కాటకం… ఎవరికి ? 2 – కవిని

తాలూకా మండలాఫీసు అప్పుడు సమయం 11 గంటలు కావస్తోంది. ఎండాకాలం కావాన గాలిలో వేడి క్రమంగా పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు వస్తున్నారు.

వచ్చిన వాళ్ళు పిచ్చాపాటి  మాట్లాడుకుని ఎవరి కుర్చీలో వారు కూర్చున్నారు. ఊర్లనుండి పనుల మీద వచ్చిన వాళ్ళు బయట కూర్చున్నారు.

ఎదురుగుండా దూరంగా గుంపులుగా వస్తున్న జనాన్ని చూస్తే వాళ్ళంతా తమ ఆఫీసుకే వస్తున్నట్టు వాళ్ళకు అర్థమయ్యింది. ప్యూను కూడా ఇదే విషయాన్ని అక్కడి ఉద్యోగులకు చెప్పాడు.

అందులో ఒకాయన ”ఆళ్ళు వస్తుండ్రు… ఆళ్ళు వస్తుండ్రు…’ అని మిగిలిన వాళ్ళతో అన్నాడు.
”డోర్లు…పెట్టి …” అని కంగారుగా, గట్టిగా  మరొకాయన అన్నాడు. ఆ గుంపులో 50, 60 మంది దాకా ఉన్నారు.వాళ్ళు ఆఫీసు దగ్గరకు రాకముందే ఆఫీసు తలుపులు పెట్టేశారు. ఆ గుంపులో ఉన్న వాళ్ళకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

”మమ్ములజూసి దర్వాజ పెట్టుకుంటర్రా…. మమ్ములజూసి…” గుంపులో ముందు వరసలో ఉన్న మంగవ్వ గట్టిగా  అరిచింది.
”డోర్లు పెట్టుకుంటారా … తీరి…తీరి…” అని అందరూ అరవటం మొదలుప్టోరు. ఎంతకీ తలుపులు తీయకపోయేసరికి వాళ్ళందరూ తలుపు దగ్గరకొచ్చి తలుపుల్ని తొయ్యటం మొదలుపెట్టారు .

”ఆ మనిషెవరో మాకు చూపీయాలె…అందులోనే ఉన్నడు” అని అరవటం మొదలు పెట్టారు .

ఇక లాభంలేదనుకున్నారో ఏమో ఆ ఆఫీసు పెద్ద సారు తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. ఆయనతోపాటే మరొకసారు కూడా వచ్చాడు..వీళ్ళను చూడగానే…

”ఆడు అందులోనే ఉండు…ఆడ్ని మేం గుంజుకొస్తం” అందరూ గట్టిగా  అన్నారు. పెద్దసారు పక్కనున్నాయన కల్పించుకుని. ”ఆగురి…జర ఇన్రి… గీయన పెద్దసారు. మాట్లాడతానంటండు..” అని పెద్ద సారును చూపిస్తూ గుంపులోని వాళ్ళతో అన్నాడు.

గుంపులోని గ్రూపు లీడర్లు యాదగిరి, లింగయ్యతో పాటుగా సత్తెమ్మ, మీనమ్మ మిగతా వాళ్ళను ఉద్దేశించి, ”ఆగురి…జర…” అని అన్నారు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. పెద్దసారు చెప్పటం మొదలుపెట్టాడు .

”ఏదన్నా ఉంటే నిమ్మళంగా మ్లాడుకోండ్రమా. మీరెలా  గొడవ చెయ్యొద్దు. మీకు ఎంత ఇచ్చేడిది ఉంటే అంత క్టిస్తం ఆయనెవరో మాకు చూపీయండ్రి.”

పెద్దసారు మాట పూర్తికాకముందే లోపలి గదిలో కూర్చుని ఉన్న లక్ష్మణరావు, ”అటాలేదు  సారు… ఒక దిక్కు సెయ్యమంటే ఇంకో దిక్కు సేసిండ్రు” అని అన్నాడు. గుంపులో ముందు వరసలో ఉన్న సత్తెమ్మ, మీనమ్మ, ”ఏయ్‌…. నువ్‌ బయటకు ఎళ్తవా లేదా….” అని గట్టిగా  అనటంతోటే, మిగతావాళ్ళంతా యాదగిరి, లింగయ్యతో సహా ”బయటకు నడు…” అంటూ అరవడం మొదలు పెట్టారు .

అప్పిటి దాకా ‘ఆయనెవరో చూపియండ’న్న పెద్దసారు మారు మాట్లాడకుండా లోపలికెళ్ళాడు. ఆఫీసు వాళ్ళు మళ్ళీ తలుపులు పెట్టబోయారు. ఇంక ఆ గుంపులోని వాళ్ళందరికీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆఫీసు ముందున్న చిన్న చిన్న రాళ్ళను తీసి లోపలకు వేయడం మొదలుపెట్టేరు . రాళ్ళతో  కిటికీ  అద్దం పగిలింది. ఆఫీసులో వాళ్ళు ‘ఆగండ’ని అరుస్తున్నా వినిపించుకునే స్థితిలో ఎవరూ లేరు. అందరూ తోసుకుంటూ ఆఫీసులోకి రావటం మొదలుపెట్టేరు .

”మీరే కుర్చుంటార్రా…కుర్చీల మీద” అని శీనయ్య, రంగయ్య అరిచారు. లోపలకు మొదటగా అడుగుపెట్టేరు . సత్తెమ్మ శీనయ్య. కుర్చీలో కూర్చొని బెరుగ్గా చూస్తున్న లక్ష్మణరావును వేలితో చూపిస్తూ ”గిడుగో…ఈడున్నడు” అని మిగతా వాళ్ళతో అన్నది సత్తెమ్మ.

”అరేయ్‌ బయటకు రారా…లం….కొడకా” యాదగిరి అన్నాడు.
”నీ పెళ్ళాం ఎండలో వచ్చి సేత్తాదిరా…” ఎల్లక్క గట్టిగా  అన్నది.

”మా పైసలు మింగుతావురా…మా గొంతులు కోస్తావురా…మా పిల్లల మేము ఎట్ల సాదుకోవాలిరా…””కరువు పని ప్టిెందే మా గురించి. మీ గురించారా? రారా…బయటకు.” ఇా్ల తలా ఒక మాట అందుకున్నారు. గుంపులోని ఒకరిద్దరు కాలరు పట్టుకుని లక్ష్మణరావుని లాక్కొచ్చి పెద్దసారు ముందు నిలబ్టెారు.

”ఈడు మాకొద్దేవద్దు…మొత్తం మింగుతున్నడు”
”గవర్నమెంటు ఎవళ్ళు…మీరా…” ”మేం కష్టం సేత్తన్నాం కదా…ఎక్కువద్దు.
మా కష్టానికే ఈయండ్రి పైసలు” ‘సేత్తే సేయండ్రి…లేదంటే మేమే సేసుకుంటం.”

‘ఈడు మంచోడు కాదు. 30, 50, 60 రూ.లు ఇచ్చుకుంట మమ్ముల మోసం చేస్తుండు” అని అనడం మొదలు పెట్టేరు .
పెద్దసారు పక్కనున్నాయన, ”ఆగుండ్రి…జర ఇడిసిపెి…” అని అన్నాడు.

పెద్దసారు వాళ్ళనుద్దేశించి, ”మనందరం తెలంగా ణోళ్ళమే… మనం మనం కోట్లాడుకుంటే మంచిగుంటదా?” అని అనంగానే శీనయ్య లక్ష్మణరావు కాలరు వదిలేశాడు. అందరూ మౌనంగా అయిపోయారు.

”మీ పైసలు న్యాయంగ ఇస్తం. మీరు ఇప్పి నుండి ఎండలో ఉండొద్దు. పొద్దుగాల 7 గంటలకే పనికిపోవాలె… వింగంటకల్లా ఇంటికి   పోవాలె. మళ్ళా పనికి పోవద్దు. మీకుఎంత కూలి పడ్తే అంత ఇస్తం. లెక్కజూసి చెప్పేదాక జర బయట ఉండ్రి. మీ కార్డులు గిట్ల అన్ని జూసి మేం పిలుస్తాం. ఒక్కొక్కరే వచ్చి పైసలు తీసుకోరి…” పెద్దసారుతో పాటు మరొక ఇద్దరు సార్లు కూడా వచ్చి నచ్చచెప్పారు.

మధ్యాహ్నం 1 గంట కావస్తోంది. ఎండ తీవ్ర రూపం దాలుస్తోంది. బయల్దేరే ముందు ఇంత సద్ది కూడా వాళ్ళు కట్టుకోలేదు. తాగానికి నీళ్ళు తెచ్చుకోలేదు. నాలుకలు పొడారిపోతున్నాయి. దాహానికి గొంతులు ఎండిపోతున్నాయి.రివ్వున కొడుతున్న ఎండగాలికి నిస్సత్తువ ఆవహిస్తోంది. అందరూ బయట ఆ చెట్టు కిందా, ఈ చెట్టుకిందా కూర్చున్నారు. ఏం లెక్కలు చూశారో ఏమో… కాని, రెండు గంటల తర్వాత ప్యూను ఒక్కొక్కరినీ పేరు పెట్టి పిలవటం మొదలు పెట్టేడు . పెద్దసారు, పక్కన కూర్చున్న మారొక సారు కార్డు చూసి, లెక్కగట్టి  డబ్బులు ఇస్తున్నాడు. గుంపులోనే ఇద్దరు ముగ్గురు 7వ తరగతి దాకా చదువుకున్న వాళ్ళున్నారు. ఒక్కొక్కళ్లు డబ్బులు తీసుకుని బయటకు ‘ఇంతే ఇచ్చిండ్రని…’ వాళ్ళకు చూపించి ఎంత రావాలో, ఎంత ఇచ్చారో

లెక్క చూసుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళకు ఒక్కో విధంగా ఇచ్చారు. రెండు మూడు రోజులు చేసినవాళ్ళకు మొత్తానికే ఇయ్యలేదు చివరగా కళమ్మ వంతు వచ్చింది. కళమ్మ చేతికి లెక్కచూసి మిగిలిన డబ్బులు ఇచ్చారు.

”అందరం తెలంగాణోళ్ళమే అంటివిగా సారు…సివరాఖరికి ఆడినాయమే పలికిండ్రు. రోజుకు వంద ఇస్తమని చెప్పిండ్రు. 50 అయినా ఈయకపోయె. పైసల్‌ క్‌ చేసిండ్రు…” అన్నది కళమ్మ.

”అవ్‌ అయ్యా…నువ్వన్నట్లు నువ్‌ తెలంగాణోడివే… మేము తెలంగాణోళ్ళమే. నువ్‌ పటేలువాయ్‌… దొరవాయ్‌… సర్కారోనివాయె. మేం బాంచనోళ్ళమాయె.” కళమ్మ వెనకగా లోపలికి వచ్చిన సత్తెమ్మ అన్నది.

సత్తెమ్మ అడుగుతున్న సూటి  ప్రశ్నకు, నిప్పులు చెరుగుతున్న వాళ్ళ చూపుల తీక్షణతకు మారుమ్లాడలేక తలదించుకున్నాడు సర్కారీ పెద్దసారు.

-కవిని ఆలూరి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, Permalink

2 Responses to కాటకం… ఎవరికి ? 2 – కవిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో