క్రాంత దర్శి
స్వీయ జీవితాన్ని వెలిగించుకుంటాడు
నలుగురి జీవితాలనూ
వెలుగులోకి నడిపిస్తుంటాడు
****
ఈ జన్మనిచ్చిన వాళ్లకు
ఇంత గంజి పోయని వాడు
కొడుకని చెప్పుకుంటే సిగ్గు
పుడమికే వాడు బరువు
****
మనిషికి ఉండాల్సిన
మేలి గుణం విశ్వాసం
అదిలేని వానికన్నా
అవనిలో కుక్క నయం
****
కాషాయం ధరించిన వాడల్లా
కాడు పరమయోగి
ఇంద్రియాలను జయించినవాడే
ఇలపైన మహర్షి
****
ఆ కంఠం కోకిలకు
భగవంతుడిచ్చిన వరం
కాకి ఎంత అరిస్తేనేం
వస్తుందా కోకిల స్వరం
– తిరునగరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to ముక్తకాలు – తిరునగరి