జయంత్ విసుగ్గా చూసి “నువ్వేదో చిన్న చిన్న కథలు రాసుకుంటూ వుంటావని పెళ్లి
చేసుకున్నాను కాని , ఇలా తయారవుతావనుకోలేదు “ అన్నాడు . ‘ఎలా తయారయానండీ ? ఈ అవార్డు రావాలంటే మాటలా !అక్కడ ఎంత పోటీని తట్టుకొని నా రచనలు ఎంపికయి ఉంటాయో తెలుసా ? పోనీ సాహిత్య పరంగా ఏ స్థాయికి చేరితే ఇది వస్తుందో తెలుసా ? నాకు తెలుసు . ఆ స్థాయికి చేరుకోవాలంటే ఎంత కృషి చేయాలో , ఎంత సాధన చేయాలో , ఎంత ఏకాగ్రత కావాలో …ఒక్క రాత్రి కాదు , ఒక్క పగలు కాదు . అదో సుదీర్ఘ శ్రమ . దాన్ని మీరు మెచ్చుకోవటం పోయి ఇలా మాట్లాడతారేం ?” అంది సంలేఖ . . ఇంతకీ ఎవరు ఈ జయంత్ , ఎవరా సంలేఖ ……ఆ రచయిత్రి తన గమ్యం చేరుకుందా ….ఈ జంట పయనం ఎలా సాగింది …….. అనే విషయాల కోసం ……….విహంగ చదువరుల కోసం …సరికొత్త ధారావాహిక
అంగులూరి అంజనీ దేవి రచించిన “జ్ఞాపకం” నవల ………..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~