బోయ్‌ ఫ్రెండ్‌ – 37 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

పరీక్షలన్నీ అయిపోయాయి . ఆ రోజు తలస్నానం చేసి వదులుగా జడ వేసుకుంది కృష్ణ. నెమలి రంగుపై జరీ నెమళ్ళున్న వెంకటగిరి చీర కట్టుకుని అదే రంగు చారెడు జరీ అంచున్న జాకెట్టు వేసుకుంది. రెండు బంగారు గాజుల మధ్యగా నీలం గాజులు అలంకరించుకుంది. హాస్టలు ఆవరణంలో అపూర్వంగా పూసే నీలాంబ్రాలను అందరినీ బ్రతిమలాడి కోసుకుని మాలగా కట్టుకుని తలలో తురుముకుంది. మెడలో సన్నని  బంగారు గొలుసుకు తాను మనసుపడి కొనుక్కున్న నీల మేఘాశ్యాముని ఎనామిల్‌ పతకాన్ని ధరించి కుర్చీని కిటికీ  దగ్గరగా జరుపుకుని చెంపకు చెయ్యి  చేర్చుకుని దూరంగా చూస్తూ కూర్చుంది. అలా కూర్చున్న కృష్ణ నీలాకాశంలో నీలి  మేఘ శకలంలా వుంది.

అలా కిటికీలో  నుండి చూస్తే దూరంగా తాటి  చెట్లు, అస్తమించే అరుణ కాంతి బ్యాగ్రౌండ్‌లో అద్భుతంగా కన్పిస్తారు. వరుసగా నిటారుగా  వున్న ఆ చెట్ల మధ్యగా ఒకే ఒక్క తాటి  చెట్టు వంగిపోయి  కొద్దిగా క్రిందికి వాలి వుంటుంది. ఎప్పుడు అలా తీరిగ్గా కూర్చున్నా ఆ చెట్ట వేపే తదేకంగా చూస్తూ, ఆలోచనల్లోకి జారిపోతుంది కృష్ణ.

”ఆ చెట్టును చూసి మిగతా చెట్లన్నీ ఏమనుకుంటాయి ? అందంగా వయ్యారంగా వున్న దాన్ని చూచి అసూయ పడ్తాయా? లేక అందులో అందాన్ని చూడలేక కిందకుందని  అవహేళన చేస్తాయా? అసలు ఆ వృక్షజాతిలో అది అందం క్రింద కొస్తుందా?  అక్కడున్న చెట్లలో ఏ ఒక్కదానికైనా ఆ చెట్టు తల్లో, బిడ్డో కాకపోతుందా? అందరూ  దాన్ని చూసి జాలిపడకపోతుందా?”

అలా వృక్షజాతిలోకి వెళ్ళిపోయిన  కృష్ణ ఎవరో పలకరించగా ఈ లోకంలో పడింది. విజిటర్స్‌ వచ్చేరని చెప్పి వెళ్ళిపోయిం ది.

భానుమూర్తిని చూస్తూనే కృష్ణ ఆహ్వాన పూర్వకంగా నవ్వింది. అలా నవ్విన స్నేహితురాలిని ఆపేక్షగా చూస్తూ అన్నాడు భానుమూర్తి. ”చాలా బాగున్నావు కృష్ణా”

”నీ బోడి కాంప్లిమెంట్  కొఱకు ఎవ్వరూ ఇక్కడ ఎదురు చూడ్డం లేదు గానీ, ఆ కుర్చీ ఇలా లాక్కుని కూర్చో.” ఆమె పెదవుల మీద హాస్య రేఖ నొసటి మీద  ముడతలు విలక్షణంగా వున్నాయి . బుద్ధిగా కుర్చీలో కూర్చుంటూ అడిగాడు భానుమూర్తి.

”ఎలా చేసావు పరీక్షలు?” ”మామూలే. మరలా కొత్తగా ఎందుకు అడుగుతావు?” నవ్వుతున్న అతని పెదాలు ముడుచుకుపోయారు.

”అది కాదు కృష్ణా నా ఉద్దేశం…” తెరలు తెరలుగా నవ్వింది కృష్ణ.

”ఎంత పిచ్చివాడివి నువ్వు ! నాకెక్కడ దొరికావు బాబూ !” ఆమె పూర్తిగా నవ్వు ఆపేసాక అన్నాడు భానుమూర్తి.

”నా మాటల వల్ల నువ్వెక్కడ బాధపడిపోతావోనని నా భయం. అంతే కృష్ణా.” అతని కళ్ళల్లోకి నిశితంగా చూస్తూ అంది కృష్ణ.

”అఇతే నేననే మాటలకు నువ్వు బాధ పడుతుంటావా  భానూ!” అతను జవాబు చెప్పలేదు కాని చల్లగా చూసే అతని కనుపాపలు ఆమెకు జవాబు చెప్పారు.

ఆమె ఒక్కక్షణం మౌనం తర్వాత అంది.

”నేనింకా నీ ఉద్దేశాలను అర్ధం చేసుకోలేనంతగా  వున్నానా  భానూ.” ”కాకపోతే ఎప్పుడూ నిన్ను నిరాశపర్చడంతోనే సరిపోతోంది. పరీక్షలు ఏమీ బాగా వ్రాయలేదు.” 

”మా వంటవాడిచేత నీ సామానంతా స్టేషన్‌కు పంపించేశావాలేదా?” ”ఆ! అంతా అయ్యింది . ఇక మనం కదలడమే తరువాయే .”

”నీ ట్రైయిన్ ఎప్పుడో రాత్రి పది గంటలకు. ఇప్పుడే వెళ్ళి భజన చేస్తావా?” ”బాగుంది నీ వరస. అప్పటి  దాకా లేడీస్‌ హాస్టలులోనే తిష్ఠవేస్తావా ఏం?” అతను నవ్వలేదు.

– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో