తప్తశిల (కథ )- సి.భవానీదేవి

వనస్థలిపురం బస్టాప్‌లో సచివాల యానికి ఆఫీస్‌ స్పెషల్‌ కదటానికి సిద్ధంగా ఉంది. దూరంగా బరువుగా పరుగులాంటి నడకతో వస్తున్న శిశిరను చూసి డ్రైవర్‌ బస్‌ను కాసేపు ఆపాడు.

‘‘పోనీవోయ్‌…’’ అరిచాడు చారి.

అంతా ఒక ఆఫీసులో పనిచేసేవాళ్ళే… కానీ బస్‌లో మాత్రo బద్ధశత్రువుల్లా మారిపోతారు. అదంతా సీటుకోసమే. లేదంటే గంటన్నర నిబడాలి మరి. ఆయాస పడుతూ వేగంగా నడుస్తున్నది శిశిర. తొమ్మిదో నెల గర్భవతి. భుజాన బ్యాగ్‌ కూడా బరువనిపిస్తున్నది.

శిశిర బస్‌ ఎక్కింది. ఆయాసంగా ఉంది. పొద్దుట్నుంచి ఏమీ తినలేదు. కళ్ళు తిరుగుతున్నట్లనిపిస్తుంది. లేడీస్‌ సీట్లు ఖాళీ ఉన్నాయేమో… లేవు. ఆ సీట్లలో కూడా రోజూలాగే మగవాళ్ళే కూర్చున్నారు.

‘‘దయచేసి కాస్త సీటు ఇస్తారా’’ ఆయాసపడ్తూనే సందేహిస్తూ మ్లెగా అడిగింది.
వినిపించనట్లు నిద్ర నటిస్తున్నారు. శిశిరకు కళ్ళు తిరుగుతున్నాయి. తప్పనిసరై మళ్ళీ అడిగింది.

‘‘మేం లేవం… ఆఫీస్‌ స్పెషల్‌లో రూల్సేం ఉండవు’’ చారి కోపంగా అన్నాడు.

‘‘లేవలేని మనిషని కూడా చూడరా…’’ మాధవి విసుక్కుంది. రోజూ జరిగే ఈ వివాదం అందరికీ చిరాగ్గా అన్పిస్తుంది.

‘‘ఆడవాళ్ళకు మాత్రమే అని ఉంది. కనపడటం లేదూ’’ సాగదీసింది రాధ.

‘‘మేం లేవం. అవసరమయితే చీరలు కట్టుకుని కూచుంటాం’’ చారి మాటకు అంతా నవ్వారు. ఎవ్వరూ ఇదేమనలేదు. ఆ గ్యాంగ్‌తో ఎవరు పెట్టుకుంటారు.

అలాగే బస్‌ సచివాయం చేరింది. బస్‌ దిగుతూనే అంతా పరిగెడుతున్నట్లు వెళ్ళిపోయారు. చివరికి మెల్లగా దిగింది శిశిర. బస్‌ దిగుతూనే అక్కడే వాంతి చేసుకుంది. బ్యాగ్‌లోంచి వాటర్‌ బాటిల్‌ తీసి నోరు కడుక్కొని ఆఫీసులోకి నడిచింది.
టైపు చేస్తున్నదే గానీ శిశిర మనసు మనసులో లేదు. ఇంకా డెలివరీకి నెల టైముందని డాక్టర్‌ చెప్పింది. అయినా ఏదో అనుమానం. కడుపులో బిడ్డ కదుల్తున్నది.

‘‘ఆగు తల్లీ… టైపు పూర్తి కానీ…’’ ఇంకా పుట్టని పాపాయికి చెప్పుకుంది.

కడుపులో పాపకు ఆకల వుతున్నట్లుంది. ఆ లెటర్‌ పూర్తిచేస్తే గానీ లంచ్ కి  వెళ్ళొద్దని ఆఫీసర్‌ ఆర్డర్‌. గర్భవతి బాధ ఆయనకేం తెలు స్తుంది. ఇప్పటికే పొద్దున్నించి ఏఎస్‌ఓ రవీంద్ర ఒకటే నస. తాను మెటర్నిటీ లీవులోకి వెళ్ళేలోగా త్వర త్వరగా పెండిoగ్‌ వర్క్‌ అంతా చేయించేయాలని చాలా రొస్టు పడుతున్నాడు పెడుతున్నాడు, నిన్న కడుపు నెప్పితో ఇంకో మాట కూడా అన్నాడు.

‘‘అసలు ఆడవాళ్ళు ఉద్యోగాలకు రాబట్టే మా మగవాళ్ళకు నిరుద్యోగం పెరిగింది’’ అని. అసెంబ్లీ సమావేశాలు  జరుగుతున్నాయి. కాబట్టి ఐదు తర్వాత కూడా ఆఫీసర్‌ వెళ్ళమనేదాకా ఉండాలిట.

‘‘ఈ నెంబర్‌ డిస్పోజల్‌ తీయండి’’ రవీంద్ర స్లిప్‌ ఇచ్చాడు. అది పదేళ్ళ కిందటిది. ఎంత వెదికినా దొరకటం లేదు. ఆ మాట చెపితే దొరికేదాకా వెతకాల న్నాడు.

‘‘ర్యాక్‌లో కింద ఉందేమో చూడండి’’ ఆమె పరిస్థితి పట్టించుకోకుండా అన్నాడు. కింద నేల మీద కూచొని చూడసాగింది శిశిర. ఆ పోజిషన్‌లో కూచోటం వాళ్ళ కడుపులో నరాలు పట్టేస్తున్నాయి. శిశిరకు కన్నీళ్ళొస్తున్నాయి. ఆఫీసరు ఏదో పనిమీద అటుగా వచ్చి కింద కూర్చొని డిస్పోజల్స్‌ వెతుకుతున్న ఆమెకేసి సానుభూతిగా చూశాడు.

‘‘ఇదేంటి ఈవిడ్ని ఇంకా ఉంచారు. మీరు వెళ్ళండమ్మా…’’ బహుశ ఆయనకి తల్లిమీద తప్పకుండా ప్రేమ, గౌరవం ఉండి ఉంటాయి.

‘‘బతుకు జీవుడా…’’ అనుకుని బయటపడిoది శిశిర. ఇంటికి వచ్చేసరికి ఎనిమిదయింది. భర్త రాంబాబు, మరిది ఏదో చదువుకుంటున్నారు. వంట ప్రయత్నం ఏమీ జరిగినట్లు లేదు.

‘‘ఇప్పుడా రావటం ఆకలి కాలిపోతుంటే…’’ రాంబాబు విసుక్కున్నాడు. భార్య కడుపుతో ఉంది. పగలల్లా చాకిరి చేసి రెండు బస్సులు మారి ఇంటికి కష్టపడి ఇంత లేటుగా వచ్చిందన్న జ్ఞానం లేదు. ఉసూరుమంటూ అప్పుడు మొదలు పెట్టి వంటచేసి ఇద్దరికీ పెట్టి తిన్నాననిపించి పక్కమీద వాలిపోయింది.
ఉదయం లేస్తూనే ఒకటే వాంతులు . విసుక్కుంటూ రాంబాబు, మరిది బయట తింటామని చెప్పి తయారై వెళ్ళిపోతున్నారు.

‘‘నాకేదయినా చేసిపెట్టి వెళ్ళండి’’ అంది నీరసంగా. ‘‘మీ అమ్మ వచ్చి చేస్తుందిలే’’ ఎగతాళిగా అంటూ వెళ్ళిపోయాడు రాంబాబు.

‘‘అమ్మ… అమ్మ వస్తుందా…?’’ ఆ ఊళ్ళో సరైన డాక్టర్‌ సౌకర్యం లేదని ఇక్కడే డెలివరీ వరకు ఉంటానని అమ్మకి రాసింది.

‘‘నీ ఇష్టం. నేను మాత్రం మీ నాన్ననొదిలి రాలేను’’ అని అమ్మ బదులు రాసింది. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మాటిమాటికీ సెవు పెట్టి పిచ్చిగా పరిగెత్తింది. తనకి ఇంత తప్పనిసరి అవసరమొస్తే ఇలా మాట్లాడుతుంది. డాక్టర్‌ ముఖ్యమని తను హైదరాబాద్‌లోనే ఉండిపోయింది.

ఆలోచనతో నిద్ర పట్టింది శిశిరకు. మె లకువ వస్తూనే ఒకటే వాంతులు . సాయంత్రం రాంబాబు వచ్చేదాకా స్పృహలో లేదు. విసుక్కుంటూ డాక్టర్‌కి చూపించాడు. ఆఫీసుకు వారం సెలవు కోసం లెటర్‌ పంపింది.

తనలాంటివాళ్ళు పెళ్ళి చేసుకోకూడదు. చేసుకున్నా పిల్లల్ని కనకూడదు. చిన్నప్పటి నుంచి అమ్మ పడే బాదలు చూసి పెళ్ళి చేసుకోకూడదు అనుకుంది శిశిర.

‘‘అంతా నాన్నలా ఉండరమ్మా… పైగా నువ్వు చేసుకోకపోతే నీ చెల్లెళ్లకు కావు’’ అంటూ నచ్చచెప్పింది అమ్మ.
మొదట్నించి ఉద్యోగమే తన ప్రయారిటీ. ఎలా జరిగిందో అంతా అయిపోయింది. ఇప్పుడు అమ్మ కూడా తన గురించి పట్టించుకోవటంలేదు. కడుపుతోవున్నమ్మ కనక మానుతుందా.

దూరపు బంధువు సహాయంతో డెలివరీ అయింది శిశిర. మూడు నెలలు మెటర్నిటీ లీవు తర్వాత పాపని క్రచ్‌లో చేర్చింది. నానా కష్టాలు  పడి ఆ పిల్లలను  పెంచేలోపు రెండోది తయారు. జీవితం ఎటు లాక్కెళ్ళితే అటు పరిగెత్తింది. ఇప్పుడు పెద్దదానికి ఆరేళ్ళు… చిన్నదానికి మూడేళ్ళు. ఈ సారయినా కొడుకుని కనకపోతే విడాకులు అంటున్నాడు రాంబాబు. పూర్తిగా తనే కారణం కాదని అతనికీ తెలుసు .

టైపు చేస్తున్నదే గానీ శిశిర మనసంతా ఇంటిమీదే ఉంది. పిల్లలకి మార్నింగ్‌ స్కూల్స్‌. పన్నెండిoటికి వస్తారు. తాళంచెవి పక్కింట్లో ఇచ్చి వచ్చింది. వాళ్ళకి అలవాటే. తాళం తీసుకుని తను ఇంటికి వెళ్ళేవరకు ఎంత జాగ్రత్తగా మసులుకోవాలో చెప్పింది. కింద ప్రమాదకరమయిన వస్తువులేవీ ఉంచదు. అయినా మనసు ఇవ్వాళ ఎందుకో పనిమీద నిలవటం లేదు. అన్నీ తప్పు టైపు చేస్తున్నది.

సాయంత్రం అయిదయింది. గబగబా సీటు కట్టేసి బస్టాప్‌కి వచ్చింది. బస్‌ కోసం ఎదురుచూస్తుండగా ఎదురింటి కాలేజీ కుర్రాడు బైక్‌ మీద వచ్చాడు.

‘‘ఎక్కండి ఆంటీ…’’ చాలా గాభరాగా ఉన్నాడు. తను సందేహించింది. ‘‘పెద్దపాపకి బాగాలేదు. త్వరగా ఎక్కండి’’ అన్నాడు బరువుగా.

అంతే! ఎక్కేసింది. బైక్‌ గాంధీ హాస్పిటల్‌ ముందు ఆగింది. శిశిరకు గుండె దడదడలాడుతోంది. బర్నింగ్‌ వార్డ్‌లో పాపని చూస్తూనే ఫెయింట్‌ అయి పడిపోయింది శిశిర.

శిశిర కొంచెం తేరుకున్నాక పాప కూడబలుక్కుంటూ చెప్పింది. ‘‘అమ్మా! నువ్వు చెప్పినట్లే స్కూల్‌ నించి వచ్చి ఫ్లాస్క్‌లో పాలు చెల్లికి ఇచ్చి తాగానమ్మా. స్టూల్‌ తలుపు దగ్గరకు లాగి పై గడియ వేశాను…’’ ఆయాసంతో ఆగి ఆగి మళ్ళీ చెప్పింది పాప.

‘‘చెల్లి బర్త్‌డే ఆట ఆడిoదమ్మా… క్యాండిల్స్‌ జాగర్తగానే వెలిగించాను. ఎలా పడిoదో నా నైలాన్‌ గౌను అంటుకుంది. గడియ తీయలేక అలాగే గోడకి నిబడ్డాను. చెల్లిని మాత్రం దగ్గరకి రానీయలేదు’’. రొప్పుతూ శ్వాస తీస్తున్న పాపని చూసి గుండె బద్దయ్యేలా ఏడ్చింది శిశిర.

అంత బాధలోనూ అమ్మ మెప్పుకోసం పాప ఆరాటం చూసి శిశిర విలవిల్లాడి పోయింది. మూడు రోజులు నరకంచూసి పాప అందని తీరాల కు పోయింది.

ఎవరెంత చెప్పినా శిశిర ఉద్యోగం మానేసింది. తల్లిగా ఓడిపోయాననుకుంటూ విపరీతమైన ఆత్మన్యూనతతో కుంగిపోయింది. ఎవ్వరితోనూ మాట్లాడటం మానేసి తప్తశిల లా బతుకుతోంది. ఇప్పటికీ ఎక్కడైనా బస్టాప్స్‌లో ముగ్గుబుట్టలాంటి తల తో బస్‌లో ఎక్కే ఉద్యోగినులందరికీ చెప్తుంటుంది.

‘‘మీ పిల్లలు  జాగర్తమ్మా’’ అంటూ ఎప్పుడైనా ఎక్కడైనా శిశిర కనిపిస్తే విసుక్కోకండి. ఆమె మనస్సులో రగిలే వేదన అర్థం చేసుకోవాంటే అమ్మ మనసుండాలి.

-సి .భవానీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

కథలు, , , , , , Permalink

One Response to తప్తశిల (కథ )- సి.భవానీదేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో