‘ప్రపంచీకరణ నేపథ్యం లో తెలుగు రచయిత్రుల రచనల్లో వస్తున్న వస్తు వైవిధ్యం’-సాహిత్య సదస్సు

img_20161118_112708                                            సాహిత్య అకాడమీ మరియు  లేఖిని మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ”ప్రపంచీకరణ నేపథ్యం లో తెలుగు రచయిత్రుల రచనల్లో వస్తున్న వస్తు వైవిధ్యం” అన్న అంశం పై  నవంబర్ 18 న శ్రీ త్యాగరాయ గాన సభ చిక్కడ పల్లి లో నిర్వహించారు.ఈ కార్యక్రమo సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి ఎస్.పి. మహాలింగేశ్వర్ స్వాగతాన్ని పలికారు.లేఖిని అధ్యక్షురాలు వాసా ప్రభావతి పరిచయ ప్రసంగం చేసారు.సాహిత్య అకాడమీ సంచాలకులు ,తెలుగు సలహా మండలి. సభ్యుడు డా.ఎన్.గోపి ఈ కార్యక్రమానికి  అధ్యక్షుడు గా  ”రెండు తరాలకు నవలా రాణి ,యువకుల కలల రాణి” గా యద్దనపూడి పూడి సులోచనా రాణి  గారి సెక్రటరి ,అగ్నిపూలు రచనల్ని పరిచయం చేసారు.ముఖ్య అతిధి గా యద్దనపూడి సులోచనా రాణి గారు రచయిత్రులుగా రచనలు ఎందుకోసం రాస్తున్నారో గమనించాలన్నారు.ఇంకా అనేక విషయాలపై కథలు రాయాలని సూచించారు.తెలుగు సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు సి.మృణాలిని అద్భుతమైన కీలకోపన్యాసం ఇచ్చారు.ప్రపంచీకరణ నేపథ్యం వల్ల జరిగే అనర్థాలను తెలుపుతూ అనేక రచయిత్రులు రాసిన రచనలను తెలియజేశారు.

                                                         మొదటి సమావేశం లో ప్రముఖ రచయిత్రి శారదా అశోక వర్ధన్ అధ్యక్షులుగా           వ్యవహరించారు.రచయిత్రి మంథా భానుమతి గారు ‘నేడు పిల్లల పెంపకం ‘అన్న అంశం పై పత్రసమర్పణ చేసారు.ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు,రచయిత్రి ,img_20161118_112640అంతర్జాల తెలుగు సాహిత్యం పై పరిశోధన చేసిన పరిశోధకురాలు డా.పుట్ల హేమలత ‘అంతర్జాలం లో వస్తున్నరచనల తీరు తెన్నులు’ అన్న అంశం పై అంతర్జాల సాహిత్యం పై క్షుణ్ణంగా విశ్లేషణ చేసారు.

                                       రెండవ సమావేశం లో తరిమిశ జానకి అధ్యక్షతన భార్యా భర్తల అనుబoధం పై ,వివాహ వ్యవస్థ పై స్వాతి శ్రీ పాద ,వృద్ధుల జీవన విధానం పై కె .బి లక్ష్మి గారు పత్ర సమర్పణ చేసారు.ప్రముఖ రచయిత్రి  పొత్తూరి విజయ లక్ష్మి  సమాపనా ప్రసంగం తో కార్యక్రమం ముగిసింది .అనంతరం ‘కవితా సంధ్య’ కార్యక్రమంలో ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య కవిత ,ప్రసంగం కవితా ప్రియుల్ని ఆకట్టుకుంది .

                                                                                                            – పెరుమాళ్ళ రవికుమార్ 

————————————————————————————————————————–

సాహిత్య సమావేశాలు, , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో