పొత్తూరి మా ఇంటి రామాయణం (పుస్తక సమీక్ష )- మాలా కుమార్

మా ఇంటి రామాయణం
రచన పొత్తూరి విజయలక్ష్మి

డాన్ . . . హాహాహా నవ్వుల డాన్. . . 😆 ఏమిటీ స్మగులర్ డాన్ లుంటారు కాని నవ్వుల డాన్ ఏమిటీ అని విస్తుపోతున్నారా ? ఉంటారండీ బాబూ ఉంటారండి.దావూద్ అబ్రహం ను మించిన భయకరమైన నవ్వుల డాన్! ఎక్కడైనా రచయిత్రుల మీటింగ్ జరుగోతోందా ? ఆ మీటింగ్ ను పట్టించుకోకుండా ఓ గుంపు , ఓ చోట విరగబడి నవ్వుతున్నారా ? అంటే అక్కడ నవ్వులడాన్ ఉన్నట్లే లెక్క.మన నవ్వులన్నీస్మగుల్ చేసి తను మాత్రం ఏమీ పట్టనట్టుంటారు.నోటి మాట తో మన పొట్టలు చెక్కలు చేస్తారు.చేతి రాతతో మనలను నవ్వుల గుంజకు కట్టేస్తారు! ఆ డాన్ ఒక్కరే కాదు ఆ కుటంబం మొత్తం నవ్వుల డాన్లేనట! అసలు పుట్టినప్పుడు అందరిలా ఏడవలేదుట! నర్సమ్మ కు చక్కిలిగింతలు పెట్టి నవ్వించారట.తనతో పాటూ ఆ నవ్వులనూ పెంచిపోషించారట.అవి మనకు మాత్రమే ఉంటే ఎలా అందరికీ పంచుదామని ముందు పిల్లకాయల నాటికలతో మొదలుపెట్టారుట. ఆ తరువాత కాస్త బయట ప్రపంచానికి కూడా మన థఢాకా చూపిద్దామని పత్రికలకు పంపారట.అది కాస్తా సినిమా ఐకూర్చుంది! ఇంకేముంది సమస్త ఆంద్ర ప్రజలూ ఢాం అని ఆడాన్ వల్లో పడిపోయారు.చెపుతుంటేనే హబ్బా. . . హబ్బా నవ్వీ నవ్వీ కడుపు నొప్పి వచ్చేస్తుందంటే ఎంతటి డాన్ నో అర్ధం చేసుకోండి. అలా కాదులెండి ఇదో ఇవి చదవండి.

[spacer height=”20px”]” ” అమ్మాయ్ మీ వేరు కాపురం వ్యవహారం ఏమైంది “
“ఇల్లదీ చూసుకోవాలిగా “
నేను చూస్తా అని పూనుకొని రోజూ తిరిగి ఇళ్ళువెతికారు .
చివరికి ఓ ఇల్లు మా అందరికీ నచ్చింది .
[spacer height=”20px”]” రేపు పంచమి . పాలుపొంగించుకొని మారిపొండి ” అన్నారు నాన్న గారు .
” అలాగే . మరి నావెంట అత్తగారిని తీసుకొని పోతాను .” అంది దుర్గ .
[spacer height=”20px”]”అదా ! అదెందుకొస్తుంది ?” అన్నారు నాన్నగారు అయోమయం గా .
“ఏం వస్తే కోడలింటికి అత్తగారు రాకూడదా ?” అంది దుర్గ .
“అది నీ వెంట వస్తే నేనేమైపోవాలి ?” అడిగారు ఇంకా షాక్ నుంచి తేరుకోకుండానే .
” సాయం గా మీ అబ్బాయిని వుంచుకోండి !”
“వాడా – వాడెందుకు నాకు ?” అడిగారాయన .

[spacer height=”20px”]” ఏం నెలతిరిగే సరికి ముప్పై వేలు సంపాదించి పెడుతారు .మా అత్తగారెందుకు మీకు ? తిని కూర్చొని తిక్కపనులు చేస్తుంది అని మీరే పొదస్తమానము అంటారుగా . ఆవిడను నాతో పంపించండి .” అంది దుర్గ .

[spacer height=”20px”]” నువ్వు రమ్మన్నా అది రాదు . నీ ఎత్తులు దానికి తెలుసు . దానిని తీసుకెళ్ళి చాకిరీ చేయించుకోవాలని నీ ప్లాను ” అన్నారు నాన్న .
[spacer height=”20px”]” ఇక్కడ మాత్రం చాకిరీ చేయక తప్పుతోందా నాకు ? దుర్గ తో వెళితే పని చేసినా ఆదరం గా చూస్తుంది . ఎక్కడికైనా తీసుకెళ్ళి తిప్పి చూపిస్తుంది . నే వెళ్తా .” అంది అమ్మ .
హతాశులైపోయారు నాన్నగారు .
[spacer height=”20px”]”ఏమిట్రా ఇదంతా ? బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడవేం ?” అన్నారు నన్ను చూసి .
నేను చెప్పేది ఏముంది ? అయినా అమ్మా దుర్గా వెళ్ళిపోతే ఈయిన్ని పెట్టుకొని నేనేం చేస్తాను అందుకే ” నేనూ దుర్గ తోనే వెళ్తా ” అని చెప్పేశాను .
[spacer height=”20px”]” నువ్వే గంగ లోనైనా దూకు .నీ భార్య నా భార్యని తీసుకుపోతానంటోంది కదా ! అదే నాకు తలనొప్పి ” అన్నారాయన .
[spacer height=”20px”]” బదులుగా నా భర్త ని సాయం వుంచుతానన్నానుగా – ఆయన వుండనంటే నేనేమి చేసేది .ఇప్పుడు నాకేమి బాధ లేదు. మా ఆయనా మా అత్తగారూ నాతో వస్తారుట . ఇక మీ ఇష్టం రేపు పంచమి , పాలు పొంగించుకొని మారిపోతాం !” అంది దుర్గ .
[spacer height=”20px”]రాజ్యం కోల్పోయిన రాజులా ఢీలా పడిపోయారు నాన్నగారు . “
ఏమిటీ ఈ మామా కోడళ్ళ కొట్లాట మా ఇంటి రామాయణం అనుకుంటున్నారా ? కాదండీ బాబు ఎంతమాత్రం కాదు . అలా అపార్ధాలు చేసుకోకండి . మరేమిటంటారా ? ఇది ” పొత్తూరి విజయలక్ష్మి ” గారి ” మా ఇంటి రామాయణం .” అదిగో మళ్ళీ అపార్ధం * * * ఆవిడింటి రామాయణం కాదండీ , ఆవిడ వ్రాసిన ” మా ఇంటి రామాయణం ” కథ లోని భాగమన్నమాట ! ఎలా వుంది ? బ్రహ్మాండం బద్దల్స్ కదా 🙂 అసలు ఆ మామా కోడళ్ళు అలా ఎందుకు పోట్లాడుకుంటున్నారు ? పాపం ఆయనొక్కడిని ఇంట్లో వదిలేసి అందరూ వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు ? తెలుసుకోవాలని కుతూహలం గా వుంది కదూ!
ఇంతే నా ,
[spacer height=”20px”]” మరునాడు సరస్వతి రాగానే , ” వంట సరస్వతీ ఇవన్నీ నాకు నువ్వు నేర్పాలి .” అన్నాడు . పదిపేజీలు వున్న జాబితా చూసి నోరావలించిందామె .
” చాలా ఇవన్నీ ” అడిగింది సరస్వతి .
” ఇవి కాక ఇంకా చాలా నేర్చుకోవాలి ” అన్నాడు .
” సరేలే పద . ” అని కుక్కర్ తీయబోతే వారించాడు .
” అలా కాదు నాకు చెప్పు నేను చేస్తా ” అన్నాడు .
[spacer height=”20px”]” సరే ముందు బియ్యం , కందిపప్పు పట్టుకురా !” అంది కుర్చీలో కూర్చొని. బియ్యం తెచ్చి ఇచ్చి కందిపప్పు కోసం వెళ్ళిన వాడు అక్కడే వుండిపోయాడు .
[spacer height=”20px”]”ఏం చేస్తున్నావ్ ప్రసాదరావ్ ?” అంది సరస్వతి .
“పప్పుకోసం వెతుకుతున్నా ” అన్నాడు . వెళ్ళి చూస్తే స్టీల్ డబ్బాలన్నీ దించి మూతలు తీసిపెట్టి వున్నాయి . ఇంకా డబ్బాలు దించుతుంటే అడ్డుపడింది .
[spacer height=”20px”]”ఇదిగో ఇక్కడే వుందిగా కందిపెప్పు .” అంది .
“ఏదీ ? ఎక్కడా ? ” కళ్ళజోడు సర్ద్దుకుంటూ అడిగాడు .
“ఇదిగో , ఇక్కడా ” అంది సరస్వతి .
[spacer height=”20px”]” ఓ వండక ముందు ముద్దపప్పు ఇట్లా బద్దలుగా వుంటుందా ? నేనింకా ముద్దపప్పు డబ్బాలో కూడా పప్పు లాగేవుంటుందేమో అని వెతుకుతున్నా ” అన్నాడు .
తల బాదుకుంది . ” చంపావుపో , వండక ముందు పప్పెలా వుంటుందో తెలియనివాడివి నువ్వు వంటేం నేర్చుకుంటావు ప్రసాదరావ్ ?” అంది దీనంగా .”
[spacer height=”20px”]ఈ ముద్దపప్పు ఎవరు ? ముద్దపప్పు వండేందుకు ఎందుకు తంటాలు పడుతున్నాడో తెలుసు కోవాలంటే “ప్రసాదరావూ – వంట సరస్వతి ” చదవాలిసిందే 🙂
ఇంతేనా అంటే ఇంతేకాదు . ఇంకా వున్నాయి .
[spacer height=”20px”]” శశికళ కాఫీలు తెచ్చింది . ఇద్దరికీ ఇచ్చింది .
కాఫీ తాగుతుండగా టెలిఫోన్ మోగింది . అదిరిపడి కాఫీ మీద పోసుకున్నాడు ఆనందరావు . ” మళ్ళీ ఫోన్ వచ్చింది . ఏ అప్పులవాడో ” అన్నాడు దీనం గా . భర్త వంక దీనంగా చూసి ఫోన్ తీసింది శశికళ .
[spacer height=”20px”]ఈ అప్పులవాళ్ళ గోల ఏమిటీ ? ఇతను ఇంతగా బెదిరిపోవటమేమిటి ? అన్ని ప్రశ్నలే కదా ? ఆ ప్రశ్నలకి సమాధానాలు “అప్పిచ్చువాడు – వైద్యుడు ” లో మాత్రమే దొరుకుతాయి .
ఇంతేనా అంటె ,
[spacer height=”20px”]ఇంకా జీవితము లో మార్పు త్రిల్లూ వుండాలని భార్య ఎవరినైనా ప్రేమిస్తే , సహృదయం తో భార్యను క్షమించాలని వుబలాట పడి , భార్య ఎవరినీ ప్రేమించలేదని నిరుత్సాహ పడే విశ్వం గురించి “తిక్క కుదిరింది ” లో ,
పాపం లక్షణం గా చదువుకొని సుమారైన ఉద్యోగాలు చేసుకుంటూ దర్జాగా బతికిన వాళ్ళు , బొచ్చెలూ , కడవలూ వగైరా పరికరాలు అందుకొని , సతీ సమేతం గా తమ దీనస్తితికి తామే జాలిపడుతూ మేస్త్రీ యాదగిరి తో చివాట్లు తినే పరిస్తితి ఎందుకు కలిగిందీ అంటే నేనేమి చెప్పగలను ? “ఇల్లుకట్టి చూడు ” చదివితే తెలుస్తుంది .
[spacer height=”20px”]చక్కని చుక్కలాంటి అమ్మాయి రాధ . సలక్షణమైన సంబంధం చూసి పెళ్ళి చేసుకోమంటే నాకు పెళ్ళి వద్దు సినిమాల్లో నటిస్తా అనంటుంది . తండ్రి వొప్పుకోకపోతే , పెళ్ళికొడుక్కు నువ్వంటే నాకు ఇష్టము లేదని చెపితే పెళ్ళి తప్పిస్తాడేమో అనుకుంటే “నాకు ఈ పెళ్ళంటే చచ్చేంత ఇష్ట మోర్రో ” అని పట్టు బట్టి రాధను పెళ్ళి చేసుకున్నాడు కుర్రడాక్టర్ వంశీ . పాపం రాధ కోరికో అంటారా ఆ((( . . .ఏమైందో “తీరని కోరిక ” చదువుతే తెలుస్తుందిగా !
[spacer height=”20px”]హైద్రాబాద్ నుంచి శ్రీకాకుళం , శ్రీకాకుళం నుంచి నుంచి విజయనగరమూ తిరగటమెందుకు ? ఇద్దరమూ హైదరాబాద్ లోనే వున్నాము కదా ఇద్దరమూ ఇక్కడే కలుసుకొని మాట్లాడుకుందామని పెళ్ళి కూతురు పద్మ ను వొప్పిస్తాడు పెళ్ళికొడుకు డాక్టర్ . కల్యాణ చక్రవర్తి .పెళ్ళి చూపుల కోసం ఇందిరాపార్క్ కు వచ్చిన పద్మకు పెళ్ళికొడుకు , ఇన్సర్ట్ సగము బయటకు వచ్చి , జుట్టు చెదిరిపోయి , చంకలో రెండేళ్ళ పిల్లాడు , ఇంకో చేతిలో బాగు తో దర్శన మిస్తే . . . హా హ హ హ . . . హమ్మ హమ్మ . . . కొంచమాగండి బాబూ నవ్వీ నవ్వీ నా పొట్ట చెక్కలైపోతొంది 🙂 ఇహ నేను చెప్పలేనండీ బాబు . మీరే చదువుకోండి . ఎక్కడా . . . అని ధీర్గం తీయకండి , చెప్తున్నా ,,, చెప్తున్నా ,,,[spacer height=”20px”]అర్ధమైపోయిందిగా ఆ నవ్వుల డాన్ ఎవరో 🙂 మాఇంటి రామయణ మే కాదు పొత్తురి వారి ప్రతి పుస్తకమూ నవ్వుల జల్లులు కురిపించేవే!మనసు చికాగ్గా ఉన్నప్పుడు, ముఖ్యంగా మొగుడి మీద కోపం వచ్చినప్పుడూ పొత్తూరి వారి పుస్తకాలు మంచి టానిక్ లా పని చేస్తాయి.అవి చదివితే చికాకూ , కోపం ఉష్ కాకి, మొగుడుగారూ హాపీ!

[spacer height=”20px”]మరో ముఖ్యవిషయం.ఈ మధ్య జరిగిన బుక్ ఎగ్జిబిషన్ లో ఆవిడ పుస్తకాలు అన్నీ అమ్ముడైపోయాయిట.నేను మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని పుస్తకాలు బహుమతి గా తెచ్చేసుకున్నాను.మీ అదృష్టం ఎలా ఉందో మరి! థాంక్ యు విజయలక్ష్మి గారు మీ పుస్తకాలకూ, మీ అమూల్యమైన సమయం నాకోసం కేటాయించినందుకు.

[spacer height=”20px”]హాస్య రచనలు చేయటము లో చేయి తిరిగిన రచయిత్రి “పొత్తూరి విజయలక్ష్మి ” గారి , ” మా ఇంటి రామాయణం “( హాస్య కథల సంపుటి ) అర్జెంట్ గా విశాలాంద్ర నుంచి 80 రూపాయలకు కొనుక్కొచ్చుకొని చదివేయండి . ఇంతే నా ఇంతేనా అనకుండా అందులో మొత్తం 14 కథలు వున్నాయి . అయ్యో ఇన్నేనా ఇంకొన్ని కథలు ఇందులో రాస్తే ఆ రచయిత్రి సొమ్మేం పోయిందిట అనిపించకపోతే నన్నడగండి . పుస్తకం కాదు . చదివి వాపసు ఇస్తానంటే ఇస్తాను కాని , మీరు తిరిగి ఇస్తారన్న నమ్మకం నాకేమాత్రం లేదు . ” అయ్యో మాలా గారూ , మా చంటాడు చింపేసాడండి .” అని అబద్దం ఆడి ఇనప్పెట్టిలో దాచేసుకుంటారు . అందుకని ఇవ్వను . ఆ ఆశ పెట్టుకొకుండా మీరే కొనుక్కొచ్చుకొని చదివేసి మనసారా నవ్వేసుకోండి . నాకు తెలుసు మీరూ ఆ పుస్తకం ఎవరికీ ఇవ్వరు 🙂

[spacer height=”20px”]భయపడకండి. పొత్తూరి విజయలక్ష్మి గారి పుస్తకాలు అన్ని పుస్తకాల షాపులల్లోనూ దొరుకుతాయి.కొనుకొచ్చుకొని చదివి హాయిగా నవ్వేసుకోండి 🙂

-మాలా కుమార్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలు, , Permalink

3 Responses to పొత్తూరి మా ఇంటి రామాయణం (పుస్తక సమీక్ష )- మాలా కుమార్