అత్యుక్తి!!! Hyperbole- క్రిష్ణగీత

“When Times Now reports, people listen.”

ఈ మధ్య షీనా బోరా హత్య కేసులో మన టివి ఛానెళ్ళు ప్రతీ అరగంటకీ “స్కూప్“ అంటూ చేసే ప్రసారాలని చూస్తుంటే, ఈ స్లోగన్( అది ఎంత స్వంత డబ్బా అయినాకానీ) అన్ని ఛానెళ్ళ విషయంలోనూ కూడా ‘ఎంత నిజమైనదో కదా!’- అనిపిస్తోంది.
అడపా తడపా ముంబయి పోలీసులు అందిస్తున్న సమాచారం మీద ఆధారపడి, జర్నలిస్టులూ, టివి ఏంకర్లూ నడుపుతున్న పానెల్ చర్చలు- కోర్టు తీర్పుకి మందే బాహాటంగా తమ నిర్ణయాలని వెల్లడిస్తున్నాయి. అవి ఏ రికార్డులలో లేనప్పటికీ కూడా, పుకార్లని కూడా మీడియా ఏ సంకోచం లేకుండా రిపోర్ట్ చేస్తోంది.
ఈ కేసులో సంబంధం లేకపోయిన కుటుంబ సభ్యుల చుట్టుపక్కలవారినీ, కార్ డీలర్లనీ, స్నేహితులనీ, కొలీగ్సునీ కూడా-QUOTES కోసమూ, సమాధానాలకోసమూ మీడియా తరిమి తరిమి మరీ వెంటాడుతోంది. జర్నలిస్మ్ పేరుతో గువహతి, బెంగళూరు, ముంబయిలో ఉన్న తెలిసినవాళ్ళందరినీ వేధించి పెడుతోంది. సిద్ధార్థ దాస్ “ చెప్పేటందుకు ఇంక తన వద్ద ఇంకేమీ లేదని” పానెల్ చర్చనుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే “ఇదిగో, మిస్టర్ దాస్, దాస్, మీరలా ఎలా వెళ్ళిపోతున్నారు? వెనక్కి రండి, రండి.“ అంటూ ఆర్నాబ్ గోస్వామీ గొంతు చించుకుని హడావిడి చేస్తాడు. ఇన్‌సెట్లో, దాస్‌ని ఛానెల్ మనుష్యులు వెనక్కి వెళ్ళమని బ్రతిమిలాడుతూ కనిపిస్తారు. ప్రెస్‌తో మాట్లాడదలచుకోనివారిని- వాళ్ళు తమ కార్లోకో, బిల్డింగ్లోకో దూరేవరకూ- కెమెరాతో వెంబడించే అధికారం టివి జర్నలిస్టులకి ఉందా?
లాక్- అప్ లో ఇంద్రాణీ ఏమిటి తిన్నాదో, తాగిందో, నిద్ర పోయిందో, లేదో అన్న అతిసూక్ష్మమైన వివరాలు అవసరమా?
ఇటువంటి పరిస్థితిలో జర్నలిస్మ్‌ని ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం అని పిలవడానికి మనకి మనసు ఒప్పుతుందా!!
మీరు కనుక కిందటి పదిరోజులుగా ప్రసారం చేయబడుతూ ఉన్న న్యూస్ ఛానెళ్ళని చూస్తూ ఉంటే, భారతదేశంలో ఇంద్రాణీ ముఖర్జియా-షీనా బోరా హత్య గురించిన దర్యాప్తు తప్ప, ప్రసారానికి యోగ్యమైన వార్త ఇంకేదీ లేదని అనిపిస్తే- దానిలో మీ తప్పేమీ లేదు.

ఈ ఆవేశాన్నీ/ఉన్మాదాన్నీ, మనం కొద్దికాలం కిందట కూడా చూసేం. మొదట ఆరుషీ తల్వార్ కేసులోనూ, ఆ తరువాత సునందా పుష్కర్ మరణం గురించీ.
కొన్ని హత్య కేసులు మాత్రమే మీడియా దృష్టికి ఇంతగా ఎందుకు వస్తున్నాయి!
సునందా థరూర్ మరియు ముఖర్జియా-బోరాలలా గ్లామరస్ జీవితాలు గడిపిన/గడిపేవారే ఈ చర్చలకీ, ఈ పరిశోధనకీ పాత్రులని అర్థమా!
కొందరన్నట్టుగా ఈ నేరం “హత్యలకి తల్లి” (mother of murders) అన్నది నిజమేకానీ ఇంద్రాణీ చిన్న ఊరునుంచి వచ్చిన స్త్రీ అనీ, డబ్బుకోసం పీటర్ని లోబరచుకుందనీ అన్న జర్నలిస్ట్ మరి ఏ ఊరతనో!!
NewsX లో- ఒకానొకకాలంలో పని చేసిన ఒక ఉద్యోగి –‘ఇంద్రాణీ ముఖర్జియా కళ్ళు క్రూరమైనవి’ అంటాడు. ఇంద్రాణీ తనకి ‘వింతగా’ కనిపిస్తుందంటాడు ఏక్టర్ రిషి కపూర్. ఆమె ‘లేడీ మాక్బెత్’ అంటుంది శోభా డే.
టివి ప్రసారాల్లో అనుపాతకత్వం ఎంతుండాలి? మిగతా ముఖ్యమైన అంశాలని పక్కకి పెట్టి, ఒక స్టోరీకి మాత్రమే ఇంత స్పేస్ ఇవ్వవలిసిన అవసరం ఉందా? ఉన్నత వర్గపు నేరం జర్నలిస్టుల దృష్టిని ఆకర్షించడం సహజమే కానీ మిగతా న్యూస్‌ని నిర్లక్ష్యపెట్టి మాత్రం కాదే!
“నేరం రుజువయేవరకూ నిందితుడు ఏనాడూ నేరస్థుడు కానేరడు” అన్న ప్రాథమిక చట్టపరమైన ఆధార వాక్యాన్ని తిరగేస్తూ, ‘నిర్దోషిత్వం నిరూపించబడేటంతవరకూ నిందితులందరూ నేరస్థులే “ అని ఈ కేసులు మనకి చెప్తున్నాయన్నట్టుగా కనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి మీడియా విచారణలే- తల్వార్లు ఆరుషీ మరణానికి కారణమని కోర్టు చట్టబద్ధంగా తీర్పు తీర్చక మునుపే, వారిని తమ కూతురి హత్యకని ప్రజలముందు దండనకి అర్హులుగా నిలబెట్టేయి.
బాధ్యతాయుత పాత్రికేయ వృత్తి అన్న భావానికి అర్థం కనిపించదేం!!!
ప్రేక్షకులని కట్టి పడేసేటందుకూ, సృజనాత్మక స్వేచ్ఛని అందిబుచ్చుకోవడానికీ- ఇది ఏ క్రైమ్ కథో లేక సినిమాయో కాదని ఎలెక్ట్రానిక్ మీడియా మరచిపోయిందా!

ఇరవై నాలుగు గంటల బ్రాడ్‌కాస్టింగ్ మీడియా నిజంగా ప్రజా ఆసక్తి కోసమే ఈ కేసుని వెంటాడుతోందా అన్న సందేహాన్ని పక్కకి పెడితే, ఎక్కువ పట్టించుకోవలిసిన అంశాలున్నాయి.
ghఆరుషీ తల్వార్ కేసులో మీడియా యొక్క prime time ఏంకర్ల జర్నలిస్టిక్ ఔత్సాహికత- తాము పోలీసులకన్నా ఎక్కువ నిపుణత కలిగిన వారిమన్న భ్రమకి వారిని గురి చేసి- వారు డిటెక్టివ్‌ల, ఇంటరోగేటర్ల మరియు న్యాయాధిపతుల పాత్రలని పోషించేలా చేసింది. ఇప్పుడు షీనా హత్య కేసులోనూ అదే జరుగుతోంది.
ఇంద్రాణీనీ రోజువారీ తీర్పు తీరుస్తున్న ఛానెళ్ళ మొండితనం చిరాకు కలిగించడం లేదూ! స్త్రీల అభ్యుదయేచ్ఛ గురించిన ప్రాధమిక ఆరాటం గురించి ఎంతని చర్చించగలరు? ఇంద్రాణీ గురించి మాట్లాడినప్పుడు, రీనా ధాకాలూ, నీనా పిళ్ళైలూ, సుహేల్ సేఠ్‌లూ నిజానికి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నిజమే. ఇంద్రాణీ ఆటని నిర్దాక్ష్యిణ్యంగానే ఆడింది. ఎన్నోసార్లు పెళ్ళి చేసుకుంది. ఆమె కన్న పిల్లలకి తండ్రులు- వేరే వేరే పురుషులు. కాబట్టి ఆమె అవకాశవాదానికి అతి నిర్ధిష్టమైన సాక్ష్యంగా చూపబడుతోంది.
ఇంద్రాణీ క్రూరంగా హత్య చేసిందని ఆరోపిస్తున్నవారిలో ఎవరి స్టేట్‌మెంటూ ఇప్పటివరకూ నిరూపించబడలేదు. సాక్ష్యాలు వెలికి తీయబడి, హత్య ఇంకా పరిశోధించబడుతోంది. అయినప్పటికీ, మీడియాయూ దానితోపాటుగా ప్రజాభిప్రాయమూ ఇంద్రాణీ ముఖర్జియాని ముందుగానే దోషిగా నిలబెట్టేయి.
పరిశోధన వేరు. బురదని పెకిలించి బయటకి లాగడం వేరు.
తన సవతి తండ్రి తనమీద అత్యాచారం చేసేడని తనతో ఇంద్రాణీ చెప్పిందని వీర్ సాంఘ్వీ ఒక ఛానెల్ ప్రసారణలో చాలా వివరంగా అరగంటసేపు ఇంటర్వ్యూ ఇచ్చేడు. అంత అనుభవశాలి అయిన జర్నలిస్టుకీ లైంగిక నేరానికి గురైన బాధితురాలి పేరు బయటపెట్టకూడదన్న నియమం గుర్తు లేకపోయిందా?
ప్రీతమ్ పీటర్ అవగా లేని అభ్యంతరం, పోరీ బోరా- ఇంద్రాణీగా మారినప్పుడు ఎందుకు తలెత్తుతోంది!
అయితే ఈ కేసులో ప్రతీ గంటకీ బయటకి తేలుతున్న వైరుధ్యాలూ, సమాధానాలు దొరకని ప్రశ్నలూ (ప్రస్తుతానికి) తక్కువేమీ కావు.

సిద్ధార్థ దాస్- షీనా, మిఖాయేలూ- ఇద్దరూ తన పిల్లలే అని చెప్పిన తరువాత కూడా మిఖాయేలు తన సవతి కొడుకని ఇంద్రాణీ ఎందుకు చెప్పింది?

Siddharthషీనా జాడ తెలియకుండా పోయిందని రాహుల్ ముఖర్జియా పోలీసులకి రిపోర్ట్ చేసేడన్నది అబద్ధం అని తేలింది. ఆమె పాస్ పోర్ట్ తన వద్దే ఉందన్న సంగతిని అతను దాచవలిసిన అవసరం ఏమొచ్చింది?తన కూతురితో ఆమె పదవ తరగతిలో ఉన్నప్పుడు మాత్రమే తను మాట్లాడేనన్న సిద్ధార్థ దాస్ మాటలు తప్పని షీనా బోరా డయరీ నిరూపించింది. అంతేకాక దాస్ హెల్మెట్ పెట్టుకుని, ముఖానికి రుమాలు చుట్టుకుని పబ్లిక్కి హాస్యాస్పదంగా కనబడటం-అంతా -డ్రామాలా కనిపిస్తోంది.

షీనా హత్య చేయబడిన కారుని పీటర్ రోమ్ నుంచి అద్దెకెందుకు తీసుకున్నాడు?
షీనా హత్య చేయబడినప్పుడు, ఆమె గర్భవతి అన్న రిపోర్టులున్నాయి.

షీనా మూడు సంవత్సరాలుగా కనిపించకపోయినప్పటికీ, ఎవరూ పట్టించుకోలేదంటే ఏమనుకోవాలి? చాలా శక్తిమంతులైన కొంతమంది ఈ విషయాన్ని చూసీ చూడకుండా ఉంటే తప్ప, ఇంతపెద్ద పరిమాణం గల నేరం గమనింపబడకుండా ఉండే అవకాశం లేదే!

సామాన్యంగా అయితే, ఎవరైనా కనపడకుండా పోయినప్పుడు, పూర్తి కుటుంబపు ప్రపంచం తల్లకిందులవుతుంది. కానీ ఇక్కడ అంత డబ్బున్న కుటుంబం ఆమె జాడ కూడా కనుక్కోడానికి ప్రయత్నించలేదే!

మృత శరీరభాగాలు కనపడిన మొత్తం గగోడె గ్రామాన్ని ఎవరో కొనుక్కునే ప్రయత్నం చేసేరన్న వదంతి ఉంది. అదే నిజమైతే, దానికున్న కారణాలేమిటో కూడా తెలియాలి కాదూ!

షీనా బోరా కేసులో డబ్బు/ఆస్థి పెద్ద అంశం అని స్పష్టంగానే తెలుస్తోంది. ఈ కేసుతో జోక్యం ఉన్న ఎవరూ సత్య హరిశ్చంద్రులు కారనీ, అందరు చెప్తున్నవీ కూడా ఎంతో కొంత అబద్ధాలేననీ కూడా అర్థం అవుతూనే ఉంది.  ఇంద్రాణీ కనుక నిజంగా తన కూతుర్ని హత్య చేసి ఉంటే, ఆ అపరాధభావం, చట్టం వేసే కఠినమైన శిక్షా ఆమె భరించవలిసినవే.ఈ కుటుంబ డ్రామాలో ఇన్ని ట్విస్టులు ఇప్పటికే ఉన్నాయి. మరి తీర్పు వస్తుందో- లేకపోతే ఇదీ సునందా పుష్కర్ మరియు ఇతర కేసులలాగానే ఏ తీర్పూ లేకుండా, ఏ నేరస్థులూ పట్టుబడకుండానే- ఈ మీడియా చర్చలతో మాత్రమే ముగుస్తుందో మరి!!!

– కృష్ణవేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, , , , , Permalink

12 Responses to అత్యుక్తి!!! Hyperbole- క్రిష్ణగీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో