గృహిణి గా….- సుజాత తిమ్మన….

మ్రోగుతున్న అలారం
గొంతు నొక్కి…
మరికొంచం సేపు ..
అనుకుని .కునుకు తీస్తూ..
అమ్మో ..అయిదైపోయింది…
జుట్టు ముడివేసుకొని…
చీర కుచ్చిళ్ళు ఎగదోపి..
వంటగది లోకి ఆగని పరుగులు ..
గృహిణిగా అవి బాధ్యతల బరువులు..

పిల్లలను బడులకు
భర్తను ఆఫీసుకు..
సాగనంపే వరకు..
ఆగని ఊపిరుల ఉరుకులు..
ఆయాసం అయినా..
అన్నీ తానై..చేస్తూఉన్నా..
దొరుకుతాయి అప్పనంగా
ఒసేయ్..ఏమోయ్..అనే బిరుదులూ….
గృహిణి గా అవి జన్మతః తెచ్చుకున్న తరువులు..

ఇంటి మూల మూలలా..
చీపిరితో చేయించే విన్యాసాలు..
చిందర వందరగా చెదిరిన
సామానులను సర్దుకోవడాలు..
కట్టుకున్నవాడు…కన్నవాళ్ళు
విడిచేసిన బట్టలనుతకడాలు..
అప్పటివరకు గొంతులో కాఫీ పడలేదే..
అనుకుంటూ..కమ్మని కాఫీ సేవనంతో..
పోయిన ప్రాణం తిరిగి వచ్చిన బావనలు..
ఆదరా బాదరా స్నానం..
“అయ్యో స్వామి..!
ఇంతా చేసి..నీకు మొక్కేందుకు
సమయం చిక్కటంలేదేమి..”
అనుకుంటూ…వెలిగించే దీపాలు..
గృహిణిగా ..అవి భక్తిరసాత్మక సమర్పణలు ….

స్కూలు నుంచి ఆకలాకలంటూ..
వెచ్చే పిల్లలకోసం ..
ఆలోచనల తెంపరలలోనుంచి పుట్టే..
అరుదైన పదార్ధాల పిండివంటలు..
ఆహా..అమ్మా..వావ్..మమ్మీ..!
అంటూ వారు తింటూ ఉంటె..
సామ్రాజ్యం గెలిచినంత సంతోషాలు..
గృహిణిగా అవి..ఆత్మియతల ఆలింగనాలు..

పిల్లల పుస్తకాలలో దూరి..
హోం వర్కులతో కుస్తీ చేస్తూ..
తల నొప్పిని కూడా మరిచిపోవడాలు..
టక టక మని వచ్చిన మగని
గుమ్మంలో నుంచే బాగులందుకొనే ..
సేవా కారీక్రమాలకి నాంది ప్రస్తావనలు..
రాత్రి వంటకి ఉపక్రమణ ..
ఇది వద్దు ..అది వద్దు అంటూ ఉన్నా..
మా అమ్మ..మా బుజ్జి అంటూ…
ముద్దులతో కడుపులు నింపే..అమ్మతనాలు..
గృహిణి గా అవి..అరహరము ఆపాదించుకున్న అనురాగపు కొమ్మలు..

అటు తిప్పి ఇటు తిప్పి ..
తిన్నాననిపించి..
సింకు లోని గిన్నెలని శుభ్రం చేస్తూ..
పుట్టింటి మురిపాలను నెమరు వేసుకుంటూ..
అలసటని మరచి…
ఆనందాలని వెతుక్కుంటూ..
ఉన్నదానిలో లేమిని ఎన్నడూ చూడక..
సంతృప్తిని తాననుభావిస్తూ..
శాంతిసుగంధాలను వెదజల్లుతూ..
చెదిరిన జుట్టును సరిచేసుకుంటూ..
చెదరని చిరునవ్వును చిందించడాలు ..
గృహిణి గా అవి..అపురూపంగా దొరికిన ఆభరణాలు …

వలపు పూదోటల వికసించే కుసుమాలు..
అవి వేడుక చేసే.. పతికి వాడని వసంతాలై..
కరిగిన కాటుక రేఖలు..
దొరికిన కలల ప్రపంచపు వాకిళ్ళు..
గృహిణిగా అవి..ప్రతి శ్వాసలో సేవించే అమృతపు గుళికలు..!!

-సుజాత తిమ్మన

****                                         ****                                  *****                                  ****

 

Uncategorized, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో