సహ జీవనం – 22 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

“రా అక్కా, రండి బావా, చాలా కాలానికి వచ్చారు” తలుపు తీసి లోపలి ఆహ్వానించాడు ప్రసాదం.
సరస్వతి వెంటనే లేచి ప్రసాదం పక్కకు వచ్చి నిలబడింది.
“మంచి నీళ్ళు కావాలా వొదినా, అన్నయ్య గారు మీకూ?” అంటూ అడుగుతూనే రెండు గ్లాసులతో మంచి నీళ్ళు తీసుకు వచ్చింది.

మంచి నీళ్ళు తాగి ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు.
“ఎండ బాగా వుందిరా ప్రకాశం” మోహనరావు రుమాలుతో నుదుట పట్టిన చెమట తుడుచుకున్నాడు.
“ఇలా ఫాను కింద కూర్చో బావా” చెప్పాడు.
“ఏమిటమ్మా, ఎలా వున్నావు? పిల్లలెలా ఉన్నార్రా?” సరస్వతిని పలకరిస్తూ అడిగింది సావిత్రి.
“నీకు తెలియంది ఏముంది అక్కా, వాడు ఇటు తొంగి చూడడు. ఉష దానికి వీలున్నప్పుడు వచ్చి పోతుంటుంది. ఇద్దరూ బాగానే వున్నారు”చెప్పాడు ప్రకాశం.

“నేను వంట చేసి పిలుస్తాను. అందాకా మీరు మాట్లాడుతూ కూర్చోండి. అన్నట్లు స్నానాలు చేస్తారేమో, బాత్రూంలో గీజరు ఆన్ చేసి వస్తాను” లేచింది సరస్వతి.
“కాసేపు కూర్చున్నాక స్నానాలు చెయ్య వచ్చులే, నువ్వు ఈ లోగా వంట మొదలు పెట్టు. మా బావకు ఆవ పెట్టిన సొర కాయ కూరంటే ఇష్టం. సొర కాయ వుందిగా అది వండెయ్యి” బావ వంక నవ్వుతూ చూశాడు ప్రకాశం.

“వద్దురా ప్రకాశం. ఇప్పుడు అవన్నీ మానేశాను. ఏది పడితే అది తినే వయసు కాదిది” అన్నాడు మోహనరావు.
“అలాయితే ఆనపకాయ పప్పు, బంగాళాదుంప కూర వండి, సాంబారు పెడతాను. ఎలాగూ చింతకాయ ఊరగాయ ఉండనే ఉంది” సరస్వతి లేచి వంటింట్లోకి వెళ్ళింది.
“సరస్వతీ, ముందు కాస్త కాఫీ ఇవ్వు మా అందరికీ” గట్టిగా చెప్పాడు.
సరస్వతి అలాగేనని తల ఊపింది.

“ ఇప్పుడు చెప్పవే అక్కా? ఎన్ని సార్లు పిలిచినా వచ్చావు కాదు. ఇన్నాళ్ళకి నీకు తీరిక అయ్యింది” నిష్టూరంగా అన్నాడు ప్రకాశం.
“ఏదిరా బాబూ,ఎక్కడికీ కదలడానికి లేదు. మా అవస్థలు వింటే, అసలు పిల్లలు లేనివాళ్ళే నయమనిపిస్తుంది. వెడితే పెద్దాడి ఇంటికి, లేకపోతే చిన్నాడి ఇంటికి. ఈ రెండూ కాక, ఏనాడైనా మరో చోటికి వెళ్ళామా,పెట్టామా? ఎక్కడికైనా వెళ్ళామంటే, వాళ్ళ తోనే వెళ్ళడం, వాళ్ళతోనే రావడం,అదీ వాళ్లకు ఇష్టమైతేనే. కోడళ్ళు ఉద్యోగాలు మాకోసమే చేస్తున్నట్లు మాట్లాడుతారు. వాళ్ళ సంపాదనలో ఒక్క పైసా ఎరగం. పైగా ఇద్దరి మధ్య పోటీ! ఎవరి అవసరానికి రాక పోయినా వాళ్ళ కోపాలు ఇంతా అంతా కాదు. వీళ్ళ ఉద్యోగాలు కాదుగానీ, మా చావుకొచ్చింది. ఇద్దరూ చాకిరీ కోసమే పిలవడం తప్ప, మాకూ వయసు పైబడుతోందని కాస్త కూడా ఆలోచించరు గదా? చిన్న కోడలు అమెరికాలో పనిమనుషులు దొరకరు కనక కాస్త జాగ్రత్తగా వుంటుంది. పెద్ద ఆఫీసరు లాగ పనులు అప్పచెప్పి పోతుంది. పెద్ద కోడలు మరీ ఒంటెత్తు గుణం. రేపు మీరు మా మీదే కదా ఆధారపడేది, బాగున్నప్పుడైనా ఎందుకు చెయ్యరన్నట్టు మాట్లాడుతుంది. ఎవరూ పడరు ఆవిడగారికి” సరస్వతి తెచ్చిన కాఫీ తాగుతూ చెప్పింది.

ప్రసాదం ఆవిడ ఆవేదన విని నిట్టూర్చాడు.
సరస్వతి వాళ్లకు కాఫీలు ఇచ్చి, అక్కా తమ్ముళ్ళు చెప్పుకునే విషయాలు తను వినడం బాగుండదని అక్కడ ఉండకుండా వెంటనే వెళ్ళిపోయింది.

 

ఇంకా వుంది…

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో