సప్త గోదావరి మాత

         New Microsoft Office PowerPoint Presentation (2)

               

R. Sarojini

R. Sarojini

               మహారాష్ట్రలో నాసిక్‌ సమీపంలోని త్రయంబకం క్షేత్రంలో పరమశివుని జాజూటం నుండి వచ్చిన గంగను గౌతమ మహర్షి తన వెంట తీసుకురావడం ద్వారా గౌతమీ గోదావరి నది ఆవిర్భవించినట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి.గోవు మృతి చెందిన ప్రాంతంలో ఈ నదిని ప్రవహింపచేయడంతో మహర్షికి పాప విముక్తి కలుగుతుంది. అందుకే గోదావరి నదికి గౌతమిగా పేరు వచ్చింది. ఇది కృతాయుగం నాటి ముచ్చట.

                భగీరధుడు గంగను తీసుకొచ్చింది త్రేతాయుగంలో అందుకే గంగకు గోదావరి అక్క.
బ్రహ్మ తన మాసన సంకల్పంతో విశ్వంలో అత్యంత అందగత్తెగా అహల్యను సృష్టిస్తాడు. భూప్రదక్షిణ చేసిన వారికి అహల్యను ఇచ్చి వివాహం చేస్తానని షరతు పెడతాడు.

              బ్రహ్మ సంకల్పంతో సప్తరుషులలో ఒకరైన గౌతముడు ఈనుతున్న గోవుకు ప్రదక్షిణ చేసి భూ ప్రదిక్షణ ఫలితాన్ని పొంది అహల్యకు పతి అవుతాడు.పశ్చాతాపపబడిన మునులు గోహత్యాపాతకం నుండి విముక్తి పొందిన గౌతమ మహర్షిని శరణు కోరతారు. గోదావరితో తమకు అనుబంధం వుండేలా చేయాలని గౌతముని ఆర్ధిస్తారు.

తమ పేర్లుతో ఏడుపాయలుగా గోదావరిని ప్రవహింపచేసి తూర్పున సముద్రంలో కలిసేలా ఆయన అనుగ్రహిస్తాడు.

కశ్యపుడు :

దీనినే తుల్యభాగ కశ్యపి అని పిలుస్తారు. రామచంద్రపురం పరిధిలోని పలు గ్రామాలు మీదుగా ప్రవహించి కాకినాడ సమీపంలోని చొల్లంగి సమీపాన సాగరంతో సంగమిస్తుంది.
పుష్యబహుళ అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య రోజున ఇక్కడ స్నానం ఆచరించడం సకల పాప హరణం.

అత్రి :

కపిలేశ్వరపురం వద్ద కణ్వనదిగా ప్రసిద్ధి. అంగర, టేకి మీదుగా ప్రవహించి కోిపల్లి వద్ద గౌతమితో కలుస్తుంది. ఆత్రేయ నామంతో కోలంక, కాలుజూరు మీదుగా సాగి కోరంగి వద్ద సముద్రంలో సంగమిస్తుంది.

విశిష్టుడు :

రాజమండ్రి సమీపాన విజ్జేశ్వరం నుండి పి. గన్నవరం, రాజోలు మీదుగా ప్రవహించే వశిష్ట గోదావరి అంతిర్వేది వద్ద సాగరంలో కలుస్తుంది. మాఘ పౌర్ణమి నాడు అంతర్వేదిలో సింధూ స్నానం చేస్తారు.

జమదగ్ని :

గోదావరి నుండి జమదగ్ని మహర్షి తీసుకువెళ్ళిన గోదావరి పాయ ఇది. జమదగ్నిగా సముద్రంలో కలుస్తుంది.

భరద్వాజ :

భరద్వాజ మహర్షి తీసుకువెళ్ళిన ఈ పాయలో గరుత్మంతుడు స్నానం చేసి పాప విముక్తి పొందడంతో దీనిని వైనతేయగా పిలుస్తారు. పి. గన్నవరం వద్ద విశిష్ట నుండి విడివడిన ఈ పాయ కరవాక వద్ద సాగరంలో కలుస్తుంది.

గౌతముడు :

రాజమండ్రి సమీపంలో అఖండ గోదావరి నుండి గౌతమీ పాయ విడిపోతుంది. గౌతమి మహర్షి పేరు మీదుగా దీనిని గౌతమిగా పిలుస్తారు.

కౌశికుడు : (విశ్వామిత్ర)

కౌశికుడుతో కలిసి వెళ్ళిన గోదావరిని కౌశికగా పిలుస్తారు. మందపల్లి వద్ద గౌతమి నుండి విడిపోయిన ఈ పాయ ఠాణేలంక, కొత్తలంక గ్రామాల మీదుగా ప్రవహించి, భైరవపాలెం వద్ద సముద్రంలో కలుస్తుంది. దీనిని వృద్ధ గౌతమిగా పిలుస్తారు.ఇలా సప్తరుషుల పేర్లతో గోదావరి మాత అలరారుతుంది. గోదావరి మాత పుణ్య నదీమతల్లిగా శ్రీవల్లిగా, కల్పవల్లిగా సిరులొలికే గోదావరి మాత మనందరికి మాత.

గోదావరిమాత ఎన్నో పేర్లతో పిలువబడుతుంది. మహేశ్వరీ, గంగా, గౌతమీ, వైష్ణవాచిత, బ్రహ్మా, గోదావరీ, నందా, సునందా, కామదాయినీ శివుని జటాజూటం నుండి వచ్చినందున మహేశ్వరి అయ్యింది. గోదావరికి గంగ అనే పేరు కూడా వుంది.గౌతమీ మహర్షి తపోఫలితంగా వచ్చింది కనుక గౌతమి అన్నపేరు వచ్చింది. విష్ణు పాదోద్భవి కనుక వైష్ణవి, బ్రహ్మ కమండలంలో నివసించింది కనుక బ్రాహ్మి అయ్యింది. ఆనందాన్ని కలుగుజేసే నది కనుక నంద, సునంద అనే పేర్లు వచ్చాయి.
కోర్కెలు తీర్చేది కనుక కామదాయిని అయ్యింది. ఎలా ఎన్నో పేర్లుతో ఉపనదులుగా గోదావరి మాత అలరారుతుంది.*

– రొబ్బి సరోజిని

పరిశోధకురాలు
సాహిత్యపీఠం
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ
రాజమండ్రి (బొమ్మూరు)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో