ఎమెన్ ఉక్కు మహిళ,విప్లవమాత నోబెల్ గ్రహీత –తవక్కోల్ కర్మన్ – గబ్బిట దుర్గాప్రాసాద్

1979 లో ఫిబ్రవరి 7న యెమెన్ లో తైజ్ గవర్నమెంట్ లోని మేకాఫ్ లో పుట్టిన ఎమెన్ జర్నలిస్ట్ ,రాజకీయ నాయకురాలు ,ఆల్ ఇస్లా పార్టీ నాయకురాలు ,మానవ హక్కుల పోరాట యోధురాలు తవక్కోల్ కర్మన్ ‘’సంకెళ్ళు లేని మహిళా జర్నలిస్ట్ ‘’ల సంస్థ స్థాపకురాలు . తైజ్ యెమెన్ లో మూడవ పెద్ద నగరం .కన్జర్వేటివ్ దృక్పథమున్న దేశం యెమెన్ .తండ్రి అబ్దేల్ సల్మాన్ కర్మన్ .ఆలీ అబ్దుల్లా ప్రభుత్వం లో న్యాయ శాఖా మంత్రిగా చేసి రిజైన్ చేశాడు .అన్న తారిక్ కర్మన్ గొప్ప కవి .తమ్ముడు ఆల్ జజీరా పత్రికకు జర్నలిస్ట్ . యూనివర్సిటి ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో చదివి కామర్స్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని ,శానా యూని వర్సిటి నుండి పొలిటికల్ సైన్స్ లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందింది .కెనడాలోని యూని వర్సిటీ ఆఫ్ అల్బెర్టా నుండి ‘’అంతర్జాతీయ న్యాయం ‘’పై గౌరవ డాక్టరేట్ అందుకొన్నది .తవక్కోల్ మహమ్మద్ అల్ నహ్వి ని పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లల తల్లి అయింది .

2010లో ఒక మహిళ కర్మన్ ను ‘’జాంబియ ‘’తో హత్య చేసే ప్రయత్నం చేస్తే ,అనుచరులు వెంటనే స్పందించి కాపాడారు .ఈ హత్యా ప్రయత్నం ప్రెసిడెంట్ సలేహా కుట్రయే అని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది .తాను టర్కీ దేశం లోని ‘’కారమాన్ ప్రాంతం ‘’కు చెందిన దానినని చెప్పింది .టర్కిష్ ప్రభుత్వం ఆమెకు పౌరసత్వాన్ని అందజేసింది .ఈమె 2012లో అందుకొన్నది . 2011లో అంతర్జాతీయ ప్రాముఖ్యం పొందిన విప్లవ నాయకురాలు .ఉక్కు మహిళా గా ,విప్లవ మాత గా యెమెన్ ప్రజా హృదయాలలో నిలిచిపోయిన అరుదైన వ్యక్తిత్వం ఉన్న మహిళా నాయకురాలు .2011లో నోబెల్ శాంతి బహుమతిని అందుకొన్న మొదటి యెమెని గా ,,మొట్టమొదటి ఆరబ్ మహిళగా రికార్డ్ సృష్టించింది . నోబెల్ అందుకొన్న రెండవ ముస్లిం మహిళ మాత్రమేకాక పిన్నవయసులో అందుకొన్న రెండవ ముస్లిం మహిళ కూడా .

2005లో ఎమెని జర్నలిస్ట్ గా గుర్తింపు పొంది ‘’చరవాణి సేవల ‘( సెల్ సర్వీసేస్ )వ్యాప్తికోసం ప్రచారం చేసిన మహిళ కర్మన్ .ఆమె పోరాట పటిమ ఫలించి రెండేళ్ళ తర్వాత అమలైంది .తర్వాత పత్రికా స్వాతంత్ర్యం కోసం ఉద్యమించింది .మానవ హక్కుల పోరాట౦ కోసం ’’వుమెన్ జర్నలిస్ట్స్ వితౌట్ చైన్స్ ‘’అనే సంస్థను మరొక 7గురు జర్నలిస్ట్ లతో కలిసి స్థాపించింది .భావ ప్రకటన స్వేచ్చ ,ప్రజాస్వామిక హక్కుల సాధనే ఈసంస్థ ధ్యేయం .ప్రభుత్వ ప్రజా సంబంధాల శాఖ జర్నలిస్ట్ లను వేధిస్తోందని బెదిరిస్తోందని ,పత్రికా స్వేచ్చకు అడ్డుపడుతోందని ఉద్యమించింది .’’ఆల్ తాజ్రా ‘’పత్రికతో కలిసి పనిచేసింది .ఎమెని జర్నలిస్ట్ సిండికేట్ లో మెంబర్ అయింది . 2007మే నెల నుండి వారానికో సారి సంస్కరణల కోసం వరుస నిరసనలు తెలియ జేసే కార్యక్రమం చేపట్టింది .తాను ‘’ఆరబ్ స్ప్రింగ్ ‘’అని ముద్దుగా పిలుచుకొనే ‘’జాస్మిన్ రివల్యూషన్ ‘’కు మద్దతు పలికింది .జినే ఎల్ అబిదీని బెన్ ఆలీ ప్రభుత్వాన్ని ట్యునీషియన్ ప్రజలు 2011 జనవరిలో కూల్చినప్పుడు ,ఈమె వ్యతిరేకించి ప్రెసిడెంట్ ఆలీ అబ్దుల్లా సాలె పాలనకు మంగళం పాడాలని పిలుపు నిచ్చింది .సౌదీ అరేబియాను వ్యతిరేకిస్తూనే రహస్యం గా ఆమె సౌదీల మద్దతు కోసం మీటింగ్ లు నిర్వహించినట్లు ‘’వీకీ లీక్స్ ‘’ద్వారా వార్త’’లీక్’’అయింది .సౌదీలతో మధ్యంతర ఒప్పందం కుదర్చటం ఆమె విప్లవ వ్యతిరేకిగాఅభియోగాన్ని ఎదుర్కొన్నది .దీనికి రహస్య విప్లవ సంస్థలైన హౌతీలకు ,ఆల్ ఖైదా కు అబిద్ రబ్బూ హాది సహకరిస్తున్నాడని నిందించింది .

తవక్కోల్ కర్మన్ ‘’ఆల్ ఇస్లా ‘’అనే ప్రతిపక్ష పార్టీ సభ్యురాలై ,’’షూరా కౌన్సిల్ ‘’లో పార్టీ సభ్యురాలుగా ఎన్నికైంది .ఇదిపార్లమెంట్ సీట్ కాదు .మొదట్లో ప్రెసిడెంట్ సాలె కు ‘’గొడుగు పార్టీ ‘’గా ఉండి ,తక్కోవల్ వ్యతిరేకించటం తో దేశమంతా విస్తరించిన పార్టీ అయింది ఆల్ ఇస్లా పార్టీ .ఈ పార్టీలో కొందరు ‘’ముస్లిం బ్రదర్ హుడ్ ‘’’’సలాఫిస్ట్ ‘’లనే సంస్థలతో సంబందాలున్నవారు .కాని కర్మన్ మధ్యే మార్గాన్ని అనుసరించింది .తన పార్టీలోనే స్వతంత్ర దృక్పధం తో పని చేసేది .’’నా నమ్మకాలను బట్టే నా స్థానం .దాన్ని ప్రజలే నిర్ణయించాలి .దీనికోసం ఎవరి అనుమతి నాకు అక్కర్లేదు .’’అని ధైర్యంగా చెప్పింది .ముస్లిం మహిళా సంప్రదాయమైన దుస్తులు ధరించేదికాదు .ముఖం కనిపించేట్లు రంగు రంగుల ‘’హిజాబులు ‘’ధరించేది .2004లో మొదటిసారిగా హిజాబు డ్రెస్ తో బహిరంగం గా కనిపించింది .పూర్తిగా ముసుగు వేసుకోమని ఇస్లాం లో లేదని చెప్పింది .’’ఇప్పటిదాకా మనం మగాళ్ళకు భయ పడి బతుకుతున్నాం .ఇక మన జీవితాలను మనమే తీర్చి దిద్దుకోవాలి .దీనికి ఎవరి పర్మిషనూ అక్కర్లేదు ‘’అని స్త్రీలకు ఉద్బోధించింది .

ఎమెని బాలికలకు తలిదండ్రులు సరైన పోషకాహారం ఇవ్వకుండా మగ పిల్లలకే పెడుతూ వారినే జాగ్రత్తగా చూస్తూ ఆడ పిల్లల్ని హీనంగా చూస్తున్నారని చెప్పింది .పార్టీ సిద్ధాంతాలు వ్యతిరేకంగా 17ఏళ్ళ లోపు బాలికలకు వివాహం చేయరాదని హితవు చెప్పింది .ఎమెని విప్లవం రాజకీయ సాధనకే కాక ,సాంఘిక సమస్యా పరిష్కారంగా ముఖ్యంగా బాల్య వివాహాలను రద్దు పరచే సంస్కరణ లకోసం ఉండాలన్నది .ప్రభుత్వ అవినీతి పై ఉద్యమించింది .తాను ఏ విదేశీ ప్రభావానికీ లోనై పని చేయటం లేదని ప్రకటించింది .అమెరికాలోని మిచిగాన్ యూని వర్సిటి లో మాట్లాడుతూ కర్మన్ ‘’నేను ప్రపంచ పౌరురాలను .భూమి నా జాతి .మానవత్వం నా దేశం ‘’అని పలికిన విశ్వ పౌరురాలు తవక్కోల్ కర్మన్ .యెమెన్ ల అసంపూర్ణ విప్లవం పై న్యూయార్క్ టైమ్స్ పేపర్ లో రాస్తూ ‘’ అమెరికా ఆరబ్ దేశాలు యెమెన్ లో పాత ప్రభుత్వాలకు వత్తాసుపలుకుతూ ,ప్రజా వ్యతిరేకులౌతున్నాయి ‘’అన్నది .’’డెమోక్రసీ నౌ ‘’కు ఇంటర్వ్యు ఇస్తూ ‘’ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్చ యే రాజమార్గం .దీనికోసం మేము దేశమంతా ఉద్యమిస్తుంటే మమ్మల్ని ,ప్రజల్ని పాలకులు అణగ దొక్కాలని ప్రయత్నిస్తున్నారు’’అన్నది .కర్మన్ తో పాటు ఆదేశం లోని 30 శాతం మహిళలు బుజాలు కలిపి నడిచి చరిత్ర సృస్తించారు .

నోబెల్ శాంతి బహుమతి పొందాక కర్మన్ అంతర్జాతీయ వేదికలలో తన దేశం లోని అప్రజాస్వామిక అవినీతి ప్రభుత్వాన్ని పడగొట్ట టానికి సాయం చేయమని కోరింది .అంతర్జాతీయ సమితిని ఆశ్రయించి సెక్యూరిటీ కౌన్సిల్ లో తన వాణి వినిపించి యెమెన్ కు న్యాయం చేయమని అర్ధించింది .ప్రెసిడెంట్ సాలేహా ప్రభుత్వాన్ని ను బర్తరఫ్ చేయాల్సిందేనని కక్షమించ రాదనీ పట్టు బట్టింది.దీనిఫలితంగా 2014లో సెక్యూరిటీ కౌన్సిల్ సాలేహా ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రజాందోళన కారులపై ఉక్కు పాదాల్ని మోపటం అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని తీర్మానం చేసింది .యునైటెడ్ స్టేట్స్ సెక్రెటరి ఆఫ్ స్టేట్ హిల్లరి రోదాం క్లింటన్ ను అక్టోబర్ 28న కలిసి యెమెన్ దుస్థితి వివరించింది .ఆమె ‘’యెమెన్ లో ప్రజాస్వామిక పరివర్తన అనివార్యమని ఆ ప్రజల హక్కులకోసం ,తమ నాయకులను తామే ఎన్నుకొనే స్వేచ్చకోసం మేము మద్దతు ఇస్తాం ‘’అని ప్రకటించింది .ఇవన్నీ కంటి తుడుపుమాటలే నని గ్రహించి యెమెన్ కు వచ్చి ప్రెస్ మీట్ లో ‘’ఇప్పటికి 9నెలలుగా ప్రజలు కటకటాల లో దుర్భరంగా బతుకుతున్నారు .ఎమనీ ప్రజల త్యాగాలు ప్రెసిడెంట్ ఒబామా కు కనపడటం లేదా?ఒక్క సారైనా వచ్చి ఓదార్చాడా ?పైగా సాలేహాకు అన్ని రకాల సాహాయం చేస్తు,పదవి గ్యారంటీ చేస్తూ ప్రవర్తిస్తున్నాడు . ఇదేనా ప్రజాస్వామ్యం ?’’అని హెచ్చరించింది కర్మన్ .చివరికి సాలేహా గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ ప్లాన్ పై సంతకం చేసి రాజీనామా చేసి 23-11-2011న అధికారాలను అబిద్ ఆల్రబ్బూ మన్సూరి కి అప్పగించాడు .

నోబెల్ బహుమతికి స్పందిస్తూ కర్మన్ ‘’ఇది నేను ఊహించనిది. ఆశ్చర్యమేస్తోంది .ఈ అవార్డ్ మా శాంతియుత విప్లవానికి విజయ సంకేతం. ఈ పురస్కారాన్ని మా యువతకు ఆరబ్ ,ఈజిప్ట్ ట్యునీషియా మహిళా లోకానికి అంకితమిస్తున్నాను .శాంతియుత వాతావరణం లేకుండా యెమెన్ కాని మరేదేశం కాని నిర్మింప బడలేదు ,బడదు కూడా ‘’అని సంతోషాన్ని ఆనందాన్ని ప్రకటించింది .తరువాత కటార్ వెళ్లి షేక్ తమీం నుకలిసి ,’’దోహాసెంటర్ ఫర్ మీడియా ఫ్రీడం ‘’వారిని యెమెన్ లో టెలివిజన్ రేడియో కేంద్రాలను ఏర్పాటు చేసి’’ క్వీన్ఆఫ్ షీబా’’ గౌరవార్ధం ‘’బిల్ కిస్ ‘’పేరు పెట్టమని కోరింది .దీనివలన యెమెన్ లోని యువ మహిళా జర్నలిస్ట్ ల విద్యా వ్యాప్తి బాగా జరుగుతుందని తెలియ జేసింది .యెమెన్ లోని అంతర్జాతీయ మీడియా సంస్థ సలహా సంఘం లో సభ్యురాలై గౌరవం పొందింది .అండర్ గ్రాడ్యుయేట్ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ జర్నలిస్ట్ లకు స్కాలర్ షిప్ లను అందజేస్తోంది .2011లోవందమంది ’’ గ్లోబల్ థింకర్స్’’ లో ‘’విదేశీ విధానం ‘’లో మొదటి స్థానం పొంది అరుదైన గౌరవం పొందింది కర్మన్ .ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి వందలాది కాలేజీలలో యూని వర్సిటీలలో ప్రసంగించి యువతను ప్రభావితం చేసింది .

తవక్కోల్ కర్మన్ రచనలు బాగా ప్రసిద్ధమైనాయి .అందులో కొన్ని – ‘’బర్నింగ్ ఎంబసీ ఈజ్ నాట్ ది వే’’,ది వరల్డ్ మస్ట్ నాట్ ఫోర్సేక్ ఎమేన్స్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడం ‘’,మోర్సీ ఈజ్ అరబ్ వరల్డ్స్ మండేలా ‘’’. జీవితమంతా పోరాటం లోనే గడుపుతున్న ఆదర్శ మహిళా జాతి రత్నం తవక్కోల్ కర్మన్ .తనజాతి తన ప్రజలు ,వారి హక్కులు సంక్షేమమే ఆమె ఊపిరి ,శ్వాస .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో