మన ఆరోగ్యం మన చేతుల్లో- బ్రేక్ ఫాస్ట్ – అలౌకిక శ్రీ

అల్పాహారం
(బ్రేక్ ఫాస్ట్)

                                23-1400840367-20-1400591382-idli ఫాస్ట్ ని బ్రేక్ చేశారా ? అదేనండి బ్రేక్ ఫాస్ట్ చేశారా ?  అని అడుగుతున్నాను . మనకు భోజనం మీదున్న శ్రద్ధ బ్రేక్ ఫాస్ట్ మీద ఉండదు . తిన్న తినకపోయినా నష్టం లేదని సర్డుకుపోతాం . ఈ అభిప్రాయం తప్పని తేలింది . చురుగ్గా ఆలోచించాలన్నా , సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలన్నా బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు .

మంచి బ్రేక్ ఫాస్ట్ … సకల రుచుల సమ్మేళనం . పోషక విలువలు మొండి . తాజా పళ్ళు , కూరగాయాలు , మొలకెత్తిన విత్తనాలు , పప్పు ధాన్యాలు , పాలు , గ్రుడ్డు మొదలైన పదార్ధాలు అన్నింటిని కలగలిసి ఉండాలి . ఇవేనా మనం తినే వాటి నుంచి శక్తి ప్రోటీన్లు , కొవ్వు , పీచు పదార్ధాలు , విటమిన్లు , ఖనిజాలు , ఇనుము ,కాల్షియం ….. అవసరమైన పోషక విలువలన్నీ తగిన మోతాదులో అందాలి .

రోజంతా మనమెంత ఉత్సాహంగా ఉండాలో , ఎంత వేగంగా పనులు చేసుకోవాలో , ఎంత ప్రశాంతంగా ఉండాలో నిర్ణయించేది మన పళ్లెం లోని బ్రేక్ ఫాస్టే , దాని ద్వారా అందే శక్తి మన శరీరానికి కావలసినంత ఉత్సాహాన్నిస్తుంది . ఆ రోజుకు మనకు అవసరమైన పోషక విలువలలో మూడో వంతుకు పైగా అందులోనే ఉండాలి . అందరికి తలెత్తే మొదటి ప్రశ్న ఎప్పుడు తినాలి ? ఏం తినాలి ? ఎంత తినాలి ? వీటికి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే ………

upma-1ఎప్పుడు తినాలి :
ఏడెనిమిది గంటల పాటు ఉపవాసాన్ని విరమించడమే “బ్రేక్ ఫాస్ట్ “. నిద్ర లేచిన గంటా గంటన్నర లోపే ఈ కార్యక్రమం పూర్తయితే మంచిది .

ఏం తినాలి :
ఇడ్లీ , వడ , దోసె , ఉప్మా , కిచిడి లాంటి సంప్రదాయ వంటలు , పళ్ళూ , పచ్చి కూరగాయలు,మొలకెత్తిన విత్తనాలున్నాయి , పాలున్నాయి , పళ్ళ రసాలున్నాయి , గుడ్లున్నాయి , ఓట్స్ ,సోయా మొదలైనవి .

ఎంత తినాలి :
బ్రేవ్ …అని తేన్చే దాకా ఒకే తిండి తినకుండా ……పరిమితమైన మోతాదులో అవి కొన్ని, ఇవి కొన్ని తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణుల అభిప్రాయం .

ఏం తినకూడదు :
కార్బోహైడ్రేట్లూ, కొవ్వు పదార్ధాలూ ఎక్కువుగా ఉండే వంటకాలు మంచిది కాదు . నూనెలో వేయించే వడ , పూరీ లాంటివి ఏ పదిహేను రోజులకో ఒకసారి తినటం మంచిది .

1405687715-2289తింటే ….
ఒంటికి సత్తువ వస్తుంది . చురుగ్గా ఉంటాం . చురుగ్గా పని చేస్తాం . నీరసం దూరమౌతుంది . ఏకాగ్రత పెరుగుతుంది . సమర్ధత మీద కూడా ఆ ప్రభావం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి .

తినకపోతే …..
నీసరం ఆవరిస్తుంది . మెదడు చురుగ్గా పని చేయదు మగతగా అనిపిస్తుంది . సులభంగా దొరికే బేకరీ రుచులకూ , చిప్స్ లాంటి వాటికి అలవాటు పడి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది .

రోజూ బ్రేక్ ఫాస్ట్ చేయడం వలన ఊబకాయం సమస్య కూడా ఉండదంటూన్నారు నిపుణులు . దీర్ఘకాలిక పోషక విలువల లోపం ఉన్న శారీరిక మానసిక పిల్లలను పరిశీలిస్తే , వారి కారణాలలో ఒక కారణం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడమే అని తేలిందంట . బ్రేక్ ఫాస్ట్ నిర్లక్ష్యం చేసే మహిళలలో ఊబకాయం , రక్తహీనత వంటి లక్షణాలు అనివార్యం .

నిద్ర లేచిన గంటా గంటన్నర లోపు ఏమీ తిన లేదంటే మన శరీరాన్ని మనం హింసిస్తున్నట్టు లెక్క . అందుకే కాస్త ఉదయం తీసుకునే అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) మీద దృష్టి పెట్టండి .

– అలౌకిక శ్రీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో