బాలల హక్కుల ప్రప్రధమ రూపకర్త ఎగ్లాంటైన్ జేబ్ – శివ లక్ష్మి

బాలల హక్కుల ప్రప్రధమ రూపకర్త ఎగ్లాంటైన్ జేబ్

మొదటి బాలల హక్కుల ప్రకటనను “జెనీవా డిక్లరేషన్” అని అంటారు గానీ దాని వెనక ఉన్న ఒక గొప్ప దార్శనికురాలైన స్త్రీమూర్తి గురించి ఎక్కడా వినపడదు.

Eglantyne Jebb

1876 లో ఇంగ్లాండ్ లో జన్మించిన ఎగ్లాంటైన్ జేబ్ (Eglantyne Jebb) అనే మహిళకు ఆమె కుటుంబ నేపధ్యం వల్ల సామాజిక స్పృహ,నిబద్ధతలు చాలా ఎక్కువ. ఆమె 1923 లో బాలల హక్కుల గురించి పరిశోధించి,కృషి చేసి ఒక ప్రణాళికలో కొన్ని మౌలికమైన డిమాండ్స్ తో ఒక అంతర్జాతీయ పత్రాన్ని రూపొందించింది. ఆ పత్రంతో “జెనీవా ఇంటర్నేషనల్ యూనియన్” సమా వేశానికి హాజరై “బాలల హక్కులకు రక్షణ కల్పించవలసిన బాద్యత అంతర్జాతీయ సమాజానిదే”నని ప్రప్రధమంగా బలంగా నొక్కి వక్కాణించింది. ఫలితంగా 1923, ఫిబ్రవరి 23 న జెనీవాలో “అంతర్జాతీయ బాలల రక్షణ యూనియన్’ ఈ క్రింది బాలల హక్కుల్ని ప్రకటించింది.

*బాలలు భౌతికంగా,మానసికంగా ఎదగడానికవసరమైన అన్ని వసతుల్ని కల్పించాలి.
*పిల్లలకు ఆకలి బాధ తెలియకుండా పెంచాలి.
*జబ్బు బారిన పడిన బిడ్డలను జాగ్రత్తగా,బాధ్యతగా కాపాడాలి.
*వెనకబడ్డ పిల్లలకి అన్నిరకాల సహాయలూ అందించాలి .
*నేరాలు చేసేవారినీ,దుర్మార్గపు ఆలోచనలున్న పిల్లల్నీ సన్మార్గాల వైపుకి మళ్ళించే చర్యలు చేపట్టాలి.
*అనాథల్నీ, ఏ దిక్కూ,మొక్కూ లేని పిల్లల్ని చేరదీసి,ఆశ్రయం కల్పించి రక్షించాలి.
*ఆపదల కాలాల్లో దురవస్థ, బాధల నుంచి మొట్టమొదటగా పిల్లలకు ఉపశమనం కలిగించాలి.
*పిల్లల్ని పెంచడానికి ప్రజలకు మంచి జీవనోపాధి పరిస్థితులుండాలి.
*వారిని అన్ని రకాల దోపిడీల నుంచి కాపాడాలి. బాలలు సామాజిక స్పృహ తో పెరగాలి.
*వాళ్ళ ప్రతిభా పాటవాలను సమాజం కోసం, తోటి మనుషుల కోసం వినియోగించగలిగేలా మలచాలి.
*పిల్లలు ఈ హక్కులు పొందుతూ పెరిగడానికి తలి-దండ్రులూ,ప్రభుత్వాలూ బాధ్యతాయుతమైన చర్యలు చేపట్టాలి.

ఈ డిమాండ్స్ తో రూపొందించిన ఒక ప్రణాళికను “ప్రపంచ సమావేశం” పిల్లలు శ్రేయస్సు గురించి ఆలోచించవలసిన అవసరాన్ని గుర్తించి, 1924, నవంబర్ 26 న ఆమోదించింది. 1925 లో జెనీవాలో జరిగిన మొదటి అంతర్జాతీయ చైల్డ్ వెల్ఫేర్ కాంగ్రెస్ విస్తృతంగా చర్చిం చి, ప్రభుత్వాల మద్దతు సాధించింది.1934 లో ప్రపంచ నాయకులు కూడా బాలల హక్కుల ను పునరుద్ఘాటింటించి, అమలు జరపాలని ఆదేశించారు .ఇది ప్రజాస్వామ్యం సాధించిన మొదటి చిన్నారి మానవ పౌరుల హక్కుల ప్రకటన. అన్ని దేశాల్లో ప్రభుత్వ చట్టాల లోకి ఈ సూత్రాల్ని చొప్పింప జెయ్యాలని ప్రతిజ్ఞ చేశారు. ఫ్రాన్స్ దేశంలో నయితే ఈ హక్కుల పత్రాన్ని ప్రతి పాఠశాలలోనూ ప్రదర్శించాలని ఆదేశాలిచ్చారు.

22 నవంబర్, 1949లో మాస్కో నగరంలో జరిగిన “మహిళల ఇంటర్నేషనల్ డెమోక్రాటిక్ ఫెడరేషన్” కాంగ్రెస్ సభ పిల్లల రక్షణ కోసం ప్రతిపాదించి,గట్టిగా నిలదీసింది. దాని ఫలితంగా 1950 నుంచి జూన్ 1 వ తేదీ ని ప్రపంచవ్యాప్తంగా “పిల్లలు రక్షణ దినం” గా అనేక దేశాలలో పాటిస్తున్నారు. దీన్ని ఐక్యరాజ్యసమితి కూడా సిఫార్సు చేసినందువల్ల నవంబర్ 20 ని “యూనివర్సల్ చిల్డ్రన్స్ డే” గా నిర్ణయించారు . ఆ తర్వాత 1954 నుంచి బాలలకోసం “ఒక ప్రత్యేకమైన రోజు” విశ్వవ్యాప్తంగా స్థాపించబడింది. దీన్ని 1959 లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా అంగీకరించింది. ఈ నేపధ్యం లోనే ఐక్యరాజ్యసమితి 1989 లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది. అతి తక్కువ వనరులున్న దేశాల ప్రభుత్వాలను కూడా పిల్లల హక్కులను కాపాడడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది.

ఆ తర్వాత అనేక మార్పులు జరిగి ఆ యా దేశ ,కాల పరిస్థితులకనుగుణంగా ఎన్నో చట్టాలొచ్చినప్పటికీ ఐక్యరాజ్యసమితి విస్తారమైన సంస్కరణలు చేపట్టడం వెనక ప్రధాన మైన ప్రేరణల్లో మొదట నిల్చేది మాత్రం ఎగ్లాంటైన్ జేబ్ ఆర్ధ్రమైన ఆలోచనలే!
పిల్లల పట్ల నిరంతరం ప్రత్యేకమైన వాత్సల్యం, నిష్కళంకమైన ప్రేమ, ఆవేదనా జ్వాలలతో, వాళ్ళ బాధల పట్ల నిస్సహాయతతో రగిలిపోతుండే ఆమెను సమకాలికులు “శ్వేత జ్వాల”(White Flame) అని మారుపేరుతో పిల్చేవారు.

33

జేబ్ ఆ రోజుల్లోనే ఆకలితో నక నక లాడి మరణించే బాలల్ని చూసి చలించిపోయారు.ఇప్పటికీ ఆ భయానకమైన పరిస్థితులు మారలేదు. జేబ్ రాసిన ప్రాధమిక ప్రణాళికా రచన జరిగి ఇప్పటికి 92 ఏళ్ళ గడిచిపోయాయి. ఈనాటిక్కూడా ప్రపంచమంతటా ఆకలి,అసమానత్వం బారిన పడి అన్యాయమైపోతున్న ఇలాంటి బాలలుండడం అసలైన విషాదం!

భారత్ 1992 డిసెంబర్ 11 న బాలల హక్కుల ఒడంబడికను అంగీకరించి సంతకం చేసింది. చ ట్టాల రూపంలో ఆర్టికల్ 1 నుంచి 41 వరకూ బోలెడన్ని హక్కుల్ని మన రాజ్యంగంలో పొందుపరిచారు గానీ మొట్ట మొదటగా ఆర్టికల్ 6 లో రూపొందించిన “జీవించే హక్కు బాలలందరి జన్మ హక్కు”గా గుర్తించి అమలు చెయ్యడం లేదు.అది అమలైతేనే మిగిలిన హక్కులు బాలల అనుభవంలో కొస్తాయి.కొన్ని చోట్ల జీవించే హక్కునే ముఖ్యంగా బాలికల జీవించే హక్కుని రద్దు చేస్తుంటే ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉంటూ పట్టించుకోవడంలేదు! ఏది ఏమైనప్పటికీ ”ఈ మానవ జాతి పిల్లలకు రుణపడి ఉంటుందనీ,ప్రపంచం మొత్తానికీ అర్ధమయ్యే అంతర్జాతీయ భాష పిల్లల ఏడు పొక్కటేననీ” అన్న జేబ్ ఎంతో ఆర్ధ్రతతో పిల్లల వేదనని మొదటగా గుర్తించింది. అందుకు భావి తరాలు ఆమెను గుర్తుంకోవాలి!

జేబ్ కృషికి కొనసాగింపుగా జరిగిన అనేక మంచి చేర్పుల్లో ఒకటైన పిల్లల కోసం పెద్దలు సాధించిన బాలల హక్కుల్లో భాగంగానే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలొచ్చాయి. వచ్చే సంచికలో 19 అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.

– శివలక్ష్మి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సినిమా సమీక్షలు, , , , , , Permalink

One Response to బాలల హక్కుల ప్రప్రధమ రూపకర్త ఎగ్లాంటైన్ జేబ్ – శివ లక్ష్మి

  1. Pingback: బాలల హక్కుల ప్రప్రధమ రూపకర్త ఎగ్లాంటైన్ జేబ్ – కుకూ.. కుహూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో