త్రివేణీ సంగమం’మేఘదూతం'(సాహిత్య వ్యాసం ) – రుత్తల శ్రీధర్‌

vihanga-telugu magazine

ISSN 2278-478

                          ప్రభావం ఉన్నా ప్రతిభ, దార్శినికత ముందు ప్రభావం మూగబోతుంది. సందేశ కావ్యాలకి అలాంటి గుర్తింపుని, పునాదిని ఏర్పరిచిన వారు మహాకవి జాషువా . అనంతర కాలంలో పుట్టపర్తి నారాయణాచార్యుగారు కన్పిస్తారు.

గబ్బిలం  దళితుల  జీవన స్థితిగతులు , దగాపడినతనం, సమాజం సహేతుక చైతన్యానికి రాని లేమితనాన్ని ఆవిష్కరించింది. సాహిత్య శిఖరాలలో ఒకదానిగా స్థానాన్ని పదిలపరచుకుంది. అదే కోవలో వచ్చిన మరొక సందేశకావ్యం పుట్టపర్తివారి మేఘదూతం.

ఇక్కడ మరో అంశాన్ని కూడా గుర్తించాలి. కవి ఒక అతి సామాన్యుడి దుర్భరజీవితాన్ని ఆధారం చేసుకొని కావ్యాన్ని ప్రారంభించాడు. అంటే కవి ఆ సామాన్యుడిలో అంతర్లీనం కావాలి సందేశ కావ్యం కాబట్టి. సామాన్యుడు తన గోడును మేఘంతో చెప్పుకున్నాడు. తన ఇంటికి దారి చూపిస్తూ ఎన్నో ఎన్నో ప్రదేశాలను ఆనవాళ్ళుగా చెప్పాడు. ప్రతీ ఆనవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతని వివరించేటప్పుడు, కవి తన అనుభూతిని వ్యక్తం చేస్తున్నాడా? లేదంటే సామాన్యుని పాత్రలో అతనికి తగిన విధంగానే భావావిష్కరణ చేస్తున్నాడా? అనే అంశాన్ని గుర్తిస్తే పుట్టపర్తివారు వ్యక్తం చేసిన భావాలు  సామాన్యుడు వ్యక్తం చేసినవిగానే కన్పిస్తాయి.

మేఘదూతంలో ఒక అతిసామాన్యుడు ధనిక స్వామ్యాన్ని ఎదిరించి జైలు  పాలయ్యాడు. మేఘదూతంలో కావ్యనాయకుడయ్యాడు. తన అభిమానం ఆకాంక్షను తన భార్యతో చెప్పమని మేఘాన్ని ఆశ్రయించాడు. ఒక రకంగా కాళిదాసు మేఘ సందేశనామాన్నే మేఘదూతంగా గ్రహించారు. కాళిదాసు కావ్యంలో యక్షుడు శాపగ్రస్తుడు. పుట్టపర్తివారి మేఘసందేశంలోని సామాన్యుడు అన్యాయంగా జైలు పాలయినవాడు. ఇద్దరు తమ భార్యలకి దూరమైన వాళ్ళే. తమ భావాలని తెలపాలంటే యక్షుడు ` తన దేవతాజాతికి చెందిన ఉత్తముడుగా మేఘాన్ని ఆశ్రయించాడు. పుట్టపర్తి వారి సామాన్యుడికి బంధుత్వం, సంబంధం లేకపోయినా మేఘం తప్ప మరొక దిక్కులేదు.

పుట్టపర్తివారి మేఘదూతం మొట్టమొదటిగా ధనిక, పేద వర్గాలో ధనిక వర్గం ఆధిపత్యాన్ని స్పష్టం చేసింది.

ఎందరో రాజులు  రాజ్యాలు  సంస్కృతి నాగరికతలు  ముక్కచెక్కయిపోయినా ఆంధ్ర రాజ్య పున:ప్రతిష్టాపన జరిగింది. హంపీ విజయనగర శిథిలాలు  ఇప్పటికీ ఆనవాళ్ళుగా మిగిలాయి.
పుట్టపర్తివారి మేఘదూతం హంపీ విజయనగరం నుంచి ప్రారంభమై శ్రీకాకుళం వరకు సాగింది. మధ్యలో ఆంధ్రదేశంలోని సుప్రసిద్ధ ప్రాంతాలు , నదీనదాలు , రాజ్యవైభవాలు , రమణీయ కవితా కోలాహలాలు  అన్ని స్పృహనీయాలు  అయ్యాయి. పుట్టపర్తివారి కావ్యనాయకుడు మాట్లాడిన మేఘం హంపీ నుంచి శ్రీకాకుళం వరకు వెళ్ళిందంటే కావ్యంలో ఆంధ్రదేశ సంస్కృతి, నాగరికత ప్రాధాన్యానికే కాని సందేశానికి కాదు అనిపిస్తుంది.

పుట్టపర్తివారిలో బహురూపమైన విక్షణత ఉన్నాయి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు  దూరమవ్వడం వల్ల  కష్టం ఒడిలోకి జారుకున్నారు. పినతల్లి లక్ష్మీదేవమ్మ కన్నబిడ్డలాగ పెంచడంతో ఆ కష్టం నుంచి తేరుకొని, చదువుపై దృష్టిసారించారు. 14 ఏళ్ళు వచ్చేసరికే సంస్కృతాంధ్రాంగ్ల భాషలేకాదు మరొకొన్ని ప్రాకృత భాషపై ఆయన పట్టుసాధించారు. కేవలం  భాష వరకే కాదు ఆయన సంగీత శాస్త్రంలోను నైపుణ్యం సాధించారు. ఆయన రాసిన ‘పెనుగొండ లక్ష్మీ’ చారిత్రక కావ్యమే బి.ఏ. చదివే నాటికి ఆయనకే పాఠ్యగ్రంథంగా మారింది. అంటే జీవితంలో చరితార్థత కలిగినది .  ఆయనకి చరిత్రంటే ఇష్టం. దానిలోనే భాష, సంస్కృతి, నాగరికతలు , గత రాజు పరిపాను తెలుగుదేశం వైభవోన్నతులు  అన్నీ ఉంటాయి. అంతేకాదు. ఆ చరిత్రలోనే సామాన్యుడు దగాపడిన తనం జీవనస్థితిగతులు  లెక్కలోకి వస్తాయి.

అన్యాయం అని పలకడమే ఆ పేదవాడి బతుక్కి అన్యాయమైపోయింది. ఇక్కడ ఆ నిరుపేదలకి దక్కిన న్యాయం జైలు  గోడ మధ్య చిక్కుకోవటమే, నిస్సహాయస్థితి తన కళ్ళకి కనిపిస్తున్నా అప్పుడే పెళ్ళి చేసుకున్న భార్య. ఆ స్థితిలో అతనికి సహాయం చేయగలిగింది మేఘం ఒక్కటే అనుకున్నాడు.

తన వంటి మానవు దైన్యమే సుఖశయ్య
గా వారి నిట్టూర్పు గాడుపులె చామరు
గా వారి కన్నీటి గరగు దినము పైని
నిచి ‘మేమూ మానవు’ మంచు గొంతెత్తి
మూర్చు ధనికు జూచి యసురని యన్నాడు. వాడు మానవుడూ!

అఱజాతి మనుజుకు నధికారము జూచి
అధికారమున దళితమైన యెదను జూచి
ధనిక రావణు చేత జూచి వారి భో
గేచ్ఛకై యేర్పడిన కీడు లోకము జూచి
అన్యాయ మన్యాయ మన్యాయ మన్నాడు

పుట్టపర్తివారి మేఘదూతంలో సందేశం ఉన్నట్లు కన్పిస్తుంది కాని, దాని కంటె సంఘర్షణే ఎక్కువగా ఉంది. దగా పడుతున్న పేద జీవితా దుర్భరస్థితిని సత్యంగానే గుర్తించాలి. ఈ కావ్య మార్గాన్ని తోడ్పాటుగా చేసుకొని మరిన్ని కావ్యాలు  ఆవిష్కరణకి ఆవిర్భవానికి కవులు  ప్రయత్నించాలి.

– రుత్తల శ్రీధర్‌

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , Permalink

3 Responses to త్రివేణీ సంగమం’మేఘదూతం'(సాహిత్య వ్యాసం ) – రుత్తల శ్రీధర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో