ఆమెను ఆమె
తవ్విపోసుకున్న చోటల్లా
ఒకనది పుట్టుకొస్తుంది
ఆమెను ఆమె
పుటం వేసుకున్న ప్రతిసారి
ఓ గ్రంథం ఆవిష్కృతమౌతుంది
ఆమె
పాటలా పాడబడేచోట
చిగుళ్లు తొడిగిన మేఘం
పచ్చదనానికి పురుడుపోస్తుంది
ఆమె
అలల చేతుల ప్రవాహ
త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకును తెచ్చిన
పావురం
……………..
– మెర్సీ మార్గరెట్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to అలల చేతుల స్పర్శ