సహ జీవనం 12 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

టి.వి.యస్ .రామానుజరావు

తిరుపతిలో ప్రస్తుతం తానున్న ఇల్లు సరిపోతుంది. అయితే ఉషను చూసుకోవడానికి ఒకరు ఇంట్లో వుండడం అవసరం. అక్క సావిత్రి ప్రస్తుతం తిరుపతిలోనే వుంది. బావ గారు మోహనరావు రెండో కొడుకు దగ్గర వున్నారు. ఆ మేనల్లుడు అమెరికాలో ఏదో సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. వాడికొక ఆడ పిల్ల. మొన్ననీ మధ్యే రెండవ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పురుటికొచ్చి ఆరునెలలు వుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మరొక ఆరునెలలు వెళ్ళి వున్నారు. ఈ లోగా పెద్ద మేనల్లుడు తన భార్యకు బాగా లేదని, రమ్మని తల్లిదండ్రులకు ఫోను చెయ్యడంతో ఇద్దరూ వచ్చేశారు. మళ్ళీ రెండో వాడి ఫోను. తల్లిని పంపలేనని పెద్దవాడి వాదన ! తల్లిదండ్రులలో ఎవరో ఒకరు రావాలని, తన అత్తమామలు మొన్నటిదాకా వుండి వెళ్ళారని అతగాడు గట్టిగా చెప్పడంతో, బావగారు బయల్దేరి రెండో కొడుకు దగ్గరికి వెళ్ళారు. అమెరికా వెళ్ళేముందు ప్రసాదం ఫోను చేసి బావగారిని పలకరించాడు. పిల్లల అవసరమై పిలుస్తున్నారు తప్పప్రేమతో కాదనీ, తల్లిదండ్రుల వయసు, ఒపికలు కానీ, వాళ్ళ వీలూ చాలూ కానీ, కొడుకులు ఆలోచించడం లేదనీ, కేవలం జీతం లేని పనివాళ్ళు, కాపలాదార్లుగా తయారయ్యామని ఆయన ప్రసాదంతో చెప్పుకుని బాధపడ్డాడు.
అందువల్ల ప్రసాదం సందేహిస్తూనే, మేనల్లుడి ఇంటికి వెళ్లి అతనితో తన పరిస్థితి అంతా వివరించాడు.

అక్కను తనతో పంపమని, ఒక వారం రోజులు ఉష ఇంట్లో అలవాటు పడే దాకా, ఉంటే చాలనీ, తర్వాత తనే వచ్చి దిగాబెడతాననీ చెప్పాడు. ఇంట్లో వంట మనిషి వుంది కనుక ఆవిడ ఏమీ చేయాల్సిన పని లేదనీ, కేవలం ఉషకు తోడుగా వుంటే చాలనీ చెప్పాడు. మేనల్లుడు సున్నితంగానే తిరస్కరించాడు. తను, తన భార్యా ఇద్దరూ ఉద్యోగస్తులు. ఇద్దరూ పొద్దున్నే ఆఫీసులకు వెళ్ళిపోవాలి. పిల్లలు స్కూళ్ళ నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి వాళ్ళ సంగతి చూసేందుకు తల్లి ఇంట్లో ఉండాలి. అందువల్ల పంపలేనని చెప్పాడు. నిజానికి అతని పిల్లలిద్దరూ పెద్ద వాళ్ళే. అక్క మీద ఆధారపడే అంత చిన్న పిల్లలు కారు. మేనల్లుడి భార్యకు అత్తగారి వైపు వాళ్ళంటే అసలు గిట్టదు. ప్రసాదం వచ్చినప్పుడే ఏదో పని మీద వచ్చాడని గ్రహించి, ముందే భర్తకు జాగ్రతలు చెప్పిందామె. ఆమె సంగతి తెలిసిన ప్రసాదం,అంతకు మునుపు కూడా అక్కను చూడడానికి ఎప్పుడో తప్ప, వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు తప్పని సరి పరిస్థితుల్లో, మేనల్లుడిని అడగాల్సి వచ్చింది. అతను కుదరదని తెగేసి చెప్పడంతో, ఉష లేచి తిరిగే దాకా ఇంట్లో ఉండమని వంటావిడనే అడిగాడు. మొదట్లో సణిగినా, మరో అయిదు వేలు ఎక్కువ ఇస్తాననడంతో ఆమె వోప్పుకుంది.

పొద్దున్నే ఒక ఫిజియోతెరఫీ డాక్టరు వచ్చి, ఉషకు ఎక్సర్సైజులు చేయిస్తాడు. ఆ తర్వాత వంటావిడ సహాయంతో ఉష స్నానం చేసి, ఒళ్ళు తుడుచుకుని, బట్టలు మార్చుకునేది. అవన్నీ పూర్తి అయ్యాక, ప్రసాదం, ఉష భోజనం చేసేవారు. వంటావిడకు ఉషకు వెయ్యాల్సిన మందులు చూపించి, జాగ్రత్తలు చెప్పి, తను ఆఫీసుకు వెళ్ళిపోయేవాడు. సాయంత్రం ఇంటికి పెదలకడే రావడం, ఉష మధ్యాహ్నం ఎలా గడిపింది అడిగి, ఆమెకు ఏమికావాలో తెలుసుకుని అవి అమర్చి పెట్టడంతో, ఉష నెమ్మదిగా తేరుకుంది. ఆమెకు చదువుకోవడానికి పుస్తకాలు తెప్పించాడు. సరైన పోషణ, తండ్రి ప్రేమాభిమానాల వల్ల ఆమె తొందరలోనే లేచి నడవడం మొదలుపెట్టింది.

ఉష పూర్తిగా కోలుకున్నాక, ఆమెను తీసుకుని ప్రసాదం భార్య దగ్గర దింపేసి వచ్చాడు. కూతురు త్వరగా కోలుకోవడంతో నీరజ ఊపిరి పీల్చుకుంది.

ఈ సారి ప్రసాదం ప్రమోషను నీరజను మరింత దూరం చేసింది. మైసూరుకు ట్రాన్సఫర్ కావడం, వెంటనే అక్కడ చేరాల్సి రావడంతో, భార్యకు అతను ఫోన్లోనే చెప్పేసి, మైసూర్ వెళ్ళిపోయాడు. తనను మరింత దూరం పెడుతున్నాడని నీరజ అభిప్రాయ పడింది.

-టి.వి.యస్.రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో