సహ జీవనం -7 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

ఒక నెల రోజులు అలాగే అవస్థపడి రత్నం చనిపోయింది. ఆమె చివరి క్షణాలలో అతని చేతుల్లోనే ప్రాణం వదిలింది. ఆమె ఇక లేదన్న వాస్తవాని అర్ధం చేసుకున్న ఆ క్షణంలో, అతని మెదడు మొద్దుబారి పోయింది. కళ్ళు తిరిగి కూలబడిపోయాడు. ఆ సమయంలో స్నేహితుడు ప్రసాదం పక్కనే వుండి, వెంటనే మొహం పైన కాసిని నీళ్ళు చల్లాడు. సుబ్రహ్మణ్యం కళ్ళు తెరచి బావురుమన్నాడు. ప్రసాదంకు కూడా చాల దుఃఖం వచ్చింది. స్నేహితుడికి వచ్చిన ఆపదకు చలించిపోయాడు. తను అనుభవించిన మానసిక క్షోభ కళ్ళకు కట్టినట్లు అయ్యింది. పక్క ఫ్లాటు లోనే ప్రసాదం , వాళ్ళావిడ- సరస్వతి వుంటున్నారు. వెంటనే సుబ్రహ్మణ్యంకు కాస్త కాఫీ తాగించి, సుభాషుకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత బంధువుల పేర్లు, ఫోన్లు డైరీలో చూసి అందరికి ఫోన్ చేశాడు. ఈ లోగా సుభాష్ నుంచి ఫోన్ వచ్చింది. తను బయల్దేరడానికి ఫ్లైట్ వెంటనే లేదని, రాత్రికి బయల్దేరు తున్నామని వచ్చేసరికి మరొక రోజు పడుతుందని చెప్పాడు. అప్పటిదాకా రత్నం బాడీని మార్చురీలో ఉంచే ఏర్పాటు చేసి, సుబ్రహ్మణ్యంను ప్రసాదం బలవంతాన తన ఫ్లాట్ లోకి తీసుకెళ్ళాడు.

కొడుకు రావడం, ఆ చెయ్యాల్సిన కర్మకాండలు పూర్తి చేశాక, మరో రెండు రోజులు ఆగి, సుబ్రహ్మణ్యంను తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. మొదట సుబ్రహ్మణ్యం ఊరు వదిలి వెళ్ళడానికి వప్పుకోలేదు. కానీ, కొడుకు, కోడలు, ప్రసాదం అందరూ అదే మంచిదని ఒప్పించారు. బలవంతాన సుబ్రహ్మణ్యం అమెరికా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినా, అతను మామూలు మనిషి కాలేక పోయాడు. ఇదివరకు మల్లే పిల్లలను పట్టించుకోవడం, వాళ్ళను చదివించడం లాంటివి చెయ్యలేక పోతున్నాడు. కన్ను మూసినా, తెరిచినా అతనికి రత్నం గుర్తుకొస్తోంది.అతను మళ్ళీ మామూలు మనిషి అవుతాడేమోనని, కోడలు కొద్ది రోజులు చూసింది.

కానీ, అతను తేరుకోక పోవడం వల్ల, పిల్లల్ని తను చూడాల్సి రావడం తప్పనిసరిగా మారింది. మామగారి మీద సింపతి కాస్తా చిరాకుగా మారింది. తనకు ఎక్కువ రోజులు సెలవు పెట్టివుండే వీలు లేదు. ఈ ఇబ్బందు లన్నిటికి మామగారే కారణమని ఆమె మనసులో ముద్ర పడిపోయింది. ఇంట్లో ఉంటూ తనకు, తన పిల్లలకు ఉపయోగపడనప్పుడు, ఈయన్ను ఇక్కడ పెట్టుకుని చూడాల్సిన అవసరం ఏమిటని అనుకుంది. మామ గారు ఇక్కడ ఎన్నాళ్ళు వున్నా మామూలు మనిషి కాలేరనీ, తిరిగి హైదరాబాదు వెడితే, అక్కడ స్నేహితులు ఉంటారు కనక మామూలు మనిషి కావచ్చని మెల్ల మెల్లగాభర్తకు నచ్చ చెప్పింది. సుభాష్ ఆమె చెప్పింది విన్నాడు. అలోచించి, తండ్రిని హైదరాబడు పంపడమే మేలనుకున్నాడు. ఒక రోజు అతను తండ్రితో ఆ ప్రస్థావన తీసుకోచ్చినప్పుడు, సుబ్రహ్మణ్యం హైదరాబాదు వెళ్ళడానికి సంతోషంగానే ఒప్పుకున్నాడు.

సుబ్రహ్మణ్యం అమెరికా నుంచి రాగానే, స్నేహితుడు ప్రసాదం వచ్చి కావిలించుకున్నాడు. వచ్చేశానని చెప్పగానే మంచి పని చేశావన్నాడు. ప్రసాదం, తను డిగ్రీ దాకా కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత వేర్వేరు ఉద్యోగాలలో చేరినా, అప్పుడప్పుడూ కలుసుకునే వారు. రిటైర్ అయ్యే నాటికి ఇద్దరూ ఒకే చోట నివాసాలు ఏర్పరుచుకున్నారు. తను ఆడిట్ ఆఫీసులో చేసి రిటైర్ అయితే, ప్రసాదం బ్యాంకు మేనేజరు చేసి రిటైర్ అయ్యాడు. ఆవిడ రెండో భార్య. మొదటి భార్య నీరజ కేన్సరుతో చనిపోయి పన్నెండేళ్ళు దాటింది. ఈ మధ్యలో ఎన్ని మార్పులు వాడి జీవితంలో! నీరజ చనిపోయేనాటికి పిల్లలు చిన్న వాళ్ళు. వాళ్ళ ఆలనాపాలనా చూడడానికి ఒక ఆడ మనిషి అవసరం.

అది గాక, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని, ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోతే, తర్వాత నీ జీవితం ఎలాగంటూ మరదల్నే చేసుకోమని వాళ్ళ మామగారు బలవంతపెట్టి ఒప్పించాడు. స్వంత పిన్ని అయినా ఆ పెళ్లి వాడి కూతురుకు,కొడుక్కూ ఇష్టం లేకపోయింది. కూతురు ఉషకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. కొడుకు సురేష్,తండ్రి మీద కోపంతో అతని మాట వినకుండా, తన ఆఫీసులో అమ్మాయినే పెళ్లి చేసుకుని చెన్నై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంట్లో ప్రసాదం, వాళ్ళావిడా మాత్రమే వుంటారు. కొడుకు,కోడలు రారు. ఫోను చేసినా పొడి పొడిగా మాట్లాడుతారు. మనవడు పుట్టినా, బాలసారెకు వాడు రమ్మన లేదు. చూడడానికి వెళ్ళి, అక్కడ కోడలు చేసిన అమర్యాదకు కష్టం వేసి ఇద్దరూ వెంటనే తిరిగి వచ్చేశారు. ఉష ఎప్పుడన్నా వచ్చి చూసి పోతుంది. అది వచ్చిందంటే పెట్టుపోతలు సరిగా లేవని పినతల్లిని సాధించి పోతుంది. తన తల్లే కనక బతికి ఉంటే, ఎంతో బాగా చూసేదని నిష్టూరంగా మాట్లాడుతుంది..

-టి.వి.యస్.రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో