వయసొచ్చిన పుట్టినరోజు(కవిత) – కె.గీత

వయసొచ్చిన పుట్టిన రోజు
మిగిలున్న పుట్టినరోజులెన్ననే ఆలోచనతో ప్రారంభమవుతుంది
మిగులున్న పనుల వివేచన మొదలవుతుంది
ఎక్కడో ఒకచోట మొదలయ్యి
ఎక్కడో ఒక చోట ఆగిపోయే
జీవన ప్రయాణం లో
పుట్టిన రోజొక మైలురాయి
బతుకు భారాన్ని కొలిచే తూకపు రాయి
గుండెల మీద
ఎదగాల్సిన పిల్లల భవిష్యత్తు
చక్కదిద్దాల్సిన జీవితాల కసరత్తు
గుండెచాటున మోగే
విరిగిన తంత్రుల
కఠోర నాదం
ఎప్పటికప్పుడు
తెగిన నాడుల్ని
వేళ్లకి చుట్టుకుని
గుండె చిక్కబట్టుకుని
కొత్త రాగాల్ని
ఆలపించాల్సిందే
అయినా విచిత్రంగా
ప్రతీ మైలురాయీ
విడిచే నిశ్వాసం మీంచి
కొత్తగా లేచే
ఆశా శ్వాసం
ఇంద్రధనుస్సు నుంచి
రాలిపడ్డ క్షణానే
ఉవ్వెత్తున నింగికెగిసే
మొక్కవోని ధైర్యం
తలెత్తుకుని సగర్వంగా
తిరగ గలిగే
మొదటి పాదపు ముద్ర
కన్నీళ్లలో స్నానించి
పునీతమై ప్రారంభమయ్యే
తొలి జీవన యాత్ర
ప్రతీ పుట్టినరోజూ
రానున్న పుట్టిన రోజులకు పూర్తవ్వాల్సిన
పనుల పట్టికల్తో
దు:ఖ సంతోషాలే
జమాఖర్చులైన
బతుకు బండి కుంటి చక్రాలతో
దొర్లక మానకపోయినా
నాకు ప్రతీ క్షణం
ఒక పుట్టిన క్షణమై
మెరిసే స్ఫూర్తి
నాతో నడిచే
ప్రతీ పాదముద్రకూ
వెలుగు నింపిన తృప్తి

-కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

2 Responses to వయసొచ్చిన పుట్టినరోజు(కవిత) – కె.గీత

  1. Pingback: వయసొచ్చిన పుట్టిన రోజు | అఆలు (అనుభూతులు-ఆలోచనలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో