సహ జీవనం 18 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

                                        “సుబ్బూ, నువ్వు గమనించావో లేదో, ఇప్పుడు చిన్న కుటుంబాలు ఏర్పడ్డాక తల్లి,దండ్రులతో, అన్నదమ్ములతో కన్నా, అత్త మామల వైపు వాళ్ళతోనే నేటి మగ పిల్లలకు అనుబంధం ఎక్కువగా ఉంటోంది. భార్య తన వైపు వారంటే ఎక్కువ మొగ్గు చూపిస్తుంది.అది సహజంగా జరిగేదే. వారి రాకపోకలు గానీ, మరొకటి గానీ మగవాడికి పెద్దగా ఇబ్బంది పెట్టేవిగా వుండవు. ఎందుకంటే, భార్య ఎక్కువ ప్రేమగా మసులుకునేది తన వైపు వాళ్ళతోనే కదా! అందువల్ల అతనికి అత్త గారింటి వైపు అనుబంధంలో పొరపొచ్చాలు వచ్చే అవకాశాలు తక్కువ. అదే తల్లిదండ్రులతో గానీ, అన్నదమ్ములతో గానీ, పరిస్థితి వేరుగా వుంటుంది. అందువల్ల, ఆడపిల్లలనే అనుకోవక్కర్లేదు. కొంత వరకు మగపిల్లలు కూడా ఈ పరిస్థితికి కారణం అవుతున్నారు.

                                      అంతే కాదు, ఆఫీసులోను, ఇంట్లోనూ సమర్ధించుకు రావడం ఈ కాలం మొగపిల్లలు చాలామందికి చేతకాదు. పిల్లలుపుట్టాక,ఎవరో ఒకరిమీద వాళ్ళు ఆధార పడక తప్పదు. ఇంట్లో వాళ్ళో, బయటి వాళ్ళో, వాళ్ళు చెప్పినట్లు వినే వాళ్ళు వాళ్లకు కావాలి. ఇదీ నేటి తంతు. ఇందులో స్వార్ధం వుంది. అవసరమూ వుంది. అయితే కొంత మంది అబ్బాయిలు నా తల్లిదండ్రుల బాధ్యత నాదే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నా దగ్గరే వుండాలి అనుకోవచ్చు. అలాంటి వాళ్ళూ లేకపోలేదు.అప్పుడు కూడా పొరపొచ్చాలు రావనేమీ లేదు” వివరించాడు ప్రసాదం.

                                    “ఏమో ప్రసాదం, ఈ పిల్లల్ని కన్నది ఇందుకేనా? మనం మన తల్లిదండ్రులతో ఇలాగే వున్నామా?ఆలోచిస్తే బాధగా వుంది.”

                               “చూడు, కాలం మారుతోంది. ఎవరు ఎలా ఉన్నారు, ఎందుకలాఅన్నారు? అని ఆలోచించి బుర్ర పాడుచేసుకోవడం కన్నా, పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి. మన జీవన విధానం మార్చుకోవాలి. ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోబోకు” అనునయించాడు ప్రసాదం.

                                  “నువ్వెప్పుడూ ఇంతే! ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటావు. నేనేమో మరీ ఆలోచించి,ఆలోచించి వర్రీ అవుతుంటాను” అన్నాడు సుబ్రహ్మణ్యం.

                            ప్రసాదం నవ్వేశాడు “ అమ్మయ్య, ఇప్పటికి కాస్త దోవలోకి వచ్చావు. మనం విచారిస్తూ కూర్చున్నందువల్ల పరిస్థితులేమీ మారవు, అనవసరంగా మన మనసు పాడుచేసుకోవడం తప్ప. పద, భోజనం చేద్దువుగాని, ఎంత సయిస్తే అంతే తిను” బలవంతాన లేవదీశాడు సుబ్రహ్మణ్యాన్ని.

                                        “రా అక్కా, రండి బావా, చాలా కాలానికి వచ్చారు” తలుపు తీసి లోపలి ఆహ్వానించాడు ప్రసాదం.

సరస్వతి వెంటనే లేచి ప్రసాదం పక్కకు వచ్చి నిలబడింది.

                        “మంచి నీళ్ళు కావాలా వొదినా, అన్నయ్య గారు మీకూ?” అంటూ అడుగుతూనే రెండు గ్లాసులతో మంచి నీళ్ళు తీసుకు వచ్చింది.మంచి నీళ్ళు తాగి ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు.

                           “ఎండ బాగా వుందిరా ప్రకాశం” మోహనరావు రుమాలుతో నుదుట పట్టిన చెమట తుడుచుకున్నాడు.
                           “ఇలా ఫాను కింద కూర్చో బావా” చెప్పాడు.

                            “ఏమిటమ్మా, ఎలా వున్నావు? పిల్లలెలా ఉన్నార్రా?” సరస్వతిని పలకరిస్తూ అడిగింది సావిత్రి.

                    “నీకు తెలియంది ఏముంది అక్కా, వాడు ఇటు తొంగి చూడడు. ఉష దానికి వీలున్నప్పుడు వచ్చి పోతుంటుంది. ఇద్దరూ బాగానే వున్నారు”చెప్పాడు ప్రకాశం.

                  “నేను వంట చేసి పిలుస్తాను. అందాకా మీరు మాట్లాడుతూ కూర్చోండి. అన్నట్లు స్నానాలు చేస్తారేమో, బాత్రూంలో గీజరు ఆన్ చేసి వస్తాను” లేచింది సరస్వతి.

-టి.వి.యస్.రామానుజ రావ

—————————————————————————————————————————–

ధారావాహికలుPermalink

One Response to సహ జీవనం 18 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో