నోటితో డోలు వాద్యం వాగిందీ ఆహా వాగిందీ
బొమ్మ పెళ్ళి బాజా మేళం బలే హుషారండీ ఆహా బలే హుషారండి.
పెళ్ళి కూతురిని పెళ్ళి కొడుకునూ ఊరేగిద్దాము.
పెద్ద వారు చేసే పెళ్ళిళ్ళలో జరిగే తంతున్నీ వారి బుల్లి మేధకు అందినంత వరకూ అనుకరిస్తారు ఈ చిన్నాయి. బొమ్మ మంగళ సూత్రాూ బొమ్మ మధుపర్కాలు అమర్చుకొంటారు. వడ్రంగి పనివారు ఆడపిల్ల బొమ్మలాట ఆడుకోవడానికి బుల్లి పందిరి కర్రతో తయారు చేసేవారు. తల్లిదండ్రు తమ కుమార్తె కోసం వేడుకగా అవి కొని ఇచ్చేవారు. మరి కొందరైతే ప్రత్యేకంగా పురమాయించి మేు జాతి కలపతో పది కాలాపాటు మన్నేటట్లుగా వీటిని చేయించేవారు.
తమ కుమార్తొ అత్తవారింటికివెళ్ళేటప్పుడు సారెతో పాటు ఈ బొమ్మ సారె కూడా వేడుకగా ఇచ్చేవారు. బొమ్మసారెలో బుల్లి బుల్లి ఇత్తడిక్క వంటి సామాన్లు బొమ్మూ కూడా ఇచ్చేవారు. విశాఖ,తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుల్లో వున్న నక్కపల్లి ఏటికొప్పాక గ్రామాు క్కబొమ్మ పరిశ్రమకు పేరు పొందాయి. ఇక్కడ జంతువు పక్షు మనుషు బొమ్మతో పాటు బుల్లి బుల్లి గిన్నొ బిందొ పళ్ళాతో పాటు పొయ్యి తిరగలి వంటి వంట సాధనాలు తయారు చేసి చిన్న తాటాకులతో అల్లిన పెట్టెలో పెట్టి అమ్ముతారు. తేలికపాటి కర్రతో తయారు చేసి ఆకర్షణీయమైన గులాబి, నీలం ఆకుపచ్చ రంగు ఈ బొమ్మకు వేస్తారు. బాలిక బంధుమిత్రులు తల్లిదండ్రులు ఈ ఆట సామాన్లు వారికి బహుమతిగా ఇస్తూ వుంటారు. బుల్లి బుల్లి బుడ్డీ చెంబులు వీటిలో ప్రత్యేక ఆకర్షణ. తరువాతి కాంలో పింగాణితో ఇటువంటి ఆట సామాన్లు వస్తున్నాయి. అమ్మ పెట్టిన గుప్పెడు పప్పో చారెడు అటుకులో పట్టెడు బెల్లం ముక్కో తెచ్చుకున్న షడ్రసోపేతమైన విందు చేసుకుంటారు. కొందరు గడుగ్గాయిలైతే అమ్మను వేధించి బుల్లి బొగ్గు కుంపటీ ఇత్తడి గిన్నొ తెచ్చి నిజమైన వంటలే చేసేవారు.
మరి ఈ బుల్లి ఇల్లాండ్రు కాపురం చేయడానికి ఇల్లు వాకిలి కావాలికదా. కొండపల్లి బొమ్మల్లో చక్కని పెంకుటిల్లు మేడ కూడా లభ్యమయ్యేవి. వాటిని అపురూపంగా కొని బొమ్మల కొలువులో పెట్టడానికి భద్రపరుచుకునేవారు. ఆ తరువాతి కాలంలో గాజు పలకతో అద్దామేడలు వచ్చాయి. వాడుకొన్నాక నిరర్థకంగా పారవేసిన బుల్లి బుల్లి ఇంజక్షన్ సీసాను భద్రపరిచి వాటిని గాజు పలకపై ఫెవికాల్తో నేర్పుగా అతికి మందిరాలు తయారు చేసారు కొంతకాలం .
ఎక్కడయినా ఇసుక గుట్ట గాని కనిపిస్తే చాలు పిల్లలంతా చేరి ఓ కాలు ఎదురుకు మడిచి కూర్చొని ఆ పాదంపై ఇసుక చేతుతో తడుతూ స్థూపాకారంగా తయారుచేస్తారు. కాలు తీసివేస్తే ఎదురవాలుగా రంధ్రంతో పిచ్చుక గూడు తయార్. వారి చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ వాటికి మెట్లు కడతారు. వీటికి ప్రాకారాలు అంతస్థు తయారవుతాయి. పెరట్లోని ఆకుల్ని పూలనూ కోసుకొని వచ్చి తమ ఊహాసౌధాల్ని అంకరిస్తారాబాలలు. నాలుగుకాలాపాటు నిలిచే ఇల్లు కట్టుకోవాలని ఒక్కోసారి ఈ పిల్లాలకు కోరిక కులుగుతుంది. ఆ రోజుల్లో ప్రతి ఇంటికి విశామైన పెరడు వుండేది. పెరట్లో ఏదో పనికోసం తెచ్చిన ఇటుకులు పడి వుంటాయి. వంట చేసే కట్టె పొయ్యిని అలకడానికి కావిళ్ళలో తెచ్చే పచ్చ మట్టిని కొని పెరట్లో ఓ మూల పోసేవారు. వెదురు కర్రల బట్టు ఆరవేసుకోవడానికి ఉపయోగించేవారు. అవి పెరట్లో ఓ చోట వుండేవి. ఇంకేం పిల్లలు ఇటుక గోడతో వెదురు కప్పుతో ఇళ్లు కట్టేసి పచ్చమట్టితో అలికేవారు. ఏటిలో వుండే బంకమట్టి తెచ్చి జంతువు పక్షు ఇంటిలో వాడే బొమ్ము తయారు చేసేవారు. బొమ్మ కొలవులో ఇసుకతో పార్కు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు ఏర్పరుస్తారు వారు. చిన్న చిన్న బొమ్మలు ఆయా స్థలాల్లో అమర్చి వాటికి వాస్తవికతను కల్పిస్తారు .
శాస్త్రిగారిలో దేశభక్తి , దేశ పరిస్థితుల పట్ల అవగాహన పుష్కంగా వున్నాయి. స్వయం తీర్త్యాపరాన్ తారయేత్। తాను ముందర దాటి ఇతరును దాటించవలెను. ‘తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరంలేదు.’ అన్నది వారి పంథా. వీరశైవము, వీరాంగము వారికి నచ్చదు. స్వరాజ్య ఉద్యమాన్ని వారు బాగా అర్థం చేసుకున్నారు. ఉద్యమంలో పాల్గొనే దేశభక్తుల పట్ల గౌరవాభిమానాలు కలిగి వుండి వారికి తాను చేయగలిన సహకారాన్ని మనస్పూర్తిగా అందించేవారు. తీవ్రవాదులుగా పరిగణింపబడే సోషలిస్టులు , కమ్యూనిస్టులు పట్ల కూడా వారికి అవగాహనా, అభిమానం వుండేది. అనుసరించే పంథా గర్హనీయమైనా వారి చిత్తశుద్ధి మాత్రం సాటిలేనిది అనేవారు. కొందరు కమ్యూనిస్టు వారి వీధి గదిలో బసచేస్తూ వుండేవారు.
స్వరాజ్యం వచ్చాక నెహ్రూ అమాత్యుని నాయకత్వంలో జరుగుతున్న భావి భారత పునర్నిర్మాణ కార్యక్రమాల్ని చక్కగా అవగాహన చేసుకున్నారు. తమవంతు సహకారాన్ని అందించారు. పుత్ర సమానంగా చూసుకుంటున్న నవభారత నిర్మాతల్లో ఒకనిగా, ఇంజనీరుగా చూసుకోవాలనుకొన్నారు. పెద్ద కుమారుని తనకు వారసునిగా చూసుకోవాలనుకున్నారు. ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో ప్రైవేటు వైద్య కళాశాలు కాకినాడ, కర్నూలు వంటి పట్టణాలలో నెలకొల్పుతున్నారు . శాస్త్రిగారు రూ. 7 మే డొనేషన్ కట్టి కళాశాల పాలక వర్గం ఏర్పడగానే తమ కుమారునికి సీటు ఏర్పాటు చేసుకున్నారు. చిన్నతనంలో తాను సంఘంలో చూసిన న్యాయవాదులు పొందుతున్న మన్ననా, వైభవం వారి మదిలో స్థిరముద్రపడి వుంది. చిన్న అల్లుడిని న్యాయవాద వృత్తిని అభ్యసించడానికి ప్రోత్సహించారు.
జాతి సంపదను పెంచడానికి నెహ్రూ ప్రభుత్వం నేషనల్ సేవింగ్సు సర్టిఫికెట్ అనే స్కీమ్ ప్రారంభించారు. ఆ పథకంలో 12 మే డిపాజిట్ చేస్తే 12 సంవత్సరా తరువాత అసలు వడ్డీతో వస్తాయి. ఈ పథకంలో శాస్త్రిగారు కుమారులిద్దరి పేరా తలో లక్షా తన పేర, భార్య పేర తలో లక్షా వచ్చేటట్లుగా డిపాజిట్ చేసారు. తాము వుంటున్న ఇంటిని పునాదుతో సహా తొలగించి, నాడు మద్రాసు, బొంబాయి, కకత్తా, డిల్లీ నగరాలలో నూతనంగా నిర్మించబడుతూన్న అత్యాధునిక భవనాల యొక్క ప్లాన్లు, ఫ్రంట్ వ్యూ, కేటలాగుల్ని తెప్పించి పట్టణంలోని మొదటి తరగతి తాపీ మేస్త్రీ, వడ్రంగి మేస్త్రీలైన తాతబ్బాయి, కడారి సుబ్బారావుగార్ల సారథ్యంలో పట్టణంలోని ప్రముఖు నివాసగృహాలతో సరితూగే విధంగా 6 గదులు , రెండు విశామైన హాళ్ళు, రెండు వరండాలు , పెద్ద భోజనశాల వంట గది వుండే భవనాన్ని నిర్మించారు. మరో 5 ఏళ్ళ తరువాత తమ అంతస్తును పెంచుకుంటూ ఆ భవనంపై మరో రెండు అంతస్తు వేశారు.
పదునాలుగేళ్ళ వయస్సులో పైమీద అంగవస్త్రంతో, మనసులో తాను ఉన్నతిని సాధించాలనే పట్టుదతో కాలి నడకన కాకినాడ చేరిన బాలుడు లబ్ధ ప్రతిష్ఠుడై స్థితిమంతుడై, బంధుమిత్రుకు అండగా , వయస్సు మళ్ళేక జనకమహారాజులా కర్మయోగాన్ని ఆశ్రయించి, వైద్య వృత్తిని కొనసాగిస్తూ, భౌతిక విషయాల్ని మనస్సుకంటనీయకుండా, ఆత్మజ్ఞానంతో ముక్త జీవితాన్ని గడిపారు. సంపూర్ణ ఉత్తర, దక్షిణ దేశ యాత్రను చేసారు.
– కాశీచయనుల వెంకట మహాలక్ష్మి
@@@@@ సమాప్తం @@@@@
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~