*వయస్సులోనే
చెయ్యవలసినదంతా చెయ్యి
ముసలితనం పై బడ్డాక
మూల్గడమే సరిపోతుంది
*చేవ ఉన్నవాడు
ఠీవి గా నిలుస్తాడు
చవట ఎప్పుడూ
చతికిల పడ్తాడు
*చీకటీ వెలుగూ
వెరసి జీవితం
రాత్రి వెళ్లిపోగానే
పగలు వచ్చేస్తోంది
*కొందరి మాటల్లో
జిలేబీ తీపి
హృదయాల్లో మాత్రం
చంపేసే విషం
– తిరునగరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to ముక్తకాలు – తిరునగరి