సహ జీవనం 16 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

“ఈ కాలం పిల్లలు తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఈ ముసలాళ్ళతో అనవసరం అనుకుంటున్నారు. వాడు బహుశా నా మీద నీకు కూడా ఏదో చెప్పి ఉండవచ్చు. తాము చేసిన పనిని సమర్ధించుకోవడం సహజం గదా. మీ చెల్లెలు నేనెంత చెబితే అంతే తప్ప, ఎన్నడూ నోరెత్త లేదు. అది ఉన్నన్నాళ్ళు అన్నీ సమర్ధించుకుంటూ పోయింది. ఉమ్మడి కాపురంలో ఎన్ని కష్టాలు పడిందో ఏనాడు నాతో కూడా చెప్పుకోలేదు. ఇవాళ ఆడపిల్లలు, పెళ్ళైన దగ్గరనుంచే మొగుడి చేత వేరు కాపరం పెట్టించేస్తున్నారు. మనం సంపాదించిన ఆస్థులు, మనకు పుట్టిన ఆ మగాడు, మొగుడు మాత్రమే కావాలి గానీ, వాడిని కన్న వాళ్ళం మనం అక్కర్లేదు. ఈ పిల్లలే మన లోకమని జీవితమంతా వాళ్ళ కోసమే బతుకుతాం. పెద్ద వయసు వచ్చే సరికి వాళ్ళు మనల్ని మన ఖర్మకు వదిలేసి పోతారు, ఇదీ ఒక అనుభవమే! కానీ, ఏది ఎలా జరగాలో ఆ పై వాడు రాసిపెట్టే ఉంటాడు. సరే, నా విషయం వదిలెయ్యి. నువ్వెలా వున్నావు? అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు? రత్నం చనిపోయి అప్పుడే సంవత్సరం దాటి పొయినట్లుంది. అప్పుడు నేను రాలేకపోయాను రా” బావ మాటలో బాధ తొంగి చూసింది.

“నేను వచ్చి రెండు నెలలైంది.ఇప్పుడిప్పుడే వంటరి తనానికి అలవాటు పడుతున్నాను. మొన్ననీ మధ్య మీ తమ్ముడు, సుందరం కనబడి చెప్పే దాకా నాకు నీ సంగతి తెలియ లేదు. ” అని, “అవునూ, ఇల్లు నీ పేరు మీద వుంది గదా, నువ్వెందుకు వచ్చేశావు? వాళ్ళనే పోమ్మనబోయావా?”కోపంగా అడిగాడు.

బావ నవ్వాడు. అటువంటి పరిస్థితులలో కూడా ఆయనకు నవ్వేలా వస్తోందో అర్ధం కాలేదు. ఏం మాట్లాడ లేక ఆయన వంకే చూస్తూ ఉండిపోయాడు సుబ్రహ్మణ్యం.

“ఇల్లు వాడి పేర రాసేసి చాలా కాలమయ్యిందిరా. అయినా నాకేం తక్కువ? నా పెన్షన్ నాకు వస్తుంది. ఇది చాలు నాకు. ఇల్లు లేకపోతే, పిల్లాజేల్లాతో వాళ్ళు అవస్థలు పడతారు. ఎప్పటికైనా వాడి కిచ్చేదే గదా. నాకెందుకు ఇల్లు?” ఈ ప్రపంచమంతా నా ఇల్లే అన్నట్లు బావ నవ్వాడు.

“బావా, నాతో పాటు వచ్చెయ్యి. ఒకరికొకరు తోడుగా, ఇద్దరమూ కలిసి ఉందాం. నా చెల్లెలు లేకపోయినా, నేనున్నాను” సుబ్రహ్మణ్యం గొంతు వణికింది.

ఆప్యాయంగా సుబ్రహ్మణ్యం చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు “నేనంటే నీకు ప్రాణం అని తెలుసురా. నాకే కష్టం వచ్చినా నువ్వు తట్టుకోలేవనీ తెలుసు. అందుకే నీకు ఈ విషయం చెప్పలేదు. మరేం పర్వా లేదు, ఇక్కడ బాగానే వుంది. ఏ రోజు ఉండలేననిపిస్తే, ఆ రోజే బయల్దేరి నీ దగ్గరకు వచ్చేస్తాను.”

బావ ఒక మాట అంటే తేడా ఉండదని తెలుసు.

బావ దగ్గర సెలవు తీసుకుని బస్టాండుకు బయల్దేరాడు సుబ్రహ్మణ్యం. ఒక్క క్షణం మేనల్లుడి ఇంటికి వెళ్ళి తండ్రిని అలా హోమ్ లో పెట్టినందుకు దులిపివేద్దామాని అనిపించింది. కానీ, ఎందుకో అతని ఇంటికి మళ్ళీ వెళ్ళాలనిపించ లేదు. సరాసరి బస్టాండుకు వచ్చేసి బస్సెక్కాడు.

ఇంటికి రాగానే సోఫాలో జారగిలబడి కూర్చున్నాడు. మనసంతా దిగులుగా వుంది. రత్నం పోయిన బాధకు ఇది మరింత తోడైనట్లుంది. తలుపు తెరుచుకున్న చప్పుడుకి కళ్ళు తెరిచి చూశాడు. ప్రసాదం, సరస్వతి లోపలికి వచ్చారు.

-టి.వి.యస్.రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో