ఇదే మా జవాబు – కవిని ఆలూరి

”లాఠీలు, తూటాలు, టియర్‌గ్యాసులే నీ నైజమయితే….
కారం పొడులు, చీపురు కట్టలు,
రోకలి బండలే మా సమాధానమవుతాయ్‌…”

Kavini Aluriరాత్రి 11 గంటలు కావొస్తోంది. నగరమంతా నిద్రలోకి జారుకుంటోంది . కానీ ఆ బస్తీలోని ప్రజలకు గతకొంత కాలంగా కింటి మీద కునుకు పడితే ఒట్టు. బస్తీ అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు ఇళ్ళ ముందు పడుకుని వున్న కుక్కల అరుపులు తప్ప మరేమీ వినపడడం లేదు. వీధిలైట్లు వెలుగుతున్నాయి. ఆ బస్తీలోని ప్రజలలో మూడు వంతుల మంది అడ్డా కూలీలే. మట్టి పనులు, డ్రైనేజీలు శుభ్రపరిచే పనులు, రోడ్లు ఊడ్చే పనులు చేసే వాళ్ళే అక్కడ ఎక్కువ. కమాన్‌ దగ్గర అడ్డా మీద కూర్చొని గుత్తేదారు ఎక్కడ పనికి పంపితే అక్కడకు వెళ్తుంటారు . గుత్తేదారు వాటాతో సహా అన్ని ఖర్చులు పోగా రోజు కూలీలో 70 రూ.లు మిగలటం కూడా కష్టమే. ఒక్కొక్క రోజు గంటల తరబడి కమాన్‌ దగ్గర కూర్చుంటారు . కానీ పని దొరికితే దొరికినట్టు, దొరకకపోతే పస్తులుంటారు . ఇంత మహానగరంలో ఉన్నా ఆ కుటుంబాలలో ఎక్కువ శాతం తిండి, బట్ట, చదువుకు నోచుకోలేదు సరికదా వాళ్ళ పిల్లలు కూడా రోజు కూలీ చేసుకునే బతుకుతుంటారు .

నిరక్ష్యరాస్యత, దారిద్య్రం అనుక్షణం వాళ్ళవెంటే వుంటాయి . బస్తీ మధ్య గుండా పోయే పెద్ద మురికి కాలువ, దాని వాసనలు, రోజంతా గుయ్‌మనే దోమల రొద వాళ్ళ జీవితాలలో భాగమయిపోయాయి. అప్పుడప్పుడు మంచి నీళ్ళలో డ్రైనేజీ నీళ్ళు కలవటం అక్కడ సాధారణం. రోజు కూలీ లేనిదే పొట్టగడవని ఆ జీవితాలకు డయేరియా, వైరల్‌ ఫీవర్లు అదనపు అలంకారాలు. కొంత ఆర్థికంగా మెరుగ్గా వున్న కుటుంబాలు ఒకి, రెండు గదులు వాళ్ళకోసం ఉంచుకుని మిగతా గదులను బ్యాచులర్లకు రెంటుకు ఇస్తుంటారు. రెంటు తక్కువగా ఉండి సిటిలో ఎక్కడకు వెళ్ళాలన్నా అందుబాటులో వుంటుందని ఊళ్ళ నుండి యూనివర్శిటికి వచ్చి చదువుకునే పేద విద్యార్థులు ఎక్కువగా ఇక్కడ రెంటుకు తీసుకుని వుంటారు . సంవత్సర కాలంగా ఆ బస్తీలోని వాతావరణం ఎమర్జెన్సీని తలపిస్తోంది. అడపాదడపా పోలీసుల, సి.ఆర్‌.పి.ఎఫ్‌ జవాన్ల దాడులు సర్వసాధారణ మయిపోయాయి. ఆటో ఖర్చులు భరించలేక, కూలీకిపోలేక, రోజు గడవక నానా తిప్పలు పడుతున్నారు బస్తీ వాసులు. అక్కడి వాతావరణం ఎంతగా భయవిహ్వలంగా మారిందంటే రోడ్డు మీద వున్న చింత చెట్టు ఆకు కూడా చిరుగాలికే గజగజలాడుతోందా అన్నంతగా!

”అవ్వా…. మనం ఈడ ఉండొద్దు…. ఇల్లిడిసి ఎల్లిపోదాం”. 10 సంవత్సరాల లింగమ్మ మనవడు నిద్రలోనే ఇలా కలవరించడం ఎన్నో సారో….
నుదుటి మీద రూపాయి బిళ్ళంత పెద్ద బొట్టు. గ్టిగా లాగి ముడేసినట్టు ఉన్న జుట్టు. కాళ్ళకు కడియాలు. రెండు చేతుల నిండామట్టి గాజులు. పాదాల కంటే పైకి కట్టిన ముతక చీర. దాదాపుగా ఆ బస్తీలోని అందరికీ లింగమ్మ రూపం సుపరిచితమే. లింగమ్మది నాలుగు గదుల ఇళ్ళు కింద రెండు గదులు. వాటి పైన రెండు గదులను నానా కష్టాలు పడి వేసుకున్నారు. లింగమ్మ భర్త మేస్త్రీ పని చేస్తుంటాడు.కొడుకు కరెంటు పని చేస్తుంటాడు. కొడుకు, కోడలు, మనవడితో కింది రెండు గదుల్లో వాళ్ళు ఉంటూ పై రెండు గదులను బ్యాచులర్లకు రెంటుకి ఇచ్చింది లింగమ్మ. పడుకున్నదన్న మాటే కానీ ఎంతకీ ఆమెకు నిద్రపట్టడం లేదు. నిన్నకొడుకు అన్నమాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి.

”అమ్మా… బస్తీలో ఉండుడు కష్టమయితంది. ఎటైనా పోయి ఉందామే!”
”అట్టనుకుంటే ఎట్టా బిడ్డా… ఈ బస్తీలో కొద్దో గొప్పో మనమే మంచిగున్నాం.. నువ్వు కొలువు చేస్తుంటివి. బాచులరు పిల్లలు కిరాయి ఇస్తుండ్రి. ఇంటికిరాయి కట్టుడు లేదాయె. మనమే అట్టనుకుంటె.. దినాం కూలీకి పోయేటోళ్ళు ఈ బస్తీలో ఎక్కువ. ఆళ్ళు ఏమనుకోవాలె…”

”పోలీసోళ్ళు ఈ బస్తోళ్ళను బతకనిస్తరామ్మా… బతకనీయరి. డ్యూటీకి పోవుడూ వచ్చుడు కూడా కష్టమయితంది. ఈడ ఏం ఉంటం…?”
”మనం ఇప్పుడొచ్చినామా ఈడికి…ఓ ..జమానాలో వస్తిమి… గప్పుడు మీరు పుట్టకనే పోతిరి. ఇది గప్పుడు అడివి లెక్కుండె… అన్నీ సింతసెట్లేనాయె … ఎట్టనో బతుక్కుంట వస్తుంటిమి. గిప్పుడు గీ బస్తిని వొదిలి ఏడికి పోతాం …” ఊరికాడికి పోదాం … ఏదో ఓి పని సేసుకుని బతుకుదాం. ఈ కొలువు ఇగ నేజెయ్య …” ఏదో నిశ్చయించుకున్నట్లుగా మ్లాడుతున్న కొడుకును చూస్తూ…. ”ఊరికాడికెళ్ళి ఎట్టబతకాలె … ఆడ మనకేం లేదు. గీ మిల్టరోళ్ళు వచ్చిన సందె బస్తీ గిట్లయ్యింది … ఈ బస్తీని పట్టించుకునే వాళ్లే లేరు.” అన్నది లింగమ్మ.

ఆ రోజును మర్చిపోవాలన్నా మర్చిపోలేక పోతోంది లింగమ్మ. యూనివర్శిటీలో మెస్సులు బందయి అప్పికి చాలా రోజులయ్యింది. హాస్టళ్ళో ఉండే విద్యార్థులు ఆకలికి అలమించి పోతున్నారు. నీళ్ళు, తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ బాధ చూడలేక బస్తీలో కొంచెం ఆర్థికంగా బాగున్నవాళ్ళందరూ కలిసి తలా ఇంత వేసుకుని ఒక పూట ఆ పిల్లలకు అన్నం ప్టోలనుకున్నారు. రోడ్డు మీద ఉండే షాపుల పక్కన వేప, చింత చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకింద వంట చెయ్యాలనుకున్నారు. మధ్యాహ్నం అయ్యింది. కాంపస్‌ పిల్లలు, రూముల్లో ఉండే పిల్లలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. అందరూ ఒకచోట గుమిగూడి మీటింగ్‌ పెట్టుకున్నారు. అన్నాలు తినే వాళ్ళు అన్నం తింటూనే వింటున్నారు.
అదే సమయానికి …..ఎక్కడ నుండి వచ్చారో …ఏమో … ఒక వ్యాను నిండా పోలీసోళ్ళు వచ్చారు.

లాఠీలు, తుపాకులతో, హెల్మెట్లు, బూట్లు, రక్షక కవచాలతో గబగబా వ్యాను దిగుతున్నారు. దిగీదిగగానే ”ఒక్కొక్కడ్ని .. కొట్టండి” అంటూ ఒక పోలీసాయన అరుస్తుంటే… ”బాగా కొట్టండి.. తరమండి.. ” అని ఇంకొక పోలీసాయన అంటున్నాడు. లింగమ్మ కూడా అక్కడే వున్నది. పోలీసులు వ్యానులోంచి దిగుతుండడం చూసి ఎక్కడి వాళ్ళక్కడ పరుగెత్తడం మొదలు ప్టోరు. వెంటబడి దొరికిన వాళ్ళను దొరికినట్టుగా కొడుతున్నారు. ఒక్కరిని పదిమంది కొడుతున్నారు. షాపుల దగ్గర ఉన్న లింగమ్మకు నోట మాట రాలేదు. ”ఓయమ్మో… మస్తు కొడుతుండ్రు పిల్లల” అని అరవాలనుకుంది. కానీ గుండె దడతో నోటమాట రాలేదు. అలాగే చూస్తూ ఉండి పోయింది. పరుగెత్తగలిగిన వాళ్ళు పరుగెత్తుతున్నారు. ఇద్దరు ముగ్గురు పిల్లలు మాత్రం పరుగెత్తలేక వాళ్ళకు దొరికి పోయారు. దొరికిన వాళ్ళను విపరీతంగా కొడుతున్నారు. ఓయమ్మో … సచ్చిపోతుండ్రే .. దొరికినోళ్ళను దొరికినట్టు కొడుతుండ్రే… నాకు భయమయితంది….” పైకే అంటూ చీర కుచ్చెళ్ళు పట్టుకుని గల్లీలోకి పరిగెత్తింది లింగమ్మ. స్టూడెంట్స్ గల్లీలోకి పరుగెత్తుకుని వస్తుంటే వాళ్ళ వెనకే పోలీసులు వస్తున్నారు.

ఆ ఇరుకు గల్లీలో చిన్న పిల్లలు, ముసలివాళ్ళు, మహిళలు అన్న తేడాలేకుండా అందరినీ లాఠీలతో ఇష్టం వచ్చినట్లు కొడుతూ, కిందపడిన వాళ్ళను బూటుకాళ్ళతో తొక్కుతున్నారు. ఇళ్ళలోకి వెళ్ళిన స్టూడెంట్సును ఇళ్ళల్లో జొరబడి లాక్కొస్తున్నారు. విపరీతంగా కొడుతున్నారు. కమాన్‌ నుంచి లోపలకు టూవిలర్‌పై వచ్చే వాళ్ళను ఆపి వారి బండ్లను గుంజుకుని మరీ కొడుతున్నారు. ఆ గల్లీ, బస్తీ అంతా భయంతో ఒక్కసారిగా వణికిపోయింది. చిన్న పిల్లల ఏడుపులు, బూట్ల చప్పుళ్లతో నిండిపోయింది. భయంతో లింగమ్మ పరుగెత్తుకుంటూ ఇంటికొచ్చింది. చతికిలబడింది. గబగబా కోడలు ఇచ్చిన గ్లాసు నీళ్ళు తాగింది. ఆమె వెనకాలే పోలీసులు… ‘ఓయమ్మో… ఈళ్ళు ఇటే వస్తుండ్రేంది…’ అని కోడలితో అంటూ చతికిలబడి కూర్చున్నదల్లా లేచి నిలబడి గుమ్మంలోకి వచ్చింది. మిగతా ఇళ్ళలోని ఆడవాళ్ళు అందరూ రోడ్డు మీదకు వస్తున్నారు. లేని ధైర్యం తెచ్చుకుని పోలీసుల్ని నిలదీసింది లింగమ్మ.

”అవునయ్యా… పిల్లలనెందుకు కొట్టి సంపాలె… ఆడుసు కాలేజి పుట్టిన  సంది ఈ పిల్లలు గీడ సదువుకునేటోళ్ళాయె…”
ఇళ్ళలోకి జొరబడి చేసిన భీభత్సానికి ఆడవాళ్ళందరూ తిట్లు మొదలు ప్టోరు.

”మీకెందుకు భయం… మీకెందుకు గింత దొంగతనం …తుపాకులు పట్టుకుని ఇళ్ళలోకొచ్చి ఈ కొట్టుడేంది…?” ఇంకొకామె కలగజేసుకుంది.

”మీరు ఇళ్ళలో పిల్లల్ని ఉంచుకోవద్దు. మనిషికి 200 నుండి 300 దాకా పైసలిస్తాం ప్టీయండి…” ఆ పోలీసుల్లోని ఒక పోలీసాయన అన్నాడు.

”తల్లినిడిసి, తండ్రినిడిసి లచ్చలు గ్టి సదువుతుండ్రు …ఆళ్ళు మా కొడుకులే… ఆళ్ళను మేం ఆగం చెయ్యం” ఇంకొకామె గ్టిగా అన్నది.

”తెలంగాణ గురించి మ్లాడుతుండ్రు కానీ ఆళ్ళు ఎవర్నీ దోసుకు తింటలేరే … గుంజుకుంటలేరే… దొంగతనం చేస్తుండ్రా …ఎవర్నన్నా కొడుతుండ్రా… మీరెందుకు పిల్లల ఎనక పడుతుండ్రు” శక్తినంతా కూడదీసుకుని అన్నది లింగమ్మ.
ఆళ్ళను పట్టీయండి … పైసలిస్తం” అసహనంగా అన్నాడు ఇందాకటి పోలీసాయన.

”మేమే ఇస్తం.. మనిసికి రొండొందలు … మీ పాడె మీద ఏస్కోరి… ” అంటూ నలుగురైదుగురు ఆడవాళ్ళు దుమ్మెత్తి పోయటం మొదలు పెట్టారు. పోలీసులు పిట్టగోడలు దూకి ఇళ్ళల్లో దొరికిన వాళ్ళను దొరికినట్లుగా కొట్టుకుంటూ వ్యానులోకి ఎక్కించుకుని తీసుకపోయారు.

(ఇంకా ఉంది )

-కవిని ఆలూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో