సహ జీవనం – 20(ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

“అక్కా, నేనొక మాట చెబుతాను వింటావా?” కొబ్బరి ముక్క నములుతూ అడిగాడు ప్రసాదం.

“చెప్పరా, నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు?” అన్నది సావిత్రి.

“ అదే, నేను చెప్పబోయేది! నీ కొడుకుల దగ్గర నీకు మొహమాటం ఎందుకు? కొడుకును, కోడల్ని కూర్చోబెట్టి, మీ సమస్యను వివరించండి. అన్ని పనులు మీ మీద వదిలేసి వాళ్ళు అలా వెళ్ళిపోతే, మీకు నిభాయించుకు రావడం కష్టంగా ఉంటోందని మృదువుగా వివరించి చెప్పండి. ఏఏ పనులు మీరు చెయ్యలేరో, అవి వాళ్ళు చెయ్యగలరేమో చూడమనండి. లేదా, ఒక మనిషిని సహాయంగా ఏర్పాటు చెయ్యమనండి. అన్ని పనులు చేసేటందుకు ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పండి. ఈ కోడలు ఇలా అన్నదనో, ఆవిడ అలా అన్నదనో పొరపాటున కూడా ప్రస్తావించవద్దు. నువ్వు అలా మాట్లాడటానికి అసలు అదే మూల కారణం అనుకునే ప్రమాదం వుంది. అందువల్ల మీ ఇబ్బంది మాత్రమే వాళ్లకు అర్ధం అయ్యేలా చెప్పండి. అప్పటికీ మిమ్మల్ని అర్ధం చేసుకోలేకపోతే, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. వాళ్ళు మిమ్మల్ని గౌరవించనప్పుడు మీరు అక్కడే ఉంటూ వాళ్ళకు సేవలు చేస్తూ పడి వుండడం ఎందుకు?ముసలితనంలో కొడుకుల దగ్గర ఉండకుండా ఎలాగా అనుకుని, ఇప్పటినుంచే జీవితం నరకంచేసుకోవడం తెలివితక్కువ. అనేక మంది ఒంటరిగా బతుకుతున్నారు. అసలు పిల్లలు లేని వాళ్ళ సంగతేమిటి? కన్న పిల్లలకు మనం మన కష్ట సుఖాలు చెప్పలేక పోతున్నాం. వాళ్ళ తప్పొప్పులు వాళ్లకు చెప్పలేక పోతున్నాం. దాని మూలంగా మనమే బాధలు పడుతున్నాం. ఇది మనం చేస్తున్న తప్పు కాదా? ఆలోచించు. వాళ్ళ మంచి చెడ్డలు చూడడమే కాదు, తప్పొప్పులు సరి చెయ్యాల్సిన బాధ్యతా మన మీదే వుంది.”

“నిజమే రా, కానీ, కొడుకులు చెప్పినా అర్ధం చేసుకునే పరిస్థితి లేదు. ఈ కాలం కోడళ్ళు మొగుళ్ళ మాట వినరు. వాళ్ళ మాటే వీళ్ళు వినాలి. మనకు మన కొడుకుల దగ్గర్నుంచే సప్పోర్టు లేదు. ఇక కోడళ్ళకు చెప్పగలమంటావా? చెప్పి చికాకులు కొని తెచ్చుకోవడమే కానీ, వాళ్ళేమీ మారరు. అమ్మ నీరజతో ఎంత చికాకు పడింది? తనే ఉద్యోగం చేస్తున్నానని ఎంత అహంకారంగా మాట్లాడేది?నువ్వు చెప్పేవాడివి అనుకో, కానీ ఏనాడన్నా విన్నదా?”

“ అవును. గట్టిగా చెప్పలేకపోవడమే నా బలహీనత. అందువల్ల, మన లాంటి వాళ్ళమంతా కష్ట పడుతున్నాం, నష్టపోతున్నాము కూడా. నా జీవితంలో చాలా ఆలశ్యంగా నైనా నీరజ నుంచి నేర్చుకున్నపాఠం ఇదే! మనిషి కొన్ని సార్లు ఖచ్చితంగా వుండాలి. అది ఎంత దగ్గరి వాళ్ళైనా సరే. భార్యతో అయితే మొదటి రోజు నుంచే కచ్చితంగా వుండాలి. ప్రేమగా వుండడం వేరే, అలాని ఆ ప్రేమ అతి కాకూడదు. నాకు మనుషుల్ని ప్రేమించడం, సర్దుకు పోవడం మాత్రమే తెలుసు. కఠినంగా మాట్లాడడం ఆవిడ నైజం. తను అలా మాట్లాడి నప్పుడు కూడా అది తప్పని ఖండించే వాడిని కాదు. ఎందుకొచ్చిన గొడవని ఊరుకునే వాడిని. తప్పు అనిపించింది ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా ఖండించకపోతే, ఆ తర్వాత మనమే బాధ పడతాం. ”
“నిజమేననుకో, అయినా ఒక్క విషయం అడుగుతాను! నువ్వు కనీసం నీ కొడుక్కు చెప్పగలిగావా?”

ఆ ప్రశ్న నువ్వు అడుగుతావని నాకు తెలుసు అన్నట్లు చిరునవ్వు నవ్వాడు ప్రసాదం.

“ఏదీ, వాడు నాకు మాట్లాడే అవకాశం ఇస్తేగా? మరొక మాట లేకుండా వెళ్ళి పోయాడయ్యే! చాలా సార్లు ఫోన్లు చేశాను. నా గొంతు వినగానే ఫోను పెట్టేసేవాడు. వుత్తరం రాసి చూశాను. దానికి జవాబు లేదు. బహుశా చించేసి ఉంటాడు. వాళ్ళ తాతయ్యా,అమ్మమ్మ చెప్పిచూశారు, వినలేదు. మనవడి బాలసారెకు తాతయ్యా,అమమ్మలను పిలిచాడు, కానీ మమ్మల్నిపిలవలేదు. మేము వెడితే వాడు పలకరించనన్నా పలకరించలేదు. కోపం వచ్చి వెంటనే వెనక్కి తిరిగి వచ్చేశాము. కోడలు పరాయి పిల్ల. కానీ వాడు రక్త సంబంధాన్ని కూడా కాదని దూరంగా ఉంటున్నాడు. తల్లిదండ్రులను సరిగా అర్ధం చేసుకున్న వాడెవడూ ఇలా ద్వేషాన్ని పెంచుకోడు. సమస్యను దాటవేయడం మంచిది కాదు, ఒప్పుకుంటాను. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచిస్తున్నాను.”

“అందరికీ సలహాలిస్తావు. నీకు చెప్పగలవాళ్ళెవరురా?”

“అదే జీవితమంటే! కొన్ని సమస్యలకు పరిష్కారం మనకు తోచక పోవచ్చు. అలాంటప్పుడు మరొకరి సహాయం తీసుకోవాలి. ఆ ప్రయత్నం కూడా చేశాను. ఫలితం మాత్రం సున్నా. మరొక స్నేహితుడ్ని నా తరఫున మాట్లాడమని చెప్పి చూశాను. దాని వల్లా ప్రయోజనం కనపడలేదు. ఇక మిగిలిందల్లా, కొన్నాళ్ళు ఓపికగా ఎదురు చూడడమే. ”

-టి.వి.యస్.రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో