గురువుస్థానం(కథ )- డేగల అనితాసూరి

తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దలు. అంటే..దైవానికన్నా గురువుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నమాట. తల్లి తండ్రి జన్మను, అవసరాలను చూస్తే సంస్కార వంతంగా ఆరోగ్యకరమైన మానసిక అభివృద్ధితో వికసించే మనుషులుగా తీర్చిదిద్దేది గురువులని అర్థంతో. కానీ నేటి గురువులు వారే నీతి తప్పి ప్రవర్తిస్తున్నారు నలుగురిలో తమ విలువలు పోగొట్టుకోవటమే కాకుండా తమ పిల్లల గురువుల్ని తల్లిదండ్రులు అనుమానించే రీతిలో వారి స్థాయిని దిగజార్చుకుని మంచి గురువులకు కూడా గుర్తింపు లేకుండా చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా తాను గురువుని వీళ్ళు నా కన్న పిల్లలతో సమానమైన విధ్యార్ధులు అని గుర్తించుకుoటే ఈ సమస్య పరిష్కారమవుతుంది.

******

అప్పటికి బి.ఇ.డి కంప్లీటైంది గానీ ఉద్యోగం రాలేదు చంద్రయ్యకు.

పనీపాటాలేకుండా ఇంట్లోనే ఉంటే ఎందుకూ కొరగాకుండా పోతాడేమోనని తల్లి తన అన్న ఇంటిదగ్గర పొలంపనులు నేర్పించమని పెట్టింది.

“ఒరే చంద్రా..కూలీలొస్తారుగానీ, త్వరగా బయలుదేరి పొలానికెళ్ళు” చెప్పేసి పక్కఊళ్ళో హెడ్ మాష్టర్ కాబట్టి స్కూలుకి సైకిలుమీద బయలుదేరాడు రామకృష్ణ.

“సరే మామా” అంటూ తనుకూడా పొలంకేసి నడిచాడు చంద్ర.

మధ్యాహ్నం పన్నెండున్నరవుతుండగా ఇంటికొచ్చింది ఇంటర్ చదువుతున్న రాణి భోజనానికి.

“రాణమ్మా..మీబావకూడా పొద్దున్న మీనాన్న మాటతో ఏమీ తినకనే పొలానికెళ్ళాడుగానీ నువ్వు తిని క్యారేజి మీ బావకిచ్చి కాలేజికి పోమ్మా” చెప్పింది తల్లి సరస్వతమ్మ.

” సరేనమ్మా ” చెప్పింది రాణి బావ చంద్రకు క్యారేజి సర్దుకుంటూ.

*****

 రామకృష్ణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు. రాణే పెద్దది. ఉద్యోగం రాకపోయినా పిలవకనే వయసైతే వచ్చింది చంద్రయ్యకు. కాబట్టి రోజూ తనకు భోజనంతెచ్చే రాణి అంటే ఆకర్షణ పెరగసాగింది. సినిమాల మహాత్మ్యoతో  ప్రేమ కబుర్లూ నాతో మాట్లాడటం మొదలెట్టాడు చంద్ర. ఆ వయసులో కోతైనా.. గాడిదైనా ఇట్టే మనసులోకి దూసుకొచ్చేస్తారు కాబట్టి రాణికి కూడా బావంటే అభిమానం పెరగసాగింది.

    ఇంట్లోవాళ్ళకుమాత్రం ఇసుమంతైనా అనుమానం కలగలేదు. కాబట్టి నాలుగేళ్ళు వాళ్ళప్రేమ నిరాటంకంగా సాగింది. డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగా రాణి నెలతప్పింది.

                                          మామకుతెలిస్తే మక్కెలిరగ తంతాడు. అమ్మకుతెలిస్తే ఊరంతా ఏకమయ్యేలా అరిచి ఆగిత్తంచేస్తుంది. ఇప్పుడేంచెయ్యాలని ఇద్దరు తెగ ఆలోచించి ఒకరోజు తిరుపతికి చెక్కేసి పెళ్ళిచేసేసుకున్నారు. రెండుమూడురోజులు ఒక లాడ్జి లో ఉన్నారు. ఈ లోగా ఎవరో చెబితే తెలుసుకుని హోటల్లో ఉన్న వాళ్ళను మంచిగా ఇంటికి పిలిపించి అయ్యిందేదో అయ్యిందని సర్దుకుని కూతురితో డిగ్రీ పూర్తిచేయించి టీచరు పోస్టింగ్ వేయించాడు రామకృష్ణ. ఈలోపు కూతురుపుట్టిన మూడునెలలకు చంద్రకు కూడా ఉద్యోగం వచ్చింది. ఇద్దరు వేరుకాపురంపెట్టారు.

 ఎలిమెంటరీ స్కూల్లో టీచరు కాబట్టి రోజులుబాగానే జరగసాగాయి . కావాల్సినంత తీరిక, గౌరవం దొరికి సాయంత్రాలు చిన్న క్యాసెట్ల వ్యాపారంకూడా మొదలుపెట్టాడు చంద్ర.

                                           కూతురికి సంవత్సరం వచ్చింది. పిల్లనెత్తుకుని దారిలో వెళ్తుంటే ఎదురైంది వెనకవీధి మస్తానమ్మ పక్కన అయిదేళ్ళ కూతురు ముంతాజ్ తో.

  “సారూ..మీ దగ్గరకే వస్తున్నా మీరే కనిపించారు. నా భర్త వట్టి త్రాగుబోతు. మీకుతెలుసు కదా. డబ్బులన్నీ తగలేస్తాడు. నేను పనికెళ్ళి తెచ్చినవి చాలటంలేదని  దీన్నికూడా పనిలోపెట్టమని గోలచేస్తున్నాడు. ఎలాగైనా మీరే బుద్ధిచెప్పి పిల్లని స్కూల్లోచేర్చాలి ” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.

   సాయంత్రం బాషాతో మాట్లాడాడు చంద్రయ్య. గవర్నమెంట్ స్కూల్లో నీకే ఖర్చూ ఉండదు. మధ్యాహ్న భోజనం ఉంటుంది. పిల్లను కష్టపెట్టకుండా బడికి పంపమని, పుస్తకాల గురించికూడా బెంగపడవలసిన పనిలేకుండా చూసుకుంటానని మాట యిచ్చాడు చంద్ర. నచ్చజెప్పేసరికి ఏ కళనున్నాడోగాని ఒప్పుకున్నాడు బాషా.

   మర్నాటినుంచి బడికి రాసాగింది ముంతాజ్. పిల్లతెల్లగా ఉన్నా పేదరికంవల్ల సరైన తిండిలేక చిక్కిపోయి ఉంది. తైలసంస్కారం తక్కువైనందున జుట్టుకాస్త ఎర్రగాతిరిగి, చిన్న కళ్ళతో నీరసించిన ప్రాణాలు దాచుకున్నట్టు కనిపిస్తోంది.చూస్తుండగానే నాలుగేళ్ళు గిర్రున తిరిగిపోయింది. త్రాగి త్రాగి కిడ్నీలు పాడై భాషా చనిపోయాడు.”సార్ ఈ లెక్క నాకు తెలవటంలేదు. మా అమ్మకు చదువు లేదుకదా. మిమ్మల్ని అడగమని పంపింది. “అంటూ వచ్చింది ముంతాజ్.

                                           పిల్ల ఇప్పుడు అయిదో తరగతికొచ్చింది. స్కూల్లో టైముకి తింటున్నందువల్లేమో బాగా పొడవై ఒళ్ళుచేసి ఇప్పుడు చూడ చక్కగా ఉంది. మడిచి కట్టిన రెండుజడలు, బొద్దుగా తయారైన పిక్కలు, యాపిల్స్ లాంటి బుగ్గలు, చిన్నవైనా కళ్ళలో చేపపిల్లల్లా అల్లల్లాడుతూ నల్లగా మెరుస్తున్న కనుపాపలతో ఏడవతరగతి పిల్లలా అనిపిస్తోంది ముంతాజ్.

                                                            ****

రాణి ఇప్పుడు ఇంట్లో లేదు. రెండవ కానుపుకి నెలలు నిండటంతో పుట్టింటికి వెళ్ళింది.భోజనానికిమాత్రం అత్తగారింటికి వెళ్ళి సాయంత్రాలు తన షాపు చూసుకుని ఇంటికే వచ్చేస్తున్నాడు చంద్ర.బోరుగా ఉండి క్యాసెట్లు చూడటం మొదలుపెట్టాడు. స్నేహితుల ప్రోత్సాహంతో అప్పుడప్పుడూ మందు పుచ్చుకోవటం అలవాటైంది. అలాగే బూతు క్యాసెట్లు చూడటం కూడా.

నెల తరువాత మళ్ళీ ఒకరోజు వచ్చింది ముంతాజ్ ఇంగ్లీషు చెప్పివ్వమని.ఈసారి ఆ పిల్లలో వయసు తక్కువైనా వంటిలోని ఎదుగుదలే కనిపించింది చంద్రానికి. దానికితోడు ముందురోజు చూసిన చిన్న పిల్లతో రొమాన్స్ సీన్లు మెదడును వికృతంగా ఆక్రమించుకుని ఉందేమో “రోజూ నాదగ్గర ట్యూషన్ కి వస్తావా..బాగా నేర్పుతాను. డబ్బులేమీ వద్దులే.” అన్నాడు బుగ్గలు సవరదీస్తూ.

ఈలోపు మస్తానమ్మ వెదుక్కుంటూ కూతురికోసం వచ్చేసరికి గబుక్కున సర్దుకున్నాడు చంద్ర.”అమ్మీ..సారు ట్యూషన్ కి వస్తే బాగా నేర్పుతారంట మరి పంపుతావా? ” అడిగింది ముంతాజ్ ఇంటివైపు నడుస్తూ తల్లిని.”సారు చానా మంచోడు. రేపు మీ పెద్దమ్మకూతురు పెళ్ళికి వెళ్తున్నాంకదా. వారం తరువాత వచ్చాక అప్పుడెళ్దువులే” అంది మస్తానమ్మ.

                                                                       ****

                                          మనవడి నామకరణం అయ్యింది. మనవరాలికి కాణిపాకంలో అక్షరాభ్యాసం చేయించారు రాణి తల్లిదండ్రులు.రేపు మంచిరోజు కాబట్టి పాపను స్కూల్లోవెయ్యాలి. పిల్లలకు పంచడానికి చాక్లెట్ లు, స్వీట్ లు పట్రమ్మని భార్య చెబితే రోడ్డెక్కాడు చంద్ర.షాపులవైపు వెళ్తుంటే మస్తానమ్మ ఇంటి బయట కనిపించింది.”రండి సారూ ..రండి” అంటూ బలవంతంగా ఇంట్లోకి పిలిచింది. కాఫీకోసం పొయ్యిమీద పాలుపెట్టి పక్కింట్లో ఆడుకుంటున్న కూతుర్ని కేకేసింది బండిదగ్గర మిర్చి బజ్జీలు తెమ్మని పంపడానికి.సారు వచ్చారని తెలిసి ముంతాజ్ పరుగున వచ్చింది చేతిలోని చార్టుతో.”ఏమిటా చార్టు ముంతాజ్..సైన్సు టీచర్ ఇచ్చారా చేసుకురమ్మని?” అంటూ అడిగాడు చంద్ర ఆరాగా.

   “లేదు సార్..రేపు మనస్కూల్లో టీచర్స్ డే కి గురుపూజోత్సవం కదా. దానికోసం” అని చార్టుని ప్రక్కనున్న టేబుల్ మీద ఉంచి పరుగున గదిలో కెళ్ళింది తల్లిదగ్గర డబ్బులుతీసుకెళ్ళడానికి.క్యూరియాసిటీతో చార్టు అందుకున్నాడు చంద్ర. చార్టు మధ్యన పైన తన ఫోటో అంటించి ఉంది.

 “గురువుల్లో మంచి గురువులు వేరు. నాకు తెలిసిన మంచి గురువుగారు మన చంద్రయ్య మాష్టారు. ఆయన చెప్పకుంటే మానాన్న నన్ను కూలికో నాలికో పంపేవాడు. ఇప్పటికీ నాకు చదువులో తెలియని విషయాలు చక్కగా వివరిస్తారు. సారు కూతురు రంజనిని చూస్తే నాకు చెల్లెలిగా అనిపిస్తుంది. మా నాన్న లేకున్నాసారు ముందు వున్నంతసేపు నాకు తండ్రిలా కనిపిస్తారు. ఆయన లాంటి గురువులు ఉన్నందుకు మన పాఠశాల చాలా గొప్పదని నా అభిప్రాయం. ఎప్పటికీ చంద్రయ్య సారుకి నేను ఋణపడి ఉంటాను.” అని రాసుంది.

 ఇంతలో ముంతాజ్ రావటం గమనించి చార్టుని అక్కడే పెట్టేశాడు చంద్ర. “ఒక్కనిమిషం సార్.. చిటికెలో వచ్చేస్తా” అంటున్న ముంతాజ్ ను దగ్గరికి పిలిచాడు.మడుచుకుపోయిన గౌన్ ని క్రిందికి లాగి సరిచేసి “బయటకు వెళ్ళేటపుడు మంచిగా ఉండాలనిచెప్పి” నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు కళ్ళముందు కూతురు రంజని గుర్తొచ్చి వాత్సల్యంగా చెమర్చిన కళ్ళతో.”నూటికో కోటికో గాని ఇలాంటి గురువులుండరు” అనుకుని పవిటచెంగుతో కళ్ళొత్తుకుంది మస్తానమ్మ మాష్టారి అభిమానానికి కరిగిపోతూ.

                                                                          *****

                                “ఏమండీ చూశారా పేపర్లో ఏంవేశారో..ఏదో స్కూల్లో ఆరేళ్ళ పిల్లపై అత్యాచారానికి యత్నించిన పి.టి. మాష్టారంట. వెధవల్ని నడివీధిలో నరికి పోగులు పెట్టాలి” మండిపడుతోంది రాణి.

   “దేవుడా..గురువు లందరికి కళ్ళుమూసుకుపోకుండా తెరిపించి మంచిబుద్ధినివ్వు స్వామి. బోనులో కెక్కే ముద్దాయిచేత భగవద్ఘీతమీద ప్రమాణం చేయించినట్టు ప్రతి టీచరుతో ఉద్యోగంలో చేరే మొదటిరోజు ‘గురువుస్థానం అంటే తండ్రి స్థానం గా భావించాలనీ ప్రమాణం చేయిస్తే ఎంతబాగుంటుందో.” కళ్ళుమూసుకుని మనదులో పైకే అన్నాడు చంద్రయ్య.

  “ఏమోబాబు..మొన్న పక్క ఊరి హెడ్మాస్టర్ విద్యార్ధినులతో వెధవ్వేషాలేశాడని ఊరంతా కలిసి తన్నినట్టు తెలిసింది. అడుగడుగునా ఉన్న కీచక మాష్టర్లని తప్పించి నా కూతురున్న స్కూల్లో అందరు పసిపిల్లలో కూతురినో విధ్యార్ధినో తప్ప ఆడపిల్లని చూడని కళ్ళున్న సార్లుండేలా చూడు స్వామీ” తనూ పైకే భగవంతునికి దండంపెట్టుకుంటూ అంది రాణి.

– డేగల అనితాసూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , , Permalink

4 Responses to గురువుస్థానం(కథ )- డేగల అనితాసూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో