సహ జీవనం -2 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

“ఇవాళ కాదు, రేపే మన ప్రయాణం. తత్కాల్ టిక్కెట్లు తీసుకున్నాను. మన బట్టలు సర్దు.”

శాంత మొహం ఆనందంతో వెలిగిపోయింది “హమ్మయ్య, ఇప్పటికి మీకు నా బాధ అర్ధం అయ్యింది. ఎన్నాళ్ళయ్యింది వాడిని చూసి? వారం రోజుల నుండి గోల పెడుతున్నా వినకపోతిరి. పోనీలెండి, ఇప్పటికన్నా నా మాట విన్నారు. ఇదిగో, వంట అయిపొయింది. భోజనాలు కాగానే, బట్టలు సర్దేస్తాను.”

శ్రీనివాసరావు ఏం మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.భోజనం చేస్తున్నాడన్న మాటే కానీ,అతని మనసంతా కొడుకు సుధీర్ మీదే వుంది. అందరి లాగే తనూ కొడుకు ఇష్ట ప్రకారం బి.టెక్. చదివించాడు. చదువు అయిపోగానే, బెంగుళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. శ్రీనివాస రావు పని చేస్తున్న కంపెనీ బ్రాంచి లేకపోవడంతో, సుధీర్ ఒక్కడే చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ హోటల్లో భోజనం చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. గత నాలుగేళ్ళుగా ఇదే పరిస్థితి. అప్పుడప్పుడూ ఇద్దరూ వెళ్లి చూసినా, అది ఏ ఒకట్రెండు రోజుల భాగ్యమో అయ్యేది. షుగర్ పేషంటు అయిన భర్తతో ఉండడమే అవసరం అని, కొడుకు దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక రెండు రోజులు మాత్రమే వుండి వచ్చేది శాంత . పెళ్లి చేసేస్తే, వాడు వంటరిగా ఉన్నాడన్న బాధ తప్పుతుందని, గత నాలుగేళ్ళుగా సంబంధాలు చూస్తున్నారు, ఆ తల్లిదండ్రి. సరైన సంబంధం ఏది కుదరడం లేదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు వాళ్ళ కోరికలు స్పష్టంగా చెప్పేస్తున్నారు. తమకన్నా ఎక్కువ చదువుకున్న వాడే కావాలని కొందరంటే, మరికొందరు అమెరికా సంబంధమే మాకు ఇష్టం అని చప్పరించేస్తున్నారు. ఒకరిద్దరు శాంతను ‘ పెళ్ళయ్యాక మీరిద్దరూ ఎక్కడుంటారూ’ అని అడగడం కూడా జరిగింది. అలాంటి సంబంధాలు మాకు వద్దని వాళ్ళ ముందే చెప్పేశాడు సుధీర్.

సుధీర్ అటు వెళ్ళగానే, “వాడు బయటకు వెళ్ళింది ఆ అమ్మాయితో మాట్లాడటానికే” అన్నాడు శ్రీనివాసరావు.

“ఇదెక్కడి దిక్కుమాలిన సంస్కృతి అండీ? వీడిని ఎంతో జాగ్రతగా పెంచామే! ఇప్పుడిలా అయ్యాడేమిటీ?” కన్నీళ్ళు పెట్టుకుంది శాంత. శ్రీనివాసరావు మౌనంగా ఉండిపోయాడు.

ఇద్దరూ స్నానాలూ అవీ పూర్తి చేసి సోఫాలో కూర్చున్నారు. మాట్లాడుకోవడానికి మాటలు ఏమీ లేనట్లుగా వుంది. టి.వి. ఆన్ చేసి చూస్తున్నారన్న మాటే కానీ, వాళ్ళ దృష్టి మాత్రం అటు లేదు. ఏదో తెలియని ఆవేదనతో శాంత మనసంతా నిండి పోయింది. శ్రీనివాసరావు పైకి గంభీరంగా వున్నా, లోలోపల కొడుకు చేసిన పనికి చీకాకు పడుతున్నాడు.

“ఇంతకూ, ఆ అమ్మాయి కనపడదేమండి?” అడిగింది శాంత.

“నాకు మటుకు ఏం తెలుసు?” అన్నాడు శ్రీనివాసరావు.
ఈలోగా సుధీర్ క్యారేజి పుచ్చుకుని వచ్చేశాడు.

“అమ్మా, నేను స్నానం చేసి వస్తాను, రాగానే బోజనాలు చేద్దాం!”అంటూ ఏమీ జరగనట్లు టవల్ తీసుకుని బాత్రూం లోకి వెళ్ళిపోయాడు.

వీడు మన్ని తప్పించుకుని తిరుగుతున్నాడా? అయినా ఎంతసేపు ఇలా గడుపుతాడు?కనీసం భోజనాల తర్వాతైనా విషయం చెప్పాలిగా? శ్రీనివాసరావు మనసులో అనుకున్నాడు.

శాంత మాత్రం ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తోంది. వేరే కులం అయితే అయ్యింది. ఈ అమ్మాయిని కోడలు అనుకోవచ్చా? అసలు వీళ్ళిద్దరికీ పెళ్ళి అయినట్టా, కానట్టా? పెళ్ళి అయితే కోడలు అవుతుంది, కాకపోతే ఏమనాలి? ఆఅమ్మాయి ఎలాంటిదో? మనతో కలిసిపోతుందో, లేదో. ఈ కాలపు కోడళ్ళు పెళ్లి కాగానే, మొగుడ్ని తీసుకుని వేరుగా వెళ్ళిపోతున్నారు. అసలు ఈ బాంధవ్యం నిలిచేదేనా? ఆలోచించి, ఆలోచించి ఆమె బుర్ర వేడెక్కింది.

భోజనాల దగ్గర కూడా సుధీర్ ఏమి మాట్లాడలేదు. శ్రీనివాస రావు కొడుకు తనంతట తానే చెబుతాడు లెమ్మని ఓపికగా చూస్తున్నాడు.

భోజనాలైనాక, శాంత ఉండబట్టలేక అడిగింది “ఎవర్రా ఆ అమ్మాయి? వేరే కులం అమ్మాయిని ఎలా ఇష్టపడతామురా? కనీసం పెళ్లి అయినా చేసుకో వచ్చుగా? ఈ సహజీవనం ఎందుకు? అసలు వాళ్ళ వాళ్లకు ఈ విషయం తెలుసా?”

సుధీర్ తల్లి వంక చూసి నెమ్మదిగా చెప్పాడు “అమ్మా, ఆ అమ్మాయి నేను ఒకే ఆఫీసులో పని చేస్తున్నాం. మొదట ఒక ట్రైనింగులో కలిశాము.తర్వాత కూడా చాలా సార్లు ఆఫీసు మీటింగులలో కలుసుకున్నాం. అయినా ఇవాళ కుల మతాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదమ్మా! మనిషికి మనిషికి మధ్య అంతరాలు పెంచే ఈ కుల మతాలు నాకు అక్కర్లేదమ్మా! ఆ అమ్మాయిది మన కులం కాకపోతేనేం, మనిషి చాలా మంచిది. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు వచ్చింది. కానీ తొందర పడకూడదని ఆగాను. మరికొన్ని సార్లు మేము కలుసుకోవడం జరిగాక, నేను అప్పుడే అడిగేశాను మనం పెళ్లి చేసుకోవచ్చుగా అని. కానీ, ఆ అమ్మాయి తను ఇప్పుడే పెళ్లి చేసుకోదలచ లేదంటూ తన ఆలోచన చెప్పింది.”

 -టి.వి.యస్.రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో