అంతరించిపోతున్న అగ్నిగుండ ప్రదర్శనలు

ఆగస్టు 22వ తేదీ ‘జానపద కళల దినోత్సవం’ సందర్బంగా …

డాక్టర్‌ తరపట్ల సత్యనారాయణ

డాక్టర్‌ తరపట్ల సత్యనారాయణ

జానపదుల్లో ఉండే భక్తి భావాలు చాలా బలీయమైనవి. వారి ఆచార వ్యవహారాలు , వారి మత విధానాలు, విశ్వాసాలు చాలా విచిత్రంగాను, చాలా ఆశ్చర్యంగాను ఉంటాయి. వీరి నమ్మకాల ను కొందరు మూఢనమ్మకాలు అంటారు. వీరు చెట్లను, పుట్లను, రాళ్ళను రప్పను దైవంగా భావించి వాటికి రకరకా పేర్లు పెడతారు. అంతేకాకుండా వాటిని ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కుతారు. వీరు రాళ్ళకు రప్పకు చెట్లకు పెట్టిన పేర్లు కూడా దేవతామయంగా ఉంటాయి. ఉదాహరణకు కొన్నింటిని పరిశీలిస్తే-
పల్లామ్మ తాడి, ముత్యామ్మ తాడి, కొండామ్మ చింత, దుర్గమ్మ జమ్మిచెట్టు, ధనమ్మమర్రి, పోచమ్మ గండి, కట్లమ్మ, పుంతలో మసమ్మ, నెరబొక్కమ్మ, పేరంటాలమ్మ మొదలైనవి. ఈ దేవతందరూ ఉభయగోదావరి ప్రాంతాకు చెందినవారే.
ఈ పేర్లన్నీ గ్రామ దేవతకు సంబంధించినవే. గ్రామ దేవతలు వారిని, వారి గ్రామాన్ని ఆపద నుండి, రోగాల నుండి కాపాడుతారని వీరి నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం ఈ గ్రామ దేవతకు ఉత్సవాలు , ఊరేగింపు, జాతర్లు , తీర్థాలు , తిరునాళ్ళు జరుపుతారు. ఈ సందర్భంలో అనేక జానపద ప్రదర్శన కళను ప్రదర్శిస్తారు. అందులో భక్తి శ్రద్దతో ప్రదర్శించే కళా రూపాలే భక్తి ప్రధానమైన ప్రదర్శన కళారూపాలు . ఉభయగోదావరి జిల్లాల్లో చూస్తే అగ్ని గుండ ప్రదర్శను, కోసంబరాలు , గరగ నృత్యాలు , చిందు భజనలు , చెక్క భజనలు , తాళ భజననలు , బళ్ళ మీద వేషాలు , వీర నాట్యాలు లేక శూల నృత్యాలు ఇలా ఎన్నో భక్తి ప్రధానమైన కళలు కనిపిస్తాయి. వాటిలో అంతరించిపోతున్న జానపద ప్రదర్శన కళరూపాల్లో అగ్నిగుండ ప్రదర్శనలు చెప్పుకోదగ్గవి.

అగ్నిగుండ పద్రర్శనలు – నేపధ్యం :

అగ్ని గుండ ప్రదర్శన అంటే కాళ్ళకు ఏ విధమైన రక్షణ వస్తువులు ధరించకుండా వట్టి కాళ్ళతో ఫెళఫెళమంటూ కణకణమండే ఎఱ్ఱని నిప్పు మధ్య నడుస్తూ చేసే ప్రదర్శన. దీనినే అగ్ని గుండం తొక్కడం, గుండం తొక్కడం. జ్వాలాతోరణం, నిప్పుమీద నడక అని మొదలైన పేర్లతో పిలుస్తారు.
ఇది భక్తి ప్రధానమైన ప్రదర్శన, ఇది ఎంత భక్తి పరమైందో అంత ప్రమాదకరమైన ప్రదర్శన. అగ్ని గుండం తొక్కే ఆసాది లేక ప్రధాన కళాకారుడు రెండు రోజులు ఉపవాసముండి, దైవానుగ్రహం పొందిన తర్వాత మూడవ రోజు అగ్ని గుండ ప్రదర్శనలో పాల్గొంటాడు. ఇది అతని భక్తికి, నియమనిష్టకు నిదర్శనం. ఈ ప్రదర్శనను సంవత్సరానికి ఒకసారే నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో ప్రధాన భక్తి కళాకారుడుతో పాటు అనేక మంది భక్తులు పాల్గొంటారు. పాల్గొనే ప్రతి భక్తునికి ఒక ప్రధానమైన కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏ భక్తుడు ఈ ప్రదర్శనలో పాల్గొనడు. పాల్గొనే భక్తుడు ఉపవాస దీక్ష ఉండి, కొన్ని నియమాలు పాటించాలి. నియమనిష్టలు , ఉపవాస దీక్ష పాటించకుండా పాల్గొంటే దేవి ఆగ్రహంతో పాటు అనేక అనర్థాలు జరుగుతాయని వీరి నమ్మకం ముస్లీంలలో కూడ ఈ సంప్రదాయ కళ ఉంది.
పద్రర్శన విధానం : ఈ ప్రదర్శనను రాత్రి సమయాల్లోనే ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనకు రెండు మూడు గంటల ముందుగానే గ్రామ దేవత గుడి ఎదురుగా 16 అడుగు పొడవు, 4 లేక 6 అడుగు వెడ్పు గ ఒక పొడవైన ‘గాడి’ని తవ్వుతారు. దీని లోతు ఒక అడుగు లేక అడుగున్నర ఉంటుంది. ఇలా పొడవుగా తవ్విన గాడి నిండా ఎండిన కొబ్బరి చిప్పలు పేర్చి కాగడాతో అగ్నిని ముట్టించి ఆ చిప్పలు
రాజేటట్టు చేస్తారు. ఇలా ఒక గంట గంటన్నరకల్లా ఆ గాడిలో ఉన్న కొబ్బరి చిప్పలు ఎర్రగా మండి ఉంటాయి. అవి చూడటానికి ఎర్రని గాజు పెంకుల్లా అందంగా కన్పిస్తాయి. ఇంతలో అగ్నిగుండం తొక్కే ఆసాది లేక ప్రధాన భక్తికళాకారుడు రెండు తాషాలు , ఒక రామడోలు , రెండు మాదిగ డప్పులతో ఆ గ్రామాల్లో ఊరేగింపుగా వెళ్ళి అక్కడక్కడ పూనకం పూని శుభవచనాలు , భవిష్యత్తులో జరిగే వింతలు , విపత్తులు గురించి ఆ ప్రజలకు చెబుతాడు. అలా చెప్పిన తరువాత అనేక మంది స్త్రీలు పసుపు కలిపిన నీళ్ళు బిందెతో తెచ్చి కొంత మంది ఆసాది కాళ్ళమీద, కొంత మంది ఆసాది తల మీద వేస్తారు. ఇలా వేసిన తర్వాత అతడు అలా గ్రామం అంతా తిరిగి చివరకు అగ్నిగుండం దగ్గరకు వస్తాడు. ఇలా వచ్చేటపుడు అతని కూడా అనేక మంది పిల్లలు , పెద్దలు , స్త్రీలు , పురుషులు శరభ శరభ ఆశ్చరభశరభ, శరభ శరభ అల్లల్ల వీర అంటూ నినాదాలు చేస్తూ ఉంటారు. అతడు గుడి దగ్గరకు వచ్చేటపుడు అతనితో పాటు అగ్నిగుండంలో నడవడానికి సిద్దంగా ఉన్న భక్తులు ఆ ఆసాది లేక ప్రధాన భక్తి కళాకారుణ్ణి అనుసరిస్తారు. మొత్తం మీద వీరందరూ కలిసి ఆ గ్రామ దేవత గుడి చుట్టూ మూడుసార్లు తిరుగుతారు. అలా తిరిగిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి అందులో మూడుసార్లు మూడు మునుకలు మునిగి మరలా వచ్చి మూడుసార్లు గుడి చుట్టూ తిరిగి గ్రామదేవతకు ఎదురుగా కూర్చుని ఆసాధి లేక ప్రధాన భక్తి కళాకారుడు పూనకం పూనుతాడు.

పూనకం జరిగేటపుడు సాంబ్రాణితో ధూపం వేస్తారు. అలా ధూపం వేస్తున్నప్పుడు తాషాలు, డప్పు వాద్యాలు భీకరంగా వాయిస్తారు. ఈ వాద్యాల శబ్దాతో పాటు అక్కడ ఉన్న భక్తులు నినాదాలు ఇంకా ఎక్కువగా పలుకుతారు. ఇలా వాద్యాలు, నినాదాలు ఊపందుకున్నప్పుడు ప్రధాన ఆసాది అకస్మాత్తుగా లేచి అగ్నిగుండం దగ్గరకు వస్తాడు. అక్కడకు వచ్చి అగ్ని గుండాన్ని తీక్షణంగా ఒక ఐదు ఆరు నిమిషాలు పరిశీలిస్తాడు. ఇలా పరిశీలించినపుడు అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లాగా మారతాయి. ఆ భక్తుడు అలా తీవ్రంగా చూస్తున్నప్పుడు అతనిపై దేవతా శక్తి ఆవహించిందని నమ్ముతారు.
అంతలో అగ్ని గుండం దగ్గర ఇద్దరు చెరొక వెదురు చేటను తీసుకుని గాడిలో ఉన్న నిప్పుపై అటూ ఇటూ విసురుతారు. ఇలా విసరడం వల్ల నిప్పుపై కప్పిఉన్న తెల్లని నివురుపోయి ఆ నిప్పులు ఎర్రగా కనిపిస్తాయి. ఇలా కణకణమంటూ మండుతున్న నిప్పుపై ప్రధాన భక్తి కళాకారుడు నడవటానికి ప్రయత్నించినపుడు అతని కూడ ఉన్న భక్తులు అతనితో బాటు అగ్ని గుండంలో నడుస్తారు. ఇలా నడుస్తున్నప్పుడు తాషాలు, డప్పు వాద్యాలు ఊపందుకుంటాయి. ఈ రణగొణ ధ్వనుల మధ్య అగ్ని గుండ ప్రవేశం చేస్తారు. ప్రధాన భక్తునితో పాటు మిగిలిన వారు అందరూ కలిసి ఆరు లేక ఎనిమిది సార్లు అతి వేగంగా ఇటు అటు ఆ గాడిలో నడుస్తారు. ఇలా నడిచినప్పుడు వారికి కాళ్ళు కాలవు. ఇది భక్తి ప్రపత్తులతో కూడుకున్న ప్రదర్శన కళ. ఈ ప్రదర్శన జరుగుతున్నంత సేపూ దైవశక్తి దిగి వచ్చినంత సందడి ఉంటుంది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారిపై దైవశక్తి ఆవహిస్తుందని వీరి నమ్మిక. ఆ నమ్మకంతోనే వారు అనుకున్నవి జరుగుతాయని నమ్ముతారు. ఈ విధంగా అగ్నిగుండ ప్రదర్శన భక్తి భావంతో నిండి యావన్మందిని ఆకర్షించే కళగా నిలిచి ఉంది.
అగ్నిగుండ ప్రదర్శన రాత్రి సమయాల్లోనే జరుగుతుంది. ప్రధాన కళాకా రుడితో పాటు ఎంత మందైనా ఈ ప్రదర్శనలో పాల్గొనటానికి వీలుంటుంది. పురుషులు తప్ప స్త్రీలు ఎంత మాత్రం ఈ ప్రదర్శనలో పాల్గొనరు. ఇది భక్తి ప్రధానమైన ప్రదర్శన కళారూపం. అంతే గాకుండా ఇది ప్రమాదకరమైన ప్రదర్శనా విధానం. పాల్గొనే కళాకారులకు ప్రత్యేకమైన వస్త్రధారణ అంటూ ఏమిా ఉండదు. చేతిలో రెండు వేప మండలు ఉంటాయి. పాల్గొనే వారందరూ ఉపవాస దీక్షలో ఉంటారు. గ్రామదేవత ఉత్సవాల్లో ఈ ప్రదర్శను నిర్వహిస్తారు. ఈ ప్రదర్శన సాధారణంగా మంగళవారం రాత్రి జరుగుతుంది. కళాకారులందరూ నుదుట విభూది గాని, కుంకుమ గాని బొట్టుగా పెట్టుకుని ప్రదర్శనలో పాల్గొంటారు.
అగ్ని గుండ పద్రర్శనలు- నియమాలు : అగ్నిగుండం తొక్కడానికి ముందు తన మీద తనకు నమ్మకం ఉండాలి. నిప్పు మీద నడవడం అంటే దైవభక్తితో నిలబడడం. ఇలాంటి భక్తితో కూడిన సాహస ప్రదర్శనలో పాల్గొనడానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. అవి అన్నీ పాటిస్తేనే అగ్ని గుండ ప్రదర్శనలో పాల్గొనడానికి వీలుంటుంది.

ఆ నియమాలలో ప్రధానమైనవి కొన్ని:

1. ఉపవాస దీక్ష తప్పనిసరిగా పాటించాలి. ఉంటే మూడు రోజులు ఉండవచ్చు లేదా ఒక రోజు పూర్తిగా ఉపవాసం ఉండి తీరాలి. ఈ సమయంలో మంచినీళ్ళు లేక పాలు మాత్రమే తీసుకోవాలి.
2. ఉపవాసం ఉన్న రోజు నుండి దానధర్మాలు తప్పనిసరిగా చేయాలి.
3. ఉపవాసముండి గుడికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకూడదు.
4. ప్రదర్శనలో పాల్గొనే ముందు ప్రధాన భక్తునితో పాటు మిగిలిన భక్తులు దగ్గరలో ఉన్న చెఱువులో మూడుసార్లు మునిగి తడి బట్టతో వచ్చి అగ్నిగుండం తొక్కాలి.
ఈ విధమైన నియమాలు పాటించి అగ్ని గుండంలో అడుగుపెడితే ఏ విధమైన హాని జరగదు. ఇందులో ఏ ఒక్కటి పాటించకపోయినా ఏదో ఒక అనర్థం జరుగుతుందని వీరి నమ్మకం.
అగ్నిగుండ ప్రదర్శనలో పాల్గొనే ప్రతివారికి ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది. రకరకాల కోరికలు సిద్దించడానికే ఈ ప్రదర్శనలో అనేక మంది పాల్గొంటారు. అనుకున్నవి జరుగుతాయని నమ్మకంతో గాని, అనుకున్నవి జరిగాయనే కృతజ్ఞత భావంతో గాని భక్తు అగ్నిగుండ ప్రవేశ ప్రదర్శనకు పూనుకుంటారు. ఇవే గాకుండా ఇంకా ఈ కింది నమ్మకాల వల్ల అగ్నిగుండం తొక్కుతారు.

అగ్ని గుండ పద్రర్శనలు -నమ్మకాలు :

1. శ్రమలు కలిగిన వారు నడిస్తే శ్రమలు తొలిగిపోయి ప్రశాంతత వస్తుందనే నమ్మకం.
2. పిల్లలు పెద్దలు చావు బ్రతుకుల్లో ఉంటే వారు బ్రతుకుతారని, ఆరోగ్యంతో ఉంటారనే నమ్మకం.
3. వివిధ కారణా వల్ల , గొడవల వల్ల విడిపోయిన వారు అగ్నిగుండంలో నడిస్తే గొడవలు తొలిగిపోయి, అందరూ కలుస్తారనే నమ్మకం.
4. అగ్నిగుండంలో నడిస్తే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందనే నమ్మకం.
5. గత సంవత్సరం అనుకున్నవి జరిగాయనే నమ్మకంతో అగ్నిగుండ ప్రవేశ ప్రదర్శనలో పాల్గొనడం.
6. పిశాచి సంబంధ శక్తుల నుండి విముక్తి కలుగుతుందనే నమ్మకం.
7. సంతానం లేకపోతే సంతానం కలుగుతుందనే నమ్మకం మొదలైనవి.

తెలుగు కవుల రచనల్లో – అగ్నిగుండ పద్రర్శనలు :

అగ్నిగుండం తొక్కడం అనే ఈ కళ చాలా ప్రాచీనమైనది. వీటి ప్రస్తావన మన ప్రాచీన తెలుగు కవుల రచనల్లో కన్పిస్తుంది. ఈ ప్రదర్శన గురించి వల్లభరాయుడు తన క్రీడాభిరామంలోను, తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్మ్యంలోను తెలియజేశారు. వీరితో బాటు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడానికి వచ్చిన యూరప్‌ దేశస్థుడైన నికోలాకాంటే రచనల్లో వీటి ప్రస్తావన ఉంది.
వల్లభరాయుడు తన క్రీడాభిరామంలో మైలూరు వీరభటులు చేసే కొన్ని సాహస విన్యాసాలను, ప్రదర్శనలను పేర్కొన్నాడు. వారి ప్రదర్శను చాలా సాహసంతో కూడి ఉన్నవిగాను, ప్రాణాంతకమైనవి గాను, మూఢ భక్తితో కూడుకొని ఉన్నవి గాను ఇతని రచన వల్ల తెలుస్తుంది. మైలూరి వీరభటులు చేసే ప్రదర్శనల్లో ‘‘అగ్నిగుండ ప్రదర్శన’’ ప్రస్తావన ఉంది. ఈ ప్రదర్శన గురించి వల్లభరాయుడు ఈ విధంగా తెలియజేశాడు.
ఱవఱవ మండు నెఱ్ఱని చండ్ర మల్లె
చోద్యంపు గుండాలు జొచ్చువారు
కరవాడి యలుగులు గనప పాతర్లతో
నుట్టు చేరులు గోసి యుఱుకువారు
గాలంపు గొంకి గంకాళ చర్మము గ్రుచ్చి
యుడువీధి నుయ్యెలలూగువారు
కటక హాన్నళంబు గండ కత్తెరపట్టి
మిసిమింతలను గాక మ్రింగువారు
సందుల ను నారసంఋ సుపువారు
యెడమ కుడి చేత నారతులిచ్చువారు
సాహసము మూర్తిగొన్న సరణివారు
ధీర హృదయులు మైలురు వీరభటులు
పై పదాన్ని బట్టి చూస్తే మైలూరి వీరభటులు చేసే విన్యాసాలు చాలా సాహసంతో కూడుకున్నవిగా ఉన్నాయి. పొడవుగా గాడి తవ్వి, అందులో నిప్పు పోసేవారని, ఆ నిప్పు కణకణ మండి ఎర్రని చంద్రమల్లెల్లాగ ఉండేవని, అలా మండుతున్న నిప్పుపై మైలూరి వీరభటులు నడిచేవారని, వారిలో కొంత మంది కుడి యెడమ చేతుల్లో హారతులు పెట్టుకుని నడిచివెళ్ళే వారని తెలుస్తుంది.
వల్లభరాయుడు తన పద్యంలో వివరించిన ‘‘అగ్నిగుండాలు’’ అనే పేరు బహుళ ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది.
అగ్నిగుండ ప్రదర్శనలో ఇపుడు పురుషులు మాత్రమే పాల్గొంటున్నారు. కాని కాకతీయు కాలం నాటికి స్త్రీలు కూడ నిప్పుల గుండం తొక్కే వారని తెనాలి రామకృష్ణ కవి తన పాండురంగ మహత్మ్యంలో పేర్కొన్నాడు. రామకృష్ణ కవి నిప్పు గుండం తొక్కే స్త్రీలను ‘పామరస్త్రీలుని’ పేర్కొన్నాడు. పామర స్త్రీంటే జానపద స్త్రీని చెప్పవచ్చు. వీరికి గ్రామదేవత మీద ఎంతో నమ్మకం ఉంటుంది. అందుకే వీరు ఆ రోజుల్లో జరిగే గంగమ్మ జాతరకు వచ్చినట్టు తొస్తుంది. ఆ జాతరలో స్త్రీలు కూడ అగ్ని గుండంలో నడిచినట్లు ఈ కింది పద్యంవల తెలుస్తుంది.
సిడివ్రేలె తెరవయోర్తు
నిప్పుటేట జరించే నిలతయోర్తు
చొచ్చె నిప్పు పందిరి గుండ మిండ యోర్తు
అనటాకు నర్తించె నతివయోర్తు
పై పద్యంలో తెనాలి రామకృష్ణుడు ప్రయోగించిన ‘‘నిప్పు పందిరి గుండం’’ అన్న పద ప్రయోగాన్ని బట్టి, ఆ రోజుల్లో గ్రామ దేవత ఆయం దగ్గర పందిరి వేసి ఆ పందిరిలో నిప్పు గుండం తొక్కే వారని తెలుస్తుంది. ఇలా దేవత గుడి ఎదుట పందిరి వేసి నిప్పు గుండం తొక్కే ఆచారం నేటికి ఉంది.
పై పద్యాలను పరిశీలిస్తే అగ్ని గుండ ప్రదర్శను రెడ్డి రాజు కాలం నుండి ఉన్నట్లు తెలుస్తుంది. ఇవి విజయనగర రాజుల కాలంలో మరీ ఎక్కువ ఆదరణ పొందినట్లు నికోలాకాంటే రచనను బట్టి ఊహించవచ్చు. రెడ్డి రాజు కాంలో ఉన్న శైవులైన వీరభటులు వీరభద్రుని సంబరాలో మాత్రమే అగ్ని గుండంలో నడిచేవారు. అవి రాను రాను విజయనగర రాజు కాలానికి గ్రామదేవత జాతరలో కూడ అగ్నిగుండ ప్రదర్శను జరిగినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి ఈ ప్రదర్శనలు చాలా ప్రాచీనమైనవని చెప్పవచ్చు.
ఉభయగోదావరి జిల్లాలో ఈ ప్రదర్శనను ఎక్కువగా నిర్వహిస్తారు. గ్రామదేవత ఉత్సవాలైన వీరభద్రుని సంబరాకు, ముత్యామ్మ జాతర్లకు, విజయదశమి ఉత్సవాలకు వీటిని ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో ఆసాదులు ఎక్కువగా పాల్గొంటారు. ఆసాదు గరగ నెత్తిన పెట్టుకుని అగ్ని గుండం తొక్కుతారు. వారిలో ముఖ్యంగా గోడి చిన అబ్బు, గోడి పెద్ద అబ్బు, పేరూరి ఆదినారాయణ, పదం త్రిమూర్తు మొదలైన వారు ఈ ప్రదర్శన కళలో పేరుపొందినవారు.

ఆధారగ్రంథాలు :
1. వ్లభరాయుడు ` క్రీడాభిరామం
2. తెనాలి రామకృష్ణుడు ` పాండురంగ మహత్మ్యం
3. డా॥ తరపట్ల సత్యనారాయణ, ఉభయ గోదావరి జిల్లా జానపద ప్రదర్శన కళారూపాు
4. దక్షిణ భారతీయ జానపద విజ్ఞాన సర్వస్వం ` ద్రవిడ విశ్వవిద్యాయ ప్రచురణ

డాక్టర్‌ తరపట్ల సత్యనారాయణ
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,
తెలుగుశాఖఆదికవి నన్నయ విశ్వవిద్యాయం, రాజమండ్రి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

సాహిత్య వ్యాసాలు ​Permalink

2 Responses to అంతరించిపోతున్న అగ్నిగుండ ప్రదర్శనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో