జోగిని(ధారావాహిక ) – శాంతి ప్రబోధ

                                     ఆమె మనసు పడిన వాడితో పెళ్ళి చేద్దామంటే… ఈ పిల్లకు పెళ్ళి వయసే రాలేదాయే. ఆలాగే పద్నాలుగేళ్ళకే పెళ్ళి చేసినా, ఆ సలీమ్‌ ఈమెకు జీవితాంతం తోడు నీడగా ఉంటాడన్న నమ్మకం ఏమి? అలాగని అలాగే ఒదిలేస్తే ఆ పిల్ల బతుకిేం? ఎంత స్వార్థపరులు ఈ తల్లిదండ్రులు! జోగినిగా చేసినట్లే… ఈ పిల్లను జోగు విడువకుండానే… ఆమె జీవితాన్ని ఫణంగా పెడ్తున్నారు ఆమె జీవితంతో ఆడుకుంటున్నారు.
                                      జోగినీ చేయకూడదని చట్టం వచ్చిన తర్వాత స్వార్థపరులైన తల్లిదండ్రులు తమ ఆడపిల్ల జీవితాల్ని ఈ విధంగా నాశనం చేస్తున్నారన్నమాట అనుకుని బెంగపడిపోయింది పోశవ్వ. తనేం చేయాలి ఇప్పుడు….? మళ్ళీ తనను తాను ప్రశ్నించుకుంది. పోలీసులకు ఒప్పచెప్తే…? వయసు వస్తూన్న ఈ చిన్నదాన్ని వాళ్ళు వదులుతారా…? అని ఆ వెంటనే సందేహం.
                                             సరే తనతో తీసికెళ్ళి తన కూతురు సబితతో పాటే ఉంచుకుంటే…?తమ పిల్లని కిడ్నాప్‌ చేశారంటూ ఆమె తల్లిదండ్రులు తనమీదకు వస్తారేమో…ఎన్నెన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు.అలా  అని కాపాడమంటూ, కాళ్ళకు చుట్టుకుపోయిన ఆమెని ఇట్లా వదిలి వెళ్ళగలదా….? అది మానవత్వం అవుతుందా… అంటూ మరెన్నో ప్రశ్నలు.సరే, ఏమైతే అయిందని ఆ అమ్మాయిని తనతో జీప్‌ ఎక్కించుకుంది. ఆ ఆమ్మాయితో పోలీస్‌ కంప్లయింట్ ఇప్పించడానికి తీసుకెళ్ళింది. విషయం చెప్పింది.కంప్లయింట్  రాయించింది.
                                       ”ఇలాoటి  చిన్న చిన్న విషయాలు కూడా మేం పట్టించుకోవాలా…? మాకు ఏం పని లేదనుకుంటున్నారా. మాకున్న కేసులతోనే సతమతమవుతున్నాం. ఏవో కుటుంబ సమస్యల్ని కుటుంబంలో తేల్చుకోక పోలీసు స్టేషన్‌ దాకా వస్తే ఎలా మేడం!” అన్నాడు ఎస్‌.ఐ. మూర్తి”మీకిది చిన్న సమస్య కావచ్చు. అసలే సమస్యగా కూడా కన్పించక పోవచ్చు కానీ ఆ అమ్మాయికిది జీవన్మరణ సమస్య” కంప్లయింట్ తీసుకొమ్మని కోరింది. పోశవ్వ పట్టుపట్టింది . కాబట్టి  మొక్కుబడి చల్లార్చడం కోసమన్నట్లుగా తీసుకున్నాడు.                                                    

                                          ఎస్‌.ఐ. కానీ, దాని ఫలితం కన్పించకపోవడంతో మూడవరోజు ఆ అమ్మాయిని తీసుకుని పోశవ్వ మళ్ళీ పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళింది. ఆమెను చూసి విసుక్కున్నారు. పోలీసులు అంతకు ముందురోజే నారయ్య అనబడే నారాగౌడ్‌ నుండి డబ్బు దండుకున్నారు. ” కాబట్టి  మాకు అన్యాయం జరుగుతోంది. న్యాయం చేయండి. అనాగరికంగా ప్రవర్తిస్తున్న వారిని శిక్షించండి అంటే మీకు స్పందనే లేదేమి? అంటూ వారిని నిలదీసింది. ”ఇదే కష్టం మీ అక్కకో, చెల్లెకో వస్తే ఇలాగే ప్రవర్తిస్తారా” అంటూ ప్రశ్నించింది.” ఈ రోజు ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని పిలిపించక పోతే ఎస్పీగారి దగ్గరకు వెళ్ళాల్సివస్తుంది. నారాగౌడ్‌ ద్వారా మీకెంత ముట్టిందో  అంతా వెల్లడించాల్సి వస్తుంది” అంటూ బెదిరించింది.
                                   ”ఏం …మమ్మల్నే బెదిరిస్తున్నావా..? పనిపాట లేనట్లు తగుదునమ్మా అని రోడ్డెక్కింది కాక మా మీదే కంప్లయింట్ చేస్తావా… చేస్కోవే… నీయమ్మ… నక్సలైట్  అని బొక్కలిరగదన్ని బొక్కలో వేస్తేగానీ నీ అటువిందానికి బుద్దిరాదే” అంటూ ఆమెను కులం పేరుతోనూ, స్త్రీ అన్న చిన్న చూపుతోను ఇష్టం వచ్చినట్లు బండ బూతులు ఉపయోగిస్తూ తిట్టాడు .అందుకామె అతని లాగే రెచ్చిపోలేదు. మారు మాట్లాడకుండా బయటికెళ్ళి ఎస్‌.ఐ. మీద కంప్లయింట్  రాసి కాపీ టు ఎస్పీ అని ఇచ్చింది.
                                   అది చూసి గాభరా పడ్డారు. పోశవ్వ అన్నంత పనీ చేస్తుందని కొత్తగా వచ్చిన ఎస్సైకి మిగతా వారికి తెల్సు. కొత్త ఎస్సై    వి షయాలేమీ తెలియక ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. అది గుర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఎస్సై దగ్గరకెళ్ళి ఆమెతో చాలా జాగ్రత్తగా డీల్‌ చేయాలనీ, అందరితో ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తే ఆమె ఊరుకోదని గుసగుసగా నచ్చజెప్పబోయాడు.
ఏమనుకున్నారో గానీ ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని ఆమె ప్రేమించిన అబ్బాయిని అతని తల్లిదండ్రుల్ని పిలిపించారు. కన్న కూతురిని వ్యభిచారిగా మార్చాలనుకుంటే జైల్లో పడేస్తామని హెచ్చరించారు. ఆ అమ్మాయి ముస్లింగా మారితే తమ కోడలిగా చేసుకోవడానికి తమకేం అభ్యంతరం లేదన్నాడు సలీమ్‌ తండ్రి జబ్బార్‌

– శాంతి ప్రబోధ

————————————————————————————————————————————

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో