జోగిని (ధారావాహిక ) – శాంతి ప్రబోధ

”మనకెందుకు ఇయ్యన్ని… ఆపైస తీసుకుంటే.. ఏ ఫికర్‌ లేకుంట ఉంటుండె. మనసులో మాట వెలిబుచ్చింది సాయవ్వ.
”ధూ… నువ్‌ బీ అట్లంట వేందే. ఈ ఓట్లల్ల మనువడ… అన్నదమ్ములెక్క ఉన్న మాల్లోలంత మనకే ఓటేత్తరనుకుిం… ఈల్లు మనల మనకే క్లొట బెట్టవట్టె” అంది తల్లితో. ఇంతలో” ఏందో పోశీ…గా పెద్ద మాలోడు లస్మడు అచ్చిన్రు. అంటూ వచ్చాడు పీరయ్య.

”ఓట్లల్ల కెల్లి ఈ వల్కి రమ్మంటున్నరు. ఇరవై ఏలుఇత్తడట జానారెడ్డి దొర” పోశవ్వ.
”ఏమన్నావే” పీరయ్య
”రానన్న” పోశవ్వ.
”మంచిగన్నవ్‌”..

”మీరంత నా కోసం తిర్గ బడ్తిరి. పెద్దగౌడ్‌ ఆల్ల్లిల్లను కాకుంట నిన్ను నిలబెట్టె..నీకు సెపకుంట అట్లెట్ల జేస్త” పోశవ్వ.
”మల్ల పెట్టెలు అచ్చినయి.. ఎవన్కి ఎన్ని గావాల్నంటే అన్ని సీసలు తాగుతున్నరు. మనమే గెలుత్తం” ధీమాగా చెప్పాడు పీరయ్య.
మాద్గిదానికి ఓటెయ్యడమా…? అని కొందరనుకుంటే, గౌడ్‌ పటేల్‌ పంపిన సీసలు పొట్ట పగిలే దంక తాగి గిప్పుడు ఓటెయ్యకుంటే ఎట్ల అని కొందరు అనుకున్నారు. ఏదైతేనేం 36 ఓట్ల మెజారితో పోశవ్వ గెలిచింది.

పోశవ్వకి తన గెలుపు వార్త పీరయ్య ద్వారా అందుకున్నప్పుడు గమ్మత్తైన అనుభూతి, శరీరంలోంచి ఒక రకమైన వణుకు.. అలా ఎందుకొస్తోందో…. ఆమెకు తెలియడం లేదు. గుండె ఆగి పోతుందేమోనన్న భయం… ఓ క్షణం… అంతలోనే ఆనందం.
ఈ రోజు నుంచి తను సర్పంచ్‌ పోశవ్వ… సర్పంచ్‌ పోశవ్వ మనసులోనే రెండు మూడు సార్లు మననం చేసుకుంది. అనుకున్న ప్రతిసారి వింతగా.. విచిత్రంగా…. నమ్మశక్యం కానట్లుగా… తన చేయి తనే గిల్లి చూస్కుంది. నిజమే తను సర్పంచ్‌ పోశవ్వే అనుకుంది. ”నడవ్వే… జల్ది… నీ నిశాని ఎయ్యాల్నట. జల్ది తోల్క రమ్మన్నడు సర్పంచ్‌ సాబ్‌” అన్నాడు పీరయ్య.

”అవ్‌… పేరు నాది. సర్పంచిగిరి గౌడ్‌సాబ్‌ది. నువు నిశాచి ఎయ్‌… చాలు అంత నే జూస్కుంట అన్నడు గద మనసులో అనుకున్న పోశవ్వ నడకలో వేగం తగ్గింది. ఇందాకి ఆనందం ఆవిరై పోయింది.

ఆగ్రామ చరిత్రలో మొట్టమొది మహిళా సర్పంచ్‌గా, మొది దళిత మహిళా సర్పంచ్‌గా, జనరల్‌ మహిళ స్థానంలో గెలిచిన దళిత స్త్రీగా ఆమె ఎన్నిక చరిత్ర సృష్టించింది. అందునా ఒక జోగిని మహిళ జనరల్‌ స్థానంలో గెలవడం ఆ పంచాయితీరాజ్‌ ఎన్నికల్లోనే ఒక చారిత్రాత్మక ఘట్టం. అపూర్వమైన విషయం అంటూ స్థానిక పత్రికలు వార్తా కథనాలు ప్రచురించాయి. ఆమె గెలుపుకోసం అహర్నిశలూ కృషి చేసిన రాజాగౌడ్‌ని అభినందించాయి.

” ఓ..పోశీ… నీ పేరు, ఫోట్వ పేపర్లల్ల అచ్చిందే…” అంటూ వచ్చాడు
సంతోషంగా వచ్చాడు పీరయ్య.

”అట్లనా…” లోలోపల ఆనందంగా ఉన్నా అతి మామూలుగా అంది పోశవ్వ.
”ఏందే గంత తీరం అంటవ్‌… చూస్కో పేపర్ల” అన్నాడు ఖాసిం

”ఓ… పోరి యాడున్నవే… పోయి పంచాయితాపీసుకాడ పేపర్‌ పట్కరాయె”
”ఓ అవ్వో.. ఆడికి పోవాల్నా… నాకు బుగులయితది… పెద్దగౌడ్‌ సాబు.. అంత ఉంటరు. నేపోనే…” అంది సబిత.

 – శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , , Permalink

Comments are closed.