“నా” అదుపు – “న” అదుపు

 

                                 అలవాటు  ప్రకారంగా ఉద్యోగ ధర్మం లో భాగంగా నా డిజైన్ సెషన్ కి కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయా అని చూసుకుంటూ ఇంకో పది నిముషాల్లో మొదలవబోయే కాన్ఫరెన్సు కాల్ కి తయారవుతున్నాను. ఇంతలో ఆఫీసు మెసెంజర్ లో ప్రాజెక్ట్ మేనేజర్ మెలిస్సా అడిగింది: లలితా! ఆర్ యు రెడీ టు మీట్ నియర్లీ ఎయిటీ ఫోక్స్ ఫ్రం సిక్స్ టీన్ టీమ్స్ (నువ్వు దాదాపు పదహారు టీమ్సు నుంచి నీ మీటింగ్ చేరబోతున్న ఎనభై మందిని ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నావా?) ? అని. నేను బదులుగా ఒక స్మైలీ ని పంపించాను. అది చూడగానే – ఆరంట్ యు వర్రీడ్ అబౌట్ వాట్ దే వుడ్ బి ఆస్కింగ్ యు? (నీకు బెరుకుగా లేదా వాళ్ళు ఏమి అడగబోతారో అని?)  అనడిగింది. దానికి ఎప్పటిలాగే నా బదులిది (నా ఆంగ్ల సమాధానానికి తెలుగు లో అనువాదం) – మెలిస్సా! ఈ ప్రపంచం లో నాకు రెండు విషయాలంటే ఎలాంటి వర్రీ లేదు. ఒకటోరకం నా కంట్రోల్ లో వున్నవి, రెండో రకం నేను కంట్రోల్ చేయలేనివి. అందుకని నేనెప్పుడూ సంతోషం గానే వుంటాను  – అని. ఎప్పటిలాగే మెలిస్సా “తంబ్స్-అప్” పంపించింది నన్ను మెచ్చుకుంటున్నట్టుగా.

    నిజమండీ – ఈ ప్రపంచం లో ఏ మనిషికైనా సంబంధించినంతవరకూ ఏ విషయాన్నైనా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు – మొదటి రకం అంతో ఇంతో ప్రయత్నించి తమ ఇష్టమైనట్టుగా మలుచుకోగలిగినవి, రెండో రకం ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేనివి. మన అదుపులో ఉన్నవాటి గురిచి అసలు ఆలోచించక్కర్లేదు – ఎందుకంటే వాటిని ఎలా సాధించుకోవాలో, అమలు పరచుకోవాలో మనకి తెలిసి వుంటుంది. అదే ఏ రకం గా చూసినా మన అదుపులో లేని వాటి గురించి ఎంత ఆలోచించినా ఏమీ చేయలేము. అలాంటి వాటిని గురించి ఆలోచించి ప్రయోజనం వుండదు కాబట్టి అంత పట్టించుకోకుండా వదిలేయగలిగితే హాయిగా వుంటుంది.

                          ఒక విద్యార్ధి  పరీక్షలు బాగా వ్రాయాలంటే బాగా చదివి పాఠ్య పుస్తకాలని అర్థం చేసుకోవడం, చదివిన దాన్ని గుర్తుంచుకుని పరీక్షల్లో వ్రాయడం వరకూ ఆ విద్యార్థి చేతుల్లో వుంటుంది. రోజుకి గంట మాత్రమే కష్టపడి అరవై  శాతం తెచ్చుకుంటాడా , లేకపోతే ఆరు గంటలు చదివి తొంభై శాతం తెచ్చుకుంటాడా అనేది ఆ విద్యార్థి తీసుకునే టైం మేనేజ్మెంట్ నిర్ణయాన్ని బట్టి వుంటుంది. కానీ ఒకసారి పరీక్ష వ్రాసి వచ్చాక ఫలితం ఆ దిద్దే వారి చేతుల్లో వుంటుంది. అందుచేత తన అదుపులో లేని ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకుండా తాను మాత్రమే చేయగల సాధన గురించి ఎక్కువ సమయం కేటాయించగలిగితే ప్రతీ విద్యార్థీ / విద్యార్థినీ తను అనుకున్నది సాధించగలరు.

                            మనమెక్కడికో వెళ్లాలని ప్రయాణమవుతాము. కావలసినవన్నీ సర్దుకుని ఏ బస్ స్టాండ్ కో, రైల్వే స్టేషన్ కో వెళ్తాము. తీరా అక్కడికి వెళ్ళాక ఆ బస్సో, రైలో అనుకున్న సమయానికి రాదు. అప్పుడు మన ముందున్నవి రెండు మార్గాలు – ఒకవేళ వెళ్ళవలసిన పని మరీ ముఖ్యమైనదైతే ఇంకేమైనా ప్రత్యామ్నాయం  – అంటే టాక్సీ లాంటిది ఏమైనా దొరుకుతుందా చూడడం, లేదా రావలసిన బస్సు / రైలు కోసం ఎదురు చూడడం. ఆ ఎదురుచూడడంలో కూడా ఏదో పుస్తకం చదువుకుంటూనో, లేక ప్రక్క ప్రయాణీకులతో మాట్లాడుతూనో మనకి నచ్చినట్టుగా కాలక్షేపం చేస్తూ ఎదురు చూడడంలో సమయం తెలియకుండా గడిచిపోతుంది. అలా కాకుండా ఇంకా రాని బస్సు / రైలు గురించి తిట్టుకుంటూ కూర్చుంటే ఒక పది నిముషాలు గడవడం కూడా దుర్భరం అవుతుంది. మనమెంత ప్రయత్నించినా తొందరగా తెప్పించలేని బస్సు/ రైలు గురించి అంత ఆలోచించకుండా మనకు అనుకోకుండా లభించిన ఆ అదనపు వేచి వుండే  సమయాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో ఆలోచిస్తే సద్వినియోగమవుతుంది.

                          కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయినట్టుగా వుంటారు. వేసవి లో “అబ్బబ్బా! వేడి భరించలేక పోతున్నాము. తొందరగా నవంబర్ / డిసెంబర్ వచ్చేస్తే బాగుండును. హాయిగా వుంటుంది చల్లగా” అనుకుంటారు. తీరా డిసెంబర్ నెలలో ” ఈ చలి కన్నా ఎంత ఎండా వున్నా భరించొచ్చు, బాబూ!” అనుకుంటూ వుంటారు.

కానీ తమ చేతుల్లో లేని వాతావరణ మార్పులని వదిలేసి ధరించే కాలానికి అనుగుణంగా ధరించే దుస్తుల్లో కొంచెం జాగ్రత్త తీసుకుని, వీలయినంతవరకూ పని వేళల్లో మార్పు చేసుకుంటే ఎవరి ఆనందం మీద, మనస్థితి మీద వారికి అదుపు ఉంటుందేమో కదా!

అసలండీ – అదే ఆ “అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు” సినిమా లో కథానాయకుడు పాడినట్టు:

మే నెల్లో ఎండ హాయి

ఆగస్ట్ లో వాన హాయి

జనవరిలో మంచు హాయి

హాయి గుంటే చాలునండీ

వేయి మాటలెందుకండీ …..

అని అనేసుకుంటే ఎంత హాయి కదండీ!

                                      విశ్వనాధ్ గారి  సినిమా చూస్తూ ” ఏంటో ఈయన చాదస్తం. ఈ రోజుల్లో ఇంకా ఈ సంగీతాలు, నాట్యాలు అంటే ఎవరు చూస్తారు?” అంటారు. అదే ఏ క్రొత్త దర్శకుడి సినిమానో  చూసి “అసలు ఈ సినిమాలు చూసే జనం చెడిపోతున్నారు” అని విసుక్కుంటారు. కానీ అసలు ఏ సినిమా చూడాలి అనేది తాము నిర్ణయించుకుని నచ్చినవే చూడగలిగేలా చేసుకోవడం తమ చేతుల్లో వుందని గ్రహిస్తే మన సంతోష కాల పరిమితి పెరుగుతుందేమో!

                                   నా వరకు నేను ఆలోచిస్తే ఈ వ్యాసం వ్రాయడం వరకే, టైపు చేయడం వరకే నా కంట్రోల్ లో వున్నట్టు. సాధ్యమైనంత వరకూ ఎవరి మనసునీ నొప్పించకుండా వ్రాద్దామనే మొదలుపెడతాను, అలాగే వ్రాశాననీ అనుకుంటాను. కానీ ఈ వ్యాసాన్ని అందరి చేతా చదివించడం, వాళ్ళ మెప్పు పొందడం అనేవి నాచేతుల్లో లేని విషయాలు.

                                               సారాంశం: వ్రాయడం వరకూ నా ప్రయత్నం బాగానే చేశాను (థింగ్ దట్ ఇస్ ఇన్ మై కంట్రోల్), చదివినవాళ్ళ భూషణ దూషణ తిరస్కారాలని నేను ఆమోదిస్తాను- ఎందుకంటే అది నా పరిధికి ఆవల వున్న విషయం కనుక (థింగ్ దట్ ఇస్ నాట్ ఇన్ మై కంట్రోల్), దాని గురించి ఆలోచించి నేను ఇంకో చోట ఉపయోగించుకోగలిగే సమయాన్ని వృధా చేయలేను కనుక.

నాకు చేతనయింది –

ఈ నూతన సంవత్సరం నేను ఆనందంగా వుండడం

మీరందరూ ఆనందం గా జరుపుకోవాలనుకోవడం –

 మీరు చేయగలగాలని నేను కోరుకునేది

మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడం

అందరూ సంతోషం గా వుండాలి అనుకోవడం –

2012 నూతన సంవత్సర శుభాకాంక్షలతో….

– లలితా TS

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

8 Responses to “నా” అదుపు – “న” అదుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో