జ్ఞాపకం-6 – ధారావాహిక )-అంగులూరి అంజనీదేవి

                                   తెలుగును ఇష్టపడేవాళ్లంటే ఎక్కడలేని మక్కువ చూపించే భరద్వాజ జయంత్‌ అలా అడగడంతో సంబరంగా అన్పించి ‘‘ ‘వెన్నెల్లో పడవ ప్రయాణం చేస్తూ అప్పుడే వికసించిన మల్లెను వాసన చూసినప్పుడు కలిగే అనుభూతి తెలుగుభాష వింటున్నప్పుడు కలుగుతుంది’ అని అన్నాడట… ఎంత ఆహ్లాదంగా అన్పించే పోలికో చూడు…’’ అన్నాడు.
అవునన్నట్లు తలవూపాడు జయంత్‌.
                              ‘‘ అంతే కాదు జయంత్‌! మనలోని ఆలోచనలు  బయటికి రావాంటే భాషకావాలి. నేను నేర్పిన తెలుగు భాష నీ స్నేహితుడు తిలక్‌ చెల్లి  సంలేఖకి ఇప్పుడు బాగా ఉపయోగపడిoది. నేను నేర్పాను అనే కన్నా సంలేఖకు తెలుగు అక్షరాల  పట్ల వున్న ఆపేక్ష, మమకారం మనసు పెట్టి నేర్చుకునేలా చేశాయి. ఆ అక్షరాతోనే ఇప్పుడు తనలో వున్న దివ్యశక్తిని తట్టి లేపుకుని ఈ మధ్యన చక్కటి కథలు రాస్తోంది. అద్భుతంగా వున్నాయి.
                             ఆ కథలు  చదివి నా అభిప్రాయం చెప్పినప్పుడు ‘మీరు నేర్పిన అక్షరాలు  తప్ప నా దగ్గర ఏముంది మాష్టారు! ఆ అక్షరాలే కదా నన్ను లైబ్రరీ వైపు నడిపించింది. నా చేత దిన, వార పత్రికనే కాక మహాభారత, రామాయణ, భాగవతాలను చదివించింది. నేను మానసికంగా కోలుకోలేని స్థితిలోకి వెళ్లినప్పుడు కూడా నన్ను నేను ఓదార్చుకునేలా చేసింది. రెండు సంవత్సరాలు  కాలేజీకి పోకుండా నేను గడిపిన కాలమంతా పుస్తకాలతోనే కదా ! అసలు  మీరు నేర్పిన ఆ అక్షరాలే లేకుంటే నేనేమైపోయేదాన్నో.! నాకు తెలుసు మాష్టారు తెలుగు నేర్పి మీరు నాకెంత మేలు  చేసారో.! అసలు  ఆ అక్షరాలు  లేకుండా, పుస్తకాలు  లేకుండా ఒక్క క్షణం కూడా నన్ను నేను వూహించుకోలేక పోతున్నాను.’ అంది కృతజ్ఞతగా.                                     అయినా నాదేముంది జయంత్‌! ఆడ పిల్ల  అని తేడా చూపించకుండా ఆమె తండ్రి ఆమెకు నాలుగు అక్షరాలు  నేర్పుకోవాలనుకున్నాడు. నా చేత నేర్పించాడు. అంతే! ఆమె తన చదువు పట్ల ఎందుకు మనసు పెట్టలేక పోయిందో నాకు తెలియదు కాని ఒక మంచి పేరున్న పత్రికలో ప్రచురణ అయ్యే స్థాయిలో కథలు  రాయగలిగినందుకు రాఘవరాయుడు గారు సంతోషపడ్డారు.  

                                ఆమె కథలు  వచ్చిన పత్రికను పట్టుకెళ్లి పొలంలో వుండే పని వాళ్లందరికి చూపించుకుని, ‘మా అమ్మాయి రచయిత్రి’ అయిందని చెప్పుకుంటుంటాడు. ప్రతి మట్టిచేయి ఆమె కథను పలకరించేలా చేసుకున్నాడు. ఇప్పటికీ ఎవరు ఎదురౖౖెనా ఆపి మరీ చెప్పుకుంటాడు. వినే వాళ్లకి కథలు  చదివే స్థాయి వుందా ! వాటి గురించి అసలు  తెలుసా అన్నది చూడడు. ఆయన సంతోషం ఆయనది.

                                నిజానికి ఆయనకు    కూడా కథంటే ఏమిటో తెలియదు. ఎలా రాస్తారో తెలియదు. పొలంలో నాగలితో మట్టినితోడి తనెలా పంట పండిస్తున్నాడో తన కూతురు కూడా ఆమె కలంతో ఏదో రాసి అద్భుతం చేస్తుందని మాత్రం తెలుసు. అందుకే అంత సంబరం. ఆయనలోని ఆ పితృవాత్సల్యం చూస్తుంటే ముచ్చటేస్తుంది’’ అని భరద్వాజ అంటుంటే ఆ ఊరి రామాల యం వచ్చింది.
                                  జయంత్‌ అడుగులు  ఆ రామాలయం ముందు ఎంతో పరిచయం వున్నట్లు ఆగిపోయాయి. తనూ, సంలేఖ ఇదే ఆదిపురికి 35 కిలోమీటర్ల దూరంలో వున్న సిటీలో మంచి పేరున్న కాలేజీలో సి.ఎ. ఫౌండేషన్‌ తీసుకున్నప్పటి రోజులు  గుర్తొచ్చాయి. సంలేఖ శ్రీరామ నవమి వచ్చిందంటే హాస్టల్లో వుండేది కాదు. ‘మా ఆదిపురికి వెళ్తున్నా జయంత్‌! అక్కడ మా ఊరి రామాలయంలో శ్రీరామ నవమి రోజు కళ్యాణ మహోత్సవం కన్నుల  పండుగలా జరుగుతుంది.
                                   ఒక పూజారి పూజ చేస్తుంటే ఇంకో పూజారి రాముని పట్టాభిషేకం గురించి, తండ్రి మాట జవదాటని శ్రీరాముని ప్రవర్తన గురించి చక్కగా చెబుతారు. అది ప్రతి సంవత్సరం వింటున్నా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్తగానే ఉంటుంది. తన్మయత్వంతో వినాలనిపిస్తుంది. అది వింటుంటే తల్లిదండ్రుల  పట్ల పిల్లలు  ఎలాంటి భావంతో వుండాలో, ఎలా గౌరవించాలో స్పష్టంగా తెలిసిపోతుంది.
                                     మా ఊరి పెద్దలు  ఆ కల్యాణాన్ని  చూడటానికి వచ్చిన వాళ్లందరికి భోజనాలు పెడతారు. ఆ గుడిలో భోజనం తింటుంటే అది దేవుని ప్రసాదంలా వుంటుంది. నీకింకో విషయం చెప్పనా! ఆ గుడిలో ప్రవేశద్వారం చాలా పెద్దగా వుంటుంది. మేము చిన్నగా వున్నప్పుడైతే చెరువు దగ్గర ఇసుకలో స్కూల్‌ బ్యాగుల్ని పెట్టి ఆ గుడిలోకి వెళ్లేవాళ్లం. ఆ గుడికి ఎదురుగా వున్న చిన్న చిన్న చెట్లల్లో వినాయకుని రాతి విగ్రహం వుండేది. ఆ చెట్ల కొమ్మల్ని ఆకుల్ని తొలగించుకుని వెళ్లి మా బాక్సుల్లో తినటానికి తెచ్చుకున్న దాంట్లో కొంచెం తీసి వినాయకునికి పెట్టేవాళ్లం. చుట్టూ తిరిగి ఆడుకునేవాళ్లం. పక్కనే హనుమాన్‌ గుడి వుంటుంది. ఆ గుడి చుట్టూ తిరిగి మొక్కుకొని అతి ఇష్టంగా హనుమంతుని బొట్టు పెట్టుకునేవాళ్లం. చెట్లలో వుండే వినాయకునికి ఇప్పుడు గుడి కట్టారు తెలుసా! చాలా బావుంటుంది.’ అని చెప్పేది.

-అంగులూరి అంజనీదేవి

————————————————————————————————————————————

జ్ఞాపకం, ధారావాహికలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో