జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

ప్రతి సంవత్సరం జరిగే మహిళా  సమావేశాల్లో జెండర్‌ సమస్యలు, సమాజంలో స్త్రీ స్థాయి, అభివృద్ధిలో మహిళ పాత్ర వంటి  అనేక విషయాలు చర్చించడం, ఒకరికొకరు సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం, తమ అనుభవంలో జెండర్‌ సమస్యల్నీ, కులవివక్షనీ, వర్గ విభేదాల్ని ఎలా ఎదుర్కొన్నారో, వాటిని ఎలా అధిగమిస్తూ వచ్చారో అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరంలాగే ఉత్తమ నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన ఒక మహిళా ప్రతినిధిని సన్మానిస్తారు.
సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి, అణిచివేతలోంచి, అధ్వాన్న పరిస్థితి నుండి అడుగడుగునా ఎదురవుతున్న జెండర్‌ సమస్యలను, కులవివక్షను, సాంఘిక, ఆర్థిక దోపిడీలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అంది వచ్చిన అవకాశాన్నిజారవిడువకుండా ఎదుగుతూ వస్తూన్న పోశవ్వ ఈ రెండు రోజులలో ప్రదర్శించిన నాయకత్వ లక్షణాలు, చొరవ, అందర్నీ ఆకట్టుకున్నాయనీ, స్ఫూర్తిదాయకంగా నిలిచాయనీ ఈ ఏడాది ” ఉత్తమ మహిళా ప్రతినిధి”గా పోశవ్వను ఎంపిక చేశారు. ఈ రకంగా మరో సంచలనం సృష్టించిన పోశవ్వ తన రాజకీయ జీవితంలో మరో మైలురాయిని దాటింది. ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకుంది.

ఢిల్లీ నుండి తన గ్రామం చేరుకునే సరికి తన పంచాయతీ ఉత్తమ పంచాయతీగా జిల్లాలో ఎంపికైందని తెల్సి మరింత ఆశ్చర్యపడింది, ఆనందపడింది పోశవ్వ. 75 శాతం కంటే ఎక్కువ పన్నులు వసూలు చేసినందుకు గాను 25 వేల రూపాయల గ్రాంటు వచ్చింది. ఈ డబ్బుతో గ్రామ మెయిన్‌ రోడ్డులో కొంత భాగాన్ని సిమెంటు రోడ్‌గా మార్పించింది.

గ్రామస్థులంతా కల్సి గ్రామ చెరువు పూడిక పనులు చేసుకున్నారు. మరో 100 ఎకరాలు సాగులోకి తెచ్చుకున్నారు. ఇలా పోశవ్వ ఆధ్వర్యంలో గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే సమస్యలు తక్కువేం కాదు. సర్పంచ్‌ పోశవ్వ ఢిల్లీ నుండి వచ్చేసరికి నాలుగు రోడ్ల కూడలిలో పంచాయతీ స్థలంలో రోడ్డు పక్కనే పాన్‌కోకా వెలిసింది. రాజాగౌడ్‌ అండదండలతో వార్డ్‌మెంబర్‌ శివప్ప తన కొడుకుతో పెట్టించాడు . వెంకన్న పటేల్‌ తన పశువుల్ని పాకలో కాకుండా రోడ్డుపై కట్టడం ఆరంభించాడు. మరొకరు రోడ్డు బౌండరీ ఆక్రమించి పాకవేశారు. చిన్న బంక్‌ మొదలు పెట్టారు . పోశవ్వకు చికాకు కల్గించాలన్న ఉద్దేశ్యమే వారికి ప్రధానం. అయితే పోశవ్వ పంచాయతీ ద్వారా మొదట నోటీసులు పంపింది. అయినా స్పందన లేకపోవడంతో బలవంతంగా ఖాళీ చేయించింది.

ఇది సహించలేక పోతున్నాడు రాజాగౌడ్‌. దీన్ని  అణచాలి అని ఆలోచిస్తున్నాడు మార్గం కోసం. అతని మనస్సుల్లోంచి బాధ అణఛుకోలేని బాధ, ఆమె పై కోపం, కసి… తీర్చుకోవడం ఎలా పరిపరివిధాల ఆలోచనలు.

తను మగవాడు… ఆర్థికంగా ఆమె కంటే బలవంతుడు. కులపరంగా ఆమె కంటే పై మెట్లలో ఉన్నాడు. తన కాలి గోరుపాటి  చేయని ఆమెను ఎదుర్కోలేకపోతున్నాడు. ఆమెకి పదవి తెచ్చి అధికారం అప్పజెప్పి తప్పుజేశాడా? ఆనాడే ఆమెను వంచెయ్యాల్నింది. మొక్కగా ఉన్నప్పుడే వంచక పోవడం వల్లే మానైపోదామనుకుంటుంది. ఆమె నుండి ఎదురవుతున్న అవమానాల్ని ఎట్ల తట్టుకునేది. అదేంది. దాని బతుకేంది.. ఆ జోగు.. ఎప్పుడంటే అప్పుడు ఒళ్ళు అప్పగించి… నా పక్కన పండుకున్న ఈ మాద్గిది ఇంత కావురం ఎక్కిపోయిందేంది..? ఎట్లయింది..? దీన్ని ఇట్ల  వదిలేస్తే… ఇంకా పెట్రేగిపోతుందేమో…! ఒక కొలిక్కి రాని ఆలోచనలతో తల బద్దలవుతూండగా………

”ఏయ్‌ చాయ్‌ పంపు” లోపలికి కేక వేసి,

”ఓరి సాయిగా పోయి బంజోల్ల శివప్పకు, మల్లగౌడ్‌కు, వెంకన్న పటేల్‌కు, పట్వారి  అందర్కిపిల్సకరా పో… ఈడున్నట్టు ఎంటనే రమ్మన్నని జెప్పపో” పురమాయించాడు రాజాగౌడ్‌.

ఆ జోగుదాన్ని అట్లనే వదిల్తే… అది సంఘపోల్లతో జేరి అలగా జనంకు మీటింగ్  లు పెడ్తాంది.

– శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో