అబ్సర్డిటీ ఆఫ్ లాజిక్- పి. విక్టర్ విజయ్ కుమార్

         ఒక రాత్రి హతాశువయ్యాక , టీ వీలు సోషల్ మీడియాలు అప్పుడప్పుడు హార్ట్ రెంచింగ్ స్టోరీస్  ను కూడా ప్రసారం చేస్తాయని తెలిసినప్పుడు కాసేపు ఆశ్చర్యం వేస్తుంది. కచ్చ పుడుతుంది. వాటిపై కాసేపు జాలేస్తుంది. మన చెవుల్లో నుంచి ప్రయాణించిన వార్త ఒకటి ఏదో కొండ గాలిలో మేరువులా నిలిచిన గుండెను టోర్నడోలా తాకి , కదిలే తీతువు పిట్టలా అలా కను చూపు మేరలో దూరమౌతుంది. జన్నత్ అన్నది ఒకటి ఉంటే బాగున్ను కదా అనిపిస్తుంది.

జీవితం నీకు నచ్చినట్టో నాకు నచ్చినట్టో మాత్రం బతకడమే బతకడం అవ్వదు. కొందరివి ఆఫ్ బీట్ జీవితాలంతే ! ఎన్నుకునే మార్గం, రాజీ పడలేని ఇంగితం – వేటినీ వదులుకోలేని అటాచ్ మెంట్ ప్రాణం పోవడాన్ని ఆల్టర్నేట్ గా చూపిస్తే ..ఏం …చలో అలానే కానిద్దాం లే అనుకుంటారు.

ఆత్మను ప్రిజర్వ్ చేసుకోవాలన్టే ప్రాణాలు తీసుకోవాలన్న లాజిక్ గమ్మత్తుగా తోస్తుంది. మరందరికీ ఒక కన్సెన్సస్ ఉంది కదా ఇందులో ?!

సరే – ప్రాణం ఎలాగూ పోయిందిగా ?! ఇక ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ లు, అగాథా క్రిస్టీలు బయటకొస్తారు. అలా చూస్తారు. ఇలా చూస్తారు. ‘ మీ రక్షణ మా విధి ‘ అన్న వాళ్ళు బై ఫోకల్ కళ్ళద్దాలు ముక్కు మీదకు దించేసి గార్ధభం శునకం పనికి పూనుకున్నట్టు మొదలు పెడ్తారు. ” ఇదుగో ! ఈ యవ్వారం మా దగ్గర నేర్చుకున్నదే ” అన్నట్టు విద్యావేత్తలు , ఉపాధ్యాయులు ఉప్పు విలువకు     వాళ్ళు అప్పుడెప్పుడో తాము చేసిన రక్షకుల ‘ రోల్ ప్లే’ గురించి ఛాతీ విరుస్తారు.

ఇక అందరూ ” తత్తెరికీ…వీడు అందరు అనుకున్నట్టు దరిద్రుడో, అనాథనో కాదు భయ్. వీడికో జాతి ఉంది. ఐతే అది మీరనుకునేది కాదు ” అనేస్తారు. ముఖారవిందం పై ఒక ప్రౌడ్ స్మైల్ పికాసో పెయింటింగ్ లా వేసేసుకుని ప్రెస్ మీట్ లు పొలో మని పెట్టేసుకుంటే ఎవరో ఒక మీసాల స్వామి ఇంకో పాపాల అప్పారావు తో కలిసి ఇరానీ చాయ్ తాగుతూ ఒకరి వెన్ను ఇంకొకరు సాగదీసుకుంటారు.

” అరే థుత్ , క్యా బాత్ కర్తా హై మియా …. Karna is born into a Kshatriya family having father none other a shining God , but still considered as a ‘ soota putra ‘ because of his raising as a shudra బట్ స్టిల్ అన్ని రూల్స్ అందరి కీ అప్లై అవ్వవ్ లే ” అనేసుకుని క డిసీట్ ఫుల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చేసి ఐబ్రోస్ ను విల్లులా వంచేసి నిల్చుంటారు. ” ఎవరికో ఎప్పుడో ఎలానో పితృత్వం శాలువ కప్పి హోదా ఒకటి ఇచ్చామా లేదా అని కాదు …ఎక్కడ ఎలాంటి దీన స్థితుల్లో మనం పెరిగాము అన్నదే మన అస్తిత్వం ” అని మీలాంటోడు ఒకడంటే ఇంకేం రెడీగా ఉంది కదా , ఒక చాతకాని ఆయుధం. ఒక్క వేటుకు తెగేలా ‘ యాంటీ నేషనల్ ‘ అని కూత పెడితే చాలు. అందరు ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ కబేళాల లోకి వెళ్ళి వాళ్ళ కన్ సైన్స్ ను చెక్ చేసుకుని, తిరిగి వెరిఫై చేసుకుని మళ్ళీ స్క్రూలు , నట్లు బిగించేసి ‘ యస్….’ అని అరిచేస్తారు.

ఇలాగే కేరక్టర్ అసాసినేషన్ అనేది ఈ దేశం తర తరాల నుండి కనిపెట్టిన ఒక మార్షి యన్ అటాకింగ్ టెక్నిక్. సోషల్ ఐసోలేషన్, సోషల్ షేమింగ్ ఈ టెక్నిక్ తో పుట్టిన అక్రమ సంతానం. అడుక్కునే వాడు దీనంగా మొహం పెట్టాలి చేయి చాచాలి కాని , కంటి కింద తొడుగుల్లో ఏ మాత్రం డిసెక్ట్ చేసినా కనిపించే ‘ అదర్ దాన్ దైన్యం ‘ కాని ఎక్స్ప్రెషన్ వాడి బీదరికాన్ని కంప్లీట్ డిస్క్వాలిఫై చేస్తుంది. అందుకే ఏం చేయాలంటే , ప్రాణం పోయిన వాడు మందు కొట్టాడనో, సిగరెట్ గుప్పు గుప్పున వదిలేసాడనో ఏదో ఒకటి కథ ఒకటి ఈస్ట్మన్ కలర్ ఫ్రేం లో పదే పదే చూపిస్తూ చానళ్ళపై ఉంచిన తనఖాను అప్పుడే సరిగా ఎన్ ఫోర్స్ చేయాలి . లేకపోతే అందమైన వాల్ పేపర్ తో ర్యాప్ చేసిన కలర్ ఫుల్ గదుల్లో , గుసగుస మనే ఆ ఏసీ గదుల్లో , కలిసి వేసుకున్న జోకులు, కలిసి పంచుకున్న ‘ కన్సైన్స్ ‘ కుడితిలో పోసినట్టౌతాయి.

ఐతే అందరూ కన్వీనియెంట్ గా మర్చిపోయేది ఏంటంటే అదో మర్డర్ అందునా అది తొమ్మిదవది అని. మరి అన్ని ప్రాణాలు కూడా, ‘ ఒక్క చావుకు వంద కారణాలు ‘ బ్యాచే ! అంటే ఏదోలా చావాలి తప్ప చస్తూ బతుకుదామనే వీటో పవర్ కూడా లేదన్న మాట. మరి ఇంత మందికి చావులు చూడ్డం కామనా ? లేదా చావులు వాళ్ళవి కావనా ?

వార్నీ…..రాజ నర్తకులు కులికే చోటే , న్యాయ స్థానం పెట్టుకుంటారు. విధూషకులు కితకితలు పెట్టే చోటే ధర్మ సంస్థాపన చేస్తారు.

అట్ల కాదు గాని – మనం ఒక సారి ఫ్రేంక్ గా మాట్లాడుకుందాం భై ! అసలు సంఘం లో , ఒక్క మనిషి వయసు మీద పడక ముందే చనిపోయాడంటే , ముంత కింద ఏదో కుత కుత లాడు తుందనే కదా ? బ్రెయిన్ లు అంటే వాళ్ళ బేంకుల్లో బ్లేక్ మనీ నింపుకున్న లాకర్లా ఏంది… ఎప్పుడో సారి సంతకం పెట్టించుకుని మరీ తెరవడానికి ? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు డైలాగ్ నచ్చదు. ఏక పాత్రాభినయాలు చేసే వేదిక ల్లాంటివి మనందరి జీవితాలన్నమాట. ఒకడు వదరుతుంటే , అందరూ నోరెళ్ళ బెట్టుకుని గాలిని మింగుతుండాలంట. పసుపు కుంకుమలు పెట్టి పాద నమస్కారం చేసిన చిలుక పలుకులే ఉండాల. వాట్ ఏ స్టుపిడ్ థింగ్ బీయింగ్ ఎ హిపోక్రైట్ ? సోషల్ స్ట్రక్చర్ ను ప్రశ్నించడం, పేరలల్ ఆర్గ్యుమెంట్ చేయడం ఒకటి కాదు. రెండోది చాత అవ్వచ్చేమో గాని, ఫస్ట్ ది మాత్రం బిల్ కుల్ నై చల్తా.

తమాషా ఏందంటే – సినిమాలు తీస్తారా ? ఎవరికో ఒకరికి విజిళ్ళు వేయ్యల్ల కదా ?! ఎవరికో ఒకరికి ఎట్లనో విజిల్ వేసినోళ్ళు దేశ ద్రోహులెట్లా అవుతారు సాహెబ్ ? దేశ ద్రోహులు కాకుండా ఉండాలంటే , ఎవరెవరికి విజిళ్ళు వేయాలో అది కూడా చెప్తారా ఏంది ? ఇంగట్లుంటే ప్రపంచకానికి ఎంటీవోడో, తలైవానోమాత్రమే సూపర్ స్టార్స్. ఇంగెవడూ లేదు. ఇది నిజంగానే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పోజేనా అని ఎవరం ఆలోచించకుండా వాడెవడో టీ వీ ఆన్ చేసినప్పటి నుండీ వదరుతానే ఉంటాడు.

సరే , ఇప్పుడు ప్రాణం ప్రాణం అని ఇంత సేపు బాధ పడినామా ? ఇప్పుడు చూడండి … నేచర్ లో చామంతి పూవును చూసినారు కదా ? ఓహ్…వాట్ అ లవ్లీ ఫ్లవర్ ?! గులాబీ భీ దేఖేనా ? కిత్నా ఖూబ్ సూరత్ హొతే హై ఉస్ ఫూల్ కీ పత్తే ? If you take them and wash them again and again, would they turn their colour into something else ?

కొంత మంది రక్తం కూడా అంతే కదా ? ఏమన్నా చెయ్……. రంగు మారదు !!

– పి. విక్టర్ విజయ్ కుమార్
————————————————————————————————————–

వ్యాసాలు, UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో