పాణిగ్రహణం పదిరోజులల్లో(పుస్తక సమీక్ష )- మాలా కుమార్

రచయిత్రి;గోవిందరాజు మాధురి

అబ్బాయి అమెరికా లో ఉన్నాడు.చదువైపోయి, ఉద్యోగం లో చేరాడు.ఇంక పెళ్ళికోసం తొందరపడుతున్నాడు.పద్దతిగా అమ్మానాన్నకు సంబంధం చూడమని చెప్పాడు.మ్య్యారేజ్ బ్యూరో లో పేరు నమోదు చేసి పెళ్ళికూతురిని వెతికి అబ్బాయి ఇష్టప్రకారమే చూసారు.అంతే పాణిగ్రహణం పదిరోజుల్లో ఐపోయింది.కోడలు అత్తవారింటికి వచ్చింది.వచ్చిన కోడలు అందరికీ నచ్చింది.కాని ఆ కోడలు పాతతరం కోడలు కాదే!ఈ కాలపు గడుసు అమ్మాయి.తెలివైనది.

?అత్తగారికి కోడలు తెలివిగా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటే సంతోషమే కాని “అత్తగారి బ్రాండ్ అంబాసిడర్ “గా ఉండాలని ముచ్చట.అలాకాదు అత్తగారు పెద్ద పోస్ట్ అని భావించకుండా అందరూ ఎంతలో ఉండాలో అంతలో ఉంటూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ అభిమానంగా ఉండాలి అని తెలియచెప్పిందీ కోడలు.  అత్తగారికి కొత్త స్మార్ట్ ఫోన్ కొని ఇచ్చి అందులో ‘అత్తాకోడళ్ళ ఆత్మీయతలు ‘ అనే గ్రూప్ చేసి చేర్చింది.ఇక అత్తగారికి సమయమే లేదు అన్నీ మెసేజ్ లే మెసేజ్ లు !                                                                                                                         తీర్ధయాత్రలకు వెళ్ళాలి అని సరదా ఉన్న అత్తగారికి ఆన్ లైన్ లో అన్ని ఏర్పాట్లూ చేసి మంచి టూల్ బార్ కోడలు అని పేరు తెచ్చుకుంది!

అత్తగారేమన్నా తక్కువ తిన్నదా?తన గొంతును సైలెంట్ మోడ్లో ఉంచి తన గొప్పతనం నిరూపించుకున్నది.బంగారు పాపాయిని ఈ ఉయ్యాల, ఈ పాటలు ,ఈ బొమ్మలతో పెంచుతున్న కోడలికి పాటల తో ముచ్చట్లతో ఎలా ఆక్టివ్ గా ఉంచాలో నేర్పించింది.
ఎలా అత్తాకోడళ్ళ మధ్యన ఉన్న ఆత్మీయ అనురాగాన్ని గురించి ఆహ్లాదంగా సరదగా చెప్పారు రచయిత్రి గోవిందరాజు మాధురి “పాణిగ్రహణం పదిరోజుల్లో”పుస్తకములో. ఇందులో మొత్తం పదికథలు ఉన్నాయి.అన్నీ అత్తకోడళ్ళ అనుబంధం గురించినవే.భానుమతి అత్తగారి కథల తరువాత ఆత్తకోడళ్ళ కథల సంకలనము చదవటము నేను ఇదే మొదటిసారి.రచయిత్రి సైకాలజీ లో యం.ఎస్.సీ చేసారు కాబట్టి అత్తకోడళ్ళ సైకాలజీని అందంగా చెప్పగలిగారు.

ఈ పుస్తకము ధర 100 రూపాయలు.విశాలాంధ్ర బుక్ హోం అన్ని బ్రాంచ్ లల్లోనూ,నవచేతన పబ్లిషింగ్ హౌస్ టి.యస్ లోనూ లభ్యమవుతాయి.

కథలు చదివాక రచయిత్రి కి మీ అభిప్రాయం చెప్పటం మర్చిపోకండి.రచయిత్రి సెల్.నంబర్;097011 37826..

-మాలా కుమార్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలు, , , , , , , , , , , , Permalink

2 Responses to పాణిగ్రహణం పదిరోజులల్లో(పుస్తక సమీక్ష )- మాలా కుమార్