ఎనిమిదో అడుగు- 42 (ధారావాహిక ) – అంగులూరి అంజనీ దేవి

…. దీన్ని బట్టి ఆలోచిస్తే సంపాయించేది కేవలం  భార్యా, పిల్లల  కోసమే కాదు. కష్టాల్లో వున్న ప్రజల  కోసం, ప్రకృతిని కాపాడే భగవంతుని కోసం. భగవంతునికి కృతజ్ఞతలు  చెప్పుకునే సందర్భాలు  అనేకం వస్తాయి. కాబట్టి శిధిలమైన గుడును పునరుద్దరించాలి. భావితరాల  కోసం ఖర్చు పెట్టాలి. లేనప్పుడు మనిషికి విలువలేదు. ఆ మనిషి సంపాదనకి విలువలేదు. కష్టపడి డబ్బు సంపాయించటం ఎంత ముఖ్యమో! ఆ డబ్బు విలువ  తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం. అందుకే కొంతమంది ప్రజలు  కోసం, కొంతమంది దేవుని కోసం ఖర్చు చేస్తుంటారు. సంపాయించే అవకాశం అందరికి దొరకదు. మనిషి చేతిలో డబ్బు వుండాలి కాని, డబ్బు చేతిలో మనిషి వుండకూడదు… అందుకే ప్రపంచ ధనవంతులకి సంపాయించటం తెలుసు , దానం చెయ్యటం తెలుసు , వాళ్లలో వుండే మానవత్వమే వాళ్లను కాపాడుతోంది.

మరి తనలో…? హేమేంద్రలో మొదలైన ఈ ప్రశ్న అతన్ని స్థిమితంగా వుండనీయలేదు. తనకి కూడా ఏదో చెయ్యానిపిస్తోంది.
కోర్టు నుండి ఇంటికెళ్లగానే సిరిప్రియను, బాబును తీసుకొని తన తల్లిదండ్రులు  దగ్గరకి వెళ్లాడు. వాళ్లను వెంటనే తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు.

భర్తలోని మార్పుకి సిరిప్రియ, బాబు సంతోషించారు.

…. తప్పు సరిద్దుకోటానికి జీవితం మిగిలి లేనప్పుడు ఆ తప్పు తెలుసుకొని ప్రయోజనం లేదు. కానీ తన భర్తకి తనని తను సరిదిద్దుకోటానికి బోలెడంత జీవితం మిగిలి వుంది. అని మనసులో అనుకుంటూ భర్తలోని అంతర్మధనాన్ని అర్థం చేసుకుంటూ అతను చెయ్యబోయే మంచి పనుల్ని ప్రోత్సహించానుకుంది సిరిప్రియ.

…. ఆలోచిస్తూ పడుకున్న హేమేంద్రకు నిద్రలేవగానే…

‘‘ ఈ శిక్ష నుండి నాకు విముక్తి రావాలే కాని నాణ్యమైన మందును సరసమైన ధరకు అమ్మి ఈ దేశంలో ఒక మంచి సంస్థాధిపతిగా సేవ చేస్తాను.’’ అన్న ఒక మంచి సంకల్పం  వచ్చింది.

అతను ఏ క్షణంలో అలా అనుకున్నాడో కాని హేమేంద్ర పెట్టుకున్న అడ్వకేట్‌కి మంచి ఆలోచన వచ్చింది.

హేమేంద్రను చూడగానే…‘‘నీకు శిక్ష పడకుండా వుండాంటే కేసు బుక్‌ చేసిన మందు మిాద ఎంత ఎక్కువ డబ్బు వస్తుందో ఆ డబ్బును చట్టప్రకారం ఎన్‌.పి.పి.ఎ. (నేషనల్‌ పార్మాసుటికల్‌ ప్రైసింగ్‌ అధారిటి) కు చెల్లించు హేమేంద్రా!’’ అంటూ సలహా ఇచ్చాడు అడ్వకేట్‌.

‘‘అలాగే సర్‌!’’ అంటూ ఒప్పుకున్నాడు. హేమేంద్ర.

వెంటనే ఆ డబ్బును ఎన్‌.పి.పి.ఎ. (నేషనల్‌ పార్మాసుటికల్‌ ప్రైసింగ్‌ అధారిటి)కు చెల్లించి అట్టి రశీదు కోర్టు వారికి చూపించి కేసు నుండి బయటపడ్డాడు హేమేంద్ర.

ఆ క్షణం నుండి హేమేంద్ర తన మనసులో అనుకున్నట్లే నాణ్యత గ మందుల్ని తయారు చేసి, ఇంతకుముందున్న పాపులారిటీని ఉపయోగించి సంపాయిస్తున్నాడు…. పేద ప్రజల  కోసం, ప్రతి జిల్లాలో నెలకు ఒక రోజు కంపెనీ తరుపున క్యాంపు నిర్వహిస్తూ పేద ప్రజకు అండగా వుంటున్నాడు.

…. డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ చేతన తన భర్త ప్రభాత్‌తో అప్పుడప్పుడు హేమేంద్ర చేస్తున్న మంచి పనులు  కథలు , కథలుగా చెబుతుంటే విని ఆశ్చర్యపోతుంటాడు ‘‘ నువ్వు చెప్తున్నది నిజంగా ఒకప్పటి నా ఫ్రెండ్‌ హేమేంద్ర గురించేనా?’’ అని అడుగుతుంటాడు సరదాగా చిరునువ్వుతో…..

‘‘అంతేకాదండీ! ‘పలానా హేమేంద్రకు మా సిరిప్రియను ఇచ్చాము. మా సిరిప్రియ హేమేంద్ర భార్య!’ అని మా వాళ్లంతా పొగుడుకుంటూ మురిసిపోతుంటారు తొసా!’’ అంటుంది చేతన.

ఆ తర్వాత ఆమెను మాట్లాడనివ్వకుండా ప్రేమగా బంధిస్తుంటాడు డా॥ప్రభాత్‌.

చేతన హేమేంద్ర కొడుక్కి, అరోప్‌ాకి ఒకేసారి గిఫ్ట్‌గా రెండు చిన్న, చిన్న సైకిళ్లు తెచ్చి ఇచ్చింది. వాళ్లు వాటిని ప్రాక్టీస్‌ చేస్తూ ఇంటికి ఎవరొచ్చినా ‘‘ఇది చేతన ఆంటి ఇచ్చిన గిఫ్ట్‌’’ అని ముద్దు, ముద్దుగా చెప్తుంటారు.

…. అరోప్‌ సైకిల్‌ తొక్కుతున్నాడు. అరోప్‌ని రోడ్డు మిాదకి పోనియ్యకుండా, అదుపు తప్పి సైకిల్‌ మిాద నుండి కిందపడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఎఫ్‌.ఎమ్‌. రేడియోలో వస్తున్న ‘‘ధీర, ధీర, ధీర మనసాగలేదురా! చేరరార శూర సొగసందుకోర ఏకవీర ధీర! శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా! కసుమముతో ఖడ్గమే ఆపగా… మగసిరితో అందమే అంటుకడితే అంతేగా…. అణువణువూ స్వర్గమే అయిపోదా…శాసనాు ఆపజాని తాపముందిగా….’’ పాటను వింటోంది ధీరజ. ఆమెకు ఆ పాట అంటే చాలా ఇష్టం. ఆ పాట ఎప్పుడు విన్పించినా చెవుతో గుటకేసి తాగుతున్నట్లు వింటుంది. అంతలో తనకేదో సందేహం వచ్చి అరోప్‌ డ్రస్‌ను ఐరన్‌ చేస్తూ లోపల  వున్న స్నేహిత దగ్గరకి వెళ్లింది ధీరజ. అరోప్‌ను గమనించటం కోసం మధ్య, మధ్యలో బయటకు తొంగి చూస్తూ.

‘‘స్నేహితక్కా! మగధీర అంటే గుర్రం మిాద స్వారి చేసుకుంటూ వచ్చే మగవాళ్లను మాత్రమే అంటారా? ప్రస్తుతం మన కళ్ల ముందు తిరుగుతున్న అబ్బాయిల్ని అనరా?’’ అంది.

ధీరజలో చాలా అనుమానాలున్నాయి. ఈ మధ్యన గర్భంతో వున్న ఆడవాళ్లు ఎక్కడ కన్పించినా వాళ్లు కూడా తనలాంటి సర్రోగేట్‌ మదర్‌లే అనుకుంటోంది. మగవాళ్లతో ఆడవాళ్లకి అసలు  పనే లేదనుకుంటోంది.

స్నేహితకి అది అర్థమై ‘‘ఛ..ఛ అలాంటిదేం, లేదు ధీరజా! ప్రస్తుతం చాలా మంది అబ్బాయికి ఏ రంగంలో కూడా కంప్యూటర్‌ లేనిదే వర్క్‌వుట్‌ కావటం లేదు. ఆ కాలంలో  అశ్వం మిాద తిరిగే మగవాళ్లకి ఎంత విలువ  వుందో ఇప్పుడు కంప్యూటర్‌ ముందు కూర్చున్న అబ్బాయికి అంత విలువ  వుంది. అశ్వాలు  పోయి కంప్యూటర్లు వచ్చాయి. కాకపోతే వాతావరణంలో మానసిక ఒత్తిడి వల్ల  అక్కడక్కడ అబ్బాయిల్లో పిల్లలు  పుట్టించగలిగే శుక్రకణాలు  లోపిస్తున్నాయి. అంత మాత్రాన వాళ్లు మగధీరులు  కాదనటానికి లేదు…. చూడు ధీరజా! జీవితం లోలోతుల్లోకి పోయి మనం మాట్లాడుకోవద్దు. ఎందుకంటే జీవితం అంటేనే ఓ రహస్యం…. రహస్యంతో కూడిన రాజీ….’’ అంది.

అర్థం కానట్లు చూసింది ధీరజ.

‘‘ధర్మార్థ కామ మోక్షాలు  అని ఒక సూక్తి వుంది. అందులో ధర్మం, అర్థం, కామం, మోక్షం అని నాలుగు వున్నాయి. అవి నువ్వు విని వుండవు. చాలా మంది మగవాళ్లు భార్యకి సౌకర్యవంతమైన జీవితం ఇవ్వాని మంచి ఇల్లు , నగలు , చీరలు , కారు ఇలాంటి వాటి కోసం రాత్రీ`పగలు  శ్రమిస్తారు. ఆ శ్రమతో అసిపోయి భార్యపట్ల తన బాధ్యత అయిపోయినట్లు తృప్తి పడ్తుంటారు. అంటే నేను చెప్పిన సూక్తిలో రెండవది పరిపూర్ణంగా చేశారు. మూడవది మరిచిపోయారు. నాలగవది ఎవరు చూడొచ్చారు అదెప్పుడో చచ్చేముందు ఆలోచించుకోవచ్చులే అనుకుంటారు. ఈ లోప ఏదో ఒక టైంలో పిల్లలు  పుట్టి వాళ్లతో పాటే తింటూ, కార్లలో తిరుగుతూ పెరుగుతుంటారు…. ఇలా అని వాళ్లు సుఖంగా లేరనుకోవద్దు. వాళ్లు ఏది కావానుకుంటారో అదే వాళ్ల దృష్టిలో సుఖం’’ అంది స్నేహిత.
‘‘అవునా! ’’ అన్నట్లు ఆశ్చర్యపోయి చూసింది ధీరజ.

 – అంగులూరి అంజనీ దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో