మహిళారాజకీయ సాధికారత రచనలు – డా.బి.వి.వి. బాలకృష్ణ

         

ISSN 2278-478

         

డా.బి.వి.వి. బాలకృష్ణ

డా.బి.వి.వి. బాలకృష్ణ

‘‘నవీన యుగపు స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది’’ అన్నారు గురజాడ 1909 సంవత్సరంలో, ఇది నూట ఏడు సంవత్సరాల నాటి మాట. జమిందారీ సంస్కృతి కొనసాగుతున్న రోజులు అవి. ఆనాడు తెల్ల వారి దాస్యంలో కృంగుతున్న భారతీయులం మనం, ఒక వంక కన్యాశ్కుం మరోవంక బాల్య  వివాహాలు , వేరొక వంక బాహుభార్యత్యం, నిర్భంద వైవిద్యం, సహగమనం వేశ్యాలోత్యం లాంటి సంకెళ్ళు స్త్రీలు  బందీలుగా ఉన్న రోజులు  అవి. భవిషత్తును ఆలోచించిన ఆశాజీవి అయిన గురజాడ ఎప్పటికైనా స్త్రీ విముక్తి పొందుతుందనే ఆశించాడు. ఆనాటి సమస్యలు , అవగాహన, ఆదర్శాలు , అనుభవాలు  వేరు. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో పయినిస్తున్నాం. శాస్త్రీయ దృక్ఫథం పెరిగింది. నాగరికత పెరిగి చంద్రుని మీదకు అడుగుపెట్టాం. అక్కడ నివాసం కొరకు ప్రయత్నాలు  చేస్తున్నాం. ఎన్నో అసాధ్యమైనవి సాధ్యమయినాయి. అయినా స్త్రీ పరిస్థితి యధాతధంగానే ఉంది. నాగరికత ప్రభావం వల్ల  వేషభాషలు  మారినా మానసిక దాస్య విముక్తి కలగలేదు. నేటి స్త్రీ ఇంకా ఒక అగ్నిగోళంలోనే జీవిస్తుంది. వరకట్న మరణ, అత్యాచారాలకి స్త్రీ ఇంకా  బలౌవుతూనే జీవిస్తుంది. వరకట్నం మరణాలు , అత్యాచారాలు  ఆమెను కబళిస్తూనే ఉన్నాయి. పితృసామ్య వ్యవస్థ లక్ష్యాలు , ఆదర్శాలు  ఆమె పట్ల ఘోరంగా వికటాట్టహాసం చేస్తూనే ఉన్నాయి. సీటస్‌ కమిటి వేశారు. మహిళా విశ్వవిద్యాయాలు  వెలిశాయి. జాతీయ మహిళా కమీషన్‌ ఉద్భవించింది. సంక్షేమ పథ కాలు , వితంతు పెన్షన్‌, స్థానిక ప్రభుత్వాలో 50% శాతం రిజర్వేషన్లు, గృహ హింస, నిర్భయ లాంటి చట్టాలు  అమలు  లోకి వచ్చాయి. అయినా మహిళకు స్వేచ్ఛా సమానత్వం ఇంకా  దూరంలోనే వుందనేది జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితి నుంచి మహిళా సాధికార సాధనకు మంచి రచనల అవసరం ఎంతైనాఉంది.

మహిళా సాధికారత అర్ధ వివరణ :`
మహిళ సమస్య పై చర్చించేటప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉపమోచిస్తున్న పదజాలం  ‘సాధికారత’ . మహిళాసాధికారం అంటే స్వయం నిర్ణయయాధికారం. సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో తమకు గల భాద్యతలు  హక్కుపట్ల అవగాహన కలిగి ఉండటం, వాటిని సాధించటానికి పురోగమించటం. సాధికారతలో అధికారం కీలకమైన అంశం. ఈ అధికారం వారి జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు  తీసుకొనే స్వయం నిర్ణయ అధికారానికి నిదర్శనం. సమాజాభివృద్ధిని తీసుకొనే నిర్ణయాంశాలలో భాగస్వామ్యం పొందటం మహిళా సాధికారత. ముఖ్యంగా రాజకీయ సాధికారత మహిళ అభివృద్ధిని స్త్రీ పురుష భేదం లేని సమాజస్థాపనకు అసవరం. ఇది సమసమాజాభివృద్ధి, విశ్వశాంతిని సాధించటానికి ఇది కీలకమౌతుంది. మహిళా రాజకీయ సాధికారత ఈ క్రింది 3 ప్రధాన అంశాపై ఆధాపడిఉంది.

1) స్త్రీ పురుష సమానత్వాన్ని ఆమోదించడం
2) మహిళ సంపూర్ణ అభివృద్ధి వారి హక్కుగా గుర్తించడం
3) మహిళ స్వయం నిర్ణయ అధికారం, స్వయం ప్రాతినిద్యం వారి హక్కుగా ఆమోదించడం
మహిళలు  తమ హక్కు పరిరక్షణ కోసం, స్వయం ప్రాతినిధ్యం, విధాన నిర్ణయావరణలో భాగస్వామ్యలు  కావాలంటే ముందుగా ఓటును సాధించి ఎన్నికలో పాల్గొని చట్టసభలో ప్రాతినిద్యం పొందినట్లయితే విద్యా  నిర్ణయావరణలో భాగస్వామలు  కావచ్చు.

భారత రాజ్యాంగం మహిళకు పురుషులుతో పాటు సమాన హక్కు, అవకాశాలు  కల్పించినప్పటికి వారి పాత్ర చట్ట సభలో నామ మాత్రంగానే ఉన్నది. ‘‘అన్నిరంగాలలో మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించినప్పుడే సమాజభ్యున్నతి సత్వరం సాధ్యం’’ అని గాంధీజీ అన్నారు.

అన్ని రాజకీయపక్షాలు  మహిళను చిన్న చూపు చూస్తున్నాయి. చట్టసభలో జరిగే ఎన్నికలలో రాజకీయపార్టీలు  30 శాతం స్థానాలు  మహిళను కేటాయించాని 1989 లో నేషనల్‌ పెరస్పెక్టివ్‌ ప్లాన్‌ సిపార్సు చేసింది. చాలా పార్టీలు  తమ ఎన్నిక ప్రణాళికలో 33% రిజర్వేషన్‌ కల్పించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించినా ఆచరణలో శూన్యహస్తం చూపిస్తున్నాయి. 1996 సెప్టెంబరు 12న నాటి ప్రధాని దేవగౌడ 81 వ రాజ్యాంగసవరణ బిల్లు  (1/3 సీట్లు మహిళకు కేటాయించే బిల్లు ) ఈనాటికి ఆమోదం పొందలేదు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలో మహిళకు 1/3 వంతు సీట్లు రిజర్వు చేసి దీనికోసం రాజ్యాంగంలో 243కి అధికరణను పొందుపరిచారు ఫలితంగా 10 లక్షలకు పైగా మహిళలు పంచాయితీ రాజ్‌ సంస్థలో సభ్యులు , అధ్యక్షస్థానాలు  పొందారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం 2014 స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో మహిళకు 50% శాతం కల్పించింది. వీరు అధికారాలోని వచ్చారు. కాని సాధికారతను సాధించలేకపోతున్నారు. రాజకీయ సాధికారత సాధించటానికి సిద్ధాంతపరమైన, సాహిత్య పరమైన కృషి చాలా అవసరం. ప్రస్తుతం ఈ కృషి చాలా తక్కువ స్థాయిలో జరుగుతుంది. మహిళా సాధికారత మీద వచ్చే రచనలు  మనకు మూడు రకాలుగా కనిపిస్తాయి.

1) స్త్రీ పురుష సంబంధాను గూర్చి భావజాలం  పునాదితో వచ్చే రచనలు .
2) భావజాలంతో సంబంధం లేకుండా స్త్రీ వేదనల్ని ఆర్ధ్రంగా చెప్పే రచనలు .
3) స్త్రీ సంక్షేమానికై సంబంధించి ప్రభుత్వం ఇచ్చే సమాచారం.

మహిళా సాధికారత పెంచాంటే స్ఫూర్తినిచ్చే రచనలు  అవసరం. ఉదాహరణకు న్లెూరు జిల్లా దూబగుంట గ్రామంలోని స్త్రీలు  మద్యపాన నిషేధానికి నిర్వహించిన ఉద్యమం. ఈ ఉద్యమానికి మూలం  ఆంధ్ర మహిళా సభవారు సాక్షరతా ఉద్యమానికై ప్రచురించిన పాఠ్య పుస్తకాలో చోటు చేసుకొన్న కథ పేరు ‘‘ఐకమత్యం’’ (సీతమ్మ కథ). స్త్రీలు  అందరూ అక్షరాశ్యులైతే తాగుబోతు కుటుంబాలు బాగుపడతాయన్న సందేశం ఈ కథలో ఉంది. సీతమ్మ భర్త తాగుడు వ్యసనాన్ని అరికట్టటానికి స్త్రీలు  చదువు కోవటానికి ఎటువంటి ఉద్యమాన్ని నడిపిందో ఆ కథను పాఠంగా చదువుకున్న మహిళలు  అర్థం చేసుకున్నారు. దూబగుంట గ్రామంలో స్త్రీలు  అంతా ‘‘రోశమ్మ’’ అనే స్త్రీ నాయకత్వంలో ఉద్యమాన్ని నడిపి ప్రభుత్వాన్ని గడగడలాడించారు . (తరువాత రాజకీయ పార్టీలు  అన్ని ఈ ఉద్యమాన్ని తమ భుజాకెత్తుకున్నాయి) పై సంఘటన ఆనాడు రాష్ట్ర ప్రజలను మద్యపాన నిషేధ  ఉద్యమానికి దారితీయించగలిగింది. అదేవిధంగా మహిళా సాధికారిత పెరగటానికి ఈ క్రింది తరహా రచనలు  రావాలి.

1) జాతీయ ఉద్యమం గురించి జాతీయ ఉద్యమంలో పాల్గొన్న మహిళ చరిత్రలు  ప్రాంతీయ భాషలో రావాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన దుర్గాబాయి దేశ్‌ముఖ్‌. ఆమె 14 సంవత్సరాల  వయస్సులో అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలను నిర్వహించటంలో కీలకపాత్ర వహించింది.
2) మహిళలకు తమ స్వయం శక్తి పట్ల, ఆత్మస్థైర్యాన్ని యిచ్చే రచనలు  రావాలి.
3) వివాహ బంధంలో ఎదురైన ఇబ్బందులనైనా, స్త్రీ సమస్యనైనా చిత్రీకరిస్తూనే వాటిల్లో ఆత్మస్థైర్యంతో విజయాలు  సాధించిన లేదా పోరాటాలు  సాగించిన మహిళను స్పూర్తిగా చిత్రీకరిస్తూ కథలు , కథానికలు , కథాంశాలు  ప్రచురించాలి.
4) రాజకీయ రంగంలో వున్న మహిళను కుటుంబ నేపధ్యంలో వచ్చిన వ్యక్తులుగా కాక స్వయం శక్తితో ముందుకు వచ్చి వారి రాజకీయ జీవితాన్ని నిర్వహించిన మహిళ జీవితాను స్ఫూర్తిగా చిత్రీకరిస్తూ రచను రావాలి.
5) మహిళలు  రాజకీయ రంగంలో మరింత విస్తృతంగా పాల్గొనటం జరగాలి. దాని కొరకు ఉద్యమాలు , రచనలు  రావాలి. ఈ రచనలు  ప్రధానంగా రాజకీయ రంగంలో మహిళలు  ఎదుక్కొనే సమస్యలు , వాటిని విజయవంతంగా ఎదుర్కొన్న స్త్రీ గాథ పై రచనలు  రావాలి. రాజకీయ రంగంలో ఉన్న మహిళల కోసం రాజ్యాంగ నియమ నిబంధనను సరళీకృత భాషలో రావాలి. స్థానిక సంస్థలో మహిళకు రిజర్వేషన్లు కల్పించి వారిని అధికార పీఠంపై ఉంచినా తమ విధులేమిటో స్పష్టంగా తెలియని పరిస్థితి వుంది. కావున స్థానిక సంస్థ అధికారాలు , విధులు  గురించి స్పష్టంగా వివరించే రచనలు  రావాలి.
6) స్థానిక సంస్థకు సంబంధించి మహిళ రాజకీయ సాధికారత రావాంటే గ్రామీణ అభివృద్ధి, దాని ప్రాముఖ్యత గురించి రచనలు  ప్రాంతీయ భాషలో విరివిగా రావాలి.
7) రాజకీయ సంస్థ కార్యక్రమాల  నిర్వహణ పై రచనలు  రావాలి.
8) పంచాయతి రాజ్‌ వ్యవస్థలోని సభ్యుకు రాజకీయ సామాజిక పరిస్థితు అవగాహనకు సంబంధించిన రచను రావాలి.

9) స్థానిక సంస్థ నిర్వాహణలో విజయాలు  సాధించిన వారి గురించి, వారి కార్యక్రమాల  గురించి వివరించే రచనలు  రావాలి. ఉదాహరణకు కర్నూలు  జిల్లాలోని  సర్పంచ్‌ సాధించిన విజయాలకు ‘‘ఐక్యరాజ్య సమితి’’ గుర్తింపు నిచ్చింది. అలాంటి వారి గురించి రచనలు  వస్తే అవి తప్పక స్థానిక సంస్థలోని ఇతర సభ్యులకు స్ఫూర్తినిస్తాయి.

మహిళా రాజకీయ సాధికారత సాధించడానికి సానుకూలమైన అంశాలు  ప్రస్తుతం ఎన్నో ఉన్నాయి. వీటిని వినియోగించే చైతన్యం మహిళకు అందించాంటే ఈ అంశంపై మాక్సికుగోర్కి రచించిన  ‘అమ్మ’ లాంటి నవలలు  ఎన్నో రావాలి.
అమ్మనవల లో చెప్పుకోదగ్గ అంశం పెగేవావ్లాసావా అనే అమ్మపాత్ర చిత్రణ, అదే ఆ నవలను సజీవంగా ఉంచుతుంది. ఒకసాధారణ వ్యక్తి మెట్టుమెట్టుగా సజీవంగా ఎదిగి న్యాయం కోసం పోరాడే యోధురాలుగా పరిణమించడం ఈ పాత్రలో చూస్తాం. రచయితలు  సత్యాన్ని వెదజల్లుతూ , ఆకాంక్షను ఉత్తేజపరుస్తూ మహిళాసాధికారత సాహిత్యాన్ని ఉద్యమస్థాయిలో చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఊయల ఊపేశామిలే రాజ్యాన్ని ఏలుతాయి అనే లెనిన్‌ మాటలు  నిజం అవుతుంది అని ఆశిద్దాం.

– డా.బి.వి.వి. బాలకృష్ణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో