జోగిని(ధారావాహిక ) – శాంతి ప్రబోధ

                             మహిళా రిజర్వేషన్‌ పోశవ్వ మరో మెట్టు పైకి ఎక్కడానికి మార్గం సుగమం చేసింది. సర్పంచ్‌గా పదవీకాలం మరీ సంవత్సరంన్నర మాత్రమే ఉండడం వల్లనో, మండల ప్రెసిడెంట్ గా  ఎన్నికయ్యే అవకాశం తనకే ఎక్కువగా ఉండడం వల్లనో, అధికారం రుచి తెలియడం వల్లనో, ప్రజాసేవే లక్ష్యంతోనో కానీ ఈ సారి పోశవ్వ నిలబడడానికి ఎలాoటి  అభ్యంతరం తెలపలేదు. అయితే ఎన్నికలంటే మాటలా..? తన దగ్గర డబ్బులేదు. కానీ ప్రజాబలం ఉంది అదే నమ్మకంతోనే ఎన్నికల బరిలో దిగింది.                                                                                                                                                                      మండల ప్రాదేశిక అభ్యర్థిగా పోటీలో నిలబడింది. తన గ్రామమంతా తిరిగింది. ప్రతి ఇంటికీ వెళ్ళింది. తనవాళ్ళతో ”నా దగ్గర డబ్బులేదు. కానీ నేను చేసిన అభివృద్ధి పనులు మీరంతా గమనిస్తున్నారు. ఈ మూడున్నర ఏళ్ళలో ఏం చేశానో, ఏం సాధించానో చెప్పి, నా గురించి నేను గొప్పలు చెప్పుకోను. నేను చేసింది మీ కందరికీ తెల్సు. నా మీద నమ్మకం ఉంటే నన్ను గెల్పించి మండలానికి పంపండి. లేదంటే నా పదవీకాలం పూర్తయ్యే వరకూ గ్రామ సర్పంచ్‌గానే ఉంటాను. గ్రామ అభివృద్ధికే పరిమితమౌతాను.” అని చెప్పింది.

                                    ప్రజలు ఆమెకు హారతులు ఇచ్చి బొట్టు పెట్టకపోయినా సానుకూలంగా స్పందిస్తున్నారు. పోశవ్వకు ప్రత్యర్ధిగా ఎవరూ నిలబడేవాళ్ళు కన్పించకపోవడంతో మాలవాళ్ళ ఓట్లు చీల్చాలని మాల కుటుంబానికి చెందిన సక్కుబాయిని బలవంతంగా బరిలోకి దింపాడు రాజాగౌడ్‌. అయితే ఎన్నిక రెండు రోజులుందనగా తనకు తాను ఎన్నిక నుండి ఉపసంహరించుకుంటున్నట్లుగా సక్కుబాయి ప్రకటిoచడంతో  పోశవ్వ ఏమాత్రం కష్టం లేకుండా ఎన్నికైంది.

                               16 మండల ప్రాదేశిక స్థానాలున్న ఎల్లారెడ్డి మండలంలో అధికార పక్షం 8, విపక్షాలు 7, స్వతంత్ర అభ్యర్థి ఒకటి  గెలుచుకున్నారు. ప్రతి పక్షం నుండి పోటీ  చేసిన ఎస్‌.సి. మహిళా అభ్యర్ధులెవరూ గెలవలేదు. దాంతో పోశవ్వ ఎంపిక మరింత సులువు అయింది. పోశవ్వ సూటిగా, కొన్ని సార్లు మొండిగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తుందనీ, చిన్నాపెద్ద అంతరాలు చూడకుండా మాట్లాడుతుందని  కొందరు ఆమె అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించారు.

                                      సర్పంచ్‌గా పోశవ్వకున్న అనుభవం, ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గమనించిన జిల్లా మంత్రి ఆశీస్సులు, ఎల్లారెడ్డి మాజీ మండల అధ్యక్షుడు దేశ్‌ముఖ్‌ ఆశీస్సులు, పోశవ్వకు అందడంతో సర్పంచ్‌ పోశవ్వ మండల అధ్యక్షురాలు పోశవ్వగా ఎంపికైంది. ఈ కొత్త స్థానంలో తన పదవీ బాధ్యతల నిర్వహణలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సమర్ధవంతంగా తన బాధ్యత తాను నిర్వహించాలనుకుంది.  

                                    పుట్టినప్పటి  నుండి పడిన శారీరక, మానసిక హింసలకంటే ఇవేం పెద్దవి కావు కదా…! అనుకుంది. ఆశ్రిత పక్షపాతానికి, అన్యాయాలకు, అక్రమాలకు తావివ్వకుండా తనకు సాధ్యమయినంత వరకూ మండల అభివృధ్ధికి కృషి చేయాలనుకుంది. దృఢ నిశ్చయంతో ఉంది. అవసరాలను అర్థం చేసుకోవడంలోనూ, వాటి  ప్రాధాన్యతను గుర్తించడంలోనూ, పనిలో ఇబ్బంది కల్గించే స్త్రీ వివక్ష, కుల సమస్యల్ని అర్థం చేసుకోవడానికి గతంలో ఇచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగపడింది.                                      

                        ప్రభుత్వ, ప్రభుత్వేతర అధికారులతో, స్థానిక ప్రజలతో కలిసి పనిచేయడానికి మంచి ఆత్మస్థైర్యాన్నిచ్చింది అనుకున్న పోశవ్వకు గతంలో మండల సమావేశాల్లో కల్సిన మహిళల అనుభవాలు గుర్తొచ్చాయి. ”అచ్చంపేట సర్పంచి లక్ష్మమ్మ పెద్ద కులంలోనే పుట్టింది. డబ్బున్న ఇంటి  కోడలైంది. సర్పంచుగా తన పని ఆమె ఎప్పుడూ చేయదు. చేద్దామన్నా ఆమె భర్త ఒప్పుకోడు. అతనే సర్పంచుగా వ్యవహరిస్తున్నాడు. ఆమె ఏమన్నా మాట్లా డదామన్నా  నీకేం తెల్సు నువు నోర్మూసుకో అంటాడు, అని చెప్పి పోశవ్వని అభినందించింది. పోశవ్వలాగా చేయలేక పోతున్నందుకు మనసులో కొంత బాధ ఆమెలో, మళ్ళీ అంతలోనే ఈ నాలుగురోజుల ముచ్చట గురించి జీవితాంతం కలిసి ఉండాల్సిన మొగుడితో గొడవ ఎందుకులే అని అన్నీ అతనికే వదిలేశానంటుంది.  

                                           రాంపూర్‌కి చెందిన మహిళా సర్పంచ్‌నయితే ఏ మీటిoగ్‌లోనూ చూడలేదు. ఆమె మామనే వచ్చి మీటిoగ్‌లో కూర్చుoటాడు. అతన్నే సర్పంచ్‌ అంటారంతా. పేరు మాత్రమే ఆమెది. ఇలా తనకు తెలియని వాళ్ళు ఎందరో… ఏమీ ధైర్యంగా మాట్లాడలేరు. తమ గ్రామ సమస్యలు చెప్పలేరు. ఎందుకిలా జరుగుతోంది…? ఆడవాళ్ళు రాజకీయాల్లో ఎదగకూడదనా…? ధైర్యంగా ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి కోసం పని చేస్తున్న వాళ్ళకెందుకు కావాలని సమస్యలు సృష్టిస్తున్నారు….? ఏదేమైనా మండలంలో అడుగు పెట్టడంతో తన బాధ్యత ఇంకా చాలా పెరిగింది. మహిళా సభ్యురాళ్ళంతా తమ గొంతు వినిపించేలా చేయగలగాలి. అది తనకు సాధ్యమా..? ఎన్నో రకాల ఆలోచనల మధ్య, సంఘర్షణల మధ్య పోశవ్వ మండల ప్రెసిడెంట్  సీట్లో  కూర్చొంది ఒక రకమైన ఉద్వేగంతో.

                              – శాంతి ప్రబోధ

————————————————————————————————————————————-

ధారావాహికలు, , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో