జ్ఞాపకాలు(కవిత )- టి.వి.యస్.రామానుజ రావు

మా బందరు పోస్టాఫీసులో,

అతనెప్పుడూ
తన బోదకాలు జీవితం
ప్లాస్టిక్ సంచిలో కట్టి
పేరు లేని హాజరు పట్టీకి
మొదటి వ్యక్తిగా
నిలిచే వాడు.
కలలు జారిన
చిరుగుల జేబులోంచి
మిగిలిన ఒక్క ఆయుధం తీసి
దాతలిచ్చిన కళ్ళజోడు లోంచీ శుక్లాల కళ్ళను సారించి ,
అప్లికేషన్ల లో ఆశల అడ్రసులు నింపేవాడు.
సూదీ దారం తో
భావి జీవిత కవర్లకు
అక్నాలెడ్జిమెంట్లు కుట్టిపెడుతూ,
రేపటి జవాబుకు ప్రతీక అయ్యేవాడు.
వాళ్ళిచ్చే రూపాయో,అర్దో
అర గ్లాసు టీలో మునిగి,
ఆకలి గొంతుకు అడ్డు పడేవి.

మా విజయవాడ సత్యనారాయణపురం వీధుల్లో,

“మరమరాలు,బటానీలు” అంటూ గురవయ్య
బడుగు, మధ్య తరగతి జీవుల
మధ్యాహ్నపు టిఫెన్ల బరువులు మోస్తూ,
మాడిన డొక్కలను పొట్లాలు కట్టీ
కొసరు వేసి కొలిచే వాడు.

మరి కాసేపటికి,
“పీచు మిటాయి పైసా, పైసా,పైసా”అంటూ
రాగయుక్తంగా పాడుతూ రాఘవయ్య,
రోజంతా జీవితాన్ని
ఎండకు పరిచి
సంపాదించిన నూరు పైసలూ
ఒళ్ళంతా చెమటలు కార్చేవి.

పార్కు దగ్గర సాయంత్రాలు
నాగా ఎరుగని
మస్తాను సాహెబు
తోపుడు బండిలో
ముంత కింద పప్పు,
వేసవిలో
ఉప్పూ కారం అద్దిన మామిడి ముక్కల రుచి
ఆనందం కాకెంగిలి తిని,
కళ్ళు నిండిన నీళ్ళు గోతిలో దిగి,
పంపు నుండి జారి
అమృత మయ్యేవి

శివాజీ కేఫ్ సెంటర్లో,
సాయంత్రాలు నిలబెట్టి
సెకెండు షో విశ్రాంతి కూడా
మిరప కాయాల్తో చీలుస్తూ
బాణలిలో ముంచుతూ
మా బజ్జీల సుందరం వేసే
మిరప బజ్జీల వాసన
చల్ల గాలిలొ తేలి
పేటంతా నోరూరించేది.

ఒక ఆదరణ తొలకరి చినుకై,
వారి కళ్ళలో ముత్యమై విరిసేది
ప్రతిగా నోటివెంట
పగడాలు జారిపడేవి
ఈ శ్రమైక జీవనులు
జ్ఞాపకాల దొంతరలొ
మనసంతా నిండి
ఏక శిలా రధంలా…
(మా విజయవాడా సత్యనారాయణపురం పార్కులో మంచి నీళ్ళపంపు ఒక గోతిలొ వుండేది.)
– టి.వి.యస్.రామానుజ  రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో