అతడు(కవిత ) – రమేష్ కార్తీక్

ఒంటరితనంతో స్నేహం చేస్తూ
దాన్ని సంచిగా మార్చుకుని
భుజానికేసుకొని రోజు సంచరిస్తుంటాడు

దారి
ఏ తీరాన్నీ చేరుస్తుందో తేలిదు
అది ముళ్ళ బాటో
అది పూల బాటో తేలిదు

అరిగిపోయిన చెప్పులతో
ఆకాశంలోని మేఘాన్ని అనుసరిస్తూ
ప్రయానిస్తుంటాడు పసివాడిలా

రాలిన ఆకుల పై
తెగిపడ్డ పూరెమ్మల గొంతుకల పై
బొగ్గుతో తన అనుభుతుల్ని రాస్తూ
ప్రాంతం మారుతున్నా కొద్ది పిడికెడు మట్టి తీసి
ఒంటరితనపు సంచీలో వేసుకు మురిసిపోతుంటాడు
వెనుతిరగకుండా భవిష్యత్తును చూస్తూ అడుగులేస్తుంటాడు

రాత్రిపగలుకు మధ్య తేడాలు మర్చిపోయాడతడు
ఇప్పుడీ పాడు లోకంతో నాకేం పని అన్నట్లు
కనిపిస్తున్న ప్రతి కొత్త దారిలో
తనని తాను తొడుక్కుంటూ
ఙ్ఞాపకాల కుబుసాల్ని కాల్చేస్తూ నడుస్తున్నాడు

తనని స్వాగతిస్తున్న దారుల్ని కౌగిలించుకుంటూ
చెట్లతో పుట్టలతో కరచాలనం చేసుకుంటూ
జీవితాన్ని వెతుక్కుంటూ
మహాప్రస్థానం  చేస్తున్నాడు

– రమేష్ కార్తీక్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

కవితలు, , , Permalink

One Response to అతడు(కవిత ) – రమేష్ కార్తీక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో