా ద్వేషాన్ని పెంచుకోడు. సమస్యను దాటవేయడం మంచిది కాదు, ఒప్పుకుంటాను. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచిస్తున్నాను.”

“అందరికీ సలహాలిస్తావు. నీకు చెప్పగలవాళ్ళెవరురా?”

“అదే జీవితమంటే! కొన్ని సమస్యలకు పరిష్కారం మనకు తోచకపోవచ్చు. అలాంటప్పుడు మరొకరి సహాయం తీసుకోవాలి. ఆ ప్రయత్నం కూడా చేశాను. ఫలితం మాత్రం సున్నా. మరొక స్నేహితుడ్ని నా తరఫున మాట్లాడమని చెప్పి చూశాను. దాని వల్ల ప్రయోజనం కనపడలేదు. ఇక మిగిలిందల్లా, కొన్నాళ్ళు ఓపికగా ఎదురు చూడడమే. ”

                                                         * * * * * *
నందిని బస్సు దిగి టైము అవడంతో సరాసరి ఆఫీసుకు వెళ్ళిపోయింది. సాయంత్రం రాగానే కాఫీ కలుపుదామని చూసేసరికి, కాఫీ పొడి తరిగి పోయినట్లు కనిపించింది.

అక్కడే ఉన్న సుధీర్,”మా అమ్మా నాన్నా వచ్చి రెండ్రోజులు వుండి వెళ్ళారు” చెప్పాడు.

“సో, మీరు ఆ రెండు రోజుల సరిపడా మన ఉమ్మడి ఖర్చులో ఎక్కువ భరించుకోవాల్సి వుంటుంది.”

“సరే, అలాగే” అన్నాడు సుధీర్.

ఆమె తన అమ్మా నాన్న ఏమన్నారని కానీ, వాళ్ళ గురించి వివరాలు కానీ అడుగుతుందేమోనని చూశాడు. నందిని మరేం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. స్నానం చేసి వచ్చాక వంట ప్రయత్నాలు మొదలు పెట్టింది.

“ఈ వారం నా వంతు కదా, నేను చేస్తాను. ఏ కూర వండమంటారో చెబితే చేసేస్తాను” అన్నాడు సుధీర్.

చాకుతో క్యాబేజీ తరుగుతూ,”నేనుండగా మీ అమ్మ గారు వచ్చినట్లుంటే, మీకసలు వంటే రాదనీ, వచ్చని అబద్ధం మాత్రం చెప్పారని చెప్పేదాన్ని. అసలు వంట ఎందుకు నేర్పలేదో అడిగేదాన్ని.”

“ఏదో క్యాబేజీ మీ అంత సన్నగా తరగడం నాకు చేతకాక పోవచ్చు, అంత మాత్రాన అసలు వంట రాదనడం బాగాలేదు. అయినా నలుడూ, భీముడూ మగ వాళ్ళే కదా?” వివరణ ఇచ్చుకున్నాడు.

“అందరు మగాళ్ళు అలాగే అంటారు లెండి. ఆడ వాళ్ళు వంట చెయ్యడంలో మనసు పెట్టి చేస్తారు. మగవాళ్ళకు అలా చెయ్యరు. పోనీ మీరు భీముడిలా లేరు, నలుడిలానూ లేరు కదా! మరి మీ స్పెషాలిటి ఏమిటో?” చిలిపిగా నవ్వుతూ అడిగింది నందిని.

“మీతో కలిసి ఇలా ఉండడమే” ఇలా అని నొక్కి పలుకుతూ అన్నాడు సుధీర్.

నందిని అతని మాట అర్ధం అయినట్లు నవ్వేసింది.

“మా అమ్మా నాన్నా మిమ్మల్ని గురించి అడిగారు” భోజనాల దగ్గర చెప్పాడు.

“ఇంకా చెప్పరేమిటని ఇందాకటి నుంచి అనుకుంటున్నాను” నవ్వింది.

“మీరు అడగుతారేమోనని చూశాను.”

“ఇది మీకు సంబంధించిన విషయం, మీ వాళ్ళు ఏమన్నది మీరు చెప్పాలి. అయినా ఏముంటుంది? మామూలుగానే మన ఇళ్ళలో ఇలాంటివి ఒప్పుకోరు. వాళ్ళకు ఇష్టం ఉండదు. ఎవరా పిల్లా? సిగ్గు లేదానో, అంత బరితెగించిందా అనో అడిగి ఉంటారు.” చాలా మామూలు విషయంలా నవ్వేసింది నందిని.
సుధీర్ మాట్లాడలేదు. ఈ అమ్మాయి చాలా తెలివైంది. ఈమెతో మాట్లాడి నెగ్గటం కష్టం.

“గుడ్ నైట్” చెప్పేసి, తన గదిలోకి వెళ్ళిపోయింది నందిని.

                                                            * * *

-టి.వి.యస్.రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో